NLG: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ దేవరకొండ నియోజకవర్గ కన్వీనర్ గా జిల్లా రాములు
దేవరకొండ: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ స్థానిక కార్యాలయంలో ఆ సంఘం నాయకులు సాధారణ సమావేశం నిర్వహించారు.
ఈ మేరకు నియోజకవర్గ కన్వీనర్ గా జిల్లా రాములు నియమిస్తూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న, జిల్లా కన్వీనర్ మద్దిమడుగు బిక్షపతి నియామక పత్రాన్ని అందజేశారు.
జిల్లా రాములు మాట్లాడుతూ.. డా. బి ఆర్ అంబేద్కర్ చేత స్థాపించబడిన ఈ సంస్థని పూర్తిస్థాయిలో విస్తరింపచేస్తానని అన్నారు. మహిళా ఉపాధ్యక్షురాలు నక్క శోభారాణి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత స్థాపించిన ఈ సంస్థని డివిజన్ స్థాయిలో అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.
జిల్లా నాయకులు గా ధర్మపురం శీను, ఉపాధ్యక్షులు గా చేపురి రాజేష్, సహాయ కార్యదర్శిగా కండేల వెంకన్న, ఊరే సురేష్, ప్రధాన కార్యదర్శిగా సోషల్ మీడియా డివిజన్ కార్యదర్శిగా వస్కుల అనిల్ నియమితులయ్యారు.
కార్యక్రమంలో చేకూరి రాజేష్, కండేల వెంకన్న, ఊరే సురేష్ వస్కుల అనిల్, మద్దిమడుగు నరేందర్, రాజ్ కుమార్, యేసు బాబు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

దేవరకొండ: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ స్థానిక కార్యాలయంలో ఆ సంఘం నాయకులు సాధారణ సమావేశం నిర్వహించారు.

నల్లగొండ జిల్లా:
నల్లగొండ:నాగార్జున ప్రభుత్వ కళాశాల పిజి 2వ, 4వ సెమిస్టర్ మరియు 1వ, 3వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ ఫలితాలను మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డా. జి. ఉపేందర్ రెడ్డి బుధవారం విడుదల చేశారు.
HYD: తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) హాస్పిటళ్ల పనితీరు, టీవీవీపీ ని సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్ గా బలోపేతం చేయడానికి అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి) రూపొందించిన ప్రతిపాదనలపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రివ్యూ సమావేశం నిర్వహించారు.
సికింద్రాబాద్: 'దానా' తుపాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది.మొత్తం 41 రైళ్ల ను రద్దు చేసింది. ఈ నెల 23, 24, 25, 27 తేదీల్లో సర్వీసులందించే పలు రైళ్ల ను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు.
చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని వలిగొండ రోడ్డు 14వ వార్డులో శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం చుట్టూ నిర్మించే సిసి రోడ్డు నిర్మాణం పనులను మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు మంగళవారం ప్రారంభించారు.
రీజనల్ రింగ్ రోడ్డు వల్ల తమ భూములు కోల్పోతున్న చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు మరియు భువనగిరి నియోజకవర్గం లోని రాయగిరి ప్రజలు, గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు, ఇవాళ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిని హైదరాబాదులోని తన నివాసంలో కలిసి రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో తమ భూములు కోల్పోతున్నామని.. ప్రభుత్వంతో మాట్లాడి అలైన్మెంట్ మార్పించాలని లేదా బహిరంగ మార్కెట్ విలువ ద్వారా పరిహారమైనా చెల్లించాలని కోరారు.
నల్లగొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్ రోడ్డు సమీపంలో రావిరాల శ్రీనివాస్, రావిరాల సత్యం అన్నదమ్ములు ఇద్దరు కలిసి నిర్మించుకున్న ఇల్లు ఆర్థిక ఇబ్బందుల కారణంగా విక్రయించారు. కొనుగోలుదారు కొంత మొత్తం డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు విక్రయించిన అన్నదమ్ముల కుటుంబీకులు తెలిపారు.
నల్లగొండ జిల్లా:
ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి, వైస్ చైర్మన్ నక్క శ్రీను యాదవ్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Oct 23 2024, 18:35
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
10.3k