కెనడాలో ఇదీ భారతీయం

వైశాల్యం పరంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం కెనడా.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌..! ఖలిస్థానీ మద్దతుదారు నిజ్జర్‌ హత్య నేపథ్యంలో ప్రస్తుతం ఈ రెండింటి మధ్య తీవ్ర స్థాయి దౌత్య యుద్ధం

వైశాల్యం పరంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం కెనడా.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌..! ఖలిస్థానీ మద్దతుదారు నిజ్జర్‌ హత్య నేపథ్యంలో ప్రస్తుతం ఈ రెండింటి మధ్య తీవ్ర స్థాయి దౌత్య యుద్ధం జరుగుతోంది. అయితే, దీన్ని పక్కనపెడితే కెనడాలో భారతీయులది బలమైన సమాజం. పలు రంగాల్లో మనవారు స్థిరపడ్డారు. ఆ వివరాలు గణాంకాల్లో..

20 ఏళ్లలో కెనడాలో భారతీయుల సంఖ్య రెట్టింపును మించింది.

1980 వరకు భారత్‌లో పుట్టి కెనడా వెళ్లినవారు 63,535. 1991-2000 మధ్యన ఈ సంఖ్య 1.45 లక్షలు. 2006-10 నడుమ 1.19 లక్షలు. 2016-21 మధ్య 2.46 లక్షలు.

ఐదేళ్లలో డబుల్‌: 2019లో కెనడాలోని భారతీయ విద్యార్థుల సంఖ్య 2.18 లక్షలు కాగా, ప్రస్తుతం 4.27 లక్షలు.

పౌరసత్వంలో పైపైకి..: కెనడా పౌరులుగా మారుతున్న భారతీయుల సంఖ్య ఏటా భారీగా పెరుగుతోంది. ఈ శాతం 2017లో 44.3 కాగా.. 2021లో 61.1 శాతం.

అక్కడ మన వారి జాబ్‌ ప్రొఫైల్‌ కూడా బాగుంటోంది. మెరుగు పడుతోంది కూడా. ప్రవాసుల్లో 50 శాతం మంది డిగ్రీ హోదాతో కూడిన ఉద్యోగాలు చేస్తున్నారు. మొత్తమ్మీద కార్యనిర్వాహక (మేనేజీరియల్‌) పోస్టుల్లో 10 శాతం లోపే ఉన్నారు. అయితే, ఇటీవల వెళ్లినవారిలో 19శాతం మంది ఈ పోస్టులు పొందారు.

భారత్‌కు పప్పు ధాన్యాలు అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశం కెనడా.

భారత్‌ నుంచి బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలు, ఫార్మా ఉత్పత్తులు, రెడీమేడ్‌ దుస్తులు అధికంగా కెనడాకు ఎగుమతి అవుతుంటాయి.

600 పైనే: భారత్‌లో ఉన్న కెనడాకు చెందిన కంపెనీలు. వీటిలో టిమ్‌ హర్టన్స్‌ కాఫీ చైన్‌, శీతల ఆహార పదార్థాల సంస్థ మెక్‌ కెయిన్‌ కూడా ఉన్నాయి. 75 బిలియన్‌ అమెరికా డాలర్లకు పైగా కెనడియన్‌ పింఛను నిధులను భారత్‌లో పెట్టుబడులు పెట్టారు.

27% కెనడాలోని శాశ్వత నివాసితుల్లో భారతీయులు. కెనడా పీఆర్‌ స్కీంలో మనవారే ప్రధాన లబ్ధిదారులు.

22 %గత ఏడాది కెనడా వెళ్లిన తాత్కాలిక విదేశీ కార్మికుల్లో భారతీయులు. రెండో అత్యధికం వీరే.

45% విదేశీ విద్యార్థుల్లో భారతీయులు. మరే దేశం నుంచి ఈ స్థాయిలో విద్యార్థులు లేరు.

