NLG:పులిమామిడి నర్సింహా రెడ్డి, ఏడుదొడ్ల కృష్ణ రెడ్డి ల ఆర్థిక సహకారంతో హనుమాన్ స్వాముల సన్నిధానం షెడ్ నిర్మాణం
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం
యరగండ్లపల్లి గ్రామములో, హనుమాన్ స్వామి దీక్ష చేపట్టిన స్వాముల సౌకర్యార్థం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పులిమామిడి నర్సింహా రెడ్డి, ఏడుదొడ్ల కృష్ణ రెడ్డి 1 లక్ష 35 వేల రూపాయలు ఖర్చు చేసి హనుమాన్ స్వాముల సన్నిధానం షెడ్డు ను నిర్మించారు.
హనుమాన్ స్వాముల సన్నిధానం షెడ్డును పులిమామిడి నరసింహారెడ్డి, ఏడు దొడ్ల కృష్ణారెడ్డి ల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ఆదివారం ప్రారంభించారు.ఈ మేరకు నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. దైవ చింతన తోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, గ్రామ అభివృద్దే తన లక్ష్యమని అన్నారు.
కార్తీక మాసంలో గత 15 సం.ల నుండి గ్రామంలో హనుమాన్ భక్తులు.. హనుమాన్ స్వామి 41 రోజు దీక్ష తీసుకుంటున్నారని, ఈ నేపథ్యంలో స్వాములు ఉండడానికి ప్రత్యేక వసతి లేకపోవడంతో నర్సింహారెడ్డి ని సంప్రదించగా రేకుల షెడ్ కట్టి ఇచ్చారని గ్రామ ప్రజలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు వారికి ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, కాకులవరం అశోక్ రెడ్డి, ఇబ్రహీం, వనపర్తి యాదయ్య, మాల్ మార్కెట్ యార్డు డైరెక్టర్ జమ్ముల వెంకటేష్, మామిడి అంజయ్య, నక్కరగోని మల్లయ్య,సీత వెంకటయ్య, వాళ్ళముల ఎర్రన్న, అందుగుల ముత్యాలు, కుక్కడపు వెంకటరమణ, పుప్పాల యాదయ్య, ఆకారపు శివ, కుక్కడపు అంజయ్య, కాకులవరం పృథ్వి రెడ్డి, బొమ్మిడి దర్శన్, ముద్దం వెంకటయ్య, గొడ్డెటి వెంకటయ్య, మైలారపు అంజయ్య, గజ్జి యాదయ్య,సిలివేరు యాదయ్య, పొలగోని అబ్బయ్య, పొలగోని యాదయ్య, ఎరుకలి రాములు, రెడ్డగోని వెంకయ్య, కుక్కడపు ముత్యాలు, మాడెం శంకర్, నక్కరగోని కొండల్, నక్కరగోని స్వామి, తోడేటి నాగరాజు, వల్లంల శ్రీను, రామిని సంతోష్, పొలగోని శేఖర్, సూరగోని శ్రీను, వల్లంల శ్రీశైలం, బచ్చనగోని లింగం, గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు, హనుమాన్ స్వాములు, శివ స్వాములు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం

NALGONDA DIST: దామరచర్ల మండలంలో గల యాదాద్రి పవర్ ప్లాంట్ స్టేజ్-1 లో ఉత్పత్తి చేసిన విద్యుత్తును గ్రిడ్డుకు అనుసంధానం చేసే కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి లు పాల్గొన్నారు.
అనంతరం రామగుండం నుంచి యాదాద్రి పవర్ ప్లాంట్ స్టేషన్ కు బొగ్గు తరలించే రైలు ను వైటీపీఎస్ టేక్ ఆఫ్ దగ్గర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ: ఈనెల 13 వ తేదీ రాత్రి గం.7 లకు అన్ని డిపోల నుండి తమిళనాడు లోని అరుణాచలం గిరి సందర్శన కొరకు, ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఉమ్మడి నల్గొండ టీజిఎస్ఆర్టిసి రీజినల్ మేనేజర్ రాజశేఖర్ తెలిపారు.
