NLG: డిండి ఎత్తిపోతల పథకం డిపిఆర్ ను ఆమోదించాలి:సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా:
డిండి ఎత్తిపోతల పథకం డిపిఆర్ ను ఆమోదించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. మర్రిగూడ మండల పరిధిలోని శివన్నగూడెం గ్రామంలో సోమవారం సిపిఎం శాఖ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ మహాసభకు మైల సత్తయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు, దేవరకొండ ప్రాంతాలలో ఉన్న ప్రాజెక్టులు సింగరాజుపల్లి, గొట్టిముక్కుల, చింతపల్లి, కిష్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్లకు  కొన్ని నిర్మాణ పనులు జరిగాయని, కానీ రైతాంగానికి ఉపయోగం లోకి సాగునీరు రావాలంటే డిండి ఎత్తిపోతల పథకం డిపిఆర్ ను పర్యావరణ,అటవీ శాఖ అనుమతులు ఇచ్చి ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధులు కేటాయించి పనులు చేపట్టి,ఆ రిజర్వాయర్ల పరిధిలో ఉన్న రైతాంగానికి సాగునీరు అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

జీవో ఎంఎస్ నెంబర్107 ద్వారా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఈ ప్రాంతానికి0.5 టీఎంసీ చొప్పున 60 రోజులు 30 టీఎంసీలు నీరు  ఇవ్వనున్నట్లు జీవో ఇచ్చారని అనుమతులు మరిచారని ఆయన అన్నారు.

నల్లగొండ జిల్లాలో 3 లక్షల 41 వేల ఎకరాల ఆయ కట్టుకు నీరు ఇస్తానని చెప్పారు కానీ డిపిఆర్ ఆమోదించకపోవడం వలన డిండి ఎత్తిపోతల పథకం పనులు ముందుకు సాగడం లేదని ఆయన అన్నారు. ఏదుల్లా రిజర్వాయర్ నుండి మరో 27 కిలోమీటర్లు కాలువ తవ్వే పనికి అనుమతులు ఇవ్వలేదన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కొచ్చి పది నెలలు అవుతున్నప్పటికీ ఇంకా దృష్టి సారించకపోవడం శోచనీయమన్నారు. మునుగోడు ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టుల పనులు త్వరగా పూర్తిచేసి,ఈ ప్రాంత ప్రజలకు త్రాగునీరు- సాగునీరు అందించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, కొట్టం యాదయ్య, చెల్లం ముత్యాలు, గడగోటి వెంకటేష్, రుద్రాక్షి శ్రీరాములు, పిట్టల రమేష్, చొప్పరి హనుమంతు, గిరి విష్ణు, సురిగి యాదయ్య  తదితరులు పాల్గొన్నారు.
NLG: ఎసిబి కి పట్టుబడ్డ పశు వైద్యాధికారి
నల్లగొండ జిల్లా:
చింతపల్లిలోని పశు వైద్యాశాలలో పనిచేస్తున్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ పాల్ జోసెఫ్ గౌతమ్ ఎసిబి అధికారులకు సోమవారం పట్టుబడ్డారు.

ఓ రైతు నుండి 8 గేదెలకు సంబంధించిన ఆరోగ్య, మూల్యాంకన ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి రూ.6,000/- లంచం డిమాండ్ చేసి, తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు.

ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయాలని ఉమ్మడి జిల్లా ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర సూచించారు.
యా' అనొద్దు.. ఇది కాఫీ షాపు కాదు.. లాయర్‌పై సీజేఐ ఆగ్రహం
డిల్లీ:
'సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఓ న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సదరు న్యాయవాది వాదనలు వినిపించే క్రమంలో పదేపదే 'యా' (yeah) అంటుండటం పై సీజేఐ విస్మయం వ్యక్తం చేశారు. 'యా' అనేది గౌరవప్రదమైన పదం కాదని ఆ న్యాయవాదికి సీజేఐ సూచించారు.

'మీరు కేఫ్‌ లో లేరు.. కోర్టు రూంలో ఉన్నారు.. పదాలను జాగ్రత్తగా వాడండి.. "యా" అనే పదం అంటే నాకు, మా న్యాయమూర్తుల బెంచ్‌ కు అలర్జీ. అలాంటి పదాలు వాడేందుకు మిమ్మల్ని మేం అనుమతించం' అని సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు..
NLG: పీఆర్టీయూ జిల్లా కార్యదర్శిగా అద్దంకి సునీల్
నల్లగొండ: జిల్లా కేంద్రంలో పీఆర్టీయూ నూతన కమిటీని ఆదివారం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డివీఎస్,ఫణి కుమార్, ప్రధాన కార్యదర్శి జాన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ మేరకు జిల్లా కార్యదర్శిగా అద్దంకి సునీల్ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన యూనియన్ నాయకులకు కృతజ్ఞతలు అని తెలిపారు.
NLG: అబాకస్ ద్వారా విద్యార్థులు నైపుణ్యం పెంచుకోవచ్చు: మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్
నల్లగొండ:
అబాకస్ నేర్చుకోవడం ద్వారా పిల్లలు విద్యలో మరింత నైపుణ్యాన్ని పొందవచ్చని నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ తెలిపారు. ఆదివారం నల్లగొండ పట్టణంలోని సిప్ అబాకస్ ఇనిస్ట్యూట్ లో డ్రాయింగ్ కాంపిటేషన్లో గెలిచిన విద్యార్థులకు నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్ సర్టిఫికెట్లు, ట్రోపీలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిప్ అబాకస్ ద్వారా విద్యార్థులు లెక్కల్లో అద్భుతంగా రాణిస్తారని దానితోపాటు చదువులో శ్రద్ధ పెంపొందించడానికి ఉపయోగపడతాయని అన్నారు.

పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఈలాంటి అదనపు యాక్టివిటీస్ ద్వారా ఉన్నత శిఖరాల చేరుకోగలరని అన్నారు. మెరుపు వేగంతో గణితాన్ని జయించే విధంగా సిప్ అబాకస్ తోడుపడుతుందని అన్నారు. విద్యార్థుల్లో లెక్కల పై ఉన్న భయాన్ని పారదోలడానికి ఇలాంటి విద్య దోహదపడుతుందని అన్నారు.

సిప్ అబాకస్ నల్లగొండ ఫ్రాంచైజీ  హెడ్ పి భవాని మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో మొదటిసారిగా విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా ఇంటర్నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం సిప్ అబాకస్ ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. వారానికి ఒక్కరోజు ఆదివారం మాత్రమే ఈ క్లాసులు ఉంటాయని శిక్షణ పొందిన టీచర్లచే క్లాస్ లు చెప్పబడతాయని అన్నారు.

బస్టాండ్ దగ్గరలో సిప్  అబాకస్  ఇనిస్ట్యూట్ నడుపుతున్నామని విద్యార్థులు తల్లిదండ్రులు మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. డ్రాయింగ్ కాంపిటీషన్లో మొదటి బహుమతి మూడువేల రూపాయలు రెండవ బహుమతి రూ. 2000 మూడవ బహుమతి రూ.1000 ప్రోత్సాహక బహుమతి 1000 రూపాయలు నగదు తో పాటు ట్రోపి, సర్టిఫికెట్ అందివ్వడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహేష్  యువిన్, యశ్వంత్ రెడ్డి, దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
NLG: మాల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా నక్క శ్రీను యాదవ్ నియామకం
నల్లగొండ జిల్లా:
మర్రిగూడెం మండలం, రామ్ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన  నక్క శ్రీను యాదవ్ ను మాల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు ఉత్తర్వులు వెలువడిన నాటి నుండి రెండు సంవత్సరాల వరకు పదవిలో కొనసాగ నున్నట్లు పేర్కొన్నారు.

సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నక్క శ్రీను యాదవ్ కు ఈ పదవి రావడం పట్ల మండలంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్బంగా  నక్క శ్రీను మాట్లాడుతూ.. తన ఎంపిక కు సహకరించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు అని తెలిపారు.
కొనసాగుతున్న క్షేత్రస్థాయి ఆర్గానిక్ వ్యవసాయ సదస్సు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్గానిక్ వ్యవసాయ సదస్సు కొనసాగుతోంది.

