TG:10 నాణేలు చట్టబద్ధమైనవి.. రోజువారి లావాదేవీలకు ఉపయోగించవచ్చు: జనరల్ మేనేజర్
HYD: రూ.10 నాణేలు  చట్టబద్ధమైనవని.. వీటిని రోజూవారీ లావాదేవీలకు ఉపయోగించవచ్చని, సెంట్రల్ బ్యాక్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక జనరల్ మేనేజర్ ధారాసింగ్ నాయక్ తెలిపారు. వీటి చలామణి ని వ్యాపార లావాదేవీలకు ఉపయోగించాలని ఆర్బీఐ ఉత్తర్వుల మేరకు విస్తృత అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కోఠి లోని బ్యాంక్ శాఖ వద్ద రూ.10 నాణేల  చలామణి పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ధారాసింగ్‌ నాయక్‌ మాట్లాడుతూ.. తమ ఖాతాదారులకు ఈ నాణేలు వినియోగించాలని సూచిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లోనూ ఇవి చెల్లుబాటు అవుతున్నాయని, ప్రజల్లో రూ.10 నాణేలపై ఉన్న అపోహలను తొలిగించేందుకే ఈ మేళాను నిర్వహించినట్లు పేర్కొన్నారు.

ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఈ నాణేలను లావాదేవీలకు చలామణి చేయవచ్చని, రూ.10 నోటు కంటే నాణేం ఎక్కువ కాలం మన్నికతో ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఖాతాదారులకు రూ.10 నాణేలను అందజేశారు.
NLG: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గుపాటి విమల
నల్లగొండ జిల్లా:
నాగార్జునసాగర్ పైలాన్ లో గల ఎస్.వి.ఏ.ఆర్ మోడల్ హైస్కూల్  ఫిజికల్ డైరెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న దగ్గుపాటి విమలను జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు నల్గొండ పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో గల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా దగ్గుపాటి విమల మాట్లాడుతూ జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులను అందరిని కలుపుకొని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడలను విజయవంతం చేయడానికి సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల జాన్ రెడ్డి, మాజీ ఎస్జీఎఫ్ సెక్రటరీ వాసుదేవరావు, హాకీ అసోసియేషన్ సెక్రెటరీ ఇమామ్ కరీం, ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రెటరీ బొమ్మపాల గిరిబాబు, వ్యాయామ ఉపాధ్యాయులు నాతి వెంకట్, వివిధ క్రీడల కోచ్ లు పాల్గొన్నారు.
NLG: జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రక్తదాన శిబిరం

నల్లగొండ: ప్రజా శ్రేయస్సు కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా.. గురువారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పోలీస్ సిబ్బంది మరియు అమ్మ ఫౌండేషన్ నల్లగొండ టీం పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం కు సంబంధించిన విషయాల గురించి వీరు తయారు చేసిన ప్ల- కార్డులు జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఆవిష్కరింప చేశారు. అనంతరం అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం వల్ల జరిగే ఉపయోగాలను అక్కడికి విచ్చేసిన పోలీసులు మరియు వివిధ సంఘాల సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ సభ్యులు 20 మంది రక్తదానం చేశారు. సతీష్, శివ, సంతోష్, పురుషోత్తం, వంశీ, అమృత రాజ్, మహేష్, శ్రీనాథ్, చందు, సాయి తదితరులు పాల్గొన్నారు.

ఈ మేరకు అమ్మ ఫౌండేషన్ ఫౌండర్, చైర్మన్ సిహెచ్ రేఖా మాట్లాడుతూ.. ప్రతి ఒక్క ఇంట్లో ఒక రక్త దాత ను, ఒక సమాజ సేవకుడిని తయారు చేయడమే తమ లక్ష్యం అన్నారు. ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యునికి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలను అందించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు నాయక్, స్థానిక డిఎస్పి శివరాం రెడ్డి, వన్ టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ సీఐ డానియేలు, ఎస్ఐ నాగరాజు, రూరల్ ఎస్సై సైదాబాబు, మరియు వివిధ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన సిఐ లు, ఎస్ఐ లు, పోలీస్ సిబ్బంది, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు ఉన్నారు.

NLG: ఉమ్మడి నల్గొండ జిల్లా బిసి జెఏసి ఛైర్మెన్ గా ఎన్నికైన పెండెం ధనుంజయ్ నేత
ఉమ్మడి నల్గొండ జిల్లా బిసి జేఏసీ చైర్మన్ గా పెండెం ధనుంజయ్ నేత ను ను నియమించారు. హైదరాబాద్ లోని విద్యానగర్ బిసి సంక్షేమ సంఘం కార్యాలయంలో గురువారం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా బిసి జేఏసీ చైర్మన్ గా పెండెం ధనుంజయ్ నేత ను నియమించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య  మాట్లాడుతూ.. ధనంజయ్ లాంటి బలమైన వ్యక్తులు బిసి ఉద్యమంలో ముందుండడం చాలా సంతోషకరమని, ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ యువకులు బిసి ఉద్యమంలో పాల్గొని బహుజన రాజ్యాధికారం సాధించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, నాయకులు జెల్లా నరేందర్, నీల వెంకటేశం,  నందగోపాల్, ఉదయ్, వనమాల రమేష్, చాపల యాదయ్య, సయ్యద్, గంజి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
NLG: విద్యుత్ శాఖ నూతన జేఏవోకు ఘన సన్మానం
నల్లగొండ: పట్టణ కేంద్రంలో విద్యుత్ శాఖ జూనియర్ అకౌంట్ ఆఫీసర్ గా  మిర్యాలగూడ నుండి బదిలీపై విచ్చేసి గురువారం బాధ్యతలు చేపట్టిన కొత్తపల్లి బాబురావు కు ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్, సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్,  ఎం.ఎఫ్ జిల్లా అధ్యక్షులు మామిడి సైదులు, ఎంఈఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న, కోటేశ్వరి రాజు, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు ప్రశాంత్, జిల్లా కార్యవర్గ సభ్యులు గంట సుమంత్, జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న ,రాష్ట్ర కోఆర్డినేటర్ బాకీ తరుణ్, శివతేజ తదితరులు పాల్గొన్నారు.
TG: టిపిసిసి అధ్యక్షుడిని కలిసిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

