NLG: 5కె రన్ లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం పొందిన ఎన్.జి కళాశాల విద్యార్థి
నల్లగొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల బి. ఏ. తృతీయ సంవత్సరం చదువుతున్న వి. ధనుష్ తెలంగాణా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కె రన్ లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం పొందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. ఉపేందర్ తెలిపారు.

రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన ధనుష్ ను తెలంగాణా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ 35 వేల చెక్కు, మెమెంటో తో సత్కరించినట్లు తెలిపారు.

త్వరలో గోవాలో జరుగు జాతీయ స్థాయిలో 10 కే రన్ పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు ధనుష్ ను ఇవాళ కళాశాలలో ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో అకాడమిక్ కో ఆర్డినేటర్ డా. పరంగి రవికుమార్,  వైస్ ప్రిన్సిపాల్ డా. పిల్లి సురేష్ బాబు, వ్యాయామ అధ్యాపకులు మల్లేశం, పరీక్షల నియంత్రణాధికారి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డా. అనిల్ బొజ్జ, కోటయ్య, తెలుగు విభాగం అధ్యక్షులు డా. వెల్దండి శ్రీధర్, చరిత్ర విభాగం అధ్యక్షులు డా. భట్టు కిరీటం, అర్థశాస్త్ర విభాగం అధ్యక్షులు డా. మునిస్వామి ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.
NLG: ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మండల కమిటీలు ఏర్పాటు
నల్లగొండ జిల్లా:
మునుగోడు: ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో, రాష్ట్ర కమిటీ సూచనల మేరకు, ఈ రోజు ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఏడు మండలాలకు మండల కన్వీనర్ ను ఏర్పాటు చేశారు. మునుగోడు నియోజకవర్గ కన్వీనర్ గా అద్దంకి కిరణ్, కో కన్వీనర్ గా నాగిల్ల మారయ్య, మరియు మండల కన్వీనర్లను నియమించి జిల్లా కన్వీనర్ లకుమాల మధుబాబు నియామక పత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు బేరి గురుపాదం, ఎనమల అనిల్, జిల్లా వైస్ చైర్మన్ చింతపల్లి బాలకృష్ణ, అద్దంకి రవీందర్, సంద యాదగిరి, అంగ రాజు స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు.

మిషన్ భగీరథ కార్మికుల వేతనాలు పెంచాలి: పల్లా దేవేందర్ రెడ్డి
నల్లగొండ: పెరుగుతున్న దరలకు అనుగుణంగా మిషన్ భగీరథ కార్మికుల వేతనాలు పెంచాలని మిషన్ భగీరథ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి కోరారు. శనివారం AITUC ఆధ్వర్యంలో మిషన్ భగీరథ నల్గొండ SE వెంకటేశ్వర్లు కు మెమోరాండం ఇచ్చినారు.

ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి కానీ కార్మికుల వేతనాలు మాత్రం పెరగడం లేదని అన్నారు. జీవోలు, హామీలు కాగితాలకే పరిమితం అయిపోయాయి తప్ప.. కార్మికుల కడుపు నింపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం ఆగస్టులో కార్మికుల వేతనాలు పెరుగుతాయని కాని అక్టోబర్ వచ్చినా, నేటికీ నల్లగొండలో కాంట్రాక్టర్లు వేతనాలు పెంచకపోవడం విచారకరమని అన్నారు.

తక్షణమే ఏజెన్సీలతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి చర్చించాలని దేవేందర్ రెడ్డి ఎస్ఈ ని కోరారు. గత ఐదు నెలలుగా కార్మికులకు వేతనాలు చెల్లించకపోతే వాళ్ళ కుటుంబాలు ఎలా బ్రతకాలని  ప్రశ్నించారు. కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని లేనియెడల కార్మికులు ఆందోళన చేపట్ట వలసి వస్తుందని తెలిపారు.

ఏజెన్సీ లతో త్వరలో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేపిస్తానని ఎస్ ఈ తెలపడం జరిగిందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి జానీ,ఆగు సైదులు, పెరపాక రాజ్ కుమార్, పులిపాటి విజయ్ కుమార్, నూకల సుందర్ రెడ్డి, అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు
NLG: ఎన్. జి కళాశాల అధ్యాపకునికి జాతీయ పురస్కారం
నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగు విభాగంలో అతిథి అధ్యాపకునిగా పనిచేస్తున్న డా.వాసా భూపాల్ కు అఖిల భారతీయ భాషా సాహిత్య పురస్కారం లభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. ఉపేందర్ తెలిపారు.

