వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
రామన్నపేట మండల కేంద్రంలోని జేపీ ఫంక్షన్ హాల్ లో పట్టణ కేంద్రానికి చెందిన ఎండి బద్రుద్దీన్ కూతురు వివాహమునకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తదనంతరం రామన్నపేట పట్టణ కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ మండల నాయకులు ఎండి మోసబ్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పోషబోయిన మల్లేశం ,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బందెల రాములు, మాజీ ఎంపీటీసీలు సాల్వేర్ అశోక్, ఎండి అమీర్, జిల్లా నాయకులు ఎస్.కె చాంద్, పట్టణ కార్యదర్శి జాడ సంతోష్ ,నాయకులు బొడ్డు అలయ్య ,లవణం రాము, రామిని లక్ష్మణ్ ,ఎండి అజాజ్, బాసాని రాజు ,కల్లూరి నరేష్, ఎండి అంజాద్ ,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Dec 23 2024, 10:18