28 లక్షలు: కెనడాలోని భారతీయులు. వీరిలో ప్రవాసులు, భారత సంతతివారూ ఉన్నారు. ప్రపంచంలో భారతీయులు అధికంగా ఉన్న నాలుగో దేశం. ఇందులో 18 లక్షలు భారత సంతతివారు. 10 లక్షల మంది ప్రవాసులు.

8.30 లక్షలు: కెనడాలోని హిందువులు. 7.70 లక్షలు: సిక్కులు

6: వాంకోవర్‌, టొరంటో, మాంట్రియల్‌, విన్నీ పెగ్‌,

ఒట్టావా (ఒంటారియో), కాల్గారి (అల్బెర్టా). ప్రవాసులు అధికంగా నివసించే ప్రాంతాలు.

ఊడ్చేందుకు పదిరెట్ల చార్జీలు..

మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)లో పారిశుధ్యం పేరిట ప్రైవేటు సంస్థలు దర్జాగా ఖజానాను ఊడ్చేస్తున్నాయి. రూపాయి పనికి సుమారు రూ.10 వసూలు చేస్తూ కోట్లాది రూపాయలను జేబుల్లో వేసుకుంటున్నాయి.

మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)లో పారిశుధ్యం పేరిట ప్రైవేటు సంస్థలు దర్జాగా ఖజానాను ఊడ్చేస్తున్నాయి. రూపాయి పనికి సుమారు రూ.10 వసూలు చేస్తూ కోట్లాది రూపాయలను జేబుల్లో వేసుకుంటున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఉన్నతస్థాయి ఆదేశాలతో కాంట్రాక్టులు దక్కించుకున్న సంస్థలు.. ప్రస్తుత కాంగ్రెస్‌ హయాంలోనూ అదే హవా కొనసాగిస్తుండడం విశేషం. అధిక పైసలకు రుచిమరిగిన ఏజెన్సీలు.. కాంట్రాక్టు పొడిగింపునకు ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొస్తున్నాయి. ఇందుకు గ్రేటర్‌లోని కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరిస్తుండడం గమనార్హం. తాజాగా ఓ సంస్థ కాంట్రాక్టు గడువు పొడిగింపునకు సిఫార్సు చేస్తూ ఓ ఎమ్మెల్యే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, అదనపు కమిషనర్లకు లేఖ రాశారు.

మెరుగైన నిర్వహణ కోసం నగరంలోని పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించారు. సాధారణంగా కిలోమీటరు మేర రహదారిపై పారిశుధ్య నిర్వహణకు జీహెచ్‌ఎంసీ ఏటా రూ.40 వేల వరకు ఖర్చు చేస్తోంది. అదే ప్రైవేట్‌ ఏజెన్సీకి మాత్రం రూ.3.12 లక్షల చొప్పున చెల్లిస్తోంది. రెండువిడతల్లో పనిచేసే కార్మికులు ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో చెత్తాచెదారాన్ని తొలగిస్తారని, అందుకే అదనపు వ్యయం అని అధికారులు చెబుతున్నారు. అలా చూసినా కిలోమీటరుకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు కావాలి. కానీ జీహెచ్‌ఎంసీ మాత్రం ఆ సంస్థలకు కిలోమీటరుకు రూ.3.12 లక్షలను అప్పనంగా చెల్లిస్తోంది.

దేశ, విదేశీ పర్యాటకులు సందర్శించే నగరంలోని చార్మినార్‌, మక్కామసీదు, గోల్కొండ కోట, ఫలక్‌నుమా ప్యాలెస్‌, సాలార్‌జంగ్‌ మ్యూజియం, బాపూఘాట్‌, కుతుబ్‌షాహీ టూంబ్స్‌, పైగా టూంబ్స్‌, నాంపల్లి పబ్లిక్‌గార్డెన్‌(Nampally Public Garden), అసెంబ్లీ, బిర్లా మందిర్‌ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణను గత ప్రభుత్వం ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించింది. ఆ ప్రాంతాల్లో అపరిశుభ్రత ఉంటే నగర పర్యాటకంపై ప్రభావం చూపుతుందన్న ఆలోచనతో నిర్ణయం తీసుకున్నారు. 9 ప్రాంతాల్లోని 73.75 కి.మీల కారిడార్లలో పారిశుధ్య నిర్వహణ బాధ్యతలను ఎక్సోరా కార్పొరేట్‌ సర్వీసెస్‌, లా మెక్‌లీన్‌ సంస్థలకు అప్పగించారు. ఇందుకోసం నెలకు రూ.2.30 కోట్ల చొప్పున ఏడాదికి సుమారు రూ.27 కోట్ల నుంచి రూ.28 కోట్లు బల్దియా చెల్లిస్తోంది.

బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వ హయాంలో ఓ కీలక మంత్రి వద్ద పనిచేసే అధికారి సూచనల మేరకు ఏజెన్సీలను ఎంపిక చేశారు. గడువు ముగిసినా గతంలోనే పలుమార్లు కాలవ్యవధి పొడిగించారు. ప్రస్తుతం సెప్టెంబరు నుంచి ఫిబ్రవరి 2025 వరకు మరోమారు గడువు పొడిగించాలని ఎక్సోరా సంస్థ జీహెచ్‌ఎంసీని కోరింది. ఈ వినతిని పారిశుధ్య నిర్వహణ విభాగం పక్కనపెట్టి పొడిగింపు అవసరం లేదని ఉన్నతాధికారులకు నివేదించింది. దీంతో అలవాటైన పద్ధతిలో ప్రజాప్రతినిధులను సదరు సంస్థ రంగంలోకి దింపింది. ఎక్సోరా సంస్థ గడువు పొడిగించాలని ఎంఐఎం ఎమ్మెల్యే ఒకరు సిఫార్సు లేఖ ఇచ్చారు. గ్రేటర్‌లోని ఓ కీలక ప్రజాప్రతినిధి కూడా పారిశుధ్య నిర్వహణ ప్రైవేట్‌ సంస్థల ఆధీనంలో ఉండేలా, లూ-కెఫేలపై ఈగ వాలకుండా చూసుకుంటారని ప్రచారం జరుగుతోంది.

హైదరాబాద్‌లో మరోసారి ఐటీ సోదాల కలకలం

ఐటీ అధికారుల సోదాలు హైదరాబాద్ లో మరోసారి కలకలం రేపుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులే లక్ష్యంగా మరోసారి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నగరంలో ఏకకాలంలో 30 ప్రదేశాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. గురువారం వేకువజాము నుంచి ఈ ఐటీ సోదాలు చేపట్టారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, జూబ్లీహిల్స్, రాయదుర్గం, చైతన్యపురి, మలక్ పేట, కొల్లూరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ తనిఖీలు కొనసాగిస్తున్నారు. అన్విత బిల్డర్స్, ప్రాపర్టీస్ కార్యాలయాలు, యాజమాన్యాల ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి. 

చైతన్యపురిలోని గూగీ ప్రాపర్టీస్ కార్యాలయంలోనూ సోదాలు చేపట్టారు. అన్విత బిల్డర్స్ అధినేత బొప్పరాజు శ్రీనివాస అచ్యుతరావు నివాసంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. మలక్‌పేట నియోజకవర్గ కాంగ్రెస్ నేత షేక్ అక్బర్ నివాసంలో, ఆయనకు చెందిన గూగి ప్రాపర్టీస్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

ఐటీ అధికారులు 40 బృందాలుగా రంగంలోకి దిగి సోదాలు చేపట్టారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించి పలు దస్త్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లో గత నెల 23వ తేదీన విస్తృతంగా ఐటీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

హయత్ నగర్ సంఘం బేకరి పై అసత్య ప్రచారం చేసిన వారిపై కేసు నమోదు....

రంగారెడ్డి : బ్రేకింగ్....

బేకరిలో అన్వర్ అనే ముస్లిం కార్మికుడు జీహాదీ పేరుతో అపవిత్రం చేస్తున్నారని ఇద్దరు యువకుల హల్చల్....

