NLG: బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: బండారు ప్రసాద్
నల్గొండ మండలం బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం కార్యశాల బిజెపి నల్గొండ మండల అధ్యక్షుడు బోగరి అనిల్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా బిజెపి నల్గొండ పార్లమెంట్ కన్వీనర్  బండారు ప్రసాద్ పాల్గొని కార్యకర్తలను, ఉద్దేశించి మాట్లాడుతూ.. నల్లగొండ మండలంలో అధిక సంఖ్యలో బిజెపి సభ్యత్వానికి నల్లగొండ మండల నాయకులందరూ కృషి చేయాలని తద్వారా రానున్న స్థానిక ఎన్నికలలో అధిక స్థానాలలో సర్పంచ్, వార్డ్ మెంబర్లు గెలవడానికి అవకాశం ఉంటుందని,m కార్యకర్తలు అందరూ సమిష్టి కృషితో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
    
ప్రతి బూత్ లో 200 మంది సభ్యత్వానికి తగ్గకుండా చేసి నల్లగొండ జిల్లాలో నల్లగొండ మండలాన్ని మొదటి స్థానంలో నిలపాలని కోరారు.

ఈ సమావేశంలో బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు బొబ్బిలి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు కొత్తపళ్లి ప్రమోద్, చామకూరి మహేష్, మండల సభ్యత్వ కన్వీనర్ పనస సురేష్, మండల ఉపాధ్యక్షులు రేగట్టే రూక్న గౌడ్, మండల కార్యదర్శిలు చింతపల్లి వెంకన్న, మేకల అనిల్, నారబోయిన మల్లేష్,మాజీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కొత్తపల్లి వినోద్, మాజీ వార్డ్ మెంబర్ కస్పరాజు ధర్మయ్య, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు పోతేపాక శంకర్, ఓబిసి మోర్చా మండల అధ్యక్షుడు జక్కల శంకర్, మైనార్టీ మోర్చా మండల అధ్యక్షుడు ఎస్ కె. సాదక్, భూత్ అధ్యక్షులు ఉప్పునూతల శ్రీహరి,సుంకర బోయిన లింగ స్వామి,అంతటి శ్రీకాంత్, పోతేపాక నవీన్, బైరెడ్డి రాంరెడ్డి, చిలుకల అనిల్, బోయిన జానయ్య యాదవ్, నరేష్ ముప్ప వెంకటరెడ్డి , పగిల్లా వెంకన్న, సురిగి వెంకటరెడ్డి మండల సీనియర్ నాయకులు పోతేపాక విజయ్, పోతేపాక సురేష్ ,శరత్, సంజీవ, రాజు మండల సోషల్ మీడియా కన్వీనర్ గన్నెబొయిన శ్రీశైలం యాదవ్  తదితరులు పాల్గొన్నారు.
NLG: ఉత్తమ పోటో అవార్డు గ్రహీతల ను సన్మానించిన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కేలావత్ నగేష్ నాయక్

నల్గొండ: జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కేలావత్ నగేష్ నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని రామాలయం లో నల్లగొండ జిల్లాలో వివిధ పత్రికల ఫోటో జర్నలిస్టులు గా విధులు నిర్వర్తిస్తూ.. ఇటీవల రాష్ట్ర స్థాయి అవార్డులు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, బంజారా సాంప్రదాయం లో ఫోటో జర్నలిస్టులను శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. అనంతరం స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నగేష్ నాయక్ మాట్లాడుతూ.. ఫోటో జర్నలిస్టులు అనునిత్యం ప్రజల కోసం ఛాయా చిత్రాలను తీసి వార్తలకు ప్రాణం పోస్తున్నారని తెలిపారు. కార్మిక కర్షకుల సమస్యలను, వారి జీవన విధానాన్ని, వారు పడుతున్న కష్టాలను అందమైన ఫోటోలు తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నారని అన్నారు.

