NLG: ఏఐటీయూసీ 105 వ ఆవిర్భావ దినోత్సవం జయప్రదం చెయ్యండి: పల్లా దేవేందర్ రెడ్డి
నల్లగొండ: ఈ నెల 31 న ఏఐటీయూసీ 105 వ ఆవిర్భావ దినోత్సవం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
మంగళవారం ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సమావేశం జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి అధ్యక్షతన పట్టణంలోని మక్దూమ్ భవన్లో జరిగింది.
ఈ మేరకు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్ర ఉద్యమం లో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిన చరిత్ర ఘనమైనది అని, లాలలజపతి రాయ్, జవహర్ లాల్ నెహ్రు, వివి గిరి, సుభాష్ ఛంద్రబోస్, సరోజని దేవి, భగత్ సింగ్, డాంగే, ఇంద్రజిత్ గుప్తా బర్ధన్, గురుదాస్ గుప్తా లాంటి గొప్ప వారు ఏఐటీయూసీ లో నాయకత్వం వహించారని తెలిపారు.
ఏఐటీయూసీ 1920 అక్టోబర్ 31 న ఏర్పాటు జరిగిన తర్వాత కార్మికుల కు అనేక సంక్షేమ చట్టాలు,హక్కులు, సాధించి 104 ఏళ్ళు పూర్తి చేసుకొని 105వ ఆవిర్భావ వేడుకలు కు సిద్ధం అవుతుందని, జిల్లా మొత్తం అన్ని కార్మిక అడ్డాల వద్ద జెండా ఆవిష్కరణ లు, సభలు, సమావేశాలు నిర్వహించాలని కార్యకర్తల కు విజ్ఞప్తి చేశారు.మోడీ ప్రభుత్వం కార్మికులు పొరాడిసాధించిన 29 చట్టాలని 4 కోడ్ లుగా మార్చి.. హక్కులు లేకుండా చేసి యాజమాన్యం లకు తొత్తులుగా చట్టాలు మార్పులు చేశారని ఆయన ఆరోపించారు.
దేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ అని నాటి నుండి నేటి వరకు కార్మికుల హక్కుల కోసం నిరంతరము రాజిలేని సమరశీల పోరాటాలు నడుపుతుందని అన్నారు. కాంటాక్ట్ వ్యవస్థ రద్దు కోసం, కనీస వేతనాలు అమలు కోసం, ఉద్యోగ భద్రత కోసం, రాబోయే కాలంలో సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశం లో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సయీద్, జిల్లా కోశాధికారి దోనకొండ వెంకటేశ్వర్లు, ఎన్ ఆర్ సి రాజు, దోమల శ్రీను, రెవల్లి యాదయ్య, ఏ.మల్లయ్య, ఎస్.కే. అమీర్, పీ. నరసింహ, జె.విజయ లక్మి, తదితరులు పాల్గొన్నారు.
Oct 29 2024, 20:28