టిడిపిలో చేరబోతున్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత తీగల కృష్ణారెడ్డి... ఎప్పుడంటే...
మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత తీగల కృష్ణారెడ్డి టీడీపీలో చేరబోతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 3న ఆ పార్టీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో కృష్ణారెడ్డి టీడీపీలో చేరనున్నారట. ఈ విషయాన్ని ఆయన మీడియాకు వెల్లడించారు.
ఏపి ముఖ్యమంత్రి ప్రమాణం చేసిన అనంతరం హైదరాబాద్ కు వచ్చిన చంద్రబాబును మాజీ మంత్రి మల్లారెడ్డితోపాటు ఆయన కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు.
కాగా, 2014లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, అనంతరం బీఆర్ఎస్‌లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. కాగా తీగల కృష్ణారెడ్డి తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఇవ్వాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.
Dec 02 2024, 07:47