నల్గొండ జిల్లా :-ఉమ్మడి నల్లగొండ జిల్లా మాల మహానాడు మీడియా అధ్యక్షులుగా గోగు బాలసైదులు

ఉమ్మడి నల్లగొండ జిల్లా మాల మహానాడు మీడియా అధ్యక్షులుగా గోగు బాలసైదులు

నియామక పత్రాన్ని అందజేసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య

నల్గొండ జిల్లా :-

ఉమ్మడి నల్లగొండ జిల్లా మాల మహానాడు మీడియా అధ్యక్షులుగా సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లా నల్లగొండ అధ్యక్షులుగా కట్టంగూరు మండల కేంద్రానికి చెందిన గోగు బాల సైదులు ను మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య మరియు రాష్ట్ర అద్యక్షులు బుర్గుల వెంకటేశ్వర్లు నల్గొండ జిల్లా మాలమహానాడు అధ్యక్షులు లకుమాల మధుబాబు సమక్షంలో అందజేశారు ఈ కార్యక్రమంలో,మహిళా నల్లగోండ అద్యక్షురాలు అంగరాజు స్వర్ణలత,మునుగోడు నియోజకవర్గం అద్యక్షులు సంత వరప్రసాద్, సూర్యాపేట మహిళా కార్యదర్శి కురపాటి జ్యోష్న,నా నియమకానికి సహకరించిన జాతీయ అధ్యక్షులు మరియు రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు నాతోటి మాల మహానాడు జిల్లా నాయకులకు కృతజ్ఞతలు.

తెలంగాణకు రెయిన్ అలెర్ట్.. మూడు రోజులు వర్షాలు.

తెలంగాణ రాష్ట్రం:తెలంగాణకు రెయిన్ అలెర్ట్.. మూడు రోజులు వర్షాలు..

తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షం పడే అవకాశముందని పేర్కొంది.

దీంతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. బుధ, గురు, శుక్రవారాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

కనిష్ట ఉష్ణోగ్రతలు...

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు కనిష్టంగా ఉండే అవకాశముందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంచు కూడా ఏర్పడుతుందని, రహదారులపై ప్రయాణించే వారుతగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

నాలుగు కోట్ల విలువైన బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన సివిల్ ఇంజినీర్

నాలుగు కోట్ల విలువైన బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన సివిల్ ఇంజినీర్

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో ఘటన

5.9 కేజీల బరువున్న 50 బంగారు కడ్డీల స్వాధీనం

ఈజీ మనీ కోసమే స్మగ్లింగ్ చేస్తున్నట్టు ఒప్పుకోలు

రూ. 4.36 కోట్ల విలువైన 6 కేజీల బంగారం స్మగ్లింగ్ చేస్తూ భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో దొరికిపోయాడో సివిల్ ఇంజినీర్. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్ నిన్న నిందితుడిని అదుపులోకి తీసుకుంది. ఇంటెలిజెన్స్ సమాచారంతో అప్రమత్తమైన టెంటుల్‌బెరియా బోర్డర్ ఔట్‌పోస్ట్ (5వ బెటాలియన్) పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24వ పరగణాల జిల్లా, అంచల్‌పాద గ్రామంలో తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో రూ. 4.36 కోట్ల విలువైన 5.9 కేజీల బరువున్న 50 బంగారం కడ్డీలను మోసుకెళ్తున్న సివిల్ ఇంజినీర్‌ను అరెస్ట్ చేశారు. ఈ గ్రామం టెంటుల్‌బెరియా బోర్డర్‌ ఔట్‌పోస్టుకు 2,700 మీటర్ల దూరంలో ఉంది.

