తెల్లవారుజామున మూడు గంటల వరకూ వరద ప్రభావిత ప్రాంతాల్లోనే సీఎం
కృష్ణలంక, ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, జూపూడి, మూలపాడు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం
జూపూడి, మూలపాడులో ఇళ్లలోకి నీళ్ళు వచ్చి చేరడంతో రోడ్లపైకి వచ్చిన జనం
అర్ధరాత్రి సమయంలో కూడా బాధితుల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్న చంద్రబాబు
అందరికీ ఆహారం, నీళ్ళు సరఫరా చేస్తున్నామన్న సీఎం
ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం ప్రకటించిన టోల్ ఫ్రీ నెంబర్ 112 లేదా 1070 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించిన సీఎం
ఎవరూ అధైర్య పడొద్దు... అండగా ఉంటానని బాధితులకు భరోసా ఇచ్చిన సీఎం
ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని కోరిన సీఎం
పరిస్థితులు చక్కదిద్దే వరకు బాధితుల మధ్యనే ఉంటానన్న సీఎం ...
రాష్ర్టానికి రెడ్ అలర్ట్.. మరో రెండ్రోజులు అత్యంత భారీ వర్షాలు ‼️*
- కరీంనగర్‌లో కూలిన దేవాలయం పైకప్పు ..
- నల్లగొండలో కొట్టుకుపోయిన వంతెన
- ఇంటిపైకప్పు కూలి ఒకరు.. పిడుగుపాటుకు మరొకరు..
- కరెంట్‌షాక్‌తో ఇంకొకరు మృతి
- సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి..
- శ్రీశైలం ప్రాజెక్టుకు 4.10 లక్షల క్యూసెక్కుల వరద
- లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించండి
- కలెక్టరేట్లలో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటుచేయండి
- తక్షణ సహాయ చర్యలు చేపట్టండి: సీఎం రేవంత్
- అధికారులు సెలవులు పెట్టొద్దు: మంత్రుల ఆదేశాలు
- రెస్క్యూకు 24 బోట్లతో సిద్ధం: అగ్నిమాపకశాఖ
అరేబియా సముద్రంలో అస్నా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో రాగల రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం వరకు ఉన్న తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని దీంతో రాష్ర్టానికి రెడ్ అలర్ట్ ప్రకటించినట్టు వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న శనివారం తెలిపారు. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని నాగరత్న తెలిపారు. ఈ జిల్లాలకు రెడ్ అలెర్జ్ జారీ చేశామని, సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. భారీ వర్ష సూచన ఉన్న కారణంగా ప్రజలు అవసరమైతెనే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో ఇండ్లలోకి నీరు చేరింది. రహదారులు చెరువులను తలపించాయి. కరీంనగర్‌లో శనివారం కురిసిన భారీ వర్షానికి 150 సంవత్సరాల పురాతన పాండురంగ దేవాలయం పైకప్పు కూలిపోయింది. శిథిలావస్థకు చేరిన ఈ ఆలయం స్లాబ్ పైకప్పు, గోడలు విరిగి పడ్డాయి. డిప్యూటి మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్ ఆలయాన్ని పరిశీలించి, శిథిలాలను వెంటనే తొలగించాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. నల్లగొండలోని పానగల్ అర్బన్ హెల్త్ సెంటర్‌లోకి వర్షపు నీరు చేరి రోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. త్రిపురారం మండలం బాబుసాయిపేట వద్ద కొత్త వంతెన నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన వరద తాకిడికి కొట్టుకుపోయింది. భూపాలపల్లి సింగరేణి ఏరియాలోని కేటీకే ఓసీ-2, 3 గనుల్లో వరద నీరు చేరి బురదయమై బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. దీంతో సింగరేణి సంస్థకు దాదాపు రూ. కోటి మేర నష్టం వాటిల్లినట్లు సింగరేణి అధికారులు తెలిపారు.
విజయవాడకు వెళ్లే వాహనాల దారి మళ్లింపు...!
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను భారీ వర్షాల నేపథ్యంలో నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద గుంటూరు మీదుగా దారి మళ్లిస్తున్నట్లు ఎస్పీ శరత్ చంద్రపవార్ తెలిపారు. ఏపీలోని జగ్గయ్యపేట వద్ద జాతీయ రహదారిపై వరద ప్రవహిస్తున్నందున వాహనాలను నార్కట్‌పల్లి – అద్దంకి రహదారి మీదుగా మిర్యాలగూడ, వాడపల్లి, గుంటూరు నుంచి విజయవాడకు వెళ్లాలని సూచించారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి, విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలను సూర్యాపేట సమీపంలోని రాయినిగుడెం వద్ద ఖమ్మం బైపాస్ మీ దుగా మళ్లిస్తున్నారు. వాహనదారులు ఖమ్మం, సత్తుపల్లి మీదుగా రాజమండ్రి, విశాఖపట్నం వెళ్లొచ్చని పోలీసులు సూచిస్తున్నారు.
