NLG: పే రోల్, ఐడి ఇచ్చి కనీస వేతనం అమలు చేయాలి: సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ
నల్లగొండ: కేజీబీవీ మోడల్ స్కూల్ అటాచ్డ్ గర్ల్స్ హాస్టల్లో  పనిచేస్తున్న కేర్ టేకర్, ఏఎన్ఎం, కుక్కింగ్ వర్కర్స్ కు పే రోల్, ఐడి ఇచ్చి రూ. 26 వేల కనీస వేతనం అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ కు అందజేశారు.

ఈ మేరకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. విద్యాశాఖ సమగ్ర శిక్ష లో భాగంగా కేజీబీవి మోడల్స్ స్కూల్ హాస్టల్లో వర్కర్స్ 2015 నుండి అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నారని వీరికి కనీస వేతనం రూ  26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

వీరికి కనీసం అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.24 గంటలు డ్యూటీ చేస్తున్నారని ఇది ఆపాలని కోరారు. పే రోల్ లేదనే నెపంతో వీరికి కనీస వేతనాలు ఇవ్వకుండా స్కూల్ కు వచ్చే బడ్జెట్ తోనే, తక్కువ వేతనాలు ఇస్తూ వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రవ్యాప్తంగా 192 గర్ల్స్ హాస్టల్ లో సుమారు1200 మంది 24 గంటలు పనిచేస్తున్నారని వీరికి పే రోల్ ఐడి ఇచ్చి 26 వేల కనీస వేతనం ఇవ్వాలని, వీరందరినీ విద్యా శాఖలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని,ఆరు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, ఆరోగ్య ,జీవిత బీమా 10 లక్షలు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు పోలే సత్యనారాయణ, యూనియన్ నాయకులు జ్యోత్స్న,  మీనాక్షి, జానకమ్మ,పార్వతమ్మ, భాగ్యమ్మ, జయలక్ష్మి, మాధవి, కావ్య తదితరులు పాల్గొన్నారు.
YGT:రేపు ఉదయం 'డయల్ యువర్ డిపో మేనేజర్
యాదాద్రి జిల్లా:
రేపు అనగా ఈనెల 24 న యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో నందు "డయల్ యువర్ డిపో మేనేజర్" కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు.

యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో పరిధిలో గల గ్రామాల ప్రజలు ఉదయం 11 నుండి 12 గంటల వరకు సలహాలు, సూచనలు, ఏదైనా సమస్యలు తెలియజేయడానికి 9959226310 నెంబర్ కు ఫోన్  చేయాల్సిందిగా సూచించారు.
NLG: ఈ నెల 28 న సాధారణ సమావేశం
నల్గొండ: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఈ నెల 28 న ఉదయం 11 గంటలకు సాధారణ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ ముసబ్ అహ్మద్  ఒక ప్రకటనలో తెలిపారు.

మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరుగు, ఈ సమావేశానికి పాలకవర్గ సభ్యులు సకాలములో హాజరు కావాలని  కోరారు.

మిర్యాలగూడ: రేపు మధ్యాహ్నం డయల్ యువర్ డిఎం
నల్గొండ జిల్లా:
రేపు అనగా ఈనెల 24 న మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, మిర్యాలగూడ డిపో మేనేజర్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు.

మిర్యాలగూడ డిపో పరిధిలో, ఆర్టీసీ బస్సులకు సంబంధించిన ఏమయినా సలహాలు సూచనలు లేదా ఏవైనా సమస్యలను తెలియజేయడానికి, పైన సూచించిన సమయంలో 9959226 308 నంబర్ కు డయల్ చేయవలసిందిగా కోరారు.
SHARE IT
NLG: రేపు మధ్యాహ్నం.. డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం
ఈ నెల 24 న మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నల్గొండ డిపో మేనేజర్ శ్రీనాథ్ తెలిపారు.

నల్గొండ డిపో పరిధిలో, ఆర్టీసీ బస్సులకు సంబంధించిన ఏమయినా సూచనలు, సలహాలు లేదా ఏవైనా సమస్యలను తెలియజేయడానికి పైన సూచించిన సమయంలో 99592 26305 నంబర్ కు డయల్ చేయవలసిందిగా కోరారు.
NLG: ప్రధాన రహదారి ప్రక్కనే పేరుకుపోయిన చెత్త కుప్పలు
మర్రిగూడ మండలం, లెంకలపల్లి గ్రామంలో ప్రధాన రహదారి ప్రక్కన చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి.

