NLG: పత్తి, వరి తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలి: పాలడుగు నాగార్జున
నల్లగొండ జిల్లా:
మర్రిగూడెం: వరి, పత్తి పంటలు కొనుగోలు సమయంలో, తేమను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర ప్రకటించాలని, వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా మద్దతు ధర ప్రకటించి, కొనుగోలు కేంద్రాలలో దళారుల బెడద లేకుండా చూసి మద్దతు ధర ఇవ్వాలని, వరి తేమ శాతం ను పరిగణలోకి తీసుకోకుండా కొనుగోలు చేయాలని అన్ని వొడ్లను కొనుగోలు చేయాలని అన్నారు.
పత్తి రంగు మారిందని రైతులను మోసం చేస్తూ దళారులు ఊర్ల మీద ఎగబడి డిజిటల్ కాంటాలు పెట్టి తూకాలలో మోసం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే స్థితికి వస్తుందని అందుకే పత్తిని రంగు మారిన అన్ని రకాల పత్తిని తీసుకుని మద్దతు ధర కల్పించాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం మహాసభలకు ఏర్పాట్లు చేసుకోవాలని పిలుపునిచ్చారు. గత కార్యక్రమాలని సమీక్షించుకొని భవిష్యత్ కార్యక్రమాలకు ఉద్యమాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాంపల్లి మర్రిగూడ మండల కార్యదర్శిలు నాంపల్లి చంద్రమౌళి ఏర్పుల యాదయ్య కె,వి,పి,ఎస్, రాష్ట్ర కమిటీ సభ్యులు బోట్ట శివకుమార్, మండల కమిటీ సభ్యులు వాష్పాక ముత్తిలింగం దేవయ్య నీలకంఠం రాములు కొట్టం యాదయ్య దామెర లక్ష్మి గిరి విష్ణు ఆయిల్ కృష్ణయ్య గడగోటి వెంకటేష్ పిట్టల రమేష్ గిరి వెంకటయ్య పల్లపు రాజు, తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ జిల్లా:
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా మద్దతు ధర ప్రకటించి, కొనుగోలు కేంద్రాలలో దళారుల బెడద లేకుండా చూసి మద్దతు ధర ఇవ్వాలని, వరి తేమ శాతం ను పరిగణలోకి తీసుకోకుండా కొనుగోలు చేయాలని అన్ని వొడ్లను కొనుగోలు చేయాలని అన్నారు.

నల్గొండ: జిల్లా కలెక్టర్ గా, ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఇలా త్రిపాఠి ని, సోమవారం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు కెలవత్ నాగేష్ నాయక్, ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి గిరిజన సాంప్రదాయ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
తిరుమలగిరి సాగర్ మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా పనులు నడుస్తున్న నెల్లికల్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని, త్వర్వతగతిన పనులు పూర్తి అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని, తండాలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని నగేష్ నాయక్ కలెక్టర్ ను కోరారు.
సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో తండాలను సందర్శిస్తామని అన్నారు.
నల్లగొండ: మండలంలోని బుద్ధారం గ్రామానికి చెందిన కాసర్ల లింగస్వామి ని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ సోమవారం నియామక పత్రం అందజేశారు.
నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న రూ.7500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేసి, బహుజన విద్యార్థుల అభివృద్ధికై తోడ్పడాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కి వినతి పత్రం అందజేశారు.
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం
NALGONDA DIST: దామరచర్ల మండలంలో గల యాదాద్రి పవర్ ప్లాంట్ స్టేజ్-1 లో ఉత్పత్తి చేసిన విద్యుత్తును గ్రిడ్డుకు అనుసంధానం చేసే కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి లు పాల్గొన్నారు.
అనంతరం రామగుండం నుంచి యాదాద్రి పవర్ ప్లాంట్ స్టేషన్ కు బొగ్గు తరలించే రైలు ను వైటీపీఎస్ టేక్ ఆఫ్ దగ్గర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ: ఈనెల 13 వ తేదీ రాత్రి గం.7 లకు అన్ని డిపోల నుండి తమిళనాడు లోని అరుణాచలం గిరి సందర్శన కొరకు, ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఉమ్మడి నల్గొండ టీజిఎస్ఆర్టిసి రీజినల్ మేనేజర్ రాజశేఖర్ తెలిపారు.
నల్లగొండ జిల్లా:
నల్లగొండ: జిల్లాలోని కనగల్ మండల పరిధిలో గల శాబ్దల్లాపురం గ్రామ సమీపంలో ఏఎంఆర్పీ కాలువలో నిన్న ఈతకు వెళ్లి తండ్రీ కొడుకు గల్లంతైన ఘటనలో.. కొడుకు బిట్టు మృతదేహం కోదండపురం కాలువ వద్ద ఈరోజు ఉదయం సుమారు 10 గంటల సమయంలో దొరకగా, ఈ ఉదయం సుమారు 7 గంటల సమయంలో గుండ్లపల్లి కాల్వ వద్ద తండ్రి దామోదర్ మృతదేహం లభించింది.
Nov 05 2024, 16:36
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
9.9k