*తెలంగాణకై కొట్లాడింది టియూడబ్ల్యూజే మాత్రమే* *టియూడబ్ల్యూజే(టిజేఎఫ్)హెచ్రా 143 రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ*

కొత్తగూడెం: తెలంగాణకై కొట్లాడింది టియూడబ్ల్యూజే మాత్రమేనని, జర్నలిస్టులకు ప్రత్యేక నిధిని సాధించింది కూడా మన సంఘమేనని, రికార్డు స్థాయిలో 20,300పై చిలుకు అక్రిడేషన్లు అందజేసిన ఘనత కూడా మనకు దక్కుతుందని, కరోనా సమయంలో రూ.7కోట్ల ఆర్థిక సాయం అందజేయడమే కాకుండా రాష్ట్రంలో దాదాపు 450 జర్నలిస్టుల కుటుంబాల్లో పింఛన్‌ అందజేసి వెలుగులు నింపామని టియూడబ్ల్యూజే(టిజేఎఫ్‌) హెచ్‌`143 రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ అన్నారు. స్వరాష్ట్రానికై ఆంధ్రా యజమానుల చేతుల్లో నుంచి పెద్ద పదవులను సైతం కాదని బయటి వచ్చి పోరాటం చేశామని, ఆంధ్రా పెత్తందారీ యూనియన్లతో ఒరిగేదేమీ లేదని, జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను వదిలిపెట్టేది లేదని, సభ్యత్వ నమోదు చేసుకోండి... మేమంతా మీతోనే ఉంటామని అల్లం నాయరణ భరోసా నిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టియూడబ్ల్యూజే సభ్యత్వ నమోదు కార్యక్రమం టియూడబ్ల్యూజే(టిజేఎఫ్‌) హెచ్‌`143 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కల్లోజి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి మహమ్మద్‌ షఫీ సమక్షంలో సోమవారం కొత్తగూడెంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అల్లం నారాయణ మాట్లాడుతూ.. 15 ఏండ్ల పాటు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో టియూడబ్ల్యూజే పాత్ర ఎంతో కీలకంగా ఉందన్నారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీలో పాస్‌ చేయాలనుకున్నప్పుడు టియూడబ్ల్యూజే ప్రధాన భూమిక పోషించిందన్నారు. ఆంధ్ర పెత్తందారీ యూనియన్లతో ఒరిగేదేమీ లేదని, తెలంగాణ కోసం కొట్లాడింది,పోరాడడింది మన సంఘమేనన్నారు. జర్నలిస్టులకు రూ.42కోట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడంతో పాటుగా కరోనా లాంటి విపత్కర సమయాల్లో రూ.10వేలు, రూ.20వేలు చొప్పున రూ.7కోట్ల ఆర్థిక సాయం కేవలం ఆధార్‌ కార్డు ద్వారా అందజేశామని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలో దాదాపు 450 కుటుంబాలకు పింఛన్‌ అందజేసి వారి కుటుంబాల్లో వెలుగులు నింపామన్నారు. రాష్ట్రంలో 20,300కు పైగా అక్రిడిటేషన్‌ కార్డులతో పాటు డెస్క్‌ జర్నలిస్టులకు సైతం అందజేసిన ఘనత కూడా మన సంఘానికే దక్కుతుందన్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అక్రిడిటేషన్‌ కార్డుల సంఖ్య తగ్గించడంతో పాటుగా, డెస్క్‌ జర్నలిస్టులను సైతం తొలగించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు సంబంధించి ప్రత్యేక జీవో సైతం వచ్చిందని, కానీ సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఆగిపోయాయని, ఇండ్ల స్థలాల సమస్యను వదిలిపెట్టేది లేదని, యూనియన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టియూడబ్ల్యూజే సభ్యత్వ నమోదులో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని, మన యూనియన్‌లో సభ్యత్వం తీసుకోవాలని, తామంతా అండగా ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్‌ హజరే, రాష్ట్ర కోశాధికారి యోగానంద్‌, టెంజూ రాష్ట్ర అధ్యక్షులు విష్ణు, చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమణ, జిల్లా ఉపాధ్యక్షులు కాగితపు వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి ప్రభాకర్‌ రెడ్డి, ఐజేయూ సభ్యులు చండ్ర నరసింహారావు, గుర్రం రాజేష్‌, టెంజూ జిల్లా అధ్యక్షులు వట్టికొండ రవి, జిల్లా కార్యదర్శి శ్రీహరి, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ* *నేరాలను నియంత్రణ మరియు చేదించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం* *జిల్లాఎస్ పి రోహిత్ రాజు ఐ పి ఎస్*