ప్రజా ప్రభుత్వంలో పారిశుద్ధ్య పనులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, సంబంధిత గ్రామ అధికారి నిర్లక్ష్యం వల్ల చెత్త పేరుకుపోయినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుచున్నారు.
NLG: జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్
నల్గొండ జిల్లా:
మర్రిగూడ: జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ సోమవారం రాష్ట్ర, జిల్లా మరియు మండల రైతాంగానికి రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ మేరకు రామదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతులకు ఇప్పటికే 21 వేల కోట్ల రుణమాఫీ చేసిందని, సన్న రకం ధాన్యానికి మద్దతు ధర పైన 500 రూపాయల బోనస్ కల్పించిందని, సంక్రాంతి నుండి  రైతు భరోసా రైతుల ఖాతాలో జమ చేయనుందని ఇప్పటికే ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో, రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని గుర్తు చేశారు.
NLG: ఆర్.టి.ఐ నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా గయాజుద్దీన్
నల్గొండ: సమాచార హక్కు సాధన సమితి నియోజకవర్గ కమిటి ఆద్వర్యంలో, నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మొహమ్మద్ గయాజుద్దీన్ ను నియమించారు.

ఈ మేరకు పట్టణంలో సోమవారం నియోజకవర్గ అధ్యక్షులు పెరిక అభిలాష్, జిల్లా ఇంచార్జ్ నజీర్ కు ఆయనకు నూతన నియామకం పత్రం అందజేశారు.

కార్యక్రమంలో సభ్యులు జిల్లా సంపత్, బన్నీ, తదితరులు పాల్గొన్నారు.
NLG: ధర్మ సమాజ్ పార్టీ దీక్ష కు మద్దతు తెలిపిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం
నల్లగొండ: మూడవరోజు ధర్మ సమాజ్ పార్టీ ఆమరణ నిరాహార దీక్షలో భాగంగా, ఆదివారం డిఎస్పి రాష్ట్ర కార్యదర్శి తలారి రాంబాబు  జిల్లా అధ్యక్షులు వట్టెపాక శ్రీనివాస్ దళిత శక్తి పార్టీ నాయకులకు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ కలిసి సంఘీభావం, మద్దతు తెలిపారు.

ఈ మేరకు శివకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 90% బహుజనులు ఉంటే, వారికి న్యాయమైన విధంగా ఫలాలు అందడం లేదని, ఉచిత  విద్యా,వైద్యం, ఉపాధి కొరకు 25% బడ్జెట్ కేటాయించి, అన్ని రంగాలలో   రిజర్వేషన్లు కల్పించాలని చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలపడం జరిగిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్, కార్యదర్శి ఎం.డి మసి, జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న, జిల్లా ఉపాధ్యక్షులు కాసర్ల లింగస్వామి వర్కింగ్ ప్రెసిడెంట్ వంగూరి సునీల్, జిల్లా కార్యవర్గ సభ్యులు సుమంత్, ప్రవీణ్, నరేందర్, సుజిత్,తదితరులు పాల్గొన్నారు.
నీరుడు నవీన్ రెడ్డి- వినీత దంపతులకు పుడమిపుత్ర అవార్డు
నల్లగొండ జిల్లా, నిడమనూర్ మండలం, గుంటిపెల్లి గ్రామానికి  చెందిన నీరుడు నవీన్ రెడ్డి - వినీత దంపతులు పుడమిపుత్ర అవార్డు అందుకున్నారు.ఈరోజు యాదగిరిగుట్ట లో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో జరిగిన సుస్థిర విజ్ఞాన సదస్సులో.. సేంద్రీయ వ్యవసాయంలో భాగంగా కెమికల్ రహితంగా కూరగాయలు పండిస్తూ, గ్రామ రైతులను ఆర్గానిక్ వ్యవసాయం దిశగా ప్రోత్సహిస్తున్న కృషిని గుర్తించి 'పుడమిపుత్ర' అవార్డుతో సత్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ సంస్థలచైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి, కార్యక్రమాన్ని కన్వీనర్ పడమటి పావని, రాష్ట్ర క్రీడా విభాగం ప్రధానకార్యదర్శి బొమ్మపాల గిరిబాబు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.