నాంపల్లి: సన్నరకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సింగిల్ విండో చైర్మన్
నల్లగొండ జిల్లా:
నాంపల్లి మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సన్న రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం సింగిల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని మార్కెట్ యార్డ్ కు తెచ్చేటప్పుడు తేమ శాతం 17% ఉండేటట్టు చూసుకోవాలని,తాలు లేకుండా కల్లాల వద్దనే వరి ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకురావాలని రైతులను కోరారు.

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఉంటుందని తెలిపారు. రైతులందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు.అదేవిధంగా  దళారులను నమ్మి  మోసపోవద్దని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో తహసిల్దార్, అగ్రికల్చర్ ఏఓ, మానేటింగ్ ఆఫీసర్ మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డీ, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, పెద్దిరెడ్డి సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్ చంద్రారెడ్డి, పానగంటి వెంకటయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అంజాచారి, పూల గిరి, పిఎసిఎస్ సిబ్బంది, రైతులు శేఖరు, నరసింహ, కిషన్, రాములు, శ్రీను, యాదమ్మ, రాజు, శివ, తదితరులు పాల్గొన్నారు.
NLG: డీఎస్సీ లో ఎంపికైన అభ్యర్థులకు రేపు కౌన్సెలింగ్
డీఎస్సీ-2024 ఎంపికైన అభ్యర్థులకు మంగళవారం నల్లగొండ డైట్ కళాశాలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి తెలిపారు. డీఎస్సీ లో ఎంపికైన అభ్యర్థులు లేటెస్ట్ రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒరిజినల్ సర్టిఫికెట్ లతో హాజరుకావాలని సూచించారు.

ఇటీవల బదిలీ అయ్యి.. అదే స్థానంలో కొనసాగుతున్న ఉపాధ్యాయులు, ఈనెల 16 న బదిలీ అయిన స్థానంలో రిపోర్ట్ చేయాలని కోరారు.
NLG: శ్రీ కంఠ మహేశ్వర స్వామి దేవాలయం నిర్మాణానికి విరాళం
నల్లగొండ జిల్లా:
మర్రిగూడెం మండలం, యరగండ్లపల్లి గ్రామానికి చెందిన శ్రీ కంఠ మహేశ్వర స్వామి దేవాలయం నిర్మాణానికి ఖర్చుల నిమిత్తం యరగండ్లపల్లి గ్రామానికి  చెందిన రామదాసు శ్రీనివాస్ రూ.10,000/- మరియు పులి మామిడి నర్సిరెడ్డి, ఎదుదొడ్ల కృష్ణ రెడ్డి రూ.55000/-  విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకు కంఠ మహేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నామని గ్రామ ఆలయ కమిటీ సభ్యులు, గౌడ సంఘం వారు తెలిపారు.
TG: త్వరలో దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ: మంత్రి సీతక్క
HYD: త్వరలోనే దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలో దివ్యాంగుల జాబ్ పోర్టల్ ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు.

ఇందిరమ్మ ఇళ్ళు, ఇతర పథకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఉంటాయని తెలిపారు.

దివ్యాంగుల పరికరాల కోసం ప్రభుత్వం రూ.50 కోట్లు ఖర్చు చేసినట్లు ఈ సందర్భంగా మంత్రి సీతక్క వివరించారు.
NLG: ఫీల్డ్ అసిస్టెంట్ బిచ్చు నాయక్ మృతికి సంతాపం తెలిపిన ఎంపిడిఓ, కార్యాలయ ఉద్యోగులు
నల్లగొండ:
మర్రిగూడ మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో కొండూరు ఫీల్డ్ అసిస్టెంట్ బిచ్చు నాయక్ మృతికి సంతాపం తెలుపుతూ సంతాప సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా బిచ్చు నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ, ఎంపీఓ, ఉపాధిహామీ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.

కాగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కొండూరు ఫీల్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న 35 సంవత్సరాల వయసు గల ఫీల్డ్ అసిస్టెంట్ బిచ్చు నాయక్ ఇటీవల మర్రిగూడ మండల కేంద్రానికి సమీపంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం విదితమే.


విజయదశమి సందర్భంగా లెంకలపల్లిలో అలరించిన నృత్యాలు-2
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో విజయదశమి సందర్భంగా మహిళలు, చిన్నారులు అందరూ ఒక చోటుకు చేరి.. ఆట పాటలతో ఆనందంగా నృత్యాలు చేశారు. ఈ నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

విజయదశమి సందర్భంగా లెంకలపల్లిలో అలరించిన నృత్యాలు-1
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో విజయదశమి సందర్భంగా మహిళలు, చిన్నారులు అందరూ ఒక చోటుకు చేరి.. ఆట పాటలతో సంతోషంగా నృత్యాలు చేశారు. ఈ నృత్యాలు పలువురి ఆకట్టుకున్నాయి.