ఒక్క ఫోటో గడిచిన కాలాన్ని జ్ఞాపకం చేస్తున్నదని తెలిపారు. వారు చేస్తున్న కృషికి అవార్డులు రావడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

అవార్డులు అందుకున్న సన్మాన గ్రహీతలు ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్ హన్స్ ఇండియా, కంది భజరంగ్ సాక్షి, చిలుముల నరేందర్ సూర్య, ముచ్చర్ల విజయ్ కుమార్ ఆంధ్ర జ్యోతి, ఆకాష్ నమస్తే తెలంగాణ ఉన్నారు.

ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ లు శివ, రవి, జనార్దన్, చారి, వినోద్, మల్లికార్జున్, ఆకాష్, శ్రీను, సతీష్,జిల్లా రాజశేఖర్,నాయకులు సాగర్ నాయక్, వెంకన్న, శంభు రెడ్డి,యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

NLG: సెల్ఫీ దిగుతూ కాలుజారి నీటిలో పడిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే..

నల్లగొండ జిల్లా:

నాగార్జున సాగర్ ఎడమ కాలువ వేములపల్లి బ్రిడ్జి వద్ద ఇవాళ ఓ మహిళ సెల్ఫ్ దిగుతూ కాలుజారి నీటిలో పడడం జరిగింది.

అటుగా వెళుతున్న స్థానికులు మాడుగులపల్లి మండలం, గజలాపురం గ్రామానికి చెందిన యువకులు జక్క నాగయ్య, జక్కా నాగరాజు ,తదితరులు వెంటనే నీటిలో దూకి తాడు సాయంతో ఆమెను సురక్షితంగా ఒడ్డుకు చేర్చి కాపాడారు.

పైకి చేరిన తర్వాత కూడా ఆమె సెల్ఫీ దిగిందని తెలిసింది.

NLG: సెప్టెంబర్ 1 న ఉమ్మడి జిల్లా స్థాయి యోగాసన పోటీలు
నల్లగొండ: యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి యోగాసనా పోటీలు సెప్టెంబర్ 1 వ తేదీ ఆదివారం రోజున స్థానిక  *భోది యోగ అండ్ ఫిట్నెస్ సెంటర్, శ్రీనగర్ కాలనీ, రోడ్ నెం.4,ఎన్ జి కళాశాల వెనుక*  జరుగుతాయని అధ్యక్షులు కోట సింహాద్రి, జనరల్ సెక్రటరీ  రాయనబోయిన శ్రీను ఒక ప్రకటనలో  తెలిపారు.

*పోటీలు నిర్వహించే విభాగాలు*

*సబ్ జూనియర్*
10 నుంచి 14 సంవత్సరాల వయస్సు వారికి
*జూనియర్*,
14 నుంచి 18 సంవత్సరాల వయస్సు వారికి
*సినియర్* 
18 నుంచి 28 సంవత్సరాల వారికి   ,
*మాస్టర్స్*
28 నుంచి 35 సంవత్సరాల వారికి  ,
35 నుంచి 45 సంవత్సరాలు మరియు ,  45 నుంచి 55 సంవత్సరాల వారికి మూడు విభాగాల్లో మాస్టర్స్ పోటీలు జరుగుతాయని చెప్పారు. బాల బాలికలకు వేరుగా పోటీలు జరుగుతాయి అని వారు తెలిపారు.

ట్రెడిషనల్ యోగాసన ,  artistic యోగాసన ( సింగిల్ ,  పెయిర్ ) , Rhythmic యోగాసన (జంట)  విభాగాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. పోటీలో పాల్గొనేవారు వయస్సు ధ్రువీకరణ పత్రం బోనఫైడ్ తో పాటు ఫోటోను సమర్పించాలని అన్నారు. పోటీల్లో పాల్గొనేవారు సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలని తెలిపారు.

ప్రతి విభాగంలో *మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలను రాష్ట్రస్థాయి యోగాసనా పోటీల్లో పాల్గొనే అవకాశం* కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిస్తే జాతీయ స్థాయి పోటీలకు కూడా వెళ్లే అవకాశం ఉంటుందన్నారు.

