NLG: నూజివీడు సీడ్స్ వారి ఆధ్య పత్తి పంట పై క్షేత్ర ప్రదర్శన
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండలం, లెంకలపల్లి గ్రామంలో నూజివీడు సీడ్స్ వారి ఆధ్య (NCS - 1134) అనే పత్తి రకం పై గురువారం క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పగిళ్ళ అశోక్ అనే రైతు సాగుచేసిన నూజివీడు సీడ్స్ వారి ఆధ్య (NCS - 1134) అనే పత్తి పంటను పరిశీలించారు. అనంతరం TSL సైదులు మాట్లాడుతూ.. ఆధ్య అనే పత్తి వంగడం అన్ని రకాల చీడ పీడలను తట్టు కొనే శక్తి కలిగి వుంటుందని, ఈ రకం పత్తి వంగడం అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుందని రైతులకు వివరించారు.

అదేవిధంగా గులాబి రంగు పురుగు ఉదృతి నుండీ తప్పించుకొని మొదటి కోత లోనే 80% పత్తి తీసుకోవడానికి అనుకూలంగా ఉండి అధిక దిగుబడి అందిస్తుందని తెలిపారు. అధిక మొక్కల సాంద్రత పద్ధతికి అనుకూలంగా ఉంటుందని అన్నారు.

స్థానిక డిస్ట్రిబ్యూటర్ శ్రీకాంత్, పూల యాదయ్య లోకల్ డీలర్, MO సతీష్ కుమార్ రెడ్డి, వివిధ గ్రామాల నుండి దాదాపు 110 మంది రైతులు పాల్గోన్నారు.
NLG: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్లగొండ:
రైతులకు దసరా కానుకగా రాష్ట్రంలోనే మొట్ట మొదటి వరి ధాన్యం సేకరణ కేంద్రం నా నల్గొండ లో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

నల్లగొండ పట్టణంలోని ఆర్జాలభావి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేపటి నుంచి ధాన్యం సేకరణ వేగంగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరం అయితే రేపే సగం ధాన్యం కొనుగోలు చేయాలని సెంటర్ నిర్వాహకులకు  చెప్పారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి మూడు రోజుల్లోగా డబ్బులు చెల్లిస్తామని అన్నారు. జిల్లాలో 53 శాతం సన్న రకాలు, 47 శాతం దొడ్డు రకం ధాన్యం పండుతుందని, అన్నింటికి ఎంఎస్పీ చెల్లించి కొనుగోలు చేస్తున్నామని, అంతేకాదు సన్నాలకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
లెంకలపల్లి: సరస్వతి మాతగా దర్శనం ఇచ్చన అమ్మవారు
నల్లగొండ జిల్లా:
మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో బుధవారం శ్రీ శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో  గాంధీ సెంటర్లో ఏర్పాటుచేసిన శ్రీ దుర్గాదేవి మండపం వద్ద చాపల శ్రీను దంపతులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఇవాళ అమ్మవారు శ్రీ సరస్వతి మాతగా దర్శనం ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో చిన్నారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
లెంకలపల్లి: సరస్వతి మాతగా దర్శనం ఇచ్చన అమ్మవారు
నల్లగొండ జిల్లా:
మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో బుధవారం శ్రీ శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో  గాంధీ సెంటర్లో ఏర్పాటుచేసిన శ్రీ దుర్గాదేవి మండపం వద్ద చాపల శ్రీను దంపతులు అమ్మవారికి పూజలు నిర్వహించారు.

ఇవాళ అమ్మవారు శ్రీ సరస్వతి మాతగా దర్శనం ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో చిన్నారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
NLG: భారత ఆహార సంస్థ జిల్లా కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
నల్గొండ: భారత ఆహార సంస్థ జిల్లా కార్యాలయంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు ఆటపాటలతో తెలంగాణ పూల పండుగ బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. బతుకమ్మ పండుగ విశిష్టతను తెలిపేలా రంగురంగుల ముగ్గులతో సంస్థ ప్రాంగణాన్ని అలంకరించి, సంప్రదాయబద్ధంగా వేడుకను నిర్వహించారు. మినీ ఇండియా ను ప్రతిబింబించేలా  భారతీయ సంస్కృతిలోని వైవిధ్యాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంస్థ ఇన్చార్జి డివిజనల్ మేనేజర్ హీరా సింగ్ రావత్, AGM (QC) డా. రాఘవేంద్ర సింగ్, మహిళా ఉద్యోగినుల ప్రతినిధి కృష్ణవేణి, సీనియర్ అధికారులు కే ఎన్ కే ప్రసాద్, రఘుపతి, బిల్లా శ్రీనివాసరావు, కే కే షా, రవి కుమార్, బి.రాము, తదితరులు పాల్గొన్నారు.
NLG: యరగండ్లపల్లి గ్రామంలో సిమెంట్ బెంచీ ల ఏర్పాటు
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం: యరగండ్లపల్లి గ్రామ అభివృద్దే తన లక్ష్యమని సామాజిక కార్యకర్త, యువజన నాయకుడు వల్లం ల సంతోష్ యాదవ్ అన్నారు. బుధవారం మండలంలోని యరగండ్లపల్లి గ్రామంలో ప్రధాన కూడళ్ళు, దేవాలయాల ఆవరణలో 50 సిమెంట్ బెంచీ లను ఆయన తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేయించారు.

