NLG: సీజనల్ జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్
నల్లగొండ జిల్లా:
నాంపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ఈ రోజు జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు సీజనల్ జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రోగులకు అవగాహన కల్పించారు.

గ్రామస్థాయి నుంచి ప్రతి పల్లెలో జరం సర్వే విస్తృతంగా నిర్వహించాలని వైద్య సిబ్బందికి తెలిపారు. సీజనల్ జ్వరాల పట్ల అవగాహన కల్పిస్తూ వైద్య శిబిరాలు నిర్వహించాలని కోరారు. మండల వైద్యాధికారులు డాక్టర్ ఇజ్రత్, డాక్టర్ తరుణ్, ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
NLG: మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా వై యస్ ఆర్ 15వ వర్ధంతి
నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో నేడు  దివంగత మాజీ సిఎం డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యాలయంలో ఉన్న వైయస్సార్ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల కోసం వైయస్సార్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి అభివృద్ధి కోసం కృషి చేశారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, మున్సిపల్ కౌన్సిలర్ లు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జమ్ముల వెంకటేష్ గౌడ్
నల్లగొండ జిల్లా:
భారీ వర్షాల పట్ల  మర్రిగూడ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జమ్ముల వెంకటేష్ గౌడ్ అన్నారు.

ఆదివారం మర్రిగూడ మండలంలో వారు మాట్లాడుతూ.. భారీ వర్ష సమయంలో ప్రతి ఒక్కరూ వీలైనంతవరకు ఇంట్లోనే ఉండండి, అత్యవసరమైతేనే బయటకు వెళ్ళండి, వర్షాల వల్ల తడిసిన కరెంటు స్తంభాలు, విద్యుత్ తీగలు, ఇనుప స్తంభాలు తాగకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

ఇంట్లో ఉండే విద్యుత్ పరికరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.ముఖ్యంగా పిల్లలు, వృద్దులు బయటకు రాకుండా చూసుకోవాలి. రైతులు పొలాల్లో విద్యుత్ స్తంభాలు, తీగలకు దూరంగా ఉండండి. ఉదృతంగా ప్రవహిస్తున్న కాలువలు, చెరువుల వద్దకు వెళ్ల వద్దని మండల ప్రజలకు సూచించారు.
రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు చేపట్టిన ఆర్ అండ్ బి అధికారులు

నల్లగొండ జిల్లా:

మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలవకుండా ఆర్ అండ్ బి అధికారులు చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఆర్ అండ్ బి ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి ఆదివారం గ్రామానికి విచ్చేసి సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లపై నిలిచిన నీరు మళ్లించడానికి తన సిబ్బందితో చర్యలు తీసుకున్నారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:దళిత రత్న నాగిల్ల మారయ్య
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం:
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాల మహానాడు నాయకులు దళిత రత్న అవార్డు గ్రహీత నాగిల్ల మారయ్య అన్నారు.

మర్రిగూడ మండల కేంద్రంలో ఆదివారం మారయ్య మాట్లాడుతూ.. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో, నల్గొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. భారీ వర్షాల సమయంలో ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండండి, అత్యవసరమైతేనే బయటికి రావాలని తెలిపారు.

వర్షాల వల్ల తడిసిన కరెంటు స్తంభాలు, విద్యుత్ తీగలు, ఇనుప స్తంభాలు తాగకుండా జాగ్రత్తగా ఉండండి.
ఇంట్లో విద్యుత్ పరికరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
ముఖ్యంగా పిల్లలు, వృద్దులు బయటకు రాకుండా చూసుకోవాలన్నారు.

రైతులు పొలాల్లో విద్యుత్ స్తంభాలు, తీగలకు దూరంగా ఉండండి. ఉదృతంగా ప్రవహిస్తున్న కాలువలు, చెరువుల వద్దకు ప్రజలు వెళ్లకండని సూచించారు.  జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కావున అనారోగ్యానికి గురైతే  వెంటనే వైద్యులను సంప్రదించాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
అంధకారం లో కోదాడ పట్టణం.. రోడ్లన్ని జలమయం

సూర్యాపేట జిల్లా:

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా శనివారం కోదాడ పట్టణం జలమయం అయింది. రోడ్ల మీద నీళ్ళు ప్రవహించాయి. పట్టణంలోని రంగా థియేటర్, ఖమ్మం చౌరస్తా లలో భారీ వరద చేరడంతో కార్లు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

నీటి వరదలో చిక్కుకున్న వాహనాలు, ద్విచక్ర వాహనాల సైలెన్సర్ ల లోకి నీరు ప్రవేశించి వాహనాలు స్టార్ట్ కాకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్డణంలోని శ్రీరంగాపురం రోడ్డు మద్యలో డివైడర్ల మీద నుండి నీరు ప్రవహించి జలపాతంలా మారింది.

