ముదిరాజులను బి.సి "డి" నుండి బి.సి "ఏ" కు మార్చకుంట్టే అసెంబ్లీ ముట్టడి చేస్తాం! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు
ఈ అసెంబ్లీ సమావేశంలో ముదిరాజులను బి.సి "ఏ" లోకి మార్చుతు బిల్లు ప్రవేశపెట్టకుంటే ప్రజా భవన్ ముట్టడి చేస్తాం!
జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు
తేది: 15-12-2024 ఆదివారం
సిద్దిపేట న్యూస్
సీఎం రేవంత్ రెడ్డి ముదిరాజులకు ఇచ్చిన హామీ బీసీ డీ నుండి బీసీ ఏలోకి మారుస్తానని ఆ హామీని ఈ అసెంబ్లీ సమావేశాలలో బిల్లు ప్రవేశపెట్టకుంటే ప్రజా భవన్ అసెంబ్లీ ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ హెచ్చరించారు.
ఆదివారం రోజు ముదిరాజ్ ఏసీ కన్వెన్షన్ హాల్లో ముదిరాజ్ హక్కుల సాధన సమితి సభ్యులు నిర్వహించిన సన్నాహ సమావేశంలో ముదిరాజులకు జరుగుతున్న అన్యాయాలపై చర్చించారు.
తరాలు మారిన ప్రభుత్వాలు మారిన ముదిరాజుల తల రాతలు మారడం లేదని ముదిరాజులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారని ఓట్లు అయిపోయినంక గద్దెనెక్కి ముదిరాజులకు మొండి చెయ్యి చూయిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముదిరాజులను బిసి డి నుండి బిసి ఏలోకి మారుస్తానని ముదిరాజులకు జరిగిన అన్యాయంపై నేను అండగా ఉంటానని కార్పొరేషన్ ఏర్పాటు చేసి యువతకు లోన్లు ఇస్తానని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి ఈనాడు ముదిరాజ్ లను పట్టించుకోవడంలేదని కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు మరిచాడని ముదిరాజుల బతుకులు ఆగమైతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో ముదిరాజులకు ఉచిత చేప పిల్లలు ఇచ్చి కనీసం అన్న ఆదుకున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏమి రావడం లేదని ఇకనైనా రేవంత్ రెడ్డి ఆలోచించి ఈ అసెంబ్లీ సమావేశాలలో బిల్లు ప్రవేశపెట్టి ముదిరాజులను బిసి ఏలోకి చేర్చాలని లేకుంటే ప్రజా భవన్ అసెంబ్లీ ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిస్తూ ఇకనుండి ముదిరాజ్ హక్కుల సాధనే ధ్యేయంగా ముదిరాజ్ హక్కుల సాధన సమితి పనిచేస్తుందని వారు అన్నారు.
ఇట్టి కార్యక్రమంలో ముదిరాజ్ హక్కుల సాధన సమితి యూత్ రాష్ట్ర అధ్యక్షుడు పడిగె ప్రశాంత్, రాగుల రాజు, గౌరవేని సుమన్, పడిగె లింగం, గౌరవేని కిషన్ తదితరులు పాల్గొన్నారు.
Jan 18 2025, 21:32