NLG: జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రక్తదాన శిబిరం
నల్లగొండ: ప్రజా శ్రేయస్సు కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా.. గురువారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పోలీస్ సిబ్బంది మరియు అమ్మ ఫౌండేషన్ నల్లగొండ టీం పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం కు సంబంధించిన విషయాల గురించి వీరు తయారు చేసిన ప్ల- కార్డులు జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఆవిష్కరింప చేశారు. అనంతరం అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం వల్ల జరిగే ఉపయోగాలను అక్కడికి విచ్చేసిన పోలీసులు మరియు వివిధ సంఘాల సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ సభ్యులు 20 మంది రక్తదానం చేశారు. సతీష్, శివ, సంతోష్, పురుషోత్తం, వంశీ, అమృత రాజ్, మహేష్, శ్రీనాథ్, చందు, సాయి తదితరులు పాల్గొన్నారు.
ఈ మేరకు అమ్మ ఫౌండేషన్ ఫౌండర్, చైర్మన్ సిహెచ్ రేఖా మాట్లాడుతూ.. ప్రతి ఒక్క ఇంట్లో ఒక రక్త దాత ను, ఒక సమాజ సేవకుడిని తయారు చేయడమే తమ లక్ష్యం అన్నారు. ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యునికి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలను అందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు నాయక్, స్థానిక డిఎస్పి శివరాం రెడ్డి, వన్ టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ సీఐ డానియేలు, ఎస్ఐ నాగరాజు, రూరల్ ఎస్సై సైదాబాబు, మరియు వివిధ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన సిఐ లు, ఎస్ఐ లు, పోలీస్ సిబ్బంది, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు ఉన్నారు.
Oct 24 2024, 21:50