NLG: నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అయ్యప్ప దేవాలయంలో అన్నదానం
నల్గొండ పట్టణంలోని మణికంఠ నగర్ అయ్యప్ప దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సందర్బంగా 9 రోజులు దుర్గా మాతకు నిర్వాహకుల ఆధ్వర్యంలో  ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈరోజు నాగుల శీను జ్యోతి దంపతులు దాతల సహకారంతో భవాని మతాలకు అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. అదేవిధంగా లెప్రసీ కాలనీలో ఉన్న నిరుపేద ప్రజలకు అన్నదానం నిర్వహించారు.
NLG: గుర్రంపోడు మండలంలో అర్ధరాత్రి వైన్ షాపులో చోరీ..
నల్లగొండ జిల్లా:
గుర్రంపోడు మండల కేంద్రంలోని ఓ మద్యం దుకాణంలో శనివారం చోరీ జరిగింది. ఈరోజు ఉదయం వైన్స్ షాపు తెరవడానికి వచ్చిన నిర్వాహకులు మద్యం దుకాణం తెరిచి చూడగా దొంగతనం జరిగినట్లుగా గుర్తించారు.

శనివారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి దుకాణం పైకప్పు రేకులు పగులగొట్టి లోనికి ప్రవేశించి గల్లా పెట్టెలో ఉన్న సుమారు రూ.12 లక్షలు ఎత్తుకెల్లినట్లు సీసీ కెమెరా ఫుటేజ్‌ ద్వారా గుర్తించారు.

NLG: తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా తరాల పరమేశ్ యాదవ్
తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ టిఆర్టిఎఫ్ నల్లగొండ జిల్లా నూతన ప్రధాన కార్యదర్శిగా తరాల పరమేశ్ యాదవ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి తెలిపారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని జిల్లా శాఖ కార్యాలయంలో జరిగిన టిఆర్టిఎఫ్ జిల్లా అత్యవసర సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఏకగ్రీవంగా నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తరాల పరమేశ్ యాదవ్ కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మారెడ్డి అంజిరెడ్డి మాట్లాడుతూ.. 80 సంవత్సరాల నుండి అనగా స్థాపించిన 1944 వ సంవత్సరం నుండి ఉపాధ్యాయుల శ్రేయస్సుకై మరియు సమస్యల పరిష్కారానికి పాటుపడిన సంఘం టిఆర్టిఎఫ్ అని అన్నారు.

టిఆర్టిఎఫ్ సంఘం భవిష్యత్తులోనూ ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి, ఉపాధ్యాయ ఉద్యోగులకు పెండింగ్ డీ ఏ లు, బిల్లులు మరియు మెరుగైన పీఆర్సీ ఇప్పించేందుకు కట్టుబడి ఉందని అన్నారు.

జిల్లా ప్రధాన కార్యదర్శిగా తరాల పరమేశ్ యాదవ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో జిల్లా ప్రధాన కార్యదర్శిగా సంఘానికి, ఉపాధ్యాయులకు సేవ చేసే అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి, రాష్ట్ర మరియు జిల్లా బాధ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. నల్లగొండ జిల్లాలో ఉపాధ్యాయులకు మెరుగైన సేవలు అందించుట ద్వారా జిల్లాలో సంఘ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.

TRTF జిల్లా అధ్యక్షులు నిమ్మనగోటి జనార్ధన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పూర్వ రాష్ట్ర అధ్యక్షులు ముప్పిడి మల్లయ్య, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి తంతెనపల్లి సైదులు, రాష్ట్ర కార్యదర్శి బి.సూర్యనారాయణ, దొడ్డేని సాయిబాబు,జలంధర్ రెడ్డి, జానకిరెడ్డి, అర్రూరి జానయ్య, ఎల్.నగేష్, బి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

TRTF జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తరాల పరమేశ్ యాదవ్ కు ప్రపంచ ఉపాధ్యాయ సమాఖ్య సెక్రటరీ జనరల్ ఎం.వీ. గోనారెడ్డి, నకిరేకల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.బెల్లి యాదయ్య, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చక్రహరి రామరాజు, నేలపట్ల సత్యనారాయణ, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు ఓలి సమీర్ కుమార్, బీసీటీయూ జిల్లా అధ్యక్షులు కొన్నె శంకర్ గౌడ్, వైద్యుల సత్యనారాయణ, దూదిగామ స్వామి, లక్ష్మయ్య, కృష్ణ, నర్సింహ, గుండెబోయిన జానయ్య, బాతుక శ్రీనివాస్, సోమనబోయిన లింగస్వామి, బెల్లి నాగరాజు, లక్ష్మీనారాయణ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.