TG: గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గా దీపారెడ్డి
HYD: తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గా గాయం దీపారెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు కేంద్ర సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్ రావు ఉత్తర్వులు వెలువరించారు.
ఈ సందర్భంగా దీపా రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో నెలకొన్న మహిళల సమస్యల పరిష్కార దిశగా తన వంతు బాధ్యతను నిర్వహిస్తానని అన్నారు. ఈ పదవి బాధ్యతలు కట్టబెట్టిన కేంద్ర సంఘానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన దీపారెడ్డి రాష్ట్ర భూగర్భజల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
Dec 25 2024, 14:13