NLG: ఏఐఎస్ఎస్డి ఆధ్వర్యంలో మనుస్మృతి పత్రాలు దహనం
నల్లగొండ జిల్లా:
కొండ మల్లేపల్లి: ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఉరే సురేష్ ఆధ్వర్యంలో, మండల కేంద్రంలోని రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, మనుస్మృతి పత్రాలు దహనం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళిత రత్న డా. బుర్రి వెంకన్న పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. మనిషిని మనిషిగా చూడలేని మనుస్మృతి ని అంబేద్కర్ 1927లో ఇదే రోజు దహనం చేసి, దేశ చరిత్రలో అస్పృశ్య కులాలకు మానవ హక్కులను గుర్తించబడిన రోజు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి కండెల వెంకన్న కొండమల్లేపల్లి కన్వీనర్ ప్రసాద్ సంజీవ,చంటి తదితర సభ్యులు పాల్గొన్నారు.
Dec 25 2024, 20:41