*గంజాయి అక్రమ రవాణా అరికట్టాలి విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :భద్రాచలం
చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తం గా ఉండాలి
జిల్లా ఎస్ పి రోహిత్ రాజ్
భద్రాచలం : భద్రాచలం పట్టణలోని బ్రిడ్జి పాయింట్ లో గల చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ రవాణా జరగకుండా చెక్ పోస్టులో గట్టి నిఘా ఏర్పాటు చేయాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, చెక్ పోస్టు వద్ద విధులు నిర్వహించే సిబ్బంది నిత్యం అప్రమతంగా ఉండాలని,ఎటు వంటి అక్రమ కార్యకలాపాలకు తావులేకుండా నిరంతరం వాహన తనిఖీలు చేయాలన్నారు. తనిఖీల సమయంలో ఏమి చేయాలో, చేయకూడదో సిబ్బందికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు స్పష్టంగా వివరించారు. రాత్రి సమయాల్లో విధులు నిర్వహించే సిబ్బంది రేడియం జాకెట్స్ ధరించాలని, భద్రతా పరమైన చర్యలు తప్పకుండా తీసుకోవలని ఎస్పీ సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీ లలో భద్రాచలం టౌన్ సీఐ సంజీవ రావు, టౌన్ ఎస్ ఐ విజయలక్ష్మి, ట్రాఫిక్ ఎస్ ఐ మధు ప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Nov 13 2024, 16:59