TG: మెదక్ చర్చి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

మెదక్ జిల్లా:

క్రిస్మస్ పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఇవాళ ప్రఖ్యాత మెదక్ కేథడ్రల్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు హాజరై ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 29 కోట్ల రూపాయల వ్యయంతో చర్చి వద్ద చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో హాజరైన ముఖ్యమంత్రి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వందేళ్లు పూర్తి చేసుకున్న ఈ చర్చి ఒక గొప్ప చర్చ్ గా గుర్తింపు పొందిందని అన్నారు.

వందేళ్ల కిందట కరవు కాటకాలను నిర్మూలించడానికి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు పనికి ఆహారం పథకం కింద భోజనం పెట్టి, చర్చి నిర్మాణం చేపట్టడం ఒక గొప్ప ఆలోచనగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నేటి ఉపాధి హామీ పథకానికి అదే స్ఫూర్తి ఉందని అన్నారు. చర్చి తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, మెదక్ జిల్లా అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళుతుందని అన్నారు. విద్య, వైద్యం విషయంలో క్రిస్టియన్ మిషనరీలు ఎనలేని సేవలు అందించాయని సిఎం కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట టిపిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్,ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు ఉన్నారు.

NLG: ఆత్మహత్య ప్రయత్నం చేసిన వ్యక్తి.. ఆసుపత్రికి తరలించిన పోలీసులు

నల్లగొండ: పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో బుధవారం, హోసింగ్ బోర్డు కాలనీ కి చెందిన సయ్యద్ నదిమ్ అనే వ్యక్తి తన గొంతు కోసుకుని రోడ్డుపై తీవ్ర రక్త స్రావం తో ఉండటం గమనించిన స్థానిక యువకులు పోలీసులకు, అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు.

వెంటనే స్పందించిన 2 టౌన్ ఏస్ఐ రావుల నాగరాజు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని, సయ్యద్ నదిమ్ కు రక్తం కారకుండా తన చేతి రుమాలుని కట్టి తన వాహనంలో ఎక్కించుకుని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
NLG: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నాయకులు
నల్గొండ: పట్టణంలోని గాంధీనగర్  ప్రైస్ ఇవాంజెలికల్ చర్చ్ నందు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.  ఈ మేరకు చర్చి సిస్టర్ గుండ్లపల్లి విజయ కుమారి, బంగారయ్య లు కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రార్థనలు చేశారు.

ఈ కార్యక్రమానికి అతిథులుగా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్,  రాష్ట్ర కార్యదర్శి కామల్ల నరేష్ కుమార్, జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న, సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు కాసర్ల లింగస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ వంగూరు సునీల్, జిల్లా కార్యవర్గ సభ్యులు గంట సుమంత్, కోఆర్డినేటర్ చింతపల్లి నవీన్, కట్టెల మహేష్ కుమార్, వినోద్, ప్రవీణ్, సురేందర్, బీజేవైఎం నాయకులు శాంతి స్వరూప్, తదితరులు పాల్గొన్నారు
NLG: ఏఐఎస్ఎస్డి ఆధ్వర్యంలో మనుస్మృతి పత్రాలు దహనం

నల్లగొండ జిల్లా:

కొండ మల్లేపల్లి: ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఉరే సురేష్ ఆధ్వర్యంలో, మండల కేంద్రంలోని రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, మనుస్మృతి పత్రాలు దహనం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళిత రత్న డా. బుర్రి వెంకన్న పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. మనిషిని మనిషిగా చూడలేని మనుస్మృతి ని అంబేద్కర్ 1927లో ఇదే రోజు దహనం చేసి, దేశ చరిత్రలో అస్పృశ్య కులాలకు మానవ హక్కులను గుర్తించబడిన రోజు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి కండెల వెంకన్న కొండమల్లేపల్లి కన్వీనర్ ప్రసాద్ సంజీవ,చంటి తదితర సభ్యులు పాల్గొన్నారు.

NLG: ఘనంగా వాజపేయి 100 వ జయంతి
నల్లగొండ జిల్లా:
మునుగోడు: భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజపేయి 100 వ జయంతి సందర్భంగా మండల కేంద్రంలో, బిజెపి నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా  భారతదేశానికి వాజపేయి చేసిన సేవలను కొనియాడారు.

కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి బొడిగె అశోక్ గౌడ్, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మాధగోని నరేందర్ గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి అక్కెనపల్లి సతీష్, మాజీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఎం.డి మాజీద్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు కొత్త శంకర్, దళిత మోర్చా మండల అధ్యక్షులు పందుల యాదయ్య, దళిత మోర్చా మండల ఉపాధ్యక్షుడు పెనుమండ్ల రాము, దళిత మోర్చా మండల ప్రధాన కార్యదర్శి పందుల నరేష్, రాములు, తదితరులు పాల్గొన్నారు.
NLG: గట్టుప్పల్ లో ఘనంగా వాజపేయి శత జయంతి
నల్గొండ జిల్లా:
భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజపేయి శతజయంతి సందర్భంగా, ఇవాళ గట్టుప్పల్ మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు రావుల ఎల్లప్ప ఆధ్వర్యంలో వాజపేయి చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు.

