TG: కొత్తగా ఏర్పాటైన కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి మంత్రిమండలి ఆమోదం
HYD: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ మేరకు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుధీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దీపావళి పండుగ సందర్భంగా ఒక డీఏ ను విడుదల చేయాలని మంత్రివర్గం తీర్మానించింది.
హైదరాబాద్ లో మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌కు మంత్రివర్గం ఆమోదించింది. నాగోల్ – శంషాబాద్, రాయదుర్గం – కోకాపేట్, ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట, మియాపూర్ – పటాన్ చెరు, ఎల్ బీ నగర్ – హయత్ నగర్ మొత్తం 76.4 కిలోమీటర్ల మేరకు విస్తరణ చేపట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్య విధానంలో చేపట్టే మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టు కోసం రూ. 24,269 కోట్లతో ప్రతిపాదనలతో సిద్ధం చేసిన డీపీఆర్‌ను కేంద్రానికి నివేదించాలి.
జీవో 317 కు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల మేరకు ఉద్యోగుల మెడికల్, స్పౌజ్, మ్యూచువల్ బదిలీలకు ఆమోదం.
జీవో 46 కు సంబంధించి కీలకమైన స్థానికత అంశం రాష్ట్రపతి పరిధిలో ఉన్నందున న్యాయ సలహా తీసుకుని శాసనసభలో చర్చించిన తర్వాత నిర్ణయం.
రాష్ట్రంలో నవంబర్ 30 వరకు కుల, ఆర్థిక, సామాజిక గణన సర్వే పూర్తి చేయాలి. ఇందుకోసం 80 వేల మంది ఎన్యుమరేటర్లను నియమించి నవంబర్ 4 నుంచి 19 వరకు రాష్ట్రమంతా ఇంటింటి సర్వే చేపడుతారు.
రాష్ట్రంలో పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ పరిధిలో చేపట్టాల్సిన రోడ్ల నిర్మాణానికి దాదాపు రూ. 25 నుంచి 28 వేల కోట్లు అవసరమని అంచనా వేయగా పీపీపీ విధానంలో పూర్తి చేయడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలి.ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణానికి గోషా మహల్ లో పోలీసు శాఖ పరిధిలోని స్థలాన్ని వైద్య శాఖకు బదిలీ.
ములుగులో ప్రతిపాదిత గిరిజన విశ్వవిద్యాలయానికి 211 ఎకరాల స్థలం కేటాయింపు.గచ్చీబౌలీ స్టేడియాన్ని ప్రతిపాదిత యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి బదలాయింపు. మధిర, వికారాబాద్, హుజూర్ నగర్ ఏటీసీల ఏర్పాటు, కావలసిన పోస్టుల మంజూరు.
దీపావళి కానుకగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి విడతగా 3500 ఇళ్ల మంజూరు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో స్టోరేజీ కెపాసిటీ తగ్గిపోతున్న కారణంగా వాటిల్లో స్టిల్ట్ తొలగించాలని నిర్ణయం. పైలట్ ప్రాజెక్టుగా మొదట కడెం ప్రాజెక్టులో సిల్ట్ తొలగింపు. గత ప్రభుత్వ హయాంలో రైస్ మిల్లర్ల వద్ద పేరుకుపోయిన దాదాపు రూ. 20 వేల కోట్ల విలువైన ధాన్యం క్లియరెన్స్ కు సంబంధించి సబ్ కమిటీ సమర్పించిన నివేదికకు ఆమోదం.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి ఆమోదం.
సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్ మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు.




నల్లగొండ : దోపిడీ లేని వ్యవస్థ కోసం సమ సమాజ స్థాపన కోసం నాడు స్వాతంత్ర పోరాటంలో అగ్రభాగంలో నిలిచి పోరాడిన పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ అని సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట రెడ్డి అన్నారు.సిపిఐ వంద సంవత్సరాల సందర్భంగా శనివారం స్థానిక మగ్దూం భవన్ లో, ఉమ్మడి నల్లగొండ జిల్లా సిపిఐ శతవార్షికోత్సవ రాష్ట్ర ప్రారంభ సభ సన్నాహాక సమావేశం యాద్రది భువనగిరి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు అధ్యకతన జరిగింది.
