డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను అవమానపరిచిన కేంద్రమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుండి తొలగించాలి:PRPS రాష్ట్ర అధ్యక్షులు నూనె వెంకట్ స్వామి డిమాండ్
కేంద్రమంత్రి అమిత్ షా తన యొక్క అసలు నైజాన్ని పార్లమెంట్ వేదిక ద్వారా బహిర్గతం చేసుకున్నాడు. అంబేద్కర్, అంబేద్కర్, అని అనే బదులు దేవుని స్తుతిస్తే ఏడు జన్మల పుణ్యఫలం దక్కుతుందని అంబేద్కర్ ను కీర్తించవద్దని దేవుని ప్రార్థించాలని ఆయన తన మనసులో ఉన్న విషయాన్ని బహిర్గతం చేయడం జరిగిందని, రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ను అవమానపరిచిన కేంద్రమంత్రి అమిత్ షాను తక్షణం కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని ప్రజా పోరాట సమితి (పి ఆర్ పి ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి డిమాండ్ చేశారు. *ఈ దేశంలో రాజ్యాంగాన్ని రచించి, భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించి, కులమతాల అసమానతలను చీల్చి చెండాడిన బిఆర్ అంబేద్కర్ విషయంలో భారతీయ జనతా పార్టీకి ఎంత కుటిలత్వం ఉన్నదో చెప్పకనే చెప్పినట్టుగా అమిత్ షా వైఖరి ఉన్నది. ఇటువంటి వాళ్లు కేంద్ర ప్రభుత్వాన్ని నడపడం భారత ప్రజల యొక్క దురదృష్టం అని అన్నారు.
అంబుజా సిమెంట్ కంపెనీని రద్దు చేయాలని తమ్మినేని కి వినతిపత్రం అందజేసిన రామన్నపేట సిపిఎం ప్రతినిధులు

చౌటుప్పల్ లో జరుగుతున్న సిపిఎం మూడవ జిల్లా మహాసభల సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారికి రామన్నపేట-కొమ్మాయిగూడెం పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే అంబుజా సిమెంటు కంపెనీని రద్దు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ సిపిఎం రామన్నపేట ప్రతినిధులు వినతి పత్రం అందజేయడం జరిగింది.. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి జిల్లా కమిటీ సభ్యులు జల్లెల పెంటయ్య లు మాట్లాడుతూ... ప్రజలకు హాని కలిగించే కాలుష్య పరిశ్రమను ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ అసెంబ్లీ సమావేశాల లోనే అంబుజా సిమెంట్ పరిశ్రమపై చర్చ జరిపి రామన్నపేటలో నిర్మించే సిమెంట్ పరిశ్రమను రద్దు చేయాలని ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని, లగచర్లలో ప్రజల నిరసనతో అక్కడ ఏర్పాటు చేయబోయే ఫ్యాక్టరీని రద్దు పరచిన విధంగా రామన్నపేట మండల ప్రజల అభిప్రాయం మేరకు అంబుజా సిమెంట్ పరిశ్రమను రద్దు చేసే విధంగా చూడాలని ప్రభుత్వానికి విన్నవించాలని వినతిపత్రం అందజేయడం జరిగింది అదే విధంగా సిపిఎం జిల్లా మహాసభలలో రామన్నపేటలో నిర్మించే అంబూజ సిమెంట్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని కోరుతూ తీర్మానం చేయడం జరిగింది వినతి పత్రం అందజేసిన వారిలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం మండల కార్యదర్శి వర్గ సభ్యులు బోయిని ఆనంద్ కూరెళ్ల నరసింహచారి,కల్లూరి నాగేష్ మండల కమిటీ సభ్యులు నాగటి ఉపేందర్ ఎండి రషీద్, గొరిగె సోములు, మేడి గణేష్,నాయకులు నీల ఐలయ్య , మూశం నరహరి,శానగొండ వెంకటేశ్వర్లు,గోగులింగస్వామి తదితరులు ఉన్నారు
తెలంగాణ ఉద్యమకారులను సమరయోధులుగా గుర్తించాలి : ఉద్యమకారుల జేఏసీ వలిగొండ

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన ఉద్యమకారులను సమరయోధులుగా గుర్తించాలని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్. రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మంటి రమేష్ ఆదివారం వలిగొండ మండల కేంద్రంలో ఉద్యమకారుల జేఏసీ కార్యాలయంలో మాట్లాడుతూ అన్నారు అలాగే వలిగొండ మండల ఉద్యమకారుల జేఏసీ అధ్యక్షులు గాజుల యాదగిరి చేతుల మీదుగా మండల ప్రధాన కార్యదర్శిగా మంట్టి లింగయ్య కోశాధికారిగా జోగు చిన్న యాదయ్యను నియమించి నియామక పత్రాలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వెంకటేశం నరసింహ రాజు తదితరులు పాల్గొన్నారు