ముఖ్య అతిథిలుగా జిల్లా కార్యదర్శి చిలువేరు దుర్గయ్య, ఓబీసీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షుడు కంపే దుర్గయ్య పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. వాజపేయి రాజకీయ చతురతలో దేశ అభివృద్ధి కి అవసరమైన అనేక సంస్కరణలను తీసుకురావడం జరిగిందన్నారు. నాయకులు, కార్యకర్తలు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ అభివృధికి కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమం లో మండల ప్రధాన కార్యదర్శి కొంగరి నరహరి, ఉపాధ్యక్షులు జంపాల సుధాకర్, కార్యవర్గ సభ్యులు నీల ఆంజనేయులు, జిల్లా చేనేత సేల్ కో కన్వీనర్ కొంగరి పాండు,మోర్చ మండల అధ్యక్షుడు మోద్దు రామేశ్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షుడు వీరమల్ల రాజు, ప్రధాన కార్యదర్శి కుండే శ్రీశైలం,తెరటుపల్లి శక్తి కేంద్ర ఇన్చార్జి కంటాల బ్రహ్మయ్య, శక్తి కేంద్ర సహా ఇంచార్జి గంజి సురేష్, బూత్ అద్యక్షులు పగీళ్ళ శంకర్, కౌడగొని శేఖర్, తిరందాసు ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
TG: గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గా దీపారెడ్డి

HYD: తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గా గాయం దీపారెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు కేంద్ర సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్ రావు ఉత్తర్వులు వెలువరించారు.

ఈ సందర్భంగా దీపా రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో నెలకొన్న మహిళల సమస్యల పరిష్కార దిశగా తన వంతు బాధ్యతను నిర్వహిస్తానని అన్నారు. ఈ పదవి బాధ్యతలు కట్టబెట్టిన కేంద్ర సంఘానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన దీపారెడ్డి రాష్ట్ర భూగర్భజల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు.

NLG: 'డయల్ యువర్ డిఎం కార్యక్రమానికి విశేష స్పందన'
నల్లగొండ జిల్లా:
దేవరకొండ: టీ జి ఎస్ ఆర్ టి సి, దేవరకొండ డిపో లో మంగళవారం ఏర్పాటు చేసిన డయల్ యువర్ డిఎం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది అని డిపో మేనేజర్ తెలిపారు.

ఈ సందర్భంగా డిపో మేనేజర్ రమేష్ బాబు మాట్లాడుతూ.. పలువురు ఆర్టీసీ బస్సు ప్రయాణికులు ఫోన్లో తమ యొక్క సూచనలు సలహాలు, సమస్యలపై మాట్లాడారని, అమూల్యమైన వారి సూచనలు, సలహాలను స్వీకరించామని తెలిపారు.

కొన్ని రిక్వెస్ట్ స్టాప్ ల పేర్లు తెలుపుతూ బస్సులను ఆపాలని ప్రయాణికులు కోరినట్లు చెప్పారు. ప్రయాణికుల కోరిక మేరకు సంబంధిత బస్సు కండక్టర్లకు తెలుపుతామని వివరించారు. అదేవిధంగా మరికొన్ని సూచనలు చేశారని ప్రతి సూచనను పరిగణలోకి తీసుకుంటున్నామని తెలిపారు.
TG: మహిళ కమిషన్ ఛైర్మెన్ శారద తో మలేషియా ప్రతినిధుల బృందం భేటీ
HYD: తెలంగాణలో మహిళా కమిషన్ తీరుతెన్నులు గురించి మలేషియా పారిశ్రామిక వేత్తల బృందం మహిళా కమిషన్ ఛైర్మెన్ నేరెళ్ల శారద తో  భేటీ అయ్యింది. మంగళవారం బుద్ధ భవన్లో కమిషన్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి టిపిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ సంతోష్, ఎంబిసి కార్పొరేషన్ చైర్మన్ విజయ్ హాజరయ్యారు.  ఈ మేరకు రాష్ట్రంలో మహిళ కమిషన్ ఏర్పాటు, పనితీరు గురించి మలేషియా ప్రతినిధుల అడిగి తెలుసుకున్నారు. మహిళల హక్కులను పరిరక్షించడం కోసం  కమిషన్ ఏర్పాటు చేయడం  జరిగిందని ఛైర్మెన్ శారద వారికి వివరించారు. సమాజంలో మహిళల పట్ల వివక్షతను తొలగించి, జెండర్ సెన్సిటైజేషన్ వంటి కార్యక్రమాలు ద్వారా మహిళా సాధికారత కోసం కృషి చేయడం జరుగుతుందని ఛైర్మెన్ శారద వారికి తెలిపారు.
RR: అమిత్ షా ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం
రంగారెడ్డి జిల్లా: ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు, జిల్లా కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పై.. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ, అమిత్ షా ను తక్షణమే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని కోరుతూ, మంగళవారం ఉదయం కొంగరకలాన్ డా.బి.అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, వీర్లపల్లి శంకర్, రాష్ట్ర రోడ్డు డవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు చిలుక మధుసూదన్ రెడ్డి, కె. గురునాధ్ రెడ్డి, యువ నాయకుడు మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్లు, బ్లాక్, మండల, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, మాజీ జడ్పీ చైర్మన్, మాజీ జడ్పీటీసీ లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.