NLG: మాల్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో సీసీఐ కేంద్రాలు ప్రారంభం
నల్లగొండ జిల్లా:
మాల్ మార్కెట్ యార్డ్ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు మంగళవారం చింతపల్లి మండలం లోని చింతపల్లి, కొంకిరాల తండా గ్రామాలలో పత్తి కొనుగోలు సీసీఐ కేంద్రాలను ప్రారంభించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. స్థానికంగా ఉన్న రైతులు తాము పండించిన పత్తి పంటను సీసీఐ కేంద్రాల ద్వారా విక్రయించి మద్దతు ధరను పొందాలని, దళారులకు తక్కువ ధరకు పత్తిని అమ్ముకొని మోసపోవద్దని సూచించారు.

కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంతం సంజీవరెడ్డి, మాల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నక్క శీను యాదవ్, పలువురు డైరెక్టర్లు పాల్గొన్నారు.
మిర్యాలగూడలో జరగనున్న బహిరంగ సభ జయప్రదం చేయండి: బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా, గట్టుప్పల్: డిసెంబర్ 2, 3, 4, తేదీలో మిర్యాలగూడలో జరగబోవు సిపిఐ(ఎం ) బహిరంగ సభను జయప్రదం చేయాలని, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం పార్టీ శ్రేణులకు  పిలుపునిచ్చారు. మంగళవారం గట్టుప్పల్ మండల కేంద్రంలో బహిరంగ సభ కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు.

ఈ మేరకు బండ శ్రీశైలం మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేసే శ్రీశైలం సొరంగం మార్గం, డిండి ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించకపోవడం వలన పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని, ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పనులు పూర్తి కాలేదని, కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి అనుసరిస్తున్న  ఆర్థిక విధానాలు, పారిశ్రామిక రంగాన్ని వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దివాలా తీయించాయని ఆరోపించారు. విద్య, వైద్యం సామాన్యులకు అందని ద్రాక్ష లాగా మారిందని, ఆర్థిక అసమానతలు పెద్ద ఎత్తున పెరియాయని అన్నారు. నిరుద్యోగం, అవినీతి, ధరలు విలయ తాండవం   చేస్తున్నాయని తెలిపారు. 

గత ప్రభుత్వాలతో పోరాడి సాధించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అంబానీ అదాని లాంటి బడా కార్పొరేట్ సంస్థలకు  కారుచౌకగా అమ్మేస్తుందని విమర్శించారు.  

రైతులు పండించిన పంటలకు మద్దతు ధరకు పార్లమెంట్లో చట్టం చేయాలని, మహిళలపై దాడులు, అత్యాచారాలు అరికట్టాలని.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన  హామీలు వెంటనే పరిష్కరించాలని, జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని, డిపిఆర్ ను  ఆమోదించాలని, ప్రభుత్వ శాఖలో వివిధ రంగాల్లో  ఖాళీగా ఉన్న  పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగ భృతి  చెల్లించాలని పలు తీర్మానాలు చేశారు.

కోలాటాలాటలు, నృత్యం ఆటపాటలతో భారీ ర్యాలీ తో బహిరంగ సభ జరపనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు, గట్టుప్పల్ మండల కార్యదర్శి  కర్నాటి మల్లేశం,సిపిఎం మండల కమిటీ సభ్యులు కర్నాటి సుధాకర్, టేకుమట్ల కృష్ణ, రావుల నరసింహ, బి.  శివకుమార్, వల్లూరి శ్రీశైలం, పడసబోయిన యాదగిరి,  కర్నాటి వెంకటేశం, ఖమ్మం రాములు తదితరులు పాల్గొన్నారు.
NLG: అవినీతి నిరోధకం పై అవగాహన కార్యక్రమం
నల్లగొండ: అవినీతి నిరోధక వారోత్సవాల్లో భాగంగా, న్యూ ఇండియా అస్యూరెన్స్ నల్గొండ శాఖ ఆధ్వర్యంలో, సోమవారం బొట్టుగూడ హైస్కూల్ విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, డ్రాయింగ్ పై పోటీలు నిర్వహించారు.

అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేయడంతో పాటు అవినీతి నిరోధకం పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య, ఉపాధ్యాయుల బృందం, అస్సూరెన్స్ కంపెనీ వారు పాల్గొన్నారు.
NLG: పత్తి, వరి తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలి: పాలడుగు నాగార్జున

నల్లగొండ జిల్లా:

మర్రిగూడెం: వరి, పత్తి పంటలు కొనుగోలు సమయంలో, తేమను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర ప్రకటించాలని, వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా మద్దతు ధర ప్రకటించి, కొనుగోలు కేంద్రాలలో దళారుల బెడద లేకుండా చూసి మద్దతు ధర ఇవ్వాలని, వరి తేమ శాతం ను పరిగణలోకి తీసుకోకుండా కొనుగోలు చేయాలని అన్ని వొడ్లను కొనుగోలు చేయాలని అన్నారు.

