NLG: ప్రకృతి సమతుల్యతకు జీవసేంద్రియ వ్యవసాయమే శరణ్యం
నల్లగొండ జిల్లా:
అనుముల మండలం కట్టొరి అన్నారం గ్రామంలో కె.ఎన్.బయో సైన్సెస్ మరియు శ్రీ సత్యం వర్మీ బయో ఆర్గానిక్స్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో బుధవారం క్షేత్రస్థాయి ఆర్గానిక్ రైతు సదస్సును నిర్వహించారు.

ఈ సందర్భంగా పత్తి, మిర్చి, ఆయిల్ ఫామ్, బత్తాయి తోటల రైతులతో క్షేత్రస్థాయి సదస్సును నిర్వహించి రైతులకు ఆర్గానిక్ జీవ సంబంధిత ఎరువుల ప్రాముఖ్యతను కే.ఎన్. బయోసైన్సెస్ తెలంగాణ ఇన్చార్జ్
వై.రామానుజ సంపూర్ణంగా రైతులకు వివరిస్తూ అవగాహనను కల్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యం వర్మీ బయో ఆర్గానిక్ కన్సల్టెన్సీ  డైరెక్టర్స్ అక్కినపల్లి కిరణ్, వంగూరి భానుప్రసాద్, గ్రామ రైతులు జూలకంటి మాధవరెడ్డి, కట్ట నారాయణరెడ్డి, గోదల శ్రీనివాస్ రెడ్డి, బొమ్మపాల లింగయ్య, గార్లపాటి ఉషయ్య తదితరులు పాల్గొన్నారు.
NLG: ఆల్ ఇండియా బంజారా కార్మిక విభాగం ఆధ్వర్యంలో మహాత్ముడి జయంతి
నల్గొండ: ఈ రోజు జాతి పిత మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలోని రామగిరి సెంటర్ లో గల గాంధీ విగ్రహానికి, ఆల్ ఇండియా బంజారా కార్మిక విభాగం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కెలావత్ నగేష్ నాయక్ మాట్లాడుతూ..గాంధీ దేశం కోస ప్రాణాలు అర్పించిన గొప్ప వ్యక్తి  అన్నారు. వారు చూపిన మార్గంలో ముందుకు నడవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రాజశేఖర్, సాగర్ నాయక్, లక్ష్మయ్య, వినోద్ కుమార్, యాదయ్య పాల్గొన్నారు.
NLG: లెంకలపల్లి గాంధీ సెంటర్లో ఘనంగా గాంధీ జయంతి

అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి ని పురస్కరించుకొని మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో గాంధీ సెంటర్లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి గ్రామ ప్రజలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ భారతదేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించడమే కాకుండా, స్వాతంత్య్ర సమరయోధులు అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన నాయకుడు, అహింసా మార్గంలో భారతదేశ స్వాతంత్ర సాధనకు కీలక పాత్ర పోషించారని ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొన్న కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్
చౌటుప్పల్: మహిళలంతా ఐక్యతతో ప్రకృతిని పూజించే పూల పండుగ బతుకమ్మ అని ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి అన్నారు. మంగళవారం ట్రినిటీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొని బతుకమ్మ ఆడారు.

NLG: పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలి: కౌన్సిలర్ పూజిత వెంకటేశ్వర్లు
నల్గొండ: మున్సిపాలిటీ పరిధిలోని  34 వ వార్డులో వావ్ ప్రాజెక్ట్ వాలంటీర్ నాగుల జ్యోతి మంగళవారం ఇంటింటికి తిరుగుతూ చెత్తను వేరు చేయాలని చెత్తను వేసే బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వార్డు కౌన్సిలర్ ఆర్. పూజిత వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడుతూ.. తడి, పొడి చెత్త ను వేరు చేయాలని పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని వార్డ్ ప్రజలకు సూచించారు. అనంతరం బ్యాగుల పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పూజిత వెంకటేశ్వర్లు, వాలంటీర్ నాగుల జ్యోతి, స్థానిక ప్రజలు, పాల్గొన్నారు.
NLG: నాగార్జున కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
నల్లగొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో సాంస్కృతిక విభాగం మరియు మహిళా సాధికారికత విభాగం ఆధ్వర్యంలో మంగళవారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే పూలను పూజించే పండుగ ఇదొక్కటేనని తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్దలతో కోలుచుకునే పండుగ బతుకమ్మ అని అన్నారు. రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ మన సాంస్కృతిక ప్రతీక అని పేర్కొన్నారు.

కోటొక్క పూల పండుగ బతుకమ్మను ప్రతి యేటా జరుపుకునే తెలంగాణ ప్రజలు, ఆడబిడ్డలు.. పిల్లాపాపలతో, పాడి పంటలతో క్షేమంగా ఉండాలని అకాంక్షిoచారు. ఈ సందర్బంగా నిర్వహించిన బతుకమ్మ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

విద్యార్థినిలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ ఆడి పాడారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. బి. సురేష్ బాబు, అకాడమిక్ కోఆర్డినేటర్ డా. పరంగి రవికుమార్, సాంస్కృతిక విభాగం కన్వీనర్ డా.వి. శ్రీధర్, మహిళా సాధికారికత విభాగం అధ్యక్షులు డా. గంజి భాగ్యలక్ష్మి, అడ్మినిస్ట్రెటివ్ ఆఫీసర్ శ్రావణి, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ అధికారులు కోటయ్య, మల్లేశం, శివరాణి, సావిత్రి, అనిల్ కుమార్, వెంకట్ రెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి నాగరాజు, అధ్యాపకులు డా. కిరీటం, డా. ప్రసన్న కుమార్, సుధాకర్, వేణు, విద్యార్థులు పాల్గొన్నారు.
NLG: విద్యార్థులు ఉన్నత లక్ష్యం చేరాలంటే కష్టపడి చదవాలి: ఎంఈఓ
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండలం యరగండ్ల పల్లి గ్రామంలో, పి ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చెడు వ్యసనాలకు బానిస కావొద్దు అని విద్యార్థులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యం చేరాలంటే కష్టపడి చదవాలని, ఈరోజు శ్రమిస్తే రేపు భవిష్యత్ తరాలకు విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తారని అన్నారు.

2003 - 2004 పూర్వ విద్యార్థుల సహకారం తో NMMS స్కాలర్షిప్ కోసం విద్యార్థులు పోటీపడి టాలెంట్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి.. పాఠశాలకు, గురువులకు, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు.

విద్యార్థులు అవసరం కోసం
ఇక్కడ పాఠశాలలో పూర్వ విద్యార్థులుగా చదివి ఇప్పటి విద్యార్థుల కోసం బుక్స్ అదేవిధంగా పదవ తరగతి విద్యార్థులకు జామెంట్రీ బాక్స్ అందించడం అభినందనీయమని పూర్వ విద్యార్థులు అయిన 2003-2004 బ్యాచ్ విద్యార్థులు పాఠశాలను గుర్తుంచుకొని విద్యార్థుల కోసం ఇలాంటి ప్రోత్సాహాన్ని అందించడం అభినందనీయమని భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధి కోసం వారు మరింత తోడ్పాటు అందించాలని ఆయన కోరారు.

జ్ఞానం అనే ఆయుధంతో ఈ సమాజాన్ని జయించాలి: పాండురంగారావు
పి ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చేల్లం పాండు రంగారావు మాట్లాడుతూ.. పూర్వ విద్యార్థిగా నేను ఈ పాఠశాలలో చదువుకొని నా మిత్రుల సహకారంతో పాఠశాల విద్యార్థుల కోసం చేయూతనందించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు విష సంస్కృతికి దూరంగా ఉండి లు కల్చర్ కు దూరంగా ఉండి బుక్ కల్చర్ను అలవాటు చేసుకోవాలని తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశలను నమ్మకాలను వమ్ము చేయకుండా ఉండాలని, చెడు స్నేహాలను వీడి సమాజ మార్పు కోసం విద్యాభివృద్ధి దశలో జీవిత లక్ష్యాన్ని ఎంచుకొని.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, బాబాసాహెబ్ అంబేద్కర్, దేశం కోసం ప్రాణాలర్పించిన యువ కిశోరం భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకొని నవ సమాజ నిర్మాతలు గా, సమాజ మార్పు కోసం పాఠశాల అభివృద్ధితో పాటు గ్రామ అభివృద్ధి కోసం విద్యార్థి దశ నుండే మంచి ప్రయత్నం చేయాలని అన్నారు.