వీడియో తీసి సోషల్ మీడియాలో బేకరి నిర్వహణ పై అసత్య ప్రచారం చేయడంతో పాటు,ముస్లిం సోదరుల మనోభావాలు దెబ్బతినేలా పోస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులు.....

సదరు వ్యక్తులు యూట్యూబర్స్ వీరేష్,నరసింహ గా గుర్తింపు.....

మతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరించినందుకు మరియు ఒక సంస్థ పై తప్పుడు ప్రచారం చేసిన నిందితులపై 329(4),115(2),351(2),324(4)రెడ్ విత్ 3 (5) సెక్షన్ ల కింద కేసు నమోదు....

గతంలో విలేఖరులమని చెప్పి కేకు ఫ్రీగా ఇవ్వాలని ఆదేశించిన యూ ట్యూబర్స్....

మాట వినలేదనే కక్షతో అసత్య ప్రచారం చేశారని అంటున్న సంఘం బేకరి నిర్వాహకులు....

టీడీపీని వీడి వైసీపీలో చేరిన కీలక నేత.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం

ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి ట్విస్ట్ ఇస్తూ కీలక నేత ఒకరు వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజ‌క‌వ‌ర్గం తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి ముదునూరి ముర‌ళీకృష్ణంరాజు ఆ పార్టీని వీడారు. ఆయన తాడేప‌ల్లిలో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయ‌న‌కు జ‌గ‌న్ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముర‌ళీకృష్ణంరాజు అమలాపురం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడిగా కూడా ఉన్నారు. ఆయన గతంలో వైఎస్సార్‌సీపీలో ఉండేవారు.. 2023లో టీడీపీ చేరారు. మళ్లీ ఇప్పుడు తిరిగి వైఎస్సార్‌సీపీలోకి వెళ్లారు.

ఆంధ్రప్రదేశ్‌‌‌లో సార్వత్రిక ఎన్నికలు వైఎస్సార్‌సీపీని కోలుకోలేని దెబ్బతీశాయి. ఆ పార్టీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యింది.. ఫలితాల తర్వాత వరుసగా నేతలు పార్టీని వీడుతున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే వైఎస్సార్‌సీపీకి గుడ్ బై చెప్పేశారు.. జిల్లాల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే మొన్నటి వరకు వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరిన నేతల్ని చూశాం.. కానీ ఈయన మాత్రం కాస్త వెరైటీ. అధికారంలో ఉన్న టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరి షాకిచ్చారు.

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన ముదునూరి మురళీకృష్ణంరాజు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్‌సీపీలో చేరారు.. ఆయనకు కండువా కప్పిన అధినేత జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ బలోపేతం కోసం పనిచేస్తానని చెప్పారు ముదునూరి మురళీకృష్ణంరాజు. మురళీకృష్ణంరాజు అధికార పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరడం ఆసక్తికరంగా మారింది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలతో ఆయన టీడీపీని వీడినట్లు తెలుస్తోంది.

ముదునూరి మురళీకృష్ణంరాజు 2023 ఏప్రిల్‌లో వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరారు. ఆయన్ను టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా, అమలాపురం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడిగా నియమిచంచారు. మురళీకృష్ణంరాజు ఆయన చేరినప్పటి నుంచి ప్రత్తిపాడులో విభేదాలు మొదలయ్యాయి. ఆయనపై టీడీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో మురళీరాజు టీడీపీకి ద్రోహం చేశారని.. ప్రత్తిపాడు అభ్యర్థి వరుపుల సత్యప్రభ కోసం పనిచేయకుండా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల కోసం డబ్బులు పంచారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ సత్యప్రభకు ఓటు వేయొద్దని గ్రామాల్లో ప్రలోభాలకు గురి చేశారని నేతలు ఆరోపించారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి పార్టీ నుంచి పొందిన పదవులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పార్టీకి, కూటమి అభ్యర్థికి వెన్నుపొటు పొడిచిన మురళీరాజుపై అధిష్టానం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అప్పటి నుంచే టీడీపీ కేడర్ మురళీరాజుపై విమర్శలు చేసింది.. అయితే తాజా పరిణామాలతో ఆయన టీడీపీని వీడి మళ్లీ వైఎస్సార్‌సీపీల ోచేరారని చెబుతున్నారు.

