NLG: ఆర్.టి.ఐ నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా గయాజుద్దీన్
నల్గొండ: సమాచార హక్కు సాధన సమితి నియోజకవర్గ కమిటి ఆద్వర్యంలో, నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మొహమ్మద్ గయాజుద్దీన్ ను నియమించారు.

ఈ మేరకు పట్టణంలో సోమవారం నియోజకవర్గ అధ్యక్షులు పెరిక అభిలాష్, జిల్లా ఇంచార్జ్ నజీర్ కు ఆయనకు నూతన నియామకం పత్రం అందజేశారు.

కార్యక్రమంలో సభ్యులు జిల్లా సంపత్, బన్నీ, తదితరులు పాల్గొన్నారు.
NLG: ధర్మ సమాజ్ పార్టీ దీక్ష కు మద్దతు తెలిపిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం
నల్లగొండ: మూడవరోజు ధర్మ సమాజ్ పార్టీ ఆమరణ నిరాహార దీక్షలో భాగంగా, ఆదివారం డిఎస్పి రాష్ట్ర కార్యదర్శి తలారి రాంబాబు  జిల్లా అధ్యక్షులు వట్టెపాక శ్రీనివాస్ దళిత శక్తి పార్టీ నాయకులకు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ కలిసి సంఘీభావం, మద్దతు తెలిపారు.

ఈ మేరకు శివకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 90% బహుజనులు ఉంటే, వారికి న్యాయమైన విధంగా ఫలాలు అందడం లేదని, ఉచిత  విద్యా,వైద్యం, ఉపాధి కొరకు 25% బడ్జెట్ కేటాయించి, అన్ని రంగాలలో   రిజర్వేషన్లు కల్పించాలని చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలపడం జరిగిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్, కార్యదర్శి ఎం.డి మసి, జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న, జిల్లా ఉపాధ్యక్షులు కాసర్ల లింగస్వామి వర్కింగ్ ప్రెసిడెంట్ వంగూరి సునీల్, జిల్లా కార్యవర్గ సభ్యులు సుమంత్, ప్రవీణ్, నరేందర్, సుజిత్,తదితరులు పాల్గొన్నారు.
నీరుడు నవీన్ రెడ్డి- వినీత దంపతులకు పుడమిపుత్ర అవార్డు
నల్లగొండ జిల్లా, నిడమనూర్ మండలం, గుంటిపెల్లి గ్రామానికి  చెందిన నీరుడు నవీన్ రెడ్డి - వినీత దంపతులు పుడమిపుత్ర అవార్డు అందుకున్నారు.ఈరోజు యాదగిరిగుట్ట లో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో జరిగిన సుస్థిర విజ్ఞాన సదస్సులో.. సేంద్రీయ వ్యవసాయంలో భాగంగా కెమికల్ రహితంగా కూరగాయలు పండిస్తూ, గ్రామ రైతులను ఆర్గానిక్ వ్యవసాయం దిశగా ప్రోత్సహిస్తున్న కృషిని గుర్తించి 'పుడమిపుత్ర' అవార్డుతో సత్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ సంస్థలచైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి, కార్యక్రమాన్ని కన్వీనర్ పడమటి పావని, రాష్ట్ర క్రీడా విభాగం ప్రధానకార్యదర్శి బొమ్మపాల గిరిబాబు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
రామచంద్రమూర్తి -శృతి దంపతులకు పుడమిపుత్ర అవార్డు బహుకరణ
నల్గొండ మండలం, మేళ్ల దుప్పలపల్లి గ్రామానికి చెందిన ముదునూరు రామచంద్రమూర్తి-శృతి దంపతులకు, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో, నేడు యాదగిరిగుట్టలో జరిగిన సుస్థిర విజ్ఞాన సదస్సులో.. సేంద్రీయ వ్యవసాయం, గోవు వ్యవసాయము, కెమికల్ రహిత వ్యవసాయం చేస్తున్నందుకు గాను, వారు చేస్తున్న కృషిని గుర్తించి పుడమిపుత్ర అవార్డుతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ సంస్థల చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి కార్యక్రమాన్ని కన్వీనర్ పడమటి పావని, రాష్ట్ర క్రీడా విభాగం ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
జీకే బయోసైన్సెస్ వ్యవస్థాపకులు కృష్ణంరాజు కు కిసాన్ సేవా రత్న అవార్డు
NLG:గత 50 సంవత్సరాలుగా వ్యవసాయ విత్తన రంగంలో వినూత్నమైన, నాణ్యమైన కూరగాయల వంగడాలను రైతులకు అందించిన జీకే సీడ్స్ వ్యవస్థాపకులు, అగ్రి సైంటిస్ట్
జి.కృష్ణంరాజు చేస్తున్న కృషిని గుర్తించి గాంధీగ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థలు, ఆదివారం యాదగిరిగుట్టలో జరిగిన 2024 సుస్థిర విజ్ఞాన సదస్సులో కిసాన్ సేవారత్న అవార్డు, ప్రశంసా పత్రం ను అందజేశారు.

ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి, కార్యక్రమ కన్వీనర్ పడమటి పావని, క్రీడా విభాగం రాష్ట్ర కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
TG: జాతీయ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు-2024 లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి
ఉమ్మడి నల్లగొండ జిల్లా,యాదగిరిగుట్ట:
మహాత్మాగాంధీ  'పల్లెలే ఈ దేశానికి పట్టుకొమ్మలు' అన్నారు. కానీ, కార్పొరేట్ కంపెనీల ఆగమనం వల్ల ఈ దేశంలో ఇప్పటికే  'సగం పల్లెటూళ్లు.. పల్లెదనం కోల్పోయి వట్టి ఊర్లు గా మిగిలాయని, ఇలాంటి సందర్భంలో కొంతమంది రైతులు, రసాయనిక ఎరువులు లేకుండా పంటలు పండించడం అభినందినీయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.ఆదివారం యాదగిరిగుట్టలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ వారు ఏర్పాటు చేసిన 'జాతీయ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు-2024' లో పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా 10 రాష్ట్రాల్లో ఎరువులు, మందులు లేకుండా సేంద్రియ వ్యవసాయం చేసే 115 ఉత్తమ రైతుల జంటలకు పుడమి పుత్ర అవార్డు ప్రదానం చేయడం జరిగింది.

ఈ మేరకు వ్యవసాయ అనుబంధ రంగాల్లో పనిచేసే 35 మంది అధికారులకు, శాస్త్రవేత్తలకు, జర్నలిస్టులకు కిసాన్ సేవా రత్న అవార్డులు ఇవ్వడం చాలా సంతోషం అని మంత్రి అన్నారు.

కార్యక్రమంలో  స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, పలువురు నాయకులు, గాంధీ గ్లోబల్ సంస్థల చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి కార్యక్రమ కన్వీనర్ పడమటి పావని, రాష్ట్ర క్రీడా విభాగం ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోడి శ్రీనివాస్, గోపాల్, ఇతర కార్యవర్గ సభ్యులు, పలువురు నాయకులు, అవార్డు గ్రహీతలు, తదితరులు పాల్గొన్నారు.
NLG: ధర్వేశిపురంలో పోటెత్తిన భక్తులు
నల్లగొండ:
కనగల్ మండలం, ధర్వేశిపురం గ్రామంలో గల ప్రఖ్యాత  శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో, ఆదివారం అమ్మవారిని భక్తులు విశేషంగా దర్శనం చేసుకున్నారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మహిళలు అమ్మవారికి వడి బియ్యం, చీర సారెలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులకి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
NLG: గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ 2024 పుడమిపుత్ర పురస్కార అవార్డులు
యాదగిరిగుట్ట: రెడ్డి సంక్షేమ భవన్ లో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల ఆధ్వర్యంలో, ఆదివారం సేంద్రీయ రైతులకు పుడమి పుత్ర అవార్డులు, కిసాన్ సేవా రత్న అవార్డులను  బహుకరించారు.

ఈ సందర్భంగా సంస్థల రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మపాల గిరిబాబు వేదికపై మాట్లాడుతూ.. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థలు సమాజహితానికి చేస్తున్న కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని, తద్వారా అన్ని రకాల వర్గాల ప్రజలను అక్కున చేర్చుకొని వారిని వెలుగు లోకి తీసుకొస్తుందని తెలిపారు.
TG: రైతాంగానికి మరింత మేలు కలిగే రీతిలో రైతు భరోసాను అమలు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
HYD: రైతులకు పెట్టుబడి సహాయం అందించే రైతు భరోసా పథకం విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కరలేదని, వ్యవసాయం చేసుకునే ప్రతి ఒక్కరికీ రైతు భరోసా అందుతుందని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు.

నిరుపేదలు ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, వ్యవసాయ కుటుంబాలు, భూమినే నమ్ముకుని భూమినే అమ్మగా భావించి, దాని చుట్టే జీవితం ముడిపడి ఉన్న రైతులను ఆదుకోవాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని, అందరి సూచనలు పరిగణలోకి తీసుకుని రైతాంగానికి మరింత మేలు కలిగే రీతిలో రైతు భరోసాను అమలు చేస్తామని చెప్పారు.

రైతు భరోసా అంశంపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. రైతు భరోసా అమలు విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కరలేదని సీఎం స్పష్టం చేశారు.
సీఎం కప్ హాకీ జట్టు ఎంపిక పోటీలు ప్రారంభం
నల్లగొండ: సీఎం కప్ లో భాగంగా ఉమ్మడి జిల్లా హాకీ జట్టు ఎంపిక పోటీలను, శనివారం టిపీసీసీ అధికార ప్రతినిధి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారుల అభ్యున్నతి కొరకే రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందన్నారు.ప్రతి పాఠశాలకు క్రీడా పరికరాలకు,క్రీడా బడ్జెట్ విడుదలకు కృషి చేస్తామన్నారు. హౌసింగ్ శాఖ పిడి రాజకుమార్, DYSO నర్సిరెడ్డి, SGF కార్యదర్శి దగ్గుపాటి విమల, హాకీ అసోసియేషన్  ప్రధాన కార్యదర్శి ఇమామ్ కరీం, ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మ పాల గిరిబాబు, హ్యాండ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి పుల్లయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు మెర్సీ ప్రభావతి, రవీందర్, శ్రీనివాస్, కవిత,బాలు, తదితరులు పాల్గొన్నారు.