శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం చుట్టూ సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
యాదాద్రి జిల్లా:
చౌటుప్పల్: మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు ఇవాళ పట్టణ కేంద్రంలోని వలిగొండ రోడ్డు 14 వ వార్డులో శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం చుట్టూ.. సిసి రోడ్డు నిర్మాణం పనులు చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, స్థానిక కౌన్సిలర్ సంధగల్ల విజయ్ సతీష్, రామాలయ గుడి చైర్మన్ మురళి, నాయకులు ఊడుగు శ్రీనివాస్(అడ్వకేట్), మునుకుంట్ల సత్యనారాయణ, చింతకింది అంజయ్య, ఉడుగు మల్లేష్, ఉష్కాగుల రమేష్, చెవగోని వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
ఎస్జిటిగా ఉద్యోగాలు సాధించిన వారిని సన్మానించిన స్వేరో స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు
నాంపల్లి మండల కేంద్రం కేతపల్లి గ్రామంలో డీఎస్సీ ఫలితాలలో ఇటీవల ఎస్జిటిగా ఉద్యోగాలు సాధించిన వారిని, గురువారం స్వేరో స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆకులపల్లి నరేష్ సన్మానించారు. ఈ మేరకు గాదేపాక వేలాద్రి, గాదేపాక సైదులు లను శాలువాతో  సన్మానించారు.

డి.ఎస్.పి మండల అధ్యక్షుడు ఇరిగి సుధాకర్, పిపిఎల్ జిల్లా అధ్యక్షుడు ఆకులపల్లి శ్రీను, చిరంజీవి, ఎల్లయ్య, రజినీకాంత్, నవీన్, వెంకటయ్య పాల్గొన్నారు
NLG: నేటి సీఎం కప్ టార్చ్ ర్యాలీలో క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొనాలి: బొమ్మపాల గిరిబాబు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 33 జిల్లాల్లో నిర్వహిస్తున్న 2024 సీఎం కప్ క్రీడా పోటీల టార్చ్ ర్యాలీ భువనగిరి మరియు సూర్యాపేట జిల్లాల ద్వారా ఈరోజు మధ్యాహ్నం నల్లగొండలో ప్రవేశిస్తుందని చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు తెలిపారు.

పట్టణంలోని మర్రిగూడ బైపాస్ వద్ద ఈ ర్యాలీ కి ఘనమైన స్వాగతం తెలిపే కార్యక్రమంలో పట్టణం మరియు గ్రామాలలోని క్రీడాకారులందరూ అధిక సంఖ్యలో పాల్గొని క్రీడా సంఘీభావం తెలియజేస్తూ టార్చ్ ర్యాలీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
NLG: కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి: జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న
అక్టోబర్ 18న హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేజీకేఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కల్లుగీత కార్మిక సంఘం పదేండ్ల ప్రయాణం పేరుతో నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సుకు నల్లగొండ జిల్లా నుండి కల్లు గీత కార్మికులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న పిలుపునిచ్చారు.

చండూరు మండల కేంద్రంలో మంగళవారం తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం 67వ వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడి 10 సం.లు పూర్తి అవుతున్నా.. ప్రభుత్వాలు మారినా.. కల్లు గీత కార్మికుల సమస్యలు మాత్రం పరిష్కరించ లేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

కల్లు గీత కార్మికుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించకపోవడం, కేటాయించిన నిధులు ఖర్చు చేయకపోవడం వల్ల గీత కార్మికుల జీవితాలలో ఎలాంటి మార్పు లేదని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది మాసాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రభుత్వం కల్లు గీత కార్మికుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.     వృత్తి రక్షణ కోసం గీత కార్మికుల యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు కోసం చర్యలు తీసుకోవాలని అన్నారు.

గీత కార్మికులందరికీ మోటర్ బైక్ లు ఇవ్వాలని, గీత కార్మికులు సహజ మరణం పొందిన ఎక్స్గ్రేషియా వచ్చే విధంగా గీతన్న బీమా పథకాన్ని అమలు చేయాలని, ప్రతి గీత కార్మికుల కుటుంబానికి రెండు లక్షల రూపాయల సబ్సిడీ రుణం ఇవ్వాలని ఆయన అన్నారు.ఎక్స్గ్రేషియా పది లక్షలకు పెంచాలని 18 డిమాండ్లతో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని ఈ సదస్సుకు  జిల్లా నుండి అధిక సంఖ్యలో గీత కార్మికులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

ఈ  కార్యక్రమంలో తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ, కెవిపిఎస్ జిల్లా నాయకులు రవీందర్, కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షులు చెనగోని కిరణ్, బొమ్మరగోని కిరణ్, ఖమ్మంపాటి యాదయ్య, బొమ్మర గోని కృష్ణయ్య, బిక్షం, చేనగొని పెంటయ్య, బోయపల్లి రోశయ్య, అంజయ్య, శ్రీను, వెంకటేశం    తదితరులు పాల్గొన్నారు.
NLG: ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబానికి పదివేలు ఆర్థిక సహాయం
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండలంలో దసరా పండుగ రోజు రోడ్డు ప్రమాదంలో మరణించిన కొండూరు ఫీల్డ్ అసిస్టెంట్ జరుపుల బిచ్య నాయక్ కుటుంబ సభ్యులను, ఇవాళ కాంగ్రెస్ నేత కోడలా అల్వాల్ రెడ్డి పరామర్శించి రూ 10 వేలు ఆర్ధిక సహాయం అందజేశారు.