ఈరోజు నల్గొండ శివారు లాలయ్యగూడెంలో రైతులతో ఆర్గానిక్ వ్యవసాయంపై శ్రీసత్యం వర్మి బయో ఆర్గానిక్స్ సేల్స్ డైరెక్టర్స్ అక్కినపల్లి కిరణ్, బాను ప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్గానిక్ వ్యవసాయంలో రైతులు అనుసరించదగ్గ వివిధ పద్ధతులు, రసాయనాల బదులు కషాయాలు వాడడం, వానపాములు రైతు నేస్తాలు, వర్మి కంపోస్టు వాడడం వల్ల భూమి బలోపేతం అయ్యే విధానం మరియు కెమికల్ క్రిమిసంహారకాలకు బదులు ప్రభుత్వం గుర్తించిన సర్టిఫైడ్ బయో ఉత్పత్తుల గురించి రైతులకు వివరించారు.
NLG: అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. ఆదివారం మర్రిగూడ మండల పరిధిలోని ఇందుర్తి గ్రామంలో సిపిఎం 9వ శాఖ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రారంభ సూచికగా సిపిఎం నాయకులు నీలకంఠం యాదయ్య సిపిఎం జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బండ శ్రీశైలం  మాట్లాడుతూ, గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలనిఆయన అన్నారు. రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్, వితంతువులకు, ఒంటరి మహిళలకు పెన్షన్ 4 వేల రూపాయలు, వికలాంగులకు 6 వేల రూపాయలు పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పి నేటికీ సంవత్సరం గడిచిన ఇంతవరకు ఇవ్వలేదని ఆయన అన్నారు.

ఇందుర్తి గ్రామంలో కొంతమందికి రుణమాఫీ అందలేదని వెంటనే అందరికీ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ గ్రామంలో మురికి కాలువలు, డ్రైనేజీ, రోడ్లు, అనేక మౌలిక వసతులపై శాఖ మహాసభలో తీర్మానం చేశారని, ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని 9వ శాఖ మహాసభలో తీర్మానం చేశారని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటకు పెట్టుబడి మీద 50% పెంచి మద్దతు ధరల చట్టం పార్లమెంట్లో చేస్తానని మూడు,నాలుగు సంవత్సరాల నుండి రైతాంగాని మోసం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై ఢిల్లీలో అనేక సందర్భాలుగా పోరాటాలు జరిగినా.. 14 నెలల పాటు దీక్షలు నిర్వహించినా.. నేటి వరకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని అన్నారు.డిండి ఎత్తిపోతల పథకం డిపిఆర్ ను ఆమోదించాలని, పర్యావరణ, అటవీశాఖ అనుమతులు ఇవ్వాలని ప్రాజెక్టులకు అవసరమయ్యే నిధులను ప్రభుత్వం కేటాయించాలని అన్నారు.

సీపీఎం మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్,మండల కమిటీ సభ్యులు మైల సత్తయ్య, చెల్లం ముత్యాలు, ఏర్పుల దుర్గమ్మ,సిపిఎం నాయకులు గిరి వెంకటయ్య, గడగోటి వెంకన్న, ఏరుకొండ రాఘవేంద్ర,, ఊరు పక్క బిక్షం,జోగు సులోచన, తదితరులు పాల్గొన్నారు.
మాల్ మార్కెట్ కమిటీ సభ్యులుగా గంట మల్లేష్ నియామకం

నల్లగొండ జిల్లా:

మర్రిగూడెం మండలం కొట్టాల గ్రామానికి చెందిన గంట మల్లేష్ ను మాల్ మార్కెట్ కమిటీ సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడిన నాటి నుండి రెండు సంవత్సరాల వరకు పదవిలో కొనసాగ నున్నట్లు పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గంట మల్లేష్ కు ఈ పదవి రావడం పట్ల మండలంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్బంగా గంట మల్లేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి నాకు మార్కెట్ కమిటీ సభ్యులుగా ఎంపిక కు సహకరించిన మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య, మరియు మర్రిగూడ మండల పార్టీ నాయకులకు, కొట్టాల గ్రామ ప్రజలకు ధన్యవాదములు అని తెలిపారు.

మాల్ మార్కెట్ కమిటీ సభ్యులుగా జమ్ముల వెంకటేష్

నల్లగొండ జిల్లా:

మర్రిగూడెం మండలం యరగండ్లపల్లి గ్రామానికి చెందిన జమ్ముల వెంకటేష్ తండ్రి సత్తయ్య ను మాల్ మార్కెట్ కమిటీ సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడిన నాటి నుండి రెండు సంవత్సరాల వరకు పదవిలో కొనసాగ నున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జమ్ముల వెంకటేష్ కు ఈ పదవి రావడం పట్ల మండలంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్బంగా జమ్ముల వెంకటేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి నాకు మార్కెట్ కమిటీ సభ్యులుగా ఎంపిక కు సహకరించిన మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య, మరియు మర్రిగూడ మండల పార్టీ నాయకులకు, యరగండ్లపల్లి గ్రామ ప్రజలకు ధన్యవాదములు అని తెలిపారు.