భాషా సాహిత్య రంగాలలో డా.భూపాల్ చేసిన సేవలకు గాను ఈ పురస్కారం లభించింది. భూపాల్ ఇప్పటిదాకా వాస శతకం, కరోనా శతకం, భూపాల గీతాలు, అద్దేపల్లి రచనలు సమగ్ర పరిశీలన, అక్షర శిల్పి అద్దేపల్లి వంటి రచనలు చేశారు. ఈ నెల 20 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కేంద్రంలో జరుగు ప్రత్యేక కార్యక్రమంలో డా.భూపాల్ ఈ అవార్డును అందుకోనున్నారు.

ఈ సందర్బంగా వైస్ ప్రిన్సిపాల్ డా. పిల్లి సురేష్ బాబు, అకాడమిక్ కోఆర్డినేటర్ డా. పరంగి రవికుమార్, పరీక్షల విభాగం అధికారి బి. నాగారాజు, ఐక్యూఏసి  కోఆర్డినేటర్ డా. ప్రసన్నకుమార్, తెలుగు విభాగం అధ్యక్షులు డా.శ్రీధర్, ఇతర అధ్యాపకులు భూపాల్ ను అభినందించారు.
NLG: హై స్కూల్ హెడ్మాస్టర్ పై.. డిఇఓ కు ఫిర్యాదు

చండూర్ హై స్కూల్ హెడ్మాస్టర్ అక్కడ పని చేసే వంట చేసే మహిళలను అసభ్య పదజాలంతో తిడుతూ వేధిస్తున్నాడని, ఆరోపిస్తూ.. అతని పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళలు ఇవాళ నల్లగొండ జిల్లా కేంద్రంలో జిల్లా విద్యాధికారి కి, జిల్లా అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. పలు విద్యార్థి సంఘాలు మహిళా వంట మనుషులకు మద్దతుగా నిలిచారు.

మహిళా సమభావన సంఘం నుండి గత పది సంవత్సరాలుగా చండూర్ హై స్కూల్ నందు పనిచేస్తున్నామని.. హెడ్మాస్టర్ మహిళలమైన తమ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మమ్మల్ని తొలగించి, హెడ్మాస్టర్ ప్రభుత్వ నియమ నిబంధనకు విరుద్ధంగా ఆయనకు సంబంధించిన వేరే ప్రైవేటు వ్యక్తులను పనిలో పెట్టుకోవడం జరిగిందని, ఇట్టి విషయంపై అడగ్గా నాకిష్టం వచ్చిన వారిని పెట్టుకుంటా మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ దుర్భాషలాడుతున్నాడని, నిబంధన ప్రకారం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తన ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు. ఇట్టి విషయంపై సమగ్ర విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని వారు కోరారు.

ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు 400 మంది ఉంటే ప్రతి ఒక్కరికి ఎనిమిది రూపాయలు చొప్పున 30 రోజులకు ఒక లక్ష రూపాయల వరకు డబ్బులు వస్తే మహిళా సంఘం అకౌంట్ లో జమ చేయకుండా సదురు హెడ్మాస్టర్ తన సొంత అకౌంట్ లో వేసుకొని వారికి కేవలం నెలకు 15 వేల రూపాయలు ఇస్తున్నారని అన్నారు. ఇదే తరహాలో గత పది సంవత్సరాలుగా ఇతర హెడ్మాస్టర్ లు కూడా చేశారని.. హెడ్మాస్టర్ అకౌంట్లో డబ్బులు వేయించుకుంటూ మహిళా సంఘం అకౌంట్ డబ్బులు వేయడంలేదని ఆరోపించారు. ప్రశ్నిస్తే వారిని తీసివేసి వేరే ప్రవేట్ వ్యక్తులు పెట్టుకోవడం జరిగిందని తెలిపారు.ఇదే విషయమై జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణచందర్ కలిసి సమస్యని వివరించడంతో, విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని డిఇఓ ను ఆదేశించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్, నవదీప్, శేఖర్, కిరణ్, సంగం సెంట్రల్ కమిటీ సభ్యులు కిన్నర జగదీష్ ,యాదయ్య, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న, రాష్ట్ర కోఆర్డినేటర్ బాకీ తరుణ్, తదితరులు పాల్గొన్నారు.

PDSU సభను విజయవంతం చేయాలని.. కరపత్రాలు ఆవిష్కరణ
నల్లగొండ: PDSU విప్లవ విద్యార్థి ఉద్యమానికి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా అర్ధ శతాబ్దోత్సవ సభలకు PDSU పిలుపునిచ్చింది. నల్లగొండ పట్టణ కేంద్రంలో ఈ నెల 21 న అంబెడ్కర్ భవన్ లో జరిగే సభ కు సంబందించి ఇవాళ  పట్టణంలోని గర్ల్స్ హాస్టల్ లో కరపత్రాలు ఆవిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా PDSU జిల్లా కార్యదర్శి పోలె పవన్ మాట్లాడుతూ.. 50 ఏళ్ల PDSU విప్లవ ప్రస్థానంలో అనేకమంది విద్యార్థి రత్నాలు, బిగి పిడికిలి జెండా కోసం తమ ప్రాణాలు తృణ పాయం చేశారని తెలిపారు.