అరూరులో ఆర్థిక సహాయం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా వెలిగొండ మండల పరిధిలోని అరూరు గ్రామంలో పడిగం లక్ష్మీనరసమ్మ మరణించడం జరిగింది. వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి మాజీ ఎంపీపీ చిట్టేడి జనార్దన్ రెడ్డి రూ .5000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. మరియు ఆవుల సత్యనారాయణ కాంగ్రెస్ సీనియర్ లీడర్ వారు కూడా రూ.3000 రూపాయలు వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం నాయకులు బండారు నరసింహారెడ్డి ,మండల ఓబీసీ సెల్ చిలకమర్రి కనకాచారి, సింగల్ విండో డైరెక్టర్ ఆవుల స్వామి, మత్స్యగిరి గుట్ట ధర్మకర్త బండి రవికుమార్, అరూరు గౌడ సంఘం అధ్యక్షులు కళ్లెం బాల శంకర్, పైల సురేష్ ,తదితరులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది.
యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా అవైస్ చిస్తి ప్రమాణ స్వీకారం

యాదాద్రి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా భువనగిరి కి చెందిన అవైస్ చిస్తీ ప్రమాణస్వీకారం ప్రమాణ స్వీకారం చేశారు .యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ ఆవరణలో నిర్వహించిన ప్రమాణస్వీకారం కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ ఆయనను ప్రమాణస్వీకారం చేయించారు.గ్రంధాలయ అభివృద్ధికి నిరంతరం తోడ్పాటును అందించాలన్నారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యాదవులు రాజ్యాధికారం కోసం కృషి చేయాలి: చలకాని వెంకటేష్ యాదవ్, యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు

దేశ, రాష్ట్ర రాజకీయాలపై అవగాహన పెంచుకొని యాదవులు రాజ్యాధికారం కోసం కృషి చేయాలని యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు చలకాని వెంకట్ యాదవ్ అన్నారు. ఆదివారం భువనగిరి జిల్లా కేంద్రంలోని శ్రీ రాఘవేంద్ర జూనియర్ కళాశాలలో యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి ఆనంద్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. యాదవులు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగడానికి అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులపాటు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసామని ఆయన అన్నారు. భారతదేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో యాదవ సామాజిక వర్గం ఉందని, ఉత్తర భారత దేశంలో యాదవ సామాజిక వర్గం రాజకీయాలలో సీఎం స్థాయి వ్యక్తులు ఉన్నారని ఈసందర్భంగా ఆయన గుర్తు చేశారు. రానున్న స్థానిక సంస్థలు ఎన్నికలలో యాదవులు రాజకీయ పార్టీలకు అతీతంగా గెలుపుకోసం కృషి చేయాలని యాదవ విద్యావంతుల వేదిక జిల్లా కమిటీకి ఆయన సూచించారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షులుగా భాత్క నరేష్ యాదవ్, జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా డాక్టర్ లోడంగి మహేష్ యాదవ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మత్స్యగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ధర్మకర్త బండి రవికుమార్ కు ఘన సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా కొండ మడుగు గ్రామానికి చెందిన కనక బోయిన గోపాల్ ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని మత్స్యగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ధర్మకర్త బండి రవి కుమార్ ను ఘనంగా సన్మానించినారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు బండారు నరసింహారెడ్డి ,మండల ఓబీసీఎల్ చిలకమర్రి కనకాచారి జిలకల మల్లేశం యాదవ్ ఈ కార్యక్రమంలోపాల్గొన్నారు.
త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం : సంగిశెట్టి క్రిస్టఫర్ మలిదశ ఉద్యమ నాయకులు

త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో నేటి వరకు త్యాగాలు చేసిన ఉద్యమకారులను గుర్తించకపోవడం దుర్మార్గమని మలిదశ ఉద్యమకారుడు సంగిశెట్టి క్రిస్టఫర్ ఆవేదన వ్యక్తం చేశారు. త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం అన్నారు మరి త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డా రాష్ట్రంలో ఉద్యమకారుల త్యాగాలను ఎందుకు గుర్తించడం.లేదని ఆయన ప్రశ్నించారు. అనేకమంది ఉద్యమకారులు పోలీసుల లాఠీ దెబ్బలు తిని జైలు జీవితాలను గడిపి నష్టపోయిన ఉద్యమకారులను ఝార్ఖండ్ రాష్ట్రంలో గుర్తించినట్లుగానే మన రాష్ట్రంలో గుర్తించి వెంటనే ఉద్యమకారులకు 25వేల రూపాయల పెన్షన్ 250 గజాలు ఇంటి స్థలం ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు