రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కించుకున్న నారాయణపూర్ ఉపాధ్యాయులు
యాదాద్రి జిల్లా:
నారాయణపూర్ మండలం నుండి PRTU TS రాష్ట్ర శాఖకు నలుగురు ఉపాధ్యాయులు ఎన్నిక కావడం పట్ల మండల అధ్యక్షులు నంద్యాల చలపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి దోర్నాల రాము హర్షం వ్యక్తం చేశారు.

హైదరాబాదులో జరిగిన 35 వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో   నారాయణపూర్ మండలం నుండి అసోసియేట్ అధ్యక్షులుగా అట్కూరి హరికిషన్ రెడ్డి, యగ్గడి శ్రీనివాస్, కాకులారాపు యాది రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బోడో ఉపేందర్ ఎన్నికైనట్లు ఆ సంఘం రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు ఒక ప్రకటనలో తెలియజేశారు. వీరి ఎన్నిక పట్ల పలువురు సీనియర్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

ఎన్నికకు సహకరించిన రాష్ట్ర, జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులకు మండల శాఖ నుండి కృతజ్ఞతలు తెలియజేశారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు

నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం,

కొండూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉడుతల యాదయ్య గారి తండ్రి ఉడుతల పెద్దయ్య గారు అనారోగ్యంతో చనిపోయారు.

నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెన్నమనేని రవీందర్ రావు, మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ మేతరీ యాదయ్య, మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జమ్ముల వెంకటేష్ గౌడ్ లు ఇవాళ మృతుడి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జాల వెంకటయ్య, పిఏసిఎస్ డైరెక్టర్ బాయికాడ కొండల్, ఉడుగు శ్రీను, కొలుకులపల్లి జంగయ్య, ఎడ్ల మల్లేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

NLG: ధర్వేశిపురంలో సరస్వతీ దేవిగా రేణుక ఎల్లమ్మ తల్లి
నల్లగొండ జిల్లా:
కనగల్ మండలం ధర్వేశిపురం గ్రామంలో, కొలువై ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారు దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం ఏడో రోజు శ్రీ సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. విద్యార్థులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అర్చకులు పూజలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
NLG: ఘనంగా సాగర్ ఎమ్మెల్యే జయవీర్ జన్మదిన వేడుకలు

నల్లగొండ జిల్లా:

నాగార్జునసాగర్: మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి నివాసంలో స్థానిక శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం తిరుమలగిరి సాగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయనకు గిరిజన సంప్రదాయంగా రుమాలు ధరించి, బోకే ఇచ్చి, శాలువా కప్పి సన్మానించారు. అనంతరం కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం సాగర్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ కలసాని చంద్రశేఖర్, మండల అధ్యక్షులు కృష్ణ నాయక్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు మేరావత్ మునినాయక్, యువజన మండల అధ్యక్షులు బొమ్ము సాయి, ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు సపావత్ అనిల్ చౌవాన్, మండల నాయకులు పాపి రెడ్డి, సరిరాం, శ్రీనునాయక్,నారాయణ రెడ్డి, నగేష్ నాయక్, రాములు, సర్దార్, శంకర్, శ్రవణ్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కస్నా, అక్రమ్, గోపి, ముని నాయక్,నాగ నాయక్, రమేష్ నాయక్, దోతుల శ్రీను నరేష్ నాయక్, రాజోలు, శ్రీధర్ రెడ్డి, పాండు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

NLG: సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: ఎస్పి శరత్ చంద్ర పవార్
నల్లగొండ: సంస్కృతి సంప్రదాయాలకు పత్రిక బతుకమ్మ పండుగని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలను ఎస్పీ వారి సతీమణితో కలిసి ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ.. వివిధ రకాల పూలతో బతుకమ్మను అద్భుతంగా పేర్చి బతుకమ్మ పండుగను నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. పది రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించడం మహిళలకు ఎంతో అద్భుతమైన అనుభూతిని ఇస్తుందన్నారు. మహిళలంతా ఒక్కచోట చేరి బతుకమ్మ పండుగ ఉత్సాహంగా జరుపుకోవడం వారిలో చైతన్యాన్ని పెంపొందిచడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ పోలీస్ శాఖ తరుపున బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ  కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి రాములు నాయక్,  ఎస్బీ డీఎస్పీ రమేష్, నల్గొండ డీఎస్పీ శివ రాం రెడ్డి, సైబర్ క్రైమ్ డిఎస్పి లక్ష్మీనారాయణ, ఏఓ శ్రీనివాస్, సుపర్డెంట్ సబిత, సిఐలు మహా లక్ష్మయ్య, రాజశేఖర్ రెడ్డి,ఆర్ఐలు సురప్ప నాయుడు, సంతోష్, శ్రీనివాస్, నరేష్, మహిళా యస్.ఐలు శ్రావణి,మమత, డీపీఓ మహిళా సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
TG: ఎస్సీ వర్గీకరణ అమలుకై ఏకవ్యక్తి న్యాయకమిషన్
HYD: ఎస్సీ వర్గీకరణ అమలుకై ఏకవ్యక్తి కమిషన్ ఏర్పాటు చెయ్యాలని మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కమిషన్ నియామకంలో అడ్వకేట్ జెనరల్ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఉప సంఘం తీర్మానించింది. అంతే కాకుండా ఏకవ్యక్తి కమిషన్ చట్టపరంగా పటిష్టంగా ఉండడంతో పాటు కమిషన్ సిఫారసులను అమలులోకి తీసుకొస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఉండేలా నియామకం జరిగేలా చూడాలని ఉపసంఘం ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది.