పిడుగుపాటుకు ఒకరు.. ఇల్లు కూలి మరొకరు..!
ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపురం గ్రామంలో బర్లను మేపేందుకు వెళ్లిన పుట్ట రమేశ్ కుమారుడు మహేశ్ (18)పై శనివారం పిడిగుపడి మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా నస్రుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన గైని స్వాతి (18) తన చిన్నాన్న ఇంటికి వెళ్లింది. అప్పటికే పిడుగుపడి విద్యుత్ వైర్ తెగడంతో ఆ ఇల్లంతా కరెంట్ సరఫరా అయి స్వాతి డోర్ తీస్తుండగా, షాక్ తగిలి మృతి చెందింది. బొప్పాస్‌పల్లిలో పిడుగుపడి గాయపడిన చవాన్ చిమ్యా నాయక్ (65)ను బాన్సువాడ దవాఖానకు తరలించారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం తాటిపాముల గ్రామంలో ఇంటిపైకప్పు కూలడంతో వడ్డె చంద్రయ్య (65) మృతి చెందాడు.
రెస్క్యూకు 24 బోట్లతో సిద్ధం
భారీ వర్షాల్లో బాధితులను రక్షించేందుకు అగ్నిమాపకశాఖలోని స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 50 మంది సిబ్బందిని 24 రెస్క్యూ బోట్లతో సంసిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర అగ్నిమాపకశాఖ డీజీ వై.నాగిరెడ్డి తెలిపారు. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో బోట్స్‌తో పాటు నీటిని తోడే పంప్స్, లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్లు ఇతర రెస్క్యూ సామగ్రితో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వరద ప్రభావిత జిల్లాల కోసం అత్యవసరమైతే ప్రత్యేక బృందాలను పంపుతామని వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా ‘ఆపద మిత్ర’ పేరుతో వలంటీర్లను సిద్ధం చేస్తున్నామని నాగిరెడ్డి వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 109 మంది ఆపద మిత్రలను సిద్ధం చేశామని తెలిపారు. త్వరలో అన్ని జిల్లాల్లో వీరి ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలకు బోట్లు నడిపేందుకు అగ్నిమాపకశాఖలోనే 145 మంది ఫైర్‌మెన్లకు ప్రత్యేక శిక్షణ ఇప్పించినట్టు తెలిపారు.
24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు
సూర్యాపేట జిల్లా
లక్కవరం రోడ్డు ; 29.88cm
చిల్కూరు ; 28.53cm
మట్టపల్లి ; 26.70cm
ములుగు జిల్లా
తాడ్వాయి ; 23.08cm
మహబూబాబాద్
ఇనుగుర్తి ; 21.50cm
ఖమ్మం జిల్లా
ఎర్రుపాలెం ; 21.33 cm
మధిర (ఏఆర్‌ఎస్) ; 20.25
సూర్యాపేట జిల్లా
తొగర్రాయి ; 19.03
రఘునాథపాలెం ; 18.98
ఖమ్మం జిల్లా
మధిర ; 18.95
Flash ; కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయండి ‼️
- జిల్లా కలెక్టర్లకు సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు
రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున... ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. వర్షాలపై శనివారం ఆమె సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణతో పాటు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఎలాంటి ఆకస్మిక విపత్తు ఎదురైనా... సమర్థంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సీఎస్ చెప్పారు.
కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. కలెక్టరేట్లు, జీహెచ్‌ఎంసీ, సచివాలయంలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ఉద్ధృతంగా పారే వాగుల వద్ద ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించి పర్యవేక్షించాలని చెప్పారు. వర్షాల దృష్ట్యా జిల్లాల్లో పాఠశాలలకు సెలవులను ప్రకటించే నిర్ణయాధికారం కలెక్టర్లదేనని అన్నారు. భారీ వర్షాలపై ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్యపర్చాలన్నారు.
గ్రామాలు, పట్టణాల్లో మంచినీటి ట్యాంకులు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ) బృందాలు హైదరాబాద్, విజయవాడలలో ఉన్నాయని, వీటి సహకారం కావాలనుకుంటే వెంటనే పంపిస్తామని అన్నారు. గోదావరి, కృష్ణా నదుల పరివాహక ప్రాంతాల్లోని జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మ్యాన్‌హోల్స్‌ను తెరవకుండా చూసుకోవాలన్నారు. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పోలీస్ కమీషనర్లు, ఎస్పీలను అప్రమత్తం చేశామని తెలిపారు.
Breaking : స్థానికి ఎన్నికలపై ఎస్ఈసీ భేటీ ‼️
- జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ
- ఎన్నికల ఓట్ల జాబితాకు రంగం సిద్ధం
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల(Telangana local body elections)కు సంబంధించి ఇవాళ(శనివారం) రాజకీయ పార్టీల నేతలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. మాసబ్‌ట్యాంక్‌లోని ఎన్నికల కమిషన్ కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే సమావేశానికి గుర్తింపు పొందిన పలు పార్టీల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ మేరకు వారికి ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కమిషనర్ పార్థసారథి వారితో కూలంకశంగా చర్చిస్తారు. ఇప్పటికే వార్టుల వారీగా ఓటర్ల జాబితా తయారీ తుది దశకు చేరుకోవడంతో పార్టీల సలహాలు, సూచనలు, అభ్యంతరాలు, ఫిర్యాదులు ఆయన స్వీకరించనున్నారు.
రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల పదవీ కాలం ముగిసి ఇప్పటికే ఏడు నెలలు గడిచిపోయింది. ఈ సమావేశంలో వాటి ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా ఖరారు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, తదితర కీలక అంశాలపై రాజకీయ పార్టీలతో ఆయన చర్చించనున్నారు. ఓటర్ జాబితా తయారీ అనంతరం ప్రభుత్వం నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలు అందిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు..!
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్నివిధాలా సమాయత్తం కావాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఇప్పటికే ఆదేశించారు. ఈ మేరకు ఆయన గురువారం హైదరాబాద్ నుంచి పలు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లను చేపట్టాలని ఆదేశించారు. నాలుగైదు నెలల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేస్తామని చెప్పారు. ముందుగా మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని, అనంతరం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు.
శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు సున్నితత్వమైనవని పార్థసారథి చెప్పారు. ఓటరు జాబితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ వంటి ప్రక్రియలను తక్షణమే పూర్తిచేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబరు 6న ముసాయిదా ఓటరు జాబితా వెలువరించి అభ్యంతరాలను స్వీకరించి 21న తుది ఓటరు జాబితా విడుదల చేయాలని చెప్పారు. జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా ముందుగానే సరి చూసుకోవాలన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 600 ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఓటర్ల సంఖ్య దాటితే అదనపు పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డికి చుక్కెదురు ‼️
సుప్రీంకోర్టులో ఈరోజు (గురువారం) 2015 లో జరిగిన ఓటుకు నోటు వ్యవహారం మీద విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. అందుకు ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీచేయాలంటూ కూడా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తరపున లాయర్ లు సుప్రీంకోర్టులో పిటీషన్ ను దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ గవాయితో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
కేవలంలో ఊహాజనిత అపోహాను బెస్ చేసుకుని .. కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయమని కోరడం సరికాదని హితవుపలికింది. దీని వల్ల మన న్యాయవ్యవస్థపై నమ్మకం లేదన్నట్లుగా ప్రజల్లోకి వెళ్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అందుకే ఈ కేసుపై.. ప్రత్యేకంగా ఇండిపెండెంట్ ప్రాసిక్యూటర్ ను నియమిస్తున్నట్లు తెలిపింది. ఏపీ లేదా తెలంగాణ నుంచి ఒక ప్రాసిక్యూటర్ ను నియమిస్తామని జస్టిస్ గవాయి ధర్మాసనం స్పష్టం చేసింది.
దీనిలో భాగంగా.. ఇరువర్గాల ఏకాభిప్రాయం కోసం.. ఇద్దరి పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనిపై ఏకాభి ప్రాయం కుదరకపోవడంతో.. కేసును.. సోమవారం ( సెప్టెంబరు2) కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.