హైడ్రాకు సర్వాధికారాలు..

గ్రేటర్ పరిధిలోని అక్రమ కట్టడాలన్నీ కూల్చివేసే పవర్ ప్రభుత్వం హైడ్రాకు ఇచ్చింది. జీహెచ్ఎంసీ చట్టంలో పలుమార్పులు చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలో మున్సిపల్ శాఖ. 374B ప్రత్యేక సెక్షన్ చేర్చింది. దీంతో బల్దియాతో పాటు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల పరిధిలో హైడ్రా దూకుడు పెంచనుంది.. ఇక నుంచి జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తారు.

ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యతలను పూర్తిస్థాయిలో హైడ్రా (Hydra)కు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt.,) ఉత్తర్వులు జారీచేసింది. గురువారం నుంచి అధికారులు హైడ్రా డైరెక్షన్ లోనే నోటీసులు (Notices) జారీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో (GO) 199 విడుదల చేసింది. గ్రేటర్ పరిధిలోని అక్రమ కట్టడాలన్నీ కూల్చివేసే పవర్ (Power) హైడ్రాకు ఇచ్చింది. జీహెచ్ఎంసీ (GHMC) చట్టంలో పలుమార్పులు చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలో మున్సిపల్ శాఖ. 374B ప్రత్యేక సెక్షన్ చేర్చింది. దీంతో బల్దియాతో పాటు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల పరిధిలో హైడ్రా దూకుడు పెంచనుంది.. ఇక నుంచి జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తారు. అక్రమ కట్టడాలకు నోటిసులు జారీ నుంచి కూల్చివేతల వరకు అన్నీ హైడ్రా చేయనుంది.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు అధికారాలను హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఎసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ(హైడ్రా)కు బదలాయిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు (జీవో-191) జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ-1955 చట్టంలోని సెక్షన్‌ 374-బీ ప్రకారం చెరువులు, పార్కులు, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, రోడ్లు, డ్రైన్‌ల పరిరక్షించాల్సి ఉంటుంది. ఈ అధికారాలను హైడ్రాకు బదిలీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. మంత్రివర్గ ఆమోదంతో ఆర్డినెన్సు ప్రతిపాదనలను గవర్నర్‌కు పంపింది. దీనిని ఆమోదిస్తూ ఈ నెల 3వ తేదీన గవర్నర్‌.. గెజిట్‌ విడుదల చేశారు. ఈ మేరకు తాజాగా పురపాలక శాఖ జీవో 191ను జారీ చేసింది. ఆర్డినెన్స్‌, జీవో జారీతో హైడ్రా చర్యలకు సంబంధించి న్యాయపరమైన ఇబ్బందులు ఉండవని అధికార వర్గాలు చెబుతున్నాయి.

తాజా అధికారాలతో ఆక్రమణలకు సంబంధించి హైడ్రా నోటీసులు జారీ చేయనుంది. ఆయా నిర్మాణదారులు సంబంధిత అనుమతి పత్రాలు, అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించని పక్షంలో స్పీకింగ్‌ ఆర్డర్స్‌ జారీ చేస్తుంది. వారు ఇచ్చే వివరణ అప్పటికీ సహేతుకంగా లేకుంటే నిర్మాణం కూల్చివేత/సీజ్‌ చేసే అధికారం హైడ్రాకు ఉంటుంది. చెరువులు, పార్కుల్లో అక్రమ నిర్మాణాలపై ఆదిలో ఉక్కుపాదం మోపిన హైడ్రా... హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొంత కాలంగా ఆచితూచి వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టడంతోపాటు చెరువుల వాస్తవ విస్తీర్ణం, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ నిర్ధారణపై దృష్టి సారించింది. ఇందుకోసం సర్వే ఆఫ్‌ ఇండియా, ఎన్‌ఆర్‌ఎ్‌ససీ సాంకేతిక సహకారం తీసుకుంటోంది.