సుప్రీంకోర్టు తీర్పు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకై రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖామంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, లోకసభ సభ్యులు మల్లు రవి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ తెలంగాణా సచివాలయంలో నాలుగో సారి మంత్రివర్గ ఉప సంఘం సమావేశం అయ్యింది. మంత్రులు దామోదర్ రాజనరసింహా, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సితక్క లతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అడ్వకేట్ జెనరల్ సుదర్శన్ రెడ్డి, బి.సి కమిషన్ చైర్మన్ నిరంజన్, లా సెక్రటరీ తిరుపతి, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సి వర్గీకరణ విషయంలో ఇప్పటికే అధికారుల బృందం తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలలో పర్యటించి అధ్యయనం చేసిందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఉప కులాల వర్గీకరణ ఉంటుందని.. అందుకు సంబంధించిన పూర్తి సమాచారం, ఉద్యోగ నియామకాలతో సహా నివేదికను రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణ పై ప్రజాభిప్రాయ సేకరణకు గాను మంత్రివర్గ ఉప సంఘం జిల్లాల వారీగా పర్యటించనున్నట్లు ఆయన వెల్లడించారు.

మంత్రి సితక్క మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అధ్యయనాన్ని టైంబౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని పూర్తి చెయ్యాలన్నారు. అదే విదంగా విధంగా యుద్ధప్రాతిపదికన బిసిల సాంఘిక ఆర్థిక గణన చేపట్టాలని సూచించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చెయ్యాలన్నారు

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ యస్.సి అభివృద్ధి శాఖా ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్, ఐ.ఏ.యస్ అధికారులు బుర్రా వెంకటేశం, లోకేష్ కుమార్, దానకిశోర్, టి.కే.శ్రీదేవి, తదితరులు  పాల్గొన్నారు.
NLG: రాకపోకలకు ఇబ్బందికరంగా ఉన్న చెట్ల తొలగింపు
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: మండలం నుండి చర్లగూడెం, వెంకేపల్లి, కుదాబక్షుపల్లి గ్రామాల మీదగా ఉన్న రోడ్డుకు ఇరువైపుల రవాణా కు ఇబ్బందికరంగా పెరిగిన చెట్లను, ఇవాళ జెసిబి సహాయంతో  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెన్నెమనేని రవీందర్ రావు తొలగించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు, సూచనల మేరకు.. దసరా సందర్భంగా  ప్రయాణికుల రాకపోకలకు  ఇబ్బందికరంగా రోడ్డు వెంట ఉన్న చెట్లను తొలగించినట్లు రవీందర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ప్రయాణికులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

#SB NEWS NLG
నకిరేకల్: ఎమ్మెల్యే వేముల కు ఘన స్వాగతం పలికిన మున్సిపల్ చైర్మన్
నల్లగొండ జిల్లా:
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గత వారం రోజుల క్రితం విదేశీ పర్యటన కు వెళ్లి ఇవాళ స్వదేశానికి విచ్చేశారు.

ఈ  సందర్భంగా  మంగళవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ చెవుగోని రజిత శ్రీనివాస్ గౌడ్  మరియు పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
NLG: మాల్ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం మహోత్సవంలో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే

నల్లగొండ జిల్లా: చింతపల్లి మండలం లోని మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి, వైస్ చైర్మన్ నక్క శ్రీను మరియు పాలకవర్గం సభ్యులు గోని జంగయ్య, రామవత్ రమేష్, ఎండి ముషవర్, జమ్ముల వెంకటయ్య, గంట మల్లయ్య, రమావత్ రమేష్, రాగివని అంజాచారి, కందిశెట్టి వెంకటేష్, మారుపాకుల మమత, పూల యాదగిరి, మేకల జగన్ రెడ్డి, ఊర శ్రీనివాస్, లింగంపల్లి వెంకటేష్ ల ప్రమాణ స్వీకారం మహోత్సవం సోమవారం మాల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ముఖ్యఅతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఏ అవసరం ఉన్న తమ సహాయ సహకారాలు నూతన మార్కెట్ కమిటీకి ఉంటాయని మంత్రి తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులను త్వరలో పూర్తిచేసి మునుగోడు దేవరకొండ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో డిసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్, డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రవీందర్ రావు, నాంపల్లి మాజీ జెడ్పిటిసి ఏవి రెడ్డి, మర్రిగూడ మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య, మర్రిగూడెం మండల పార్టీ అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్, నాంపల్లి మండల పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పల్ల వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే యాదగిరి రావు, మర్రిగూడెం మాజీ జెడ్పిటిసి పాశం సురేందర్ రెడ్డి, ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్ నిరంజన్ రెడ్డి, చింతపల్లి నాంపల్లి మర్రిగూడ మండలాల ఇతర నాయకులు, అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

NLG: మారుమూల గ్రామాల్లో సైతం సామాజిక కార్యక్రమాలు విస్తరిస్తాం: వై.ఆర్.పి. ఫౌండేషన్
నల్లగొండ:
వై.ఆర్.పి. ఫౌండేషన్ వ్యవస్థాపకులు వైష్ణోవి కన్స్ట్రక్షన్స్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎలిశాల రవి ప్రసాద్  వ్యక్తిగత పని నిమిత్తం నల్లగొండకు విచ్చేసిన సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు
బొమ్మపాల గిరిబాబు కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై వారు చర్చించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వై ఆర్ పి ఫౌండేషన్ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా సామాజిక ఆధ్యాత్మిక విద్యాపరంగా, క్రీడల పరంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామని, భవిష్యత్తులో కూడా మారుమూల గ్రామాల్లో సైతం సామాజిక కార్యక్రమాలను విస్తరిస్తామని, రాష్ట్ర జాతీయ క్రీడలను కూడా నిర్వహిస్తామని మరియు గ్రామీణ ప్రాంత యువతీ, యువకులకు మంచి అవకాశాలను కూడా కల్పిస్తామని రవి ప్రసాద్ తెలిపారు.