NLG: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సిల్వర్ జూబ్లీ వేడుక
నల్గొండ పట్టణంలోని లైన్ వాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సిల్వర్ జూబ్లీ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులను ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రావ్య ,డాక్టర్ విశ్వజ్యోతి మాట్లాడుతూ.. ఇద్దరు ముగ్గురు సిబ్బందితో ప్రారంభమైన లైన్ వాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.. అంచలంచెలుగా ఎదిగి నేడు హౌస్ సర్జన్లు సైతం విచ్చేసి వైద్య సేవలు అందించే స్థాయికి ఎదిగిందని అన్నారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా గర్భిణీలకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు వ్యాక్సిన్లు ఇవ్వడం జరుగుతుందని, అనంతరం వారిని జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రికి తీసుకువెళ్లి ప్రసవాలు చేయించడం జరుగుతుందని తెలిపారు.

దీంతోపాటు సాధారణ టీకాల కార్యక్రమాలు, యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తోపాటు సాధారణ వైద్య సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు. ఇవే కాకుండా ప్రభుత్వం చేపట్టే అన్ని రకాల వైద్య ఆరోగ్య కార్యక్రమాలను పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్నామని, ఇందుకోసం ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సూపర్వైజర్లు,మెడికల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి కార్యక్రమాలను చేపడుతున్నారని తెలిపారు.

డెంగ్యూ, చికున్ గున్యా వంటి వైరల్ ఫీవర్ లపై సర్వే నిర్వహించి, జ్వర పీడితులను గుర్తించి, చికిత్సలు అందజేస్తున్నామని, అవసరమైతే వారిని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు పంపిస్తున్నామని చెప్పారు. గతంలో ప్రతిరోజు 20 మంది మాత్రమే ఓపి సేవలు పొందే వారిని, ప్రస్తుతం ప్రతిరోజు 150 మంది ఓపి సేవలు పొందుతున్నారని తెలిపారు. అన్ని రకాల మందులు సైతం అందుబాటులో ఉన్నాయని, ప్రజలందరూ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందించే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ మోహిని, డాక్టర్ మసీన, డాక్టర్ విజయ్ కుమార్, ఏఎన్ఎం సువార్తమ్మ, రేణుక , భాగ్యలక్ష్మి, నలిని, నాగమణి,వినోద, సిబ్బంది జానీ, శ్రీనివాస్,అంబేద్కర్, కళమ్మ, పద్మ, భాగ్యలక్ష్మి, రాజకుమార్, ల్యాబ్ టెక్నీషియన్ సరిత, నాగేందర్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
NLG: కలెక్టరేట్ ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా
నల్లగొండ :రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన  హమీలో ఎలాంటి కొరివిలేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రైతులకు 2 లక్షల  రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ, ఇవాళ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాకు సత్యం సంఘీభావం తెలిపి మాట్లాడారు. రైతులు వ్యవసాయం సాగు కోసం  బ్యాంకులలో చేసిన అప్పులు గత ప్రభుత్వం 1లక్ష రుణమాఫీ చేస్తామని  చెప్పి మాఫీ చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే  ఆగస్టు 15 లోపు 2లక్షలు రుణ మాపీ చేస్తామని హమీ ఇచ్చి, కొంత మంది రైతులకే రుణమాఫీ చెశారు అయితే క్షేత్ర స్థాయిలో కేవలం 50 శాతానికి మించి రుణమాఫీ కాలేదన్నారు. ప్రభుత్వం పెట్టిన రేషన్ కార్డ్ షరతులు రైతులకు శాపంగా మారిందని విమర్శించారు.

గత పదేళ్లుగా ఎవరికీ నూతన రేషన్ కార్డు రాకపోవడంతో ఉమ్మడి కుటుంబంలోనీ రైతులకు రేషన్ కార్డు ఉన్నాయని, మరికొంతమందికి రేషన్ కార్డులు లేకుండా పోయాయని పేర్కొన్నారు. దీని మూలాన రైతులు రుణమాఫీ విషయంలో తీవ్ర నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎలాంటి షరతులు లేకుండా  భూమి పాస్ పుస్తకం ఉన్న అర్హులైన రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో రైతులకు మద్దతుగా సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

రైతు సంఘం  రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉజ్జిని యాదగిరిరావు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు. రుణమాఫీ కి ఆంక్షలు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రెండు లక్షల రుణాలు మాఫీ చేయడంతో పాటు రైతు భరోసా ఇవ్వాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని బ్యాంకుల అధికారులు కావాలని రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, అలాంటి బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎండి మొయినుద్దీన్, గురజా రామచంద్రం, వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు,గీత పనివారాల సంఘం జిల్లా అధ్యక్షులు  పబ్బు వీరస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లోడంగి శ్రవణ్ కుమార్, బలుగూరి నరసింహ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి టి. వెంకటేశ్వర్లు,రైతు సంఘం నాయకులు బుర శేఖర్ బండమీది యాదయ్య, వెంకన్న, పాండు, సుదర్శన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ కు వినతిపత్రం పత్రం అందజేశారు.