ఈ సమావేశానికి పల్లా వెంకట రెడ్డి ముఖ్యతిధిగా హాజరై మాట్లాడుతూ.. 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్ లో సిపిఐ ఆవిర్భావించి బ్రిటిష్ ప్రభుత్వం కు వ్యతిరేకంగా పోరాడి, ఎన్నో నిర్బంధాలను కుట్రలను జైలు జీవితాలను ఎదుర్కొని త్యాగలు చేసిన గొప్ప చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ అని గుర్తు చేశారు.
నల్లగొండ: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నల్గొండ జిల్లా కార్యదర్శిగా నియమింపబడిన దగ్గుపాటి విమల.. శనివారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
HYD: గ్రూప్ -1 పేపర్ కాపీయింగ్ పై పబ్లిక్ సర్వీస్ కమీషన్ స్పందించింది.సీవీఆర్ కాలేజ్ గ్రూప్ -1 ఎగ్జామ్ సెంటర్లో ఒక మహిళా అభ్యర్థి అనుమానాస్పదంగా కనిపించిందని.. మహిళా అభ్యర్థి తన ఎడమ చేతి మీద కొన్ని జవాబులు రాసుకొని వచ్చిందని, దీంతో సదరు మహిళా అభ్యర్థిని ఇన్విజిలేటర్ ఎగ్జామ్ రాసేందుకు అనుమతించలేదని తెలిపారు. 
నల్లగొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో బి ఏ తృతీయ సంవత్సరం చదువుతున్న పి. ఉదయ్ కబడ్డీ లో సౌత్ జోన్ కు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ శుక్రవారం తెలిపారు. త్వరలో చెన్నైలో జరుగనున్న సౌత్ జోన్ పోటీల్లో ఉదయ్ నాగార్జున కళాశాల తరపున పాల్గొంటారని తెలిపారు.
ఈ మేరకు కళాశాల అధ్యాపకులతో కలిసి ఉదయ్ ను అభినందించారు. ఉదయ్ ని స్ఫూర్తిగా తీసుకొని ఇతర విద్యార్థులు కూడా క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు.
HYD: రూ.10 నాణేలు చట్టబద్ధమైనవని.. వీటిని రోజూవారీ లావాదేవీలకు ఉపయోగించవచ్చని, సెంట్రల్ బ్యాక్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక జనరల్ మేనేజర్ ధారాసింగ్ నాయక్ తెలిపారు. వీటి చలామణి ని వ్యాపార లావాదేవీలకు ఉపయోగించాలని ఆర్బీఐ ఉత్తర్వుల మేరకు విస్తృత అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కోఠి లోని బ్యాంక్ శాఖ వద్ద రూ.10 నాణేల చలామణి పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
నల్లగొండ జిల్లా:
నల్లగొండ: ప్రజా శ్రేయస్సు కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా.. గురువారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పోలీస్ సిబ్బంది మరియు అమ్మ ఫౌండేషన్ నల్లగొండ టీం పాల్గొని రక్తదానం చేశారు.
రక్తదానం కు సంబంధించిన విషయాల గురించి వీరు తయారు చేసిన ప్ల- కార్డులు జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఆవిష్కరింప చేశారు. అనంతరం అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం వల్ల జరిగే ఉపయోగాలను అక్కడికి విచ్చేసిన పోలీసులు మరియు వివిధ సంఘాల సభ్యులకు వివరించారు.
ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ సభ్యులు 20 మంది రక్తదానం చేశారు. సతీష్, శివ, సంతోష్, పురుషోత్తం, వంశీ, అమృత రాజ్, మహేష్, శ్రీనాథ్, చందు, సాయి తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా బిసి జేఏసీ చైర్మన్ గా పెండెం ధనుంజయ్ నేత ను ను నియమించారు. హైదరాబాద్ లోని విద్యానగర్ బిసి సంక్షేమ సంఘం కార్యాలయంలో గురువారం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా బిసి జేఏసీ చైర్మన్ గా పెండెం ధనుంజయ్ నేత ను నియమించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని అందజేశారు.
Oct 27 2024, 17:53
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
7.7k