AP : అగ్ని ప్రమాదం... కాలేజి బస్సు కు తప్పిన పెను ప్రమాదం... ఎక్కడంటే...
బాపట్ల జిల్లాలో దగ్ధమైంది ఓ కాలేజి బస్సు. ఈ ప్రమాదం జరిగినప్పుడు మొత్తం 30 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
బాపట్ల జిల్లా లో కాలేజి బస్సుకు పెను ప్రమాదం చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద, షార్ట్ సర్క్యూట్ తో ఓ కాలేజీ బస్సు దగ్ధం అయింది. రేపల్లె ఐ ఆర్ ఇ ఎఫ్ నర్సింగ్ కాలేజీకి చెందిన బస్సుగా పోలీసులు గుర్తించారు.
రేపల్లె నుంచి గుంటూరుకు విద్యార్థుల పరీక్షల నిమిత్తం వస్తుండగా ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఇక ఈ ఘటన సమయం లో బస్సులో మొత్తం 30 మంది విద్యార్థులు ఉన్నారు. బస్సుకు మంటలు అంటుకోగానే, ఒకసారిగా కిందకి దిగేశారు విద్యార్థులు.
దీంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోతే.. చాలా వరకు మరణించేవారు. ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని..దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Nov 30 2024, 11:07