HYD: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను హైదరాబాద్ నార్సింగ్ లోని ఆయన నివాసంలో, గురువారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహుకరించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

NLG: కబడ్డీ కోచ్ భాస్కర్ రావు కు ఘన సన్మానం
నల్లగొండ జిల్లా:
చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు ఆధ్వర్యంలో.. ఇటీవల కబడ్డీ కోచ్ గా పదవీ విరమణ పొందిన భాస్కర రావును, గచ్చిబౌలి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కబడ్డీ కోచ్ శ్రీనివాస రావు ద్వారా నల్గొండలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. కబడ్డీ కోచ్ గా గత 30 సంవత్సరాలుగా భాస్కర రావు విధులను నిర్వహిస్తూ ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయస్థాయి మరియు ప్రో కబడ్డీ క్రీడాకారులను తయారుచేసిన ఘనత వారిదని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ క్రీడాధికారులు, సీనియర్ కబడ్డీ క్రీడాకారులు పాల్గొని శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపిక ను అందజేశారు.
NLG: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ దేవరకొండ నియోజకవర్గ కన్వీనర్ గా జిల్లా రాములు

దేవరకొండ: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ స్థానిక కార్యాలయంలో ఆ సంఘం నాయకులు సాధారణ సమావేశం నిర్వహించారు.

ఈ మేరకు నియోజకవర్గ కన్వీనర్ గా జిల్లా రాములు నియమిస్తూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న, జిల్లా కన్వీనర్ మద్దిమడుగు బిక్షపతి నియామక పత్రాన్ని అందజేశారు.

జిల్లా రాములు మాట్లాడుతూ.. డా. బి ఆర్ అంబేద్కర్ చేత స్థాపించబడిన ఈ సంస్థని పూర్తిస్థాయిలో విస్తరింపచేస్తానని అన్నారు. మహిళా ఉపాధ్యక్షురాలు నక్క శోభారాణి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత స్థాపించిన ఈ సంస్థని డివిజన్ స్థాయిలో అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.

జిల్లా నాయకులు గా ధర్మపురం శీను, ఉపాధ్యక్షులు గా చేపురి రాజేష్, సహాయ కార్యదర్శిగా కండేల వెంకన్న, ఊరే సురేష్, ప్రధాన కార్యదర్శిగా సోషల్ మీడియా డివిజన్ కార్యదర్శిగా వస్కుల అనిల్ నియమితులయ్యారు.

కార్యక్రమంలో చేకూరి రాజేష్, కండేల వెంకన్న, ఊరే సురేష్ వస్కుల అనిల్, మద్దిమడుగు నరేందర్, రాజ్ కుమార్, యేసు బాబు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

NLG: కొండూరు ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబానికి ఆర్ధిక సహాయం
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: ఇటీవల దసరా పండుగ రోజు రోడ్డు ప్రమాదంలో మరణించిన
కొండూరు గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ జరుపుల బిచ్య నాయక్ కుటుంబసభ్యులను బుధవారం పలువురు పరామర్శించారు.

ఈ మేరకు బండి శేఖర్ గౌడ్ రూ.11 వేలు, మాజీ ఎంపిటిసి మారగోని వెంకటయ్య రూ.10 వేలు, బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు వల్లపు సైదులు యాదవ్ రూ.5 వేలు ఆర్ధిక సహాయం అందజేశారు.

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం పట్ల గ్రామస్తులు అభినందిస్తున్నారు. బండి జహంగీర్, బడేటి జంగయ్య, ఈద కృష్ణ, గూడూరు సలార్జాన్, రాములు, దుబ్బ గిరి, వల్లపు మల్లేష్, బండి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.
NLG: ఎన్.జి కళాశాల పి జి ఫలితాలు విడుదల
నల్లగొండ:నాగార్జున ప్రభుత్వ కళాశాల  పిజి 2వ, 4వ సెమిస్టర్ మరియు 1వ, 3వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ ఫలితాలను మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డా. జి. ఉపేందర్ రెడ్డి బుధవారం విడుదల చేశారు.

ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ.. ఎమ్మెస్సీ, ఎం.కాం, ఎం.ఏ లకు సంబంధించిన ఫలితాలను విడుదల చేశామని, ఫలితాలను నాగార్జున కళాశాల పరీక్షల విభాగం వెబ్ సైట్ లో చూడవచ్చని తెలిపారు.

ఫలితాలను నాగార్జున కళాశాల పరీక్షల విభాగం వెబ్ సైట్ లో చూడవచ్చని తెలిపారు.

కార్యక్రమంలో నాగార్జున ప్రభుత్వ కళాశాల పరీక్షల నియంత్రణాధికారి బి. నాగరాజు, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు డా. వైవిఆర్ ప్రసన్నకుమార్, డా. వెల్దండి శ్రీధర్, అకాడమిక్ కో ఆర్డినేటర్ డా. పరంగి రవికుమార్ పాల్గొన్నారు.