నల్లగొండ జిల్లా:
నల్లగొండ: జిల్లాలోని కనగల్ మండల పరిధిలో గల శాబ్దల్లాపురం గ్రామ సమీపంలో ఏఎంఆర్పీ కాలువలో నిన్న ఈతకు వెళ్లి తండ్రీ కొడుకు గల్లంతైన ఘటనలో.. కొడుకు బిట్టు మృతదేహం కోదండపురం కాలువ వద్ద ఈరోజు ఉదయం సుమారు 10 గంటల సమయంలో దొరకగా, ఈ ఉదయం సుమారు 7 గంటల సమయంలో గుండ్లపల్లి కాల్వ వద్ద తండ్రి దామోదర్ మృతదేహం లభించింది.
రంగారెడ్డి జిల్లా:
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి, ఎంఎల్సీ పట్నం మహేందర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Breaking news:
నల్లగొండ: సామ్రాజవాదం, భూస్వాములు పెట్టబడుదారులకు వ్యతిరేకంగా అసమాన త్యాగాలు చేసిన సిపిఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహించే శత వార్షికోత్సవాలలో కార్మికులు, రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ జాతీయ సమితి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట రెడ్డి పిలుపునిచ్చారు.
సిపిఐ నల్లగొండ జిల్లా సమితి కౌన్సిల్ సమావేశం పట్టణంలోని మగ్దూమ్ భవన్ లో శనివారం జరిగింది. ఈ సమావేశానికి పల్లా వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. దేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని రాజకీయ, ఆర్థిక, సామజిక రంగాలలో సిపిఐ తమ పాత్ర పోషించిందన్నారు. దున్నేవానికి భూమి, గీసే వానికి చెట్టు అనే నినాదంతో దేశవ్యాప్తంగా భూఉద్యమాలకు సిపిఐ నాయకత్వం వహించిందన్నారు. తాత్కాలికంగా కమ్యూనిస్టు ఉద్యమానికి ఎదురుదెబ్బలు తగిలినా.. పెట్టుబడిదారి విధానాలకు, పాలకులు అవలంబించే ప్రజావ్యతిరేక విధానాలపై ఎర్రజెండా తో పేద ప్రజలను చైతన్యం చేస్తూ సిపిఐ నిరంతరం ప్రజా పోరాటాలు నిర్వహిస్తుందన్నారు.
ప్రజల పక్షాన నిలబడి నిజంగా పోరాటం చేసేది కమ్యూనిస్టులేనని తెలిపారు. ఇంతటి సుధీర్ఘపోరాట చరిత్ర కలిగిన సిపిఐ వంద ఏండ్లలో అడుగుపెడుతున్న సందర్భంగా నవంబర్ 7 నుంచి సిపిఐ సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు.
నల్గొండ: ఈ నెల 6 నుండి నిర్వహించనున్న సామాజిక ,ఆర్థిక, విద్య, రాజకీయ మరియు కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఇవాళ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే విషయమై అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ మేరకు సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల టీచర్ల తో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సర్వే.. ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, ముందుగా ఇండ్ల జాబితా తయారు చేయాలని, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై విస్తృత ప్రచారం కల్పించాలని, 6వ తేదీ నుండి సర్వే నిర్వహిస్తున్న విషయం అన్ని పట్టణ ప్రాంతాలతో పాటు, గ్రామీణ ప్రాంతం వరకు చేరాలని, సర్వే వివరాల సేకరణ తర్వాత ఏకకాలంలో డేటాను కంప్యూటరైజేషన్ చేయాలని, ఎట్టి పరిస్థితులలో తప్పు వివరాలు డేటా ఎంట్రీ చేయకూడదని ఆయన ఆదేశించారు.
Nov 04 2024, 16:10
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
31.0k