బీఎస్ఎఫ్ సిబ్బందిని చూసి నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో భయపడిన స్మగ్లర్ పారిపోయే ప్రయత్నాన్ని విరమించుకోవడంతో అరెస్ట్ చేశారు. తేలికగా, వేగంగా డబ్బులు సంపాదించే ఉద్దేశంతోనే స్మగ్లింగ్‌కు పాల్పడినట్టు నిందితుడు అంగీకరించాడు. తనకు అందిన స్మగ్లింగ్ వస్తువులను గంటా, రెండు గంటలపాటు ఇంట్లో ఉంచి, ఆ తర్వాత వాటిని సంబంధిత వ్యక్తులకు అందిస్తానని పేర్కొన్నాడు. ఇలా చేసినందుకు ఒక్కో డెలివరీకి రూ. 500 నుంచి రూ. 1000 ఇస్తారని తెలిపాడు.

సూర్యాపేట జిల్లా :-డి మార్ట్ లో ఆకస్మికంగా తనిఖీలు.

డి మార్ట్ లో ఆకస్మికంగా తనిఖీలు..

కల్తీగా అనుమానించి సుమారు 20 కేజీల టీ పౌడర్ సీజ్..

సూర్యాపేట జిల్లా :-

సూర్యాపేట పట్టణంలో బుధవారం డి మార్ట్ ని వి.జ్యోతిర్మయి,జోనల్ ఫుడ్ కంట్రోలర్,సూర్యాపేట జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆర్ కిరణ్ కుమార్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి పలు అనుమానిత ఆహార పదార్థాల షాంపిల్స్ లను సేకరించి ప్రయోగశాలకు పంపిస్తామని తెలపారు.అక్కడ లూస్ గా అమ్ముతున్న టీ పౌడర్ ని కల్తీ ఉన్నట్లు అనుమానించి శాంపిల్స్ తీసుకొని ల్యాబ్ కు పంపిస్తున్నట్లు తెలపడం జరిగింది. ప్రయోగశాల నివేదికల ఆధారంగా వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.ఆహార పదార్థాలలో రంగులు హానికరమైన కెమికల్స్ ని ఉపయోగించరాదని యాజమాన్యంను హెచ్చరించారు. అలాగే వివిధ వ్యాపారులకు లైసెన్సు లేకుండా వ్యాపారాలు చేస్తే క్రిమినల్ చర్యలు తప్పవని ప్రతి ఒక్క ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ తప్పనిసరిగా లైసెన్స్ పొందాలని సూచించారు. నాణ్యతలేని,శుభ్రత పాటించని పలు దుకాణాల వారికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్ట ప్రకారం షెడ్యూల్ 4 కింద చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఫస్సై ప్రకారం పలు నోటీసులు జారీ చేసారు. తర్వాత కల్తీగా అనుమానించి సుమారు 20 కేజీల టీ పౌడర్ ని సీజ్ చేశారు.

భువనగిరి పట్టణంలోని ప్రగతి నగర్ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

భువనగిరి పట్టణంలోని ప్రగతి నగర్ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

భువనగిరి పట్టణంలోని ప్రగతి నగర్ కాలనీలో వీర శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణేశుని వద్ద గుర్రాల లక్ష్మమ్మ లక్ష్మయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గుర్రాల జంగయ్య లావణ్య. గుర్రాల శీను సంతోష అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వీర శివాజీ యూత్ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

నల్గొండ జిల్లా :-నోముల గౌడ సంఘము ఆధ్వర్యంలో ఘనంగా 374 వ జయంతి వేడుకలు.

నోముల గౌడ సంఘము ఆధ్వర్యంలో ఘనంగా 374 వ జయంతి వేడుకలు.

ఈ రోజు నోముల గ్రామంలో బహుజన విప్లవ వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుక ర్యాలీ నిర్వహించడం జరిగింది...

ప్రతి గ్రామంలో గౌడ్స్ అందరూ ఒక ఐక్యతతో కలిసిమెలిసి ఉండాలని ఆదేశించారు...

అదేవిధంగా పాపన్న చరిత్రను పాఠ్య పుస్తకాలలో ప్రవేశపెట్టాలని, అలాగే ప్రతి గ్రామములో పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని గౌడ సంఘము నాయకులందరూ కోరారు...