కార్యక్రమంలో సైదులు, ఈద కృష్ణ, ప్రదీప్ రెడ్డీ, శ్రీశైలం, సురేష్, కొండల్, మంగ్త, బాలు, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
నాంపల్లి: సన్నరకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సింగిల్ విండో చైర్మన్
నల్లగొండ జిల్లా:
నాంపల్లి మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సన్న రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం సింగిల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని మార్కెట్ యార్డ్ కు తెచ్చేటప్పుడు తేమ శాతం 17% ఉండేటట్టు చూసుకోవాలని,తాలు లేకుండా కల్లాల వద్దనే వరి ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకురావాలని రైతులను కోరారు.

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఉంటుందని తెలిపారు. రైతులందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు.అదేవిధంగా  దళారులను నమ్మి  మోసపోవద్దని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో తహసిల్దార్, అగ్రికల్చర్ ఏఓ, మానేటింగ్ ఆఫీసర్ మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డీ, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, పెద్దిరెడ్డి సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్ చంద్రారెడ్డి, పానగంటి వెంకటయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అంజాచారి, పూల గిరి, పిఎసిఎస్ సిబ్బంది, రైతులు శేఖరు, నరసింహ, కిషన్, రాములు, శ్రీను, యాదమ్మ, రాజు, శివ, తదితరులు పాల్గొన్నారు.
NLG: డీఎస్సీ లో ఎంపికైన అభ్యర్థులకు రేపు కౌన్సెలింగ్
డీఎస్సీ-2024 ఎంపికైన అభ్యర్థులకు మంగళవారం నల్లగొండ డైట్ కళాశాలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి తెలిపారు. డీఎస్సీ లో ఎంపికైన అభ్యర్థులు లేటెస్ట్ రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒరిజినల్ సర్టిఫికెట్ లతో హాజరుకావాలని సూచించారు.

ఇటీవల బదిలీ అయ్యి.. అదే స్థానంలో కొనసాగుతున్న ఉపాధ్యాయులు, ఈనెల 16 న బదిలీ అయిన స్థానంలో రిపోర్ట్ చేయాలని కోరారు.
NLG: శ్రీ కంఠ మహేశ్వర స్వామి దేవాలయం నిర్మాణానికి విరాళం
నల్లగొండ జిల్లా:
మర్రిగూడెం మండలం, యరగండ్లపల్లి గ్రామానికి చెందిన శ్రీ కంఠ మహేశ్వర స్వామి దేవాలయం నిర్మాణానికి ఖర్చుల నిమిత్తం యరగండ్లపల్లి గ్రామానికి  చెందిన రామదాసు శ్రీనివాస్ రూ.10,000/- మరియు పులి మామిడి నర్సిరెడ్డి, ఎదుదొడ్ల కృష్ణ రెడ్డి రూ.55000/-  విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకు కంఠ మహేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నామని గ్రామ ఆలయ కమిటీ సభ్యులు, గౌడ సంఘం వారు తెలిపారు.
TG: త్వరలో దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ: మంత్రి సీతక్క
HYD: త్వరలోనే దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలో దివ్యాంగుల జాబ్ పోర్టల్ ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు.

ఇందిరమ్మ ఇళ్ళు, ఇతర పథకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఉంటాయని తెలిపారు.

దివ్యాంగుల పరికరాల కోసం ప్రభుత్వం రూ.50 కోట్లు ఖర్చు చేసినట్లు ఈ సందర్భంగా మంత్రి సీతక్క వివరించారు.
NLG: ఫీల్డ్ అసిస్టెంట్ బిచ్చు నాయక్ మృతికి సంతాపం తెలిపిన ఎంపిడిఓ, కార్యాలయ ఉద్యోగులు
నల్లగొండ:
మర్రిగూడ మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో కొండూరు ఫీల్డ్ అసిస్టెంట్ బిచ్చు నాయక్ మృతికి సంతాపం తెలుపుతూ సంతాప సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా బిచ్చు నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ, ఎంపీఓ, ఉపాధిహామీ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.

కాగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కొండూరు ఫీల్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న 35 సంవత్సరాల వయసు గల ఫీల్డ్ అసిస్టెంట్ బిచ్చు నాయక్ ఇటీవల మర్రిగూడ మండల కేంద్రానికి సమీపంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం విదితమే.