NLG: అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న మాల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నక్క శ్రీను యాదవ్
నల్లగొండ జిల్లా:
మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో గాంధీ సెంటర్ వద్ద దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా,ఇవాళ 9వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నక్క శీను యాదవ్ హాజరై మాట్లాడుతూ.. అమ్మవారు ఆశీస్సులతో గ్రామ ప్రజలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.

లెంకలపల్లి మాజీ సర్పంచ్ పాక నగేష్ యాదవ్ మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీర్వాదాలు గ్రామ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
NLG: మర్రిగూడ మండలంలో ఎస్జీటీ టీచర్ ఉద్యోగం సాధించిన వారికి సన్మానం
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం:
యరగండ్లపల్లి గ్రామంలో ఎస్జిటి టీచర్ ఉద్యోగాలు సాధించి నియామక పత్రాలు అందుకున్న ఆవంచల దర్శన్, బచ్చనగోని పుష్పలత లను, వారి తల్లిదండ్రులను ఇంటి వద్ద శుక్రవారం సామాజిక కార్యకర్త, యువజన నాయకుడు వల్లంల సంతోష్ యాదవ్ శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇద్దరు అభ్యర్థులు ఇటీవల ఎస్జిటి ఉద్యోగాలను సాధించి గ్రామానికి గొప్ప పేరు తెచ్చినందుకు అభినందిస్తున్నానని అన్నారు. దర్శన్, పుష్పలత లను ఆదర్శంగా తీసుకొని గ్రామంలో ఉన్న మిగతా విద్యార్థులు, నిరుద్యోగులు ఉన్నత ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు, గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యూత్ నాయకులు పాల్గొన్నారు.
NLG: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల మేరకు వీధిలైట్లు ఏర్పాటు

నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండలం, చర్లగూడెం ముప్పు గ్రామంలో వీధిలైట్లు లేక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న, నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెన్నమనేని రవీందర్ రావు.. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగినది. ఎమ్మెల్యే సూచనల మేరకు రవీందర్ రావు ఇవాళ చర్లగూడెం లో తక్షణమే వీధిలైట్లు ఫిట్ చేయించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరియు వెన్నమనేని రవీందర్ రావు లకు ధన్యవాదములు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.
యరగండ్లపల్లి: భక్తిశ్రద్ధలతో అమ్మవారి పూజలు.. అనంతరం అన్న ప్రసాదం
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండలంలోని యరగండ్లపల్లి గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ వరసిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపం వద్ద గురువారం అమ్మవారు  దుర్గామాత అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త, యువజన నాయకుడు వల్లంల సంతోష్ యాదవ్-విమల దంపతులు, దేవుని లక్ష్మయ్య యాదవ్-యాదమ్మ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పూజ కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. తదుపరి ఉత్సవ కమిటీ వారు అన్నదాత సంతోష్ యాదవ్ ను  ఘనంగా సన్మానించారు.
SAD: పిడుగుపాటు గురై ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు
నల్లగొండ జిల్లా:
దామరచర్ల మండలం, వీర్లపాలెం గ్రామంలో గురువారం భారీ వర్షం కురిసింది. పిడుగుపాటు కు గురై ఒకరు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఇదే ఘటనలో మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. వారిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బీసీ సంక్షేమ సంఘం నేతలు
HYD: తెలంగాణలో బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఈ రోజు బీసీ సంక్షేమ సంఘం నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సంఘం నాయకులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ని, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ను కలిసి ప్రభుత్వ నిర్ణయంపై వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీహరి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు తో పాటు పలువురు బీసీ సంక్షేమ సంఘం ఉన్నారు.
NLG: ఘనంగా మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ జన్మదిన వేడుకలు
నల్లగొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం:
హాలియా పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ నివాసంలో ఆయన జన్మదిన వేడుకలు  నియోజకవర్గ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య భగత్ కేక్ కట్ చేశారు. అనంతరం రక్తదాన శిభిరం నిర్వహించి, మొక్కను నాటారు. వారు మాట్లాడుతూ.. నా పై అభిమానంతో విచ్చేసి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గం లోని నాయకులకు, ప్రజా ప్రతినిధులకు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ ధన్యవాదములు అని తెలిపారు. మీ అభిమానం, ఆశీస్సులు, మీరు చూపిస్తున్న ప్రేమ ఎల్లప్పుడు నాపై ఇలాగే ఉండాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.అనంతరం నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
NLG: నూజివీడు సీడ్స్ వారి ఆధ్య పత్తి పంట పై క్షేత్ర ప్రదర్శన
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండలం, లెంకలపల్లి గ్రామంలో నూజివీడు సీడ్స్ వారి ఆధ్య (NCS - 1134) అనే పత్తి రకం పై గురువారం క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పగిళ్ళ అశోక్ అనే రైతు సాగుచేసిన నూజివీడు సీడ్స్ వారి ఆధ్య (NCS - 1134) అనే పత్తి పంటను పరిశీలించారు. అనంతరం TSL సైదులు మాట్లాడుతూ.. ఆధ్య అనే పత్తి వంగడం అన్ని రకాల చీడ పీడలను తట్టు కొనే శక్తి కలిగి వుంటుందని, ఈ రకం పత్తి వంగడం అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుందని రైతులకు వివరించారు.

అదేవిధంగా గులాబి రంగు పురుగు ఉదృతి నుండీ తప్పించుకొని మొదటి కోత లోనే 80% పత్తి తీసుకోవడానికి అనుకూలంగా ఉండి అధిక దిగుబడి అందిస్తుందని తెలిపారు. అధిక మొక్కల సాంద్రత పద్ధతికి అనుకూలంగా ఉంటుందని అన్నారు.

స్థానిక డిస్ట్రిబ్యూటర్ శ్రీకాంత్, పూల యాదయ్య లోకల్ డీలర్, MO సతీష్ కుమార్ రెడ్డి, వివిధ గ్రామాల నుండి దాదాపు 110 మంది రైతులు పాల్గోన్నారు.
NLG: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్లగొండ:
రైతులకు దసరా కానుకగా రాష్ట్రంలోనే మొట్ట మొదటి వరి ధాన్యం సేకరణ కేంద్రం నా నల్గొండ లో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

నల్లగొండ పట్టణంలోని ఆర్జాలభావి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేపటి నుంచి ధాన్యం సేకరణ వేగంగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరం అయితే రేపే సగం ధాన్యం కొనుగోలు చేయాలని సెంటర్ నిర్వాహకులకు  చెప్పారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి మూడు రోజుల్లోగా డబ్బులు చెల్లిస్తామని అన్నారు. జిల్లాలో 53 శాతం సన్న రకాలు, 47 శాతం దొడ్డు రకం ధాన్యం పండుతుందని, అన్నింటికి ఎంఎస్పీ చెల్లించి కొనుగోలు చేస్తున్నామని, అంతేకాదు సన్నాలకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
లెంకలపల్లి: సరస్వతి మాతగా దర్శనం ఇచ్చన అమ్మవారు
నల్లగొండ జిల్లా:
మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో బుధవారం శ్రీ శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో  గాంధీ సెంటర్లో ఏర్పాటుచేసిన శ్రీ దుర్గాదేవి మండపం వద్ద చాపల శ్రీను దంపతులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఇవాళ అమ్మవారు శ్రీ సరస్వతి మాతగా దర్శనం ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో చిన్నారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.