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ

పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ ను ఈ రోజు జిల్లా ఎస్ పి రోహిత్ రాజు ఐ పి ఎస్ సందర్శించారు. ఇందులో భాగంగా పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూతనంగా ఏర్పాటు చేసిన 43 సీసీ కెమెరాలను అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేసిన కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ నేరాలను నియంత్రించడంలో మరియు నేరాలు ఛేదించడంలో సీసీ కెమెరాలు పాత్ర కీలకమని అన్నారు. జిల్లాలో ఇప్పటికే సీసీ కెమెరాలు సహాయంతో చాలా నేరాలను ఛేదించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలియజేసారు.అనంతరం పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించి అక్కడ నమోదైన పలు కేసులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ వివిధ రకాల సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు అండగా ఉండాలని తెలిపారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు,సమస్యాత్మక వ్యక్తులు మరియు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.అనంతరం పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు మరియు సిబ్బంది సమస్యల గురించి అడిగి తెలుసుకుని వాటి పరిష్కారాన్ని కృషి చేస్తామని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,సీఐ వినయ్ కుమార్,ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు,ఎస్ఐలు సుమన్,రాఘవయ్య,జీవన్ రాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :అన్నపురెడ్డిపల్లి* *దాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్*

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :అన్నపురెడ్డిపల్లి 

దాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

 మాయ మాటలు చెప్పే దళారులకు అమ్మి మోసపోవద్దు 

అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని గుంపెన గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిజిల్లా ఎస్ పి రోహిత్ రాజ్ సందర్శించడం జరిగింది.అక్కడ విధుల్లో ఉన్న అధికారులను కొనుగోలు ప్రక్రియను గురించి అడిగి తెలుసుకున్నారు.అనంతరం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న రైతుల సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరిస్తామని తెలిపారు.రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని మాయమాటలు చెప్పే దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు.దాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే స్థానిక పోలీస్ అధికారులకు వెంటనే సమాచారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి రెహమాన్,ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు, అన్నపురెడ్డిపల్లి ఎస్సై చంద్రశేఖర్, చంద్రుగొండ ఎస్సై స్వప్న మరియు తదితరులు పాల్గొన్నారు.

*గంజాయి అక్రమ రవాణా అరికట్టాలి విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి*

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :భద్రాచలం

చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తం గా ఉండాలి 

జిల్లా ఎస్ పి రోహిత్ రాజ్ 

భద్రాచలం : భద్రాచలం పట్టణలోని బ్రిడ్జి పాయింట్ లో గల చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ రవాణా జరగకుండా చెక్ పోస్టులో గట్టి నిఘా ఏర్పాటు చేయాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, చెక్ పోస్టు వద్ద విధులు నిర్వహించే సిబ్బంది నిత్యం అప్రమతంగా ఉండాలని,ఎటు వంటి అక్రమ కార్యకలాపాలకు తావులేకుండా నిరంతరం వాహన తనిఖీలు చేయాలన్నారు. తనిఖీల సమయంలో ఏమి చేయాలో, చేయకూడదో సిబ్బందికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు స్పష్టంగా వివరించారు. రాత్రి సమయాల్లో విధులు నిర్వహించే సిబ్బంది రేడియం జాకెట్స్ ధరించాలని, భద్రతా పరమైన చర్యలు తప్పకుండా తీసుకోవలని ఎస్పీ సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీ లలో భద్రాచలం టౌన్ సీఐ సంజీవ రావు, టౌన్ ఎస్ ఐ విజయలక్ష్మి, ట్రాఫిక్ ఎస్ ఐ మధు ప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

