TeluguCentralnews

Sep 08 2024, 11:45

ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నిరసన సెగ.

వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పర్యటిస్తున్న కిషన్ రెడ్డి.

వరదలకు తాము సర్వం కోల్పోయినా కేంద్రం నుంచి తమకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదని కిషన్ రెడ్డని నిలదీసిన వరద బాధితులు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొంగులేటి వెంటే ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

వరదల వల్ల జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వివరించిన మంత్రి పొంగులేటి.

వరదల్లో ఇళ్ళు కోల్పోయిన వారికీ కేంద్ర ప్రభుత్వం తరఫున ఇళ్ళు కట్టిస్తామని హామీనిచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

TeluguCentralnews

Sep 08 2024, 11:44

ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నిరసన సెగ.

TeluguCentralnews

Sep 05 2024, 18:28

చంద్రబాబు కు తృటిలో తప్పిన ప్రమాదం
మధురా నగర్ రైల్వే ట్రాక్ పై చంద్ర బాబు అదే సమయంలో ట్రాక్ పైన రన్నింగ్ ట్రైన్. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది. చంద్రబాబుకు మూడు అడుగుల దూరంలోనే పాస్ అయిన ట్రైన్..

మధురా నగర్ రైల్వే ట్రాక్ పై చంద్ర బాబు అదే సమయంలో ట్రాక్ పైన రన్నింగ్ ట్రైన్. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది. చంద్రబాబుకు మూడు అడుగుల దూరంలోనే పాస్ అయిన ట్రైన్..

TeluguCentralnews

Sep 05 2024, 15:05

నలుగురిని కాపాడి.. వరదల్లో కొట్టుకుపోయి చనిపోయిన వ్యక్తి

విజయవాడకు చెందిన చంద్రశేఖర్(32) సింగ్ నగర్‌లో డెయిరీఫాంలో పనిచేస్తుండగా వరద పోటెత్తింది.

చంద్రశేఖర్ తనతో పనిచేస్తున్న తన ఇద్దరు సోదరులు, మరో ఇద్దరిని కాపాడి షెడ్డు పైకప్పు మీదకు ఎక్కించి, తాళ్లతో కట్టేసిన ఆవులనూ వదిలేశాడు.

తాను పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా కాలు జారి వరదలో కొట్టుకుపోయడు. చంద్రశేఖర్ భార్య 8 నెలల గర్భవతిగా ఉంది.

TeluguCentralnews

Sep 05 2024, 10:40

TTD: శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇక ఈ కేంద్రాల్లోనూ లభ్యం..!!

Srivari Laddu Prasadam: శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం ఇచ్చింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇక ఎంపిక చేసిన కేంద్రాల్లోనూ అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది.

తాజాగా టీటీడీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇక నుంచి దర్శనం టికెట్‌ లేకుండా తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చే వారికి గరిష్ఠంగా రెండు లడ్డూలు మాత్రమే ప్రసాదంగా అందించాలని నిర్ణయం తీసుకుంది. అయితే, భక్తుల నుంచి వస్తున్న వినతులతో లడ్డూ పలు కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకొస్తోంది.

తగ్గిన రద్దీ

తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. తిరుమలలో శ్రీవారి ప్రసాదం లడ్డూ పంపిణీలో తాజాగా టీటీడీ మార్పులు చేసింది. ఇక నుంచి దర్శనం టికెట్‌ లేకుండా తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చే వారికి గరిష్ఠంగా రెండు లడ్డూలు మాత్రమే ప్రసాదంగా అందించాలని.. అదీ కూడా ఆధార్​కార్డు చూపించి మాత్రమే రెండు లడ్డూలు కొనుగేలా చేసేలా టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేసారు.

ఇదే సమయంలో లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని, నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డూ నాణ్యత పెరుగుతుందని నిపుణులు తెలిపారని ఈవో శ్యామలా రావు తెలిపారు.

లడ్డూ ప్రసాదం

గతంలో నెయ్యి సరఫరాదారులు నాణ్యత, రుచి, వాసన లేని ఆవు నెయ్యి సరఫరా చేశారన్నారు. టీటీడీలో నెయ్యి నాణ్యత పరిశీలించేందుకు సరైన ల్యాబరెటరీ లేదని, ప్రయివేటు ల్యాబరెటరీ సౌకర్యం ఉన్న పరిశీలించలేదన్నారు.

టీటీడీలో నూతనంగా అత్యాధునిక ల్యాబరెటరీ ఏర్పాటు చేస్తునట్లు ఈవో వెల్లడించారు. ఇదే సమయంలో మరో నిర్ణయం తీసుకున్నారు. భక్తుల విజ్ఞప్తి మేరకు టీటీడీ స్థానిక ఆలయాలు, సమాచార కేంద్రాలలో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తున్నట్లు చెప్పారు.

TeluguCentralnews

Sep 05 2024, 08:27

వర్షాలతో మరో 16 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 594 రైళ్లు రద్దు.

పలు ప్రాంతాల్లో వర్షం నీరు చేరడంతో 15 రైళ్ల దారి మళ్లింపు.

పలు ప్రాంతాల్లో ట్రాక్‌లు సిద్ధం కావడంతో 8 రైళ్లు పునఃప్రారంభం.

యథావిథిగా మరో 4 రైళ్ల రాకపోకలు.

TeluguCentralnews

Sep 05 2024, 08:05

నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పాడే అవకాశం..

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

పల్నాడు, ఎన్టీఆర్ఎర్, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..

అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఉభయ గోదావరి..

కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్..

40కి.మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం..

TeluguCentralnews

Sep 05 2024, 08:04

తప్పుడు ప్రచారం చేసిన వారిని అమరావతిలో పూడ్చేస్తాం: చంద్రబాబు

AP: అధికారులను బురదలో దించి పని చేయిస్తుంటే కొంతమంది ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని CM చంద్రబాబు ఫైర్ అయ్యారు.

తప్పుడు ప్రచారం చేస్తున్నవారిని అమరావతిలో పూడ్చేస్తామని విరుచుకుపడ్డారు.

'బాధితులకు రాజకీయ, సినీ ప్రముఖులు సాయం చేస్తున్నారు. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు.

ఇలాంటి సమయంలో అమరావతి మునిగిందని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారిని సంఘ బహిష్కరణ చేయాలి' అని CM మండిపడ్డారు.

TeluguCentralnews

Sep 04 2024, 16:53

Pawan Kalyan: వరద బాధితులకు పవన్ కళ్యాణ్ భారీ విరాళం..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు మరియు వరదల కారణంగా సంభవించిన భారీ వినాశనాన్ని చూసి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయత్ రాజ్ మంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భారీ విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.కోటి, ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. పంచాయత్ రాజ్ మంత్రిగా ఉన్నందున,

ఆంధ్రప్రదేశ్, రాష్ట్రంలోని 400 పంచాయతీలకు (రూ. 4 కోట్లు) ఒక్కొక్కరికి రూ. 1 లక్ష విరాళం ఇవ్వాలని నిర్ణయించారు.

మొత్తంగా, అతను రెండు తెలుగు రాష్ట్రాలకు వ్యక్తిగతంగా రూ. 6 కోట్ల మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడు,

అతను ప్రతి పంచాయతీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ప్రభావిత ప్రాంతం వద్ద సహాయక చర్యలను విస్మరిస్తూ, తన ఆదర్శాలకు కట్టుబడి ఉన్నాడు.

TeluguCentralnews

Sep 04 2024, 10:26

ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండోె ప్రమాద హెచ్చరిక ఎత్తివేత.

ప్రస్తుతం బ్యారేజ్ వద్ద 5 లక్షల క్యూసెక్కుల వరద.

30 గంటల్లో 6.5 లక్షల క్యూసెక్కులు తగ్గిన వరద.

Streetbuzz News