పోటీలో పాల్గొనే వారు *9182046383,* *8886465858*  ఫోన్ నెంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని యోగ సాధకులు అందరూ సద్వినియోగం చేసుకొని రాష్ట్ర , జాతీయస్థాయిలో జిల్లాకి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మ‌రింత పెంచేలా గ‌ణేష్ ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి
HYD: తొలి నుంచి మ‌త సామరస్యానికి, ప్ర‌శాంత‌త‌కు పేరు గాంచిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మ‌రింత పెంచేలా గ‌ణేష్ ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ ఉండాల‌ని, ఇందుకోసం ఉత్స‌వ క‌మిటీలు, మండప నిర్వాహ‌కులు, ప్ర‌భుత్వ అధికారులు స‌మ‌న్వ‌యంతో ముందుకుసాగాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

గణేష్ ఉత్సవాల నిర్వహణపై డా. బిఆర్అంబేద్కర్ రాష్ట్ర స‌చివాల‌యంలో గురువారం ముఖ్య‌మంత్రి అధ్య‌క్ష‌త‌న స‌మీక్షా సమావేశం జరిగింది.

గ‌ణేష్ మండ‌పాల‌కు ఉచిత విద్యుత్ ఇవ్వాల‌ని భాగ్య‌న‌గ‌ర్ గ‌ణేష్ ఉత్స‌వ కమిటీ స‌భ్యులు చేసిన విజ్ఞప్తికి ముఖ్య‌మంత్రి సానుకూలంగా స్పందించారు.

ముందుగా మండ‌ప నిర్వాహ‌కులు ఉచిత విద్యుత్ స‌ర‌ఫ‌రాకు విధిగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. అనుమ‌తులు లేకుండా విద్యుత్ వినియోగిస్తే చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, జ‌వాబుదారీత‌నం కోస‌మే అనుమ‌తి చేసుకోవాల‌ని కోరుతున్నామ‌ని తెలిపారు.

గణేష్ ఉత్సవ మండ‌పాల ఏర్పాటు, తొమ్మిది రోజుల ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ, నిమ‌జ్జ‌నానికి సంబంధించి మండ‌ప నిర్వాహ‌కుల బాధ్య‌తలపై ముఖ్యమంత్రి సమావేశంలో పలు సూచనలు చేశారు. ఉత్సవాల విషయంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రభుత్వ శాఖలు, నిర్వహకుల మధ్య సమన్వయంతో ముందుకు సాగాలని చెప్పారు. మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లోనో అనుమతులు తీసుకోవాలని సూచించారు.

నిమ‌జ్జ‌న ఊరేగింపు సాధ్యమైనంత త్వ‌ర‌గా ప్రారంభిస్తే కార్య‌క్ర‌మాన్ని సాఫీగా ముగించుకోవ‌చ్చ‌ని, ఫ‌లితంగా భక్తులు ట్రాఫిక్‌, ఇత‌ర ఇబ్బందులు బారిన ప‌డ‌కుండా చూసుకోవ‌చ్చ‌న్నారు.

సెప్టెంబ‌రు 16న మిలాద్ ఉన్ న‌బీ, 17న తెలంగాణ‌లో వివిధ రాజ‌కీయ పార్టీలు ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టే అవకాశాలు ఉన్నందున అన్ని కార్య‌క్ర‌మాల‌కు సరైన ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగాల‌ని, ఎక్క‌డా స‌మ‌స్య త‌లెత్త‌కుండా చూసుకోవాల‌ని ముఖ్యమంత్రి పోలీసులను ఆదేశించారు.

ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ధనసరి సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు  కే. కేశవరావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఉత్సవ సమితి ప్రతినిధులు, పోలీస్ ఉన్నతాధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
NLG: తూర్పుపల్లి లో ఉచిత మెగా వైద్య శిబిరం
దేవరకొండ నియోజకవర్గం, తూర్పుపల్లి (బొడ్డుపల్లి) గ్రామంలో అంకూరి అరుణ - నరసింహ ఆర్థిక సహకారం తో మరియు లైన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ వారి సహకారంతో గురువారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించినారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగ వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాలలో సీజనల్ వ్యాధులు పెరుగుతున్న క్రమంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం చాలా మంచి శుభ పరిణామం అని, ఇలాంటి క్యాంపు ను ఉపయోగించుకొని గ్రామ ప్రజలందరూ  సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అదేవిధంగా ప్రభుత్వం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించాలని ప్రజలలో చైతన్యం తీసుకురావాలని కోరారు.   