రేవంత్ రెడ్డి పై సుప్రీం కోర్టు ఫైర్
అంతకు ముందుకు కేసు విచారణ సందర్భంగా సీఎం రేవంత్.. సుప్రీంకోర్టుపై చేసిన వ్యాఖ్యల పట్ల ధర్మాసనం సీరియస్ అయ్యింది. ఒక సీఎం స్థానంలో ఉండి.. సుప్రీంకోర్టు ఆర్డర్ లను తప్పుపట్టేలా.. మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని ధర్మాసనం ఆగ్రహాం వ్యక్తం చేసింది. తాము రాజకీయ నాయకుల్ని సంప్రదించి బెయిల్ ఇస్తామా..?.. ఎవరి వ్యాఖ్యల్ని పట్టించుకోమని, కేవలం తమ విధినిర్వహణలో భాగంగా.. కేసును బట్టి మాత్రమే తమ చర్యలుంటాయని కూడా ధర్మాసనం తెల్చిచెప్పింది. తాము ప్రమాణ పూర్వకంగా పనిచేస్తామని, ఎవరి పనుల్లో కూడా జోక్యం చేసుకొమని చెప్పుకొచ్చింది. సీఎం రేవంత్ కు.. సర్వోన్నత న్యాయస్థానం అంటే.. గౌరవం లేదా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.
Emergency | కంగనారనౌత్ ఎమర్జెన్సీ విడుదలపై నిషేధం..⁉️
బాలీవుడ్ నటి కంగనారనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రాజెక్ట్ ఎమర్జెన్సీ. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాలనలో 1975 జూన్ 25 నుండి 1977 వరకు కొనసాగిన ఇండియన్ ఎమర్జెన్సీ (Emergency )ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో కంగనారనౌత్ ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రాన్ని ఎన్నికలకు ముందు వివాదాలకు అవకాశం ఇవ్వకుండా.. సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణలో నిషేధం విధించే అవకాశాలున్నాయన్న వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఎమర్జెన్సీ సినిమా రిలీజ్‌పై ప్రభుత్వం న్యాయపరమైన సంప్రదింపులు జరుపుతూ.. నిషేధం అంశాన్ని పరీలిస్తుందని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. మాజీ ఐపీఎస్ అధికారి తేజ్ దీప్ కౌర్ మీనన్ నేతృత్వంలోని తెలంగాణ సిక్కు సొసైటీ ప్రతినిధుల బృందం షబ్బీర్‌ను కలిసి ఎమర్జెన్సీ విడుదలపై నిషేధం విధించాలని కోరింది. సిక్కు సొసైటీ ప్రతినిధులు సినిమాలో సిక్కు సమాజాన్ని చూపించిన తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. రాష్ట్రంలో సినిమాను నిషేధించే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డిని షబ్బీర్ కోరినట్టు సమాచారం.
ఎమర్జెన్సీ సమయంలో పౌరహక్కుల సస్పెన్షన్, ఇందిరా గాంధీ వ్యతిరేకుల అరెస్టుతోపాటు పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయని తెలిసిందే. ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నిలబడ్డ ప్రముఖ రాజకీయ వేత్త జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) పాత్రలో పాపులర్ బాలీవుడ్ దర్శకనిర్మాత అనుపమ్ ఖేర్ నటిస్తుండగా.. శ్రేయాస్ తల్పడే, భూమికా చావ్లా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఎమర్జెన్సీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన వివిధ పాత్రలకు సంబంధించిన పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ చిత్రాన్ని కంగనా హోం బ్యానర్ మణి కర్ణిక ఫిలిమ్స్ బ్యానర్‌పై రేణు పిట్టి, కంగనారనౌత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
వైసిపి పార్టీ కి మరో ఇద్దరు ఎంఎల్ సి లు గుడ్ బై..
నిన్నటి వరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉన్న ఎంఎల్ సి బల్లి కళ్యాణ్ చక్రవర్తి తో పాటు మరో ఎంఎల్ సి పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేసి లేఖ ను మండలి చైర్మన్ కు అందజేశారు.
నిన్ననే ఇద్దరు ఎంపీలు వెంకట రమణ, బీద మస్తాన్ రావు వైసిపి పార్టీ కి, ఎంపి పదవికి రాజీనామా చేసి డిల్లి లో రాజ్యసభ చైర్మన్ ను కలిసి లేఖ ను అందజేశారు.
రోజు కూడ గడవక ముందే వైసిపి పార్టీ కి మరో ఇద్దరు ఎంఎల్ సి లు రాజీనామా లేఖ ను మండలి చైర్మన్ కు అందజేశారు.
ఎం ఎల్ సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి మాజీ మంత్రి, మాజీ ఎంపి బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు ఆయన మరణతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బల్లి కళ్యాణ్ చక్రవర్తి కి ఎం ఎల్ సీ గా అవకాశం కల్పించారు.
నిన్నటి వరకు టిడిపి ప్రభుత్వం పై పోరాటం లో డిల్లి లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా ఉంటానని చెప్పి రోజులు కూడా గడవక ముందే వైసిపి పార్టీ కి గుడ్ బై చెప్పారు.
Sep 03 2024, 17:04