*ఫలించిన టియూడబ్ల్యూజె (టిజెఎఫ్) 143 నాయకుల కృషి*

 జర్నలిస్టుల పిల్లల స్కూల్ ఫీజుల్లో50శాతం రాయితీ 

సర్క్కులర్ జారీ చేసిన భద్రాద్రి కొత్తగూడెం డీఈఓ

హర్షం వ్యక్తం చేసిన యూనియన్ నేతలు

ధన్యవాదాలు తెలిపిన జిల్లా జర్నలిస్టులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లల ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) సోమశేఖర శర్మ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారులకు, ప్రైవేట్​ స్కూళ్లకు సర్య్కులర్​ జారీ చేశారు. 2023–24 అకడమిక్​ ఇయర్​కు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం​ స్కూళ్లలో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ ఇవ్వాలని స్పష్టం చేశారు. జర్నలిస్టుల పిల్లలకు స్కూళ్ల ఫీజులో రాయితీ కోరుతూ గత నెలలో 6వ తేదీన భద్రాద్రి ​జిల్లా విద్యాశాఖ అధికారులను కలిసిన టియూడబ్ల్యూజె (టిజెఎఫ్) 143 ప్రతినిధి బృందం డీఈఓకు వినతి పత్రం అందించింది. దీనికి డీఈఓ సానుకూలంగా స్పందిస్తూ.. సర్క్యూలర్ జారీ చేశారు. ఫీజు రాయితీపై డీఈఓ ఆదేశాలు జారీ చేయడం పట్ల యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు కల్లోజీ శ్రీనివాస్, మహమ్మద్ షఫీ, టెంజు అధ్యక్ష, కార్యదర్శులు వట్టికొండ రవి, సిహెచ్ నరసింహరావు, యూనియన్ నాయకులు హర్షం వ్యక్తం చేయగా జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ లు యూనియన్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ**విద్యుత్ షాక్ గురై వ్యక్తి మృతి*

 ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి మృతి చెందిన సంఘటన శుక్రవారం పాల్వంచ లో చోటుచేసుకుంది.పాల్వంచ పట్టన పరిధిలోని శేఖరం బంజర కు చెందిన సంతోష్ అనే వ్యక్తి చిప్పింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.అల్లూరి సెంటర్ ఏరియాలోని ఓ ఇంటిలోని చిప్పింగ్ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.మృతదేహాన్ని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ* *విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు-పాల్వంచ డీఎస్పీ వెంకటేష్*

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని శాఖపరమైన చర్యలు తీసుకుంటామని పాల్వంచ డిఎస్పి వెంకటేష్ సిబ్బందిని హెచ్చరించారు. మంగళవారం పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు.నేషనల్ హైవే పై డివైడర్లను అనధికారికంగా కట్ చేసి ఏర్పాటు చేసుకున్న మార్గాలు, ఆ కారణంతో జరిగిన ప్రమాదాలు, మృతి చెందిన వ్యక్తుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే నేషనల్ హైవే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం పట్టణంలోని ప్రధాన సెంటర్లలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల పనితీరును, బ్లూ కోట్ సిబ్బంది పనితీరును స్వయంగా పరిశీలించి అసహనం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఎటువంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగినా, ఆ కారణంతో జరిగే రోడ్డు ప్రమాదాలకు బాధ్యత వహించవలసి వస్తుందని హెచ్చరించారు. ముఖ్యంగా హోంగార్లు ట్రాఫిక్ ఉల్లంఘన ల ఫోటోలు తీయవద్దని , ఆ పనిని ఎస్ఐ స్థాయి అధికారికి కేటాయించాలని సీఐ వినయ్ కుమార్ కు సూచించారు.

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ* *రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి*

రోడ్డు ప్రమాదాల నివారణ పై పాల్వంచ పట్టణ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు, ట్రాఫిక్ అంతరాయాలు, ట్రాఫిక్ రూల్స్ పై ప్రయాణికులకు పూర్తిస్థాయిలోఅవగాహన లేకపోవడం, జాతీయ రహదారిపై నేషనల్ హైవే అథారిటీ వారు ఏర్పాటు చేసిన డివైడర్లను నిబంధనలకు విరుద్ధంగా మధ్యలో ధ్వంసం చేసి ఇల్లీగల్ పాసెజ్ లను ఏర్పాటు చేసుకోవడం తదితర కారణాలను గుర్తించారు. పాల్వంచ టౌన్ పోలీసులు, మున్సిపల్ అధికారులు, నేషనల్ హైవే అధికారులతో కలిసి పాల్వంచ సీఐ వినయ్ కుమార్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ సెంటర్ , దమ్మపేట సెంటర్ , రెజీనా స్కూల్ ప్రాంతాలలో జాతీయ రహదారిని, డివైడర్లను, ఇల్లీగల్ ప్యాసేజెస్ను శుక్రవారం పరిశీలించారు. సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. యుద్ధ ప్రాతిపదికన డివైడర్స్ ను క్రమబద్ధీకరించాలని సూచించారు. వెంటనే ఇల్లీగల్ ప్యాసేజెస్ను మూసి వేయడానికి కావలసిన చర్యలు చేపట్టి రోడ్డు ప్రమాదాల నివారణకు తమవంతుగా పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ టౌన్ ఎస్సై బాణాల రాము, నేషనల్ హైవే అథారిటీ అధికారి నలిని, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి సత్యనారాయణ, మున్సిపల్ ఏఈ రాజేష్ పాల్గొన్నారు.

*కేసిఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేసిన టియూడబ్లూజే జిల్లా నాయకులు*

భద్రాద్రి కొత్తగూడెం

రెండు దశాబ్దాలకు పైగా పని చేస్తున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ కృషితో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ జర్నలిస్ట్ భవన్ కు స్థలాన్ని కేటాయించడంపై టియూడబ్లూజే (టీజేఎఫ్) జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు కల్లోజి శ్రీనివాస్, మహ్మద్ సఫీ ఆధ్వర్యంలో కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. గురువారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ లోని అమరవీరుల స్థూపం వద్ద టియూడబ్లూజే (టీజేఎఫ్) జిల్లా నాయకులు కేసీఆర్, కేటీఆర్, అల్లం నారాయణ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు కల్లోజి శ్రీనివాస్ మాట్లాడుతూ

జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం ప్రెస్ అకాడమీ చైర్మన్ చేస్తున్న కృషిని కొనియాడారు. రాష్ట్ర రాజధాని కేంద్రంలోని ఉప్పల్ బగాయత్ లో  జర్నలిస్టుల కోసం తెలంగాణ జర్నలిస్ట్ భవన్ నిర్మాణానికి 2000 గజాల స్థలాన్ని కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. టియూడబ్లూజే (టీజేఎఫ్) ఆధ్వర్యంలో జర్నలిస్టులకు భవిష్యత్తు లో మరిన్నీ సంక్షేమ పథకాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు చండ్ర నరసింహారావు, టెంజు అధ్యక్షులు వట్టి కొండ రవి, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ జిల్లా అధ్యక్షులు చెంగపొంగు సైదులు, కార్యదర్శి అఫ్జల్ పఠాన్, సీనియర్ పాత్రికేయులు మోటమర్రి రామకృష్ణ, అచ్చి ప్రభాకర్ రెడ్డి, జిల్లా నాయకులు కనుకు రమేష్, శివ ,రాజ్ కుమార్, నవీన్, భాస్కరాచారి, సురేష్, నాగరాజు ,మురళి, చిరంజీవి, కనకారావు, జంపన్న, చదలవాడ సూరి, కిరణ్ ,రత్నకుమార్, వినోద్, రమేష్, ఆదాబ్ శ్రీను, దశరథ్ ,కలవ రాజా, మిలాప్ శ్రీను, రహీం తదితరులు పాల్గొన్నారు.

*సీఎం కే సి ఆర్,కేటీఆర్ చిత్రపటాలకు లకు పాలభిషేకం*

జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం రెండు దశాబ్దాలకు పైగా పని చేస్తున్న టియూడబ్లూజే (టీజేఎఫ్) రాష్ట్ర కార్యాలయానికి (తెలంగాణ జర్నలిస్ట్ భవన్) కు స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం జిఓ జారీ చేసిన నేపథ్యంలో స్థల కేటాయింపు జరపడానికి ప్రధాన కారణమైన సీఎం కేసీఆర్, మున్సిపల్ ఐటి శాఖ మంత్రి కేటీఆర్, మన యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చిత్రపటాలకు టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి షఫీ మహమ్మద్ అధ్యకతన జిల్లా అధ్యక్షులు భద్రాద్రి జిల్లా అధ్యక్షులు కల్లోజీ శ్రీనివాస్ కోత్తగూడెం బస్టాండ్ సెంటర్ లో చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.ఈ సందర్బంగా కల్లోజీ మాట్లాడుతూ జిల్లా కార్యవర్గం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.హైద్రాబాద్ ఉప్పల్ బగాయత్ లో యూనియన్ భవనం కోసం 2000 గజాలా స్థలంను కేటాయించటం పై హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో టెంజు అధ్యక్షులు వట్టి కొండ రవి, రాష్ట్ర ఐ జె యూ సభ్యులు చండ్ర నరసింహరావు,యూనియన్ బాధ్యులు, యూనియన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.