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి సురేష్, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పెరిక ముని కుమార్, లైయన్స్ క్లబ్  అధ్యక్షులు వస్కుల సత్యనారాయణ, ఎస్సీ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ వినోద్ రాథోడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు కుంభం తిరుపతి, దేవరకొండ బీజేపీ టౌన్ అధ్యక్షులు గుండాల అంజయ్య l, బిజెపి టౌన్ ప్రధాన కార్యదర్శిలు జెల్దభాస్కర్, సముద్రాల సహదేవ్, బీజేపీ ఎస్సి మోర్చా జిల్లా కార్యదర్శి ఎర్ర బిక్షపతి, ఎస్సి మోర్చా మండల అధ్యక్షులు దర్శనం శ్రీను, అంకురి యాదగిరి,బొడ్డుపల్లి అంజి, పులిజాల అజయ్, నేనావత్ రాము నాయక్, పులిజాల చంటి, నాగిళ్ల చిన్న అంజి,శివ మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
NLG: నాగార్జున సాగర్: తాజా సమాచారం..26 గేట్లు ఎత్తివేత

నల్గొండ జిల్లా:

నాగార్జున సాగర్ ప్రాజెక్టు కు గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుంది. దీంతో అధికారులు గురువారం సాయంత్రం మొత్తం 26 క్రస్ట్ గేట్ల కు.. 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

లెంకలపల్లిలో కన్నుల పండుగగా ముత్యాలమ్మ తల్లి బోనాలు

నల్లగొండ జిల్లా:

మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో ఇవాళ ఊర బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు ప్రతి ఇంటి నుండి బోనాలతో బయలుదేరి ముత్యాలమ్మ తల్లికి పూజలు నిర్వహించి, అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.

అమ్మవారి దీవెనలతో ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

జగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగుల పంపిణి
నల్లగొండ జిల్లా:
మార్రిగూడ: మండలంలోని యరగండ్లపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం హైదరాబాదులోని జగతి ఫౌండేషన్ ఛైర్మన్ దుర్గా కళ్యాణి, సభ్యులు జ్యోత్స్న రెడ్డి , పూర్ణ చందర్ రెడ్డి , రామచందర్, అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఆగష్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వారు పాఠశాల చిన్నారులకు బ్యాగుల పంపిణీ  చేయడం జరిగినది.

పాఠశాల ప్రధానోపాధ్యాయూరాలు మాలతి, మర్రిగూడ మండల సబ్ ఇన్స్పెక్టర్ రంగారెడ్డి విద్యార్థులకు  బ్యాగులు మరియు నోట్ బుక్స్   అందజేశారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రోత్సాహక  బహుమతులు అందజేయడం చాలా సంతోషమని విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మర్రిగూడ ఎస్ఐ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత చిన్నారులకు విద్యా పట్ల మరియు క్రీడల పట్ల ఆసక్తి కలిగించడానికి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రోత్సాహక బహుమతులు అందజేయడం అభినందనీయనమని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు పలు సూచనలు చేశారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ.. ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల కు నోట్ పుస్తకాలు మరియు బ్యాగులు అందించడం అభినందనీయమని, జగతి ఫౌండేషన్ చైర్మన్ కు ధన్యవాదములు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు యరగండ్లపల్లి గ్రామ ప్రజలు జమ్ముల వెంకటేష్ గౌడ్, సీలివెరీ యాదయ్య,
వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డును ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి
నల్లగొండ జిల్లా:
నాంపల్లి: మండలంలోని  కేతపల్లి నుండి పసునూరుకు వెళ్లే 33 ఫీట్ల రోడ్డులో 15 ఫీట్లను అక్రమంగా ఆ ప్రాంత కొంతమంది రైతులు ఆక్రమించారు. కేతపల్లి గ్రామస్తులు పసునూరు గ్రామానికి బ్యాంకు, ఇతర పనులకు వెళ్లాలంటే ఇబ్బందులకు గురవుతున్నారని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అక్రమంగా రోడ్డును ఆక్రమించిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని  గ్రామ ప్రజలు కోరుతున్నారు.