ఖమ్మం వైపు వెళ్లే రోడ్డు మీద తమ్మర వద్ద ఉన్న వాగు బ్రిడ్జి పైనుండి మోకాళ్ళ లోతులో నుండి నీరు ప్రవహిస్తున్నది.

బారీగా కురిసిన వర్షానికి కరెంట్ సబ్ స్టేషన్ లోకి కూడా బారీగా నీరు చేరింది, దీంతో సాయంత్రం నుండే పట్డణం మొత్తం కరెంట్ లేని పరిస్థితి. 

కోదాడ నుండి మేళ్ళచెరువు వెళ్ళే మార్గం కూడా బ్లాక్ అయింది. కోదాడ నుండి చుట్డు ప్రక్కల గ్రామాలకు వెళ్ళ లేని పరిస్థితి నెలకొన్నది.

పట్టణంలో‌ని పురపాలక సంఘం కార్యాలయంలోకి వచ్చిన వరద నీరుతో కార్యాలయ సంబంధించిన సామాగ్రి ఫైల్స్ పూర్తిగా తడిసిముద్దయ్యాయి.

కోదాడలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో నీరంతా రోడ్డు మీదనే ప్రవహిస్తూ రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కోదాడ నుండి మేళ్ళచెరువు వైపు, ఖమ్మం వైపు , విజయవాడ వైపు వెళ్ళ లేని పరిస్థితి ఆ వైపు గ్రామాలకు వెళ్ళాల్సిన ప్రజలు ఎటు వెళ్ళాలో తెలియక పట్టణంలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

HYD - VIJAYAWADA హైవేపై నందిగామ వద్ద పోటెత్తిన వరద
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద శనివారం భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

నందిగామ వద్ద వాగు పొంగడం తో హైవే పైకి వరదనీరు వచ్చి చేరింది.

కోదాడ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను ఖమ్మం వైపు మళ్ళించారు.
NLG: భారీ వర్షాల నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు
నల్గొండ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల నల్గొండ పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్ కోరారు.

నల్గొండ పట్టణంలో వర్షాలు వల్ల ఏదైనా సమస్య వస్తే నల్గొండ పురపాలక సంఘం కార్యాలయంలో ఏర్పాటుచేసిన కాల్ సెంటర్ 086822 20100 ను సంప్రదించాలని తెలిపారు.

ఈ కాల్ సెంటర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
NLG: భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు
నల్లగొండ: రానున్న 3 రోజులపాటు భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం తో పాటు, ముఖ్యమైన కార్యాలయాలలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు.

వర్షాలకు సంబంధించి అత్యవసర సమాచారం, సహాయం కోసం
(1). కలెక్టర్ కార్యాలయం- 18004251442
(2).ట్రాన్స్కో నల్గొండ సర్కిల్ -  9440813326
(3).నల్గొండ డివిజన్ ట్రాన్స్కో కంట్రోల్ రూమ్* నెంబర్ 9542451160
(4).మిర్యాలగూడ ట్రాన్స్కో కంట్రోల్ రూమ్ నంబర్ 9493951399
(5).దేవరకొండ ట్రాన్స్కో కంట్రోల్ రూమ్ నెంబర్ 9440203717


(6).నీటిపారుదల శాఖకు సంబంధించిన నల్గొండ కంట్రోల్ రూమ్ నెంబర్ 9989997950
(7).నాగార్జునసాగర్ హిల్ కాలనీ డివిజన్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8465080694
(8).జివి గూడెం కంట్రోల్ రూమ్ నెంబర్ 9948042977
(9).మాల్ డివిజన్ కు సంబంధించి కంట్రోల్ రూమ్ నెంబర్ 9912534475
(10).పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన కంట్రోల్ రూమ్ నంబర్ 9059834706

ప్రజలు వర్షం కారణంగా ఇబ్బందులకు గురైనా, లేదా ఏదైనా అత్యవసర సమాచారాన్ని తెలియజేసేందుకు సంబంధించి పైన పేర్కొన్న కంట్రోల్ రూమ్ నెంబర్లకు ఫోన్ చేయవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు.
NLG: జిల్లా క్రీడల అధికారికి ఘనంగా వీడ్కోలు
నల్గొండ: గత 25 సంవత్సరాలుగా  జిల్లాలో హాకీ కోచ్ గా మరియు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారిగా సమర్థవంతంగా పనిచేస్తూ శనివారం రిటైర్మెంట్ పొందిన మక్బూల్ మొహమ్మద్ ను జిల్లా క్రీడల కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ.. జిల్లాలో క్రీడల అభివృద్ధిని సమర్థవంతంగా నిర్వహించి మంచి అధికారిగా గుర్తింపు సాధించారని తెలిపారు.