కామ్రేడ్ జార్జి రెడ్డి మతోన్మాద కత్తిపోట్లకి ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో నేల కొరిగాడని, కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్, శ్రీపాద శ్రీహరి నాటి ఎమర్జెన్సీ చీకట్లో నాటి నియంతృత్వ పాలకుల తుపాకి తూటాలకు తమ ప్రాణాలని అర్పించారని.. కోలా శంకర్, చేరాలు, రంగవల్లి, స్నేహాలత, మారోజు వీరన్న, మధుసూదన్ రాజు యాదవ్, యానాల వీరారెడ్డి, రమణయ్య, సాంబన్న, వరహాలు లాంటి ఎందరో వీరులు తమ విలువైన ప్రాణాలని ప్రగతిశీల విద్యార్థి ఉద్యమానికి ఇచ్చి సంస్థని సమున్నతంగా నిలబెట్టారని అన్నారు. ఏ విద్యార్థి సంఘం కి లేని త్యాగాల చరిత్ర పీ.డీ.ఎస్.యు సంస్థకి ఉన్నదని వారు తెలిపారు.

అక్టోబర్ 24 న ఓయూ లోని ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే 50 వసంతల అర్ధ శతాబ్దోత్సవ సభలకు పూర్వ, ప్రస్తుత PDSU నాయకులు మరియు విద్యార్థి విద్యార్ధిని లు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.

ఈ కార్యక్రమంలో  పి.డి.ఎస్.యూ నాయకులు భవాని,స్వాతి,మౌనిక, రాజేశ్వరి, మాధవి, స్వప్న, కళావతి, రేణుక,పల్లవి,సుజాత తదితర విద్యార్థినీలు పాల్గొన్నారు.
NLG: సాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద
నల్గొండ జిల్లా:
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు శనివారం 8 గేట్ల ద్వారా  నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

జలాశయానికి ఇన్ ఫ్లో 1,08,249క్యూసెక్కులు వస్తూ ఉండగా, ఔట్ ఫ్లో 1,08,249 క్యూసెక్కు లు వెళ్తోంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 590 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయంలో పూర్తిస్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయి.
నల్లగొండ: మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉపకులపతిగా ఆచార్య అల్తాఫ్ హుస్సేన్ నియామకం.
తెలంగాణలో తొమ్మిది యూనివర్సిటీలకు ప్రభుత్వం వైస్ ఛాన్స్లర్ లను నియమించింది.
NLG: అతిథి అధ్యాపక (గెస్ట్ లెక్చరర్స్) పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్ తెలిపారు.

పీ.జి లో 55 శాతం, యస్.సి. యస్.టి వారికి పీ.జి లో 50 శాతం మార్కులు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. అర్థశాస్త్రం- 01, జంతు శాస్త్రం- 01 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ నెల 22 వ తేదీ లోపు దరఖాస్తు ఫారాలను కళాశాల కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తేది.23-10-2024 ఉదయం 10.30 గంటలకు కళాశాల లో ఇంటర్వూ కు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని తెలిపారు.
NLG: టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) ను సందర్శించిన ఎన్జీ కళాశాల విద్యార్థులు
నల్లగొండ లోని నాగార్జున ప్రభుత్వ
కళాశాల విద్యార్థులు, ఇవాళ హైదరాబాద్ లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) పరిశోధన కేంద్రంను సందర్శించారు.

ఈ మేరకు ఈ సందర్శన విద్యార్థులకు ఉన్నత విద్యా పరిశోధనలో అనుభవాన్ని అందించి, పరిశోధనలో ఉన్నత స్థాయి అవకాశాలను అవగాహన చేసుకోవడంలో ప్రేరణను కల్పించిందని ప్రిన్సిపాల్ డా. ఎస్. ఉపేందర్ అన్నారు.

వైస్ ప్రిన్సిపాల్ డా. పి. రవికుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు బతిని నాగార్జున, ఎం. శ్రీనివాస రెడ్డి, డి. కృష్ణ, మహేశ్వరి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీఐఎఫ్‌ఆర్ డైరెక్టర్ ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థులు ఈ సందర్శనలో ఆసక్తి చూపించినందుకు అభినందించారు.