జీవో జారీ నేపథ్యంలో ఇక నుంచి చట్టపరంగా ముందుకు వెళ్లాలని సంస్థ భావిస్తోంది. వాస్తవానికి రోడ్లు, పార్కులు, చెరువుల్లో ఆక్రమణలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసే అధికారాలు జీహెచ్‌ఎంసీతోపాటు మునిసిపాలిటీలకు ఉన్నాయి. కానీ, కూల్చివేతలపై హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో నోటీసుల జారీ, స్పీకింగ్‌ ఆర్డర్స్‌ తర్వాతే హైడ్రా నిర్ణయం తీసుకోనుంది. ఔటర్‌రింగ్‌ రోడ్డు వరకు హైడ్రా పరిధి ఉన్న నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ వరకు జీహెచ్‌ఎంసీ యాక్ట్‌ ప్రకారం, ఆవలి ప్రాంతాల్లోని 27 మునిసిపాలిటీలు/కార్పొరేషన్ల పరిధిలో మునిసిపల్‌ చట్టం ప్రకారం ముందుకు సాగనున్నట్టు కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. తాజా జీవోతో హైడ్రా మరింత బలపడిందని, పూర్తి స్థాయిలో అధికారాలు వచ్చాయ న్నారు. అనధికార భవనాలను కూల్చివేయడంతోపాటు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారికీ హైడ్రానే నోటీసులు జారీ చేస్తుందని తెలిపారు.

ప్రధానితో చంద్రబాబు, పవన్ భేటీ - గేమ్ ఛేంజర్..!!

సీఎం చంద్రబాబు..డిప్యూటీ సీఎం పవన్ హర్యానా వెళ్తున్నారు. హర్యానా నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. ఆ తరువాత ఎన్డీఏ సమావేశంలో ఈ ఇద్దరు పాల్గొంటారు. జమిలి ఎన్నికల వేళ కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలతో ఈ భేటీ కీలకం కానుంది. ప్రధాని మోదీతో చంద్రబాబు, పవన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీ పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.

హర్యానాలో హ్యాట్రిక్ విజయం సాధించిన బీజేపీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం నేడు కొలువు తీరనుంది. ఈ ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు హాజరు కానున్నాయి. సీఎం చంద్రబాబు...డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక విమానంలో హర్యానాకు వెళ్తనున్నారు.

ప్రమాణ స్వీకారం తరువాత ఎన్డీయే పక్ష నేతల సమావేశంలో వారు పాల్గొంటారు. ఈ భేటీలో రానున్న రాష్ట్రాల్లో ఎన్నికలతో పాటుగా నాలుగు నెలల ఎన్డీఏ మూడో విడత పాలన గురించి చర్చించనున్నారు. జమిలి ఎన్నికల విషయంలో వ్యూహాల పైన ప్రధాని తమ భాగస్వామ్య పక్ష నేతలకు వివరించే అవకాశం ఉంది.

పవన్ కల్యాణ్ ఎన్డీఏ సమావేశానికి హాజరు కావటం ప్రత్యేకత సంతరించుకుంది. ప్రధానిగా మోదీ ఎన్నిక జరిగిన సమావేశంలో పవన్ ను ఉద్దేశించి ప్రధాని ప్రశంసించారు. ఇప్పుడు ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతోంది. చాలా కాలం తరువాత ప్రధానితో పవన్ భేటీ కానున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వివరించనున్నారు.

అదే విధంగా మహారాష్ట్రలో తెలుగు ప్రజలు ఉన్న ప్రాంతాల్లో పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. కేంద్ర మంత్రుల తో పాటుగా ఎన్డీఏ పక్షాల సీఎంలు..డిప్యూటీ సీఎంలు హర్యానా చేరుకుంటున్నారు. హర్యానాలో బీజేపీ వరుసగా మూడో సారి అధికారం చేపడుతోంది.

