చండూరు నూతన ఆర్డీవోగా శ్రీదేవి
నల్లగొండ జిల్లా:
చండూరు రెవెన్యూ డివిజన్ ఆర్డీవోగా శ్రీదేవి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో శ్రీదేవికి పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా నూతనంగా ఏర్పడిన చండూరు రెవిన్యూ డివిజన్ కు ఆర్ డి ఓ గా పని చేసిన సుబ్రమణ్యం మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి రెవెన్యూ డివిజన్ కు బదిలీపై వెళ్లారు.
NLG: మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో హాకీ జట్టు ఎంపికలు ప్రారంభం
నల్లగొండ: ఉమ్మడి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 17 హాకీ జట్టు ఎంపికలు మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్ జి ఎఫ్ సెక్రటరీ దగ్గుపాటి విమల కార్యక్రమాన్ని ప్రారంభించి  మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి పోటీలలో మన హాకీ జట్టు ప్రథమ స్థానంలో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. క్రీడల ద్వారానే శారీరక మరియు మానసిక రుగ్మతలను జయించవచ్చని ఆమె తెలిపారు. ఎంపిక ప్రక్రియ చాలా నిష్పక్షపాతంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు మెర్సీ ప్రభావతి, వాడపల్లి రవీందర్, గుండా శ్రీనివాస్, ఇమామ్ కరీం, బొమ్మ పాల గిరిబాబు, రాజశేఖర్, కవిత, శ్రీదేవి, అజీజ్  కేలో ఇండియా హాకీ కోచస్ యావర్ మురళి తదితరులు పాల్గొన్నారు.
NLG: పక్షవాతం వ్యాధిగ్రస్తురాలికి వీల్ చైర్ అందజేత
నల్లగొండ జిల్లా:
నాంపల్లి గ్రామానికి చెందిన కమిశెట్టి చంద్రకళ గత 9 సం. లుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ వారానికి 3 రోజులు డైయాలసిస్ కోసం నిమ్స్ కు వెళ్తున్నారు.

అయితే ఇటీవల ఆమెకు పక్షవాతం రావడంతో రెండు కాళ్ళు పని చెయ్యక పోవడం తో ఆమెకు వీల్ చైర్ అవసరం ఏర్పడింది.

కానీ ఆమె ఆర్థిక పరిస్థితి బాగాలేక దాతల కోసం ఎదురు చూస్తున్న సమయంలో నిమ్స్ లో పిఆర్ఓ గా విధులు నిర్వర్తిస్తున్న ఆశా రాణి మంగళవారం తన సొంత ఖర్చుతో వీల్ చైర్ అందచేసి తన ఉదారత ను చాటుకున్నారు.
NLG: ఏఐటీయూసీ 105 వ ఆవిర్భావ దినోత్సవం జయప్రదం చెయ్యండి: పల్లా దేవేందర్ రెడ్డి
నల్లగొండ: ఈ నెల 31 న ఏఐటీయూసీ 105 వ ఆవిర్భావ దినోత్సవం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని  ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
మంగళవారం  ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సమావేశం జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి అధ్యక్షతన పట్టణంలోని మక్దూమ్ భవన్లో జరిగింది.
ఈ మేరకు  ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్ర ఉద్యమం లో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిన చరిత్ర ఘనమైనది అని, లాలలజపతి రాయ్, జవహర్ లాల్ నెహ్రు, వివి గిరి, సుభాష్ ఛంద్రబోస్, సరోజని దేవి, భగత్ సింగ్, డాంగే, ఇంద్రజిత్ గుప్తా బర్ధన్, గురుదాస్ గుప్తా లాంటి గొప్ప వారు ఏఐటీయూసీ లో నాయకత్వం వహించారని తెలిపారు.

ఏఐటీయూసీ 1920 అక్టోబర్ 31 న ఏర్పాటు జరిగిన తర్వాత కార్మికుల కు అనేక సంక్షేమ చట్టాలు,హక్కులు, సాధించి 104 ఏళ్ళు పూర్తి చేసుకొని 105వ ఆవిర్భావ వేడుకలు కు సిద్ధం అవుతుందని, జిల్లా మొత్తం అన్ని కార్మిక అడ్డాల వద్ద జెండా ఆవిష్కరణ లు, సభలు, సమావేశాలు నిర్వహించాలని కార్యకర్తల కు విజ్ఞప్తి చేశారు.మోడీ ప్రభుత్వం కార్మికులు పొరాడిసాధించిన 29 చట్టాలని 4 కోడ్ లుగా మార్చి.. హక్కులు లేకుండా చేసి యాజమాన్యం లకు తొత్తులుగా చట్టాలు మార్పులు చేశారని ఆయన ఆరోపించారు.

దేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ అని నాటి నుండి నేటి వరకు కార్మికుల హక్కుల కోసం నిరంతరము రాజిలేని సమరశీల పోరాటాలు నడుపుతుందని అన్నారు. కాంటాక్ట్ వ్యవస్థ రద్దు కోసం, కనీస వేతనాలు అమలు కోసం, ఉద్యోగ భద్రత కోసం, రాబోయే కాలంలో సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశం లో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సయీద్, జిల్లా కోశాధికారి దోనకొండ వెంకటేశ్వర్లు, ఎన్ ఆర్ సి రాజు, దోమల శ్రీను, రెవల్లి యాదయ్య, ఏ.మల్లయ్య, ఎస్.కే. అమీర్, పీ. నరసింహ, జె.విజయ లక్మి, తదితరులు పాల్గొన్నారు.
NLG: లెంకలపల్లి లో రుణాలపై రైతులకు అవగాహన కల్పించిన బ్యాంకు మేనేజర్

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ మండలం, లెంకలపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఆధ్వర్యంలో, మంగళవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా మేనేజర్ జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. స్థానికంగా ఉన్న ప్రజలు తమ బ్యాంకు ద్వారా రుణాలు పొందాలని, రుణాలపై అతి తక్కువ వడ్డీ రేటు 7 శాతం మాత్రమే ఉంటుందని తెలిపారు. బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

కొత్త పంట రుణాలు డిపాజిట్లు పై అవగాహన సదస్సు, ప్రధానమంత్రి ఇన్సూరెన్స్ పథకాలు, గోల్డ్ లోన్ల గురించి వారు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో క్యాషియర్ సాయికుమార్, గ్రామ ప్రజలు, రైతులు, పాల్గొన్నారు.

నల్లగొండ జిల్లా కు నూతన కలెక్టర్ గా త్రిపాటి
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులకు బదిలీలు జరిగాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

నల్లగొండ  జిల్లా ప్రస్తుత కలెక్టర్ సి నారాయణ రెడ్డిని   రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు. వీరి స్థానంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ గా ఐలా త్రిపాటి నియమించారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
NLG: హాకీ-17 సంవత్సరాల బాలుర జిల్లా జట్టు ఎంపికలు
నల్లగొండ: జిల్లా విద్యాశాఖ అధికారి   ఆదేశాల ప్రకారం ఉమ్మడి  జిల్లా స్థాయి (సూర్యాపేట ,యాదాద్రి, నల్లగొండ) హాకీ-17 సంవత్సరాల బాలుర జిల్లా జట్టు ఎంపికలు.. నల్గొండ పట్టణంలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియం యందు, ఈ నెల 29 న ఉ. గం.10 లకు నిర్వహించబడుతాయని ఎస్.జి.ఎఫ్  సెక్రటరీ డి. విమల ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ఈ క్రీడలలో  పాల్గొనే క్రీడాకారులు ఆధార్, బోనఫైడ్ తో  హాజరు కావాల్సిందిగా కోరారు.
NLG: ఐకెపి సెంటర్ ను సందర్శించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు
నల్లగొండ జిల్లా, కనగల్ మండలంలోని జి.యడవల్లి గ్రామంలో ఐకెపి సెంటర్ ను, బిజెపి జిల్లా అధ్యక్షులు డా.నాగం వర్షిత్ రెడ్డి సందర్శించారు.

ఈ మేరకు వారు మాట్లాడుతూ.. రైతులు పంటను ఆరబెట్టిన తర్వాత కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఆలస్యం అవుతుందని ఆవేదనతో ఉన్నారని, వెంటనే ధాన్యాన్ని రోజుల తరబడి ఆపకుండా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. పంట నష్టం వాటిల్లిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు జిల్లా శేఖర్,కిసాన్ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ పోలోజు భిక్షమాచారి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్ రెడ్డి, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి పిండి పాపిరెడ్డి, కనగల్ మండల బిజేపి అధ్యక్షులు పులకరం బిక్షం, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి తిరందాసు కనకయ్య, ఓ బి సి మోర్చా జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ బిక్షం, బండమీది సురేందర్, బొమ్మ కంటి లింగస్వామి, బొమ్మకంటి సైదులు, తదితరులు పాల్గొన్నారు.
TG: నెల రోజుల పాటు 144 సెక్షన్

HYD: నెల రోజుల పాటు హైదరాబాద్ లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో  నెలరోజుల పాటు పోలీస్ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేస్తూ  అధికారిక ప్రకటన చేశారు. అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వాస నీయ సమాచారం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

U/S 163 BNS యాక్ట్ ప్రకారం ఆంక్షలు హైదరాబాద్ లో అమలు చేస్తామన్నారు. సభలు, సమావేశాలు, దర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీ లు నిషేధం అని తెలిపారు.

ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నవంబర్ 28 వరకు నెల రోజుల పాటు ఆంక్షలు అమలులో ఉంటాయని సిటి పోలీస్ కమీషనర్ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.
NLG: ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి SGF వాలీబాల్ పోటీలు
నల్గొండ: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి దగ్గుపాటి విమల ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి SGF అండర్ 14, 17 బాలబాలికల వాలీబాల్ టోర్నమెంట్ మరియు సెలక్షన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి దగ్గుపాటి విమల మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, క్రీడాకారులందరికి భోజన మరియు మంచినీటి సదుపాయాలు కల్పించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశామని తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని కల్పించిన విద్యాశాఖ అధికారి బొల్లారం బిక్షపతి కి SGF పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు నాగరాజు, కవిత, రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్, శ్రీదేవి, చంద్రయ్య, సురేందర్, కర్ణాకర్ రెడ్డి,  నుష్రత్, బ్రహ్మయ్య, మురళి, లెనిన్, సావిత్రి, రంగా, బొమ్మపాల గిరిబాబు, తస్లీమ్, రెహనా, శ్రీను, అజయ్ మరియు సూర్యపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల స్కూల్ గేమ్స్ సెక్రటరీలు మరియు వివిధ మండలాల నుంచి వచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.