పత్తి రంగు మారిందని రైతులను మోసం చేస్తూ దళారులు ఊర్ల మీద ఎగబడి డిజిటల్ కాంటాలు పెట్టి తూకాలలో మోసం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే స్థితికి వస్తుందని అందుకే పత్తిని రంగు మారిన అన్ని రకాల పత్తిని తీసుకుని మద్దతు ధర కల్పించాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం మహాసభలకు ఏర్పాట్లు చేసుకోవాలని పిలుపునిచ్చారు. గత కార్యక్రమాలని సమీక్షించుకొని భవిష్యత్ కార్యక్రమాలకు ఉద్యమాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాంపల్లి మర్రిగూడ మండల కార్యదర్శిలు నాంపల్లి చంద్రమౌళి ఏర్పుల యాదయ్య కె,వి,పి,ఎస్, రాష్ట్ర కమిటీ సభ్యులు బోట్ట శివకుమార్, మండల కమిటీ సభ్యులు వాష్పాక ముత్తిలింగం దేవయ్య నీలకంఠం రాములు కొట్టం యాదయ్య దామెర లక్ష్మి గిరి విష్ణు ఆయిల్ కృష్ణయ్య గడగోటి వెంకటేష్ పిట్టల రమేష్ గిరి వెంకటయ్య పల్లపు రాజు, తదితరులు పాల్గొన్నారు.

NLG: నెల్లికల్ ప్రాజెక్టు రైతులకు న్యాయం చేయాలి: నగేష్ నాయక్
నల్గొండ: జిల్లా కలెక్టర్ గా, ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఇలా త్రిపాఠి ని, సోమవారం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం  కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు  కెలవత్ నాగేష్ నాయక్, ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి గిరిజన సాంప్రదాయ శాలువాతో సత్కరించి  శుభాకాంక్షలు తెలిపారు. తిరుమలగిరి సాగర్ మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా పనులు నడుస్తున్న  నెల్లికల్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని, త్వర్వతగతిన పనులు పూర్తి అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని, తండాలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని నగేష్ నాయక్  కలెక్టర్ ను కోరారు. సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో తండాలను సందర్శిస్తామని అన్నారు.

సాగర్, రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
NLG: ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా కాసర్ల లింగస్వామి
నల్లగొండ: మండలంలోని బుద్ధారం గ్రామానికి చెందిన కాసర్ల లింగస్వామి ని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా నియమిస్తూ ఆ సంఘం  రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ సోమవారం నియామక పత్రం అందజేశారు.

ఈ మేరకు లింగస్వామి మాట్లాడుతూ.. విద్యా, వైద్య, ఉద్యోగ ఉపాధి కల్పన రంగాల సమస్యలపై, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కొరకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమస్యలపై రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతానని, సంఘం అభివృద్ధి కొరకు తన వంతు కృషి చేస్తానని  తెలిపారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర జిల్లా నాయకులకు, రాష్ట్ర అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు.
NLG: ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం
నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న రూ.7500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేసి, బహుజన విద్యార్థుల అభివృద్ధికై తోడ్పడాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కి వినతి పత్రం అందజేశారు.

అనంతరం శివకుమార్ మాట్లాడుతూ.. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాకపోవడం వలన ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడం జరుగుతుందనీ, డబ్బులు వచ్చాకే మీ సర్టిఫికెట్స్ ఇస్తాము అని అంటున్నారని.. దీనివలన బహుజన విద్యార్థులు చదువు మధ్యలోనే ఆపేసే పరిస్థితి ఉందని తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం చూడాలని విద్యార్థుల పక్షాన నిలబడి, ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్, మెస్ ఛార్జిలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న, ఉపాధ్యక్షులు కాసర్ల లింగస్వామి, రాష్ట్ర కోఆర్డినేటర్ బాకీ తరుణ్, నియోజకవర్గ అధ్యక్షులు పగడాల శివతేజ, వరుణ్, తదితరులు పాల్గొన్నారు.
NLG:పులిమామిడి నర్సింహా రెడ్డి, ఏడుదొడ్ల కృష్ణ రెడ్డి ల ఆర్థిక సహకారంతో హనుమాన్ స్వాముల సన్నిధానం షెడ్ నిర్మాణం
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం
యరగండ్లపల్లి గ్రామములో, హనుమాన్ స్వామి దీక్ష చేపట్టిన స్వాముల సౌకర్యార్థం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పులిమామిడి నర్సింహా రెడ్డి, ఏడుదొడ్ల కృష్ణ రెడ్డి 1 లక్ష 35 వేల రూపాయలు ఖర్చు చేసి హనుమాన్ స్వాముల సన్నిధానం షెడ్డు ను నిర్మించారు.