అర్ధ నగ్న చిత్రాలు, అశ్లీల దృశ్యాలు యువతను పెడదోవ పట్టించే విధంగా సినిమా కల్చర్, ర్యాగింగ్.. రోజురోజుకు పెరుగుతున్నాయని, వాటి అరికట్టడంలో యువత విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని, మనలను మనమే రక్షించుకోవాలని అందుకోసం జ్ఞానం అనే ఆయుధంతో ఈ సమాజాన్ని జయించాలని ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు కోరారు.

విద్యార్థులకు జామెంట్రీ బాక్స్, NMMS  బుక్స్ అవసరమని చెప్పగానే తక్షణమే స్పందించి సహకారాన్ని అందించిన పూర్వ విద్యార్థులందరికీ పి ఆర్ ఆర్ ఫౌండేషన్ మరియు పాఠశాల విద్యార్థుల పక్షాన ఆయన ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధిస్తే భవిష్యత్తులో మా పూర్వ విద్యార్థులుగా మరింత ప్రోత్సాహాన్ని అందిస్తామని ఈ సందర్భంగా విద్యార్థులకు తెలిపారు. అనంతరం తన దగ్గర లేకున్నా పురోహితం చేసుకుంటూ పాఠశాల పదవ తరగతి విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం సాయంత్రం తన సొంత డబ్బులతో స్నాక్స్ ను అందిస్తున్న మంచన హరిబాబు ను సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాలతి ఉపాధ్యాయులు ఎం.మూర్తి, శ్రీనివాస్ రెడ్డి, ఉదయశ్రీ, జ్యోతి, నరేష్, తదితరులు పాల్గొన్నారు.
ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ సోమవారం రాత్రి  కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు.73 ఏళ్ల నటుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ బృందం నటుడిని పరీక్షిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ఆసుపత్రిలో చేరడానికి ముందు, రజనీకాంత్ ఇటీవల తన రాబోయే చిత్రం వేట్టయాన్ ఆడియో లాంచ్‌లో కనిపించారు. ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో రజనీకాంత్ కొన్ని డ్యాన్స్‌లు కూడా చేశారు.
NLG:  హైస్కూల్ బాలికలకు హిమోగ్లోబిన్ పరీక్షలు
నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ హైస్కూల్ లో 8,9,10 తరగతి చదువుతున్న బాలికలకు ప్రభుత్వ మెడికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సోమవారం హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య మాట్లాడుతూ.. బాలికలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు బలమైన ఆహారంతో పాటు మంచి నీటిని అధికంగా తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, డాక్టర్ల బృందం, పారామెడికల్ సిబ్బంది, ఆశావర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
TG: కుటుంబ సభ్యులు అంగీకరిస్తేనే కుటుంబం ఫొటో తీయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్: కుటుంబ డిజిటల్‌ కార్డుల పంపిణీ సమయంలో కుటుంబ సభ్యులు అంగీకరిస్తేనే కుటుంబం ఫొటో తీయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ రికార్డుల ప్రకారం గుర్తించిన కుటుంబాన్ని నిర్ధరించాలన్నారు. కుటుంబ డిజిటల్‌ కార్డులపై సోమవారం సీఎం సమీక్ష నిర్వహించారు. డిజిటల్‌ కార్డుల కోసం సేకరించే వివరాలను అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

అక్టోబరు 3 నుంచి 7 వరకు పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలు, 238 ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలి. కొత్త సభ్యులను జత చేసి, చనిపోయిన వారిని తొలగించాలి. పైలెట్‌ ప్రాజెక్టులో ఎదురైన వివరాలతో నివేదిక తయారు చేయాలి. కుటుంబ సభ్యుల వివరాల మార్పులు చేర్పుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని సీఎం సూచించారు.̲