ఈ కార్యక్రమంలో నోముల కల్లుగీత కార్మికులు మరియు గౌడ యూత్ నాయకులందరూ పాలొగొనీ విజయవంతం చేసారు....

పంచాయతీరాజ్ పై ముగిసిన సీఎం సమీక్ష

తెలంగాణ:-

పంచాయతీరాజ్ పై ముగిసిన సీఎం సమీక్ష

కొత్త ఓటరు జాబితాను ఆగస్టు మొదటివారంలోగా పూర్తి చేయాలని సూచించిన ముఖ్యమంత్రి

ఓటరు జాబితా పూర్తయిన వెంటనే నిర్దిష్ట గడువులోగా రిపోర్ట్ ఇవ్వాలని బీసీ కమిషన్ కు సూచించిన సీఎం

బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం

వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం

రాష్ట్రవ్యాప్తంగా ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలి మోతే మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ప్రారంభించిన. టీఎస్ జేఏ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి

సూర్యాపేట జిల్లా :-

రాష్ట్రవ్యాప్తంగా ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలి

మోతే మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ప్రారంభించిన. టీఎస్ జేఏ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి

నల్గొండ జిల్లా :-

గౌరవ అతిథులుగా హాజరైన మండల తహసిల్దార్..

ఎంపీడీవో...వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని సౌకర్యాలతో కూడిన ప్రెస్ క్లబ్ భవనాలను నిర్మించాలని స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజానికి దిశా నిర్దేశం చేసే ఫోర్త్ ఎస్టేట్ మీడియాకు సరైన గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 90% జర్నలిస్టులకు పక్కా ప్రెస్ క్లబ్ భవనాలు లేక హోటల్లో చెట్ల కింద ప్రైవేటు భవనాల మెట్ల పైన కూర్చొని కాలం వార్తలు సేకరించే దయనీయమైన పరిస్థితి నెలకొన్నదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా భవనాలు నిర్మించాలని కోరారు. అదేవిధంగా జర్నలిస్టుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ సంఘమిత్ర, మండల ఎంపీడీవో హరి సింగ్, భారత రాష్ట్ర సమితి మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు, కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ, భాస్కర్, బిజెపి మండల పార్టీ అధ్యక్షులు బి శ్రీనివాస్, తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు దోసపాటి రాములు, బిజెపి మండల ఉపాధ్యక్షులు కొడిసే వెంకన్న, టీఎస్ జెఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌసుద్దీన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రఘువరన్ ఆచార్యులు, రాష్ట్ర సహాయ కార్యదర్శి చిలకల చిరంజీవి, మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఏర్పుల సాయి కృష్ణ , మండల ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గట్టిగుండ్ల రాము, ఉపాధ్యక్షులు మాలోత్ కోటి నాయక్, కోశాధికారి గురజాల వెంకన్న, సహాయ కార్యదర్శి డి ఎలీషా, కమిటీ సభ్యులు కొండ ఉదయ్, అన్ని పార్టీల నాయకులు మాజీ ఎంపీపీ శంకర్ నాయక్ , ఆర్.టి.ఐ నాయకులు, నాయకులు పేర్ల రామయ్య, సిఐటియు మండల కన్వీనర్ దోసపాటి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు జిల్లా :-ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నలుగురు నకిలీ విలేకరుల ముఠా అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ :-

ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నలుగురు నకిలీ విలేకరుల ముఠా అరెస్ట్