ఈ సందర్భంగా సంతోష్ యాదవ్ మాట్లాడుతూ... గ్రామంలో సేవా కార్యక్రమాలు, యువతను వివిధ రంగాలలో ప్రోత్సహించడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని అన్నారు. గ్రామస్తుల సూచన మేరకు గ్రామస్తులు కూర్చునేందుకు సౌకర్యవంతంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు గ్రామస్తులు, యువత సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంటు జగదీశ్వర్, మాజీ ప్రజా ప్రతినిధులు, సింగల్ విండో డైరెక్టర్లు, మాజీ వార్డు సభ్యులు, యువకులు పాల్గొన్నారు.
రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కించుకున్న నారాయణపూర్ ఉపాధ్యాయులు
యాదాద్రి జిల్లా:
నారాయణపూర్ మండలం నుండి PRTU TS రాష్ట్ర శాఖకు నలుగురు ఉపాధ్యాయులు ఎన్నిక కావడం పట్ల మండల అధ్యక్షులు నంద్యాల చలపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి దోర్నాల రాము హర్షం వ్యక్తం చేశారు.

హైదరాబాదులో జరిగిన 35 వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో   నారాయణపూర్ మండలం నుండి అసోసియేట్ అధ్యక్షులుగా అట్కూరి హరికిషన్ రెడ్డి, యగ్గడి శ్రీనివాస్, కాకులారాపు యాది రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బోడో ఉపేందర్ ఎన్నికైనట్లు ఆ సంఘం రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు ఒక ప్రకటనలో తెలియజేశారు. వీరి ఎన్నిక పట్ల పలువురు సీనియర్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

ఎన్నికకు సహకరించిన రాష్ట్ర, జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులకు మండల శాఖ నుండి కృతజ్ఞతలు తెలియజేశారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు

నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం,

కొండూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉడుతల యాదయ్య గారి తండ్రి ఉడుతల పెద్దయ్య గారు అనారోగ్యంతో చనిపోయారు.

నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెన్నమనేని రవీందర్ రావు, మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ మేతరీ యాదయ్య, మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జమ్ముల వెంకటేష్ గౌడ్ లు ఇవాళ మృతుడి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జాల వెంకటయ్య, పిఏసిఎస్ డైరెక్టర్ బాయికాడ కొండల్, ఉడుగు శ్రీను, కొలుకులపల్లి జంగయ్య, ఎడ్ల మల్లేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

NLG: ధర్వేశిపురంలో సరస్వతీ దేవిగా రేణుక ఎల్లమ్మ తల్లి
నల్లగొండ జిల్లా:
కనగల్ మండలం ధర్వేశిపురం గ్రామంలో, కొలువై ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారు దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం ఏడో రోజు శ్రీ సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. విద్యార్థులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అర్చకులు పూజలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
NLG: ఘనంగా సాగర్ ఎమ్మెల్యే జయవీర్ జన్మదిన వేడుకలు

నల్లగొండ జిల్లా:

నాగార్జునసాగర్: మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి నివాసంలో స్థానిక శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం తిరుమలగిరి సాగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయనకు గిరిజన సంప్రదాయంగా రుమాలు ధరించి, బోకే ఇచ్చి, శాలువా కప్పి సన్మానించారు. అనంతరం కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం సాగర్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ కలసాని చంద్రశేఖర్, మండల అధ్యక్షులు కృష్ణ నాయక్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు మేరావత్ మునినాయక్, యువజన మండల అధ్యక్షులు బొమ్ము సాయి, ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు సపావత్ అనిల్ చౌవాన్, మండల నాయకులు పాపి రెడ్డి, సరిరాం, శ్రీనునాయక్,నారాయణ రెడ్డి, నగేష్ నాయక్, రాములు, సర్దార్, శంకర్, శ్రవణ్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కస్నా, అక్రమ్, గోపి, ముని నాయక్,నాగ నాయక్, రమేష్ నాయక్, దోతుల శ్రీను నరేష్ నాయక్, రాజోలు, శ్రీధర్ రెడ్డి, పాండు నాయక్, తదితరులు పాల్గొన్నారు.