హనుమాన్ స్వాముల సన్నిధానం షెడ్డును పులిమామిడి నరసింహారెడ్డి, ఏడు దొడ్ల కృష్ణారెడ్డి ల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ఆదివారం ప్రారంభించారు.ఈ మేరకు నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. దైవ చింతన తోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, గ్రామ అభివృద్దే తన లక్ష్యమని అన్నారు.

కార్తీక మాసంలో గత 15 సం.ల నుండి గ్రామంలో హనుమాన్ భక్తులు.. హనుమాన్ స్వామి 41 రోజు దీక్ష తీసుకుంటున్నారని, ఈ నేపథ్యంలో  స్వాములు ఉండడానికి ప్రత్యేక వసతి లేకపోవడంతో  నర్సింహారెడ్డి ని సంప్రదించగా రేకుల షెడ్ కట్టి ఇచ్చారని గ్రామ ప్రజలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు వారికి ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, కాకులవరం అశోక్ రెడ్డి, ఇబ్రహీం, వనపర్తి యాదయ్య, మాల్ మార్కెట్ యార్డు డైరెక్టర్ జమ్ముల వెంకటేష్, మామిడి అంజయ్య, నక్కరగోని మల్లయ్య,సీత వెంకటయ్య, వాళ్ళముల  ఎర్రన్న, అందుగుల ముత్యాలు, కుక్కడపు వెంకటరమణ, పుప్పాల యాదయ్య, ఆకారపు శివ, కుక్కడపు అంజయ్య, కాకులవరం పృథ్వి రెడ్డి, బొమ్మిడి దర్శన్, ముద్దం వెంకటయ్య, గొడ్డెటి వెంకటయ్య, మైలారపు అంజయ్య, గజ్జి యాదయ్య,సిలివేరు యాదయ్య, పొలగోని అబ్బయ్య, పొలగోని యాదయ్య, ఎరుకలి రాములు, రెడ్డగోని వెంకయ్య, కుక్కడపు ముత్యాలు, మాడెం శంకర్, నక్కరగోని కొండల్, నక్కరగోని స్వామి, తోడేటి నాగరాజు, వల్లంల శ్రీను, రామిని సంతోష్, పొలగోని శేఖర్, సూరగోని శ్రీను, వల్లంల శ్రీశైలం, బచ్చనగోని లింగం, గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు, హనుమాన్ స్వాములు, శివ స్వాములు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
NLG: యాదాద్రి పవర్ ప్లాంట్ కు బొగ్గును తరలించే రైలును ప్రారంభించిన మంత్రులు
NALGONDA DIST: దామరచర్ల మండలంలో గల యాదాద్రి పవర్ ప్లాంట్ స్టేజ్-1 లో ఉత్పత్తి చేసిన విద్యుత్తును గ్రిడ్డుకు అనుసంధానం చేసే కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి లు పాల్గొన్నారు. అనంతరం రామగుండం నుంచి యాదాద్రి పవర్ ప్లాంట్ స్టేషన్ కు బొగ్గు తరలించే రైలు ను వైటీపీఎస్ టేక్ ఆఫ్ దగ్గర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
NLG: నల్లగొండ నుండి అరుణాచలం కు ప్రత్యేక బస్సులు
నల్లగొండ: ఈనెల 13 వ తేదీ రాత్రి గం.7 లకు అన్ని డిపోల నుండి తమిళనాడు లోని అరుణాచలం గిరి సందర్శన కొరకు, ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఉమ్మడి నల్గొండ టీజిఎస్ఆర్టిసి రీజినల్ మేనేజర్ రాజశేఖర్ తెలిపారు.

ప్రతి పౌర్ణమికి రద్దీని బట్టి ప్రత్యేక సర్వీసులు నడిపిస్తామని, అరుణాచలం వెళ్ళే భక్తులకు ఏపీలోని కాణిపాకం, తమిళనాడు వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం ఉంటుందన్నారు. వివరాలకు 9298008888 లేదా సమీప బస్ స్టేషన్లలో సంప్రదించాలన్నారు.