ఏలూరు: ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ వ్యాపారస్తుల్ని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో నలుగురు వ్యక్తులు కలిగిన ముఠాను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరు డి.ఎస్.పి శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. ఏలూరు నగరపాలక సంస్థ 19వ డివిజన్ కొత్తూరు ఇందిరమ్మ కాలనీ చెందిన మండల అప్పలనాయుడు చిన్న హోటల్ ను నడుపుతున్నాడు. ఇటీవల కొందరు ఈజీ మనీ సంపాదనలో పడి విలేకరులు వృత్తులను ఎంచుకొని దాని ముసుగులో నేరాలకు పాల్పడుతున్నారు. ఇందులో ప్రధాన సూత్రధారులైన మంగళ వెంకట దుర్గ ఏలూరులోని లోకల్ ఛానల్ లో విలేఖరిగా పనిచేస్తుంది. ఆమె ఒక పథకం ప్రకారం ఇందిరమ్మ కాలనీలో మండల అప్పలనాయుడు హోటల్ కి వెళ్ళింది. ఆ దుకాణ యజమాని ఎక్కడ అని అడిగి హోటల్లో అన్ని పరిశీలించి తాను ఫుడ్ సేఫ్టీ అధికారిని.. హోటల్ ఏమి సరిగా లేవని ఆ హోటల్ యజమాని అప్పలనాయుడుని బెదిరించింది. కనీసం లైసెన్స్ లేకుండా హోటల్ ను ఎలా నడుపుతున్నారని, దీనిపై చర్యలు తీసుకుంటామని బెదిరించింది. దీనికి భయపడిన అప్పలనాయుడు వెంటనే లైసెన్స్ తీసుకుంటాను ఇకనుంచి నిబంధనలు పాటిస్తానని చెప్పాడు. అప్పటికి ఆ యజమాని మాటలు వినకుండా మరొక వ్యక్తికి ఫోన్ చేసింది. రూ 10,000 ఇస్తే విడిచిపెడతామని డిమాండ్ చేశారు. వీరి ప్రవర్తన పై అనుమానం వచ్చిన యజమానికి సీసీ కెమెరాలు దగ్గర తీసుకువెళ్లి డబ్బులు ఇస్తాను చెప్పి ఈ విషయాన్ని అందర్నీ అడగగా వాళ్ళు నకిలేని అధికారులు తెలిసింది వెంటనే ఈ విషయాన్ని జిల్లా ఎస్పీకి ఆన్లైన్ ద్వారా తెలియజేయడంతో వేలూరు పోలీస్ స్టేషన్ వచ్చేసి దర్యాప్ చేసి ప్రధాన నిందితురాలు అయిన వెంకట దుర్గా దేవి పాట సహకరించి బుక్కురి దేవి ప్రసాద్, అగ్గాల ఉమామహేశ్వరి, పులిగా రాంబాబులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు..వారి వద్ద నుండి రెండు మొబైల్ ఫోన్స్ రెండు ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. ఈ కేస్ చేదించిన ఎస్సై రాజారెడ్డిని ఆయన అభినందించారు. ఎవరైనా అధికారులు అంటూ డబ్బులు డిమాండ్ చేస్తే తక్షణమే పోలీసులు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు

ఏపీ.పరకాలలో ఏసీబీ ట్రాప్ లంచం తీసుకొంటూ రెడ్ హ్యాడెడ్ గా పట్టుబడ్డ సబ్ రిజిస్టార్ సునీత.

BIG BREAKING

ఆంధ్రప్రదేశ్ :-

పరకాలలో ఏసీబీ ట్రాప్ .

లంచం తీసుకొంటూ రెడ్ హ్యాడెడ్ గా పట్టుబడ్డ సబ్ రిజిస్టార్ సునీత.

80000 వేలు లంచం తీసుకొంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్టర్.

బాధితుడు లాడే శ్రీనివాస్, శ్రీకాంత్ లకు చెందిన చెందిన ల్యాండ్ ను తల్లి నుండి కొడుకులకు పార్టెషన్ కోసం మాదారం శివారులోని 481c సర్వే నెంబర్ భూమి కోసం వెళ్లగా 80000 వేల లంచం అడిగిన సబ్ రిజిస్టర్ సునీత .

దీంతో ఏసీబీని ఆశ్రయించిన బాధితులు.