వాయు'గండం'గా మారిన అల్పపీడనం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈనెల 17వ తేదీన చెన్నై-పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఈ అల్పపడీనం నెల్లూరుకు 590 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరికి 500 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, ములుగు, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఆయా జిల్లాలకు పసుపు హెచ్చరిక జారీచేశారు. రెండు రోజులుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఈరోజు కూడా నగరంలో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

కూకట్ పల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, రామంతపూర్, ఉప్పల్, మూసాపేట, బోరబండ, పంజాగుట్ట ప్రాంతాల్లో వర్షం కురిసింది. సాయంత్రానికి మళ్లీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సూచించారు.

అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ తడిసి ముద్దవుతోంది. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు హైఅలర్ట్ జారీచేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు.

మెదక్ జిల్లాలో కారు బీభత్సం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి

మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న కారు.. అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. దీంతో ఆ కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వారిలో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. పైగా వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి.

మెదక్ జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం.. ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు.. ఈ ప్రమాదంలో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం ధాటికి కారు మొత్తం నుజ్జునుజ్జయింది. చనిపోయిన ఏడుగురిలో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు. శివంపేట మండలం ఉసిరికపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడే ప్రాణాలు విడిచారు. ఇక వారంతా పాముబండా తండా వాసులుగా పోలీసులు గుర్తించారు.

ఉసిరికపల్లి నుంచి వెల్దుర్తి వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండగా.. వేగంగా వచ్చిన ఆ కారు.. రహదారిపై ఉన్న గుంతలో పడటంతో అదుపు తప్పి ఆ తర్వాత ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా రోడ్డుపై ఉన్న గుంతలో పడటంతో గాల్లోకి ఎగిరి రహదారి పక్కకు దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే రోడ్డు పక్కకు ఉన్న చెట్టును ఢీకొట్టింది. అనంతరం అదే వేగంతో కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు స్పాట్‌లోనే చనిపోయినట్లు స్థానికులు గుర్తించారు.

ఇక ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని స్థానికులు పోలీసులకు అందించడంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులోని మృతదేహాలను బయటికి తీసి.. పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇక ఆ ఏడుగురు మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని గుర్తించిన పోలీసులు.. వారిది పాముబండ తండా అని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాద ఘటనపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

సీఎం చెప్పినా వినరా?

స్టేడియాలను ఇకపై బహిరంగ సభలు, సమావేశాలు, క్రీడేతర కార్యక్రమాలకు వినియోగించబోమని సాక్షాత్తూ సీఎం రేవంత్‌ రెడ్డి రెండునెలల కిందట ఎల్బీ స్టేడియం వేదికగా చెప్పిన మాటలను స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ (శాట్‌) యంత్రాంగం బేఖాతరు చేస్తోంది.

వచ్చే శనివారం గచ్చిబౌలి ప్రధాన స్టేడియంలో దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత విభావరి నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.16 కోట్లకు పైగా వెచ్చించి, స్టేడియంలోని సీట్లు, ఫుట్‌బాల్‌ మైదానాన్ని ఆధునికీకరించింది. అథ్లెటిక్‌ ట్రాక్‌ను కూడా మరమ్మతు చేసే ఆలోచనలో ఉన్న సమయంలో ఈ సంగీత విభావరికి స్టేడియంను ‘శాట్‌’ ఎలా కేటాయించిందని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఇళయరాజా సంగీత విభావరికి స్టేడియాన్ని ఇచ్చినప్పుడు ఫుట్‌బాల్‌ మైదానంలో గుంతలు తవ్వడం, ఆహార పదార్థాల వ్యర్థాలు, ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లు పడేసి చిందరవందరగా తయారు చేశారు.

ఇప్పటికే సంగీత విభావరి నిర్వాహకులు అథ్లెటిక్‌ సింథటిక్‌ ట్రాక్‌పైన స్టేజ్‌ కూడా వేయడంతో ‘శాట్‌’ అధికారుల తీరుపై క్రీడాకారులు, క్రీడాభిమానులు మండిపడుతున్నారు.