        
వచ్చే నెల నుంచి కులగణన: మంత్రి పొన్నం
HYD: రాష్ట్రంలో వచ్చే నెల నుంచి కుల గణన ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇందు కోసం జీవో జారీ చేసి రూ.150 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సాధారణ పరిపాలన విభాగం, పంచాయతీరాజ్, ప్రణాళిక శాఖలలో ఏదైనా ఒక శాఖ ఈ ప్రక్రియను చేపడుతుందని అన్నారు.

బీసీలకు రిజర్వేషన్లు ఖరారైన మేరకు చట్టం చేసి అమలు చేస్తామన్నారు. పార్టీపరంగా బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు.
TG: ఆరోగ్య, మున్సిపల్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆరోగ్య, మున్సిపల్ శాఖలకు సంబంధించి స్పీడ్‌ (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) పై మంగళవారం, సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఆయా శాఖల్లో అత్యవసర, ప్రాధాన్యత కలిగిన పనులను గుర్తించి వాటిపై సమీక్ష, తక్షణ నిర్ణయాలు చేయడమే “స్పీడ్” ఉద్ధేశం అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సమీక్షలో ఆరోగ్య శాఖ మంత్రి  దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇతర అధికారులు పాల్గొన్నారు.
మహిళా సమానత్వం ఇంటి నుంచే మొదలు కావాలి
నల్గొండ:మహిళా సమానత్వం గృహం నుంచే మొదలు కావాలని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ప్లేస్‌మెంట్‌ సెల్‌ డైరెక్టర్‌ డా.వై. ప్రశాంతి అన్నారు. మంగళవారం పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో మహిళా సాధికారికత విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా సమానత్వ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డా. వై. ప్రశాంతి మాట్లాడుతూ.. విద్య ద్వారానే సమానత్వం సాధ్యమవుతుందని అందుకే ప్రతి అమ్మాయి తప్పనిసరిగా చదువుకోవాలని సూచించారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో మహిళా సమానత్వం ఆశించిన స్థాయిలోనే ఉందని అయినా ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా ఎదగాలంటే పురుషులు కూడా స్త్రీలను ప్రోత్సహించే మనస్తత్వాన్ని కలిగియుండాలని కోరారు.

ఆత్మీయ అతిథిగా హాజరైన మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం సూక్ష్మజీవశాస్త్రం అధ్యక్షులు డా.కె. మాధురి మాట్లాడుతూ.. సామాజిక  చైతన్యం ద్వారానే మహిళా సమానత్వం వృద్ధి చెందుతుందని అన్నారు. ముందటి కాలం కంటే ఇప్పుడు స్త్రీల పరిస్థితి ఉన్నతంగా ఉన్నా ఇంకా కొన్ని రంగాలలో వెనకబడే ఉన్నారని, ప్రతికూల అంశాలను సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు సాగాలని అన్నారు. స్త్రీలు తాము ఎందులోను పురుషుల కన్న తక్కువ కాదనే ఆత్మవిశ్వాసాన్ని కలిగియుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డా. సురేష్‌, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ డా. పరంగి రవి, కళాశాల మహిళా సాధికారికత సెల్‌ అధ్యక్షులు డాక్టర్ భాగ్యలక్ష్మి, సభ్యులు శివరాణి, సరిత, మహేశ్వరి, స్రవంతి, శిరీష, సావిత్రి ,డాక్టర్ జ్యోత్స్న మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.
విష జ్వరాలు నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలి
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ హైదరాబాదులో బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్కు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నల్లగొండ జిల్లా కు చెందిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ మాట్లాడుతూ.. విష జ్వరాలు నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందులు అందుబాటులో ఉంచాలని అన్నారు.
TG: లక్ష్య సాధనలో ఆర్థిక కష్టం వారి ప్రతిభకు ఆటంకం కాకూడదు: సిఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ బిడ్డలు దేశాన్ని నడిపించాలి, పరిపాలనలో  మన ప్రాతినిధ్యం ఉండాలి, అఖిల భారత సర్వీస్ అధికారులుగా మన బిడ్డలు ఎంపికై సత్తా చాటాలని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం డా. బి ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూ పి ఏస్ సీ సివిల్స్ ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులైన 135 మంది పేదలకు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తూ చెక్కులు అందించారు సిఎం రేవంత్ రెడ్డి.

లక్ష్య సాధనలో ఆర్థిక కష్టం వారి ప్రతిభకు ఆటంకం కాకూడదనే ఆలోచనతో.. సివిల్స్ ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులైన పేద బిడ్డలకు సింగరేణి సౌజన్యంతో ప్రజా ప్రభుత్వం “రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం” పథకం తెచ్చిందని సిఎం అన్నారు.

NLG: నిరుపేదలకు అండగా ధర్మ రక్షా ఫౌండేషన్
నిరుపేదలకు ఎల్లప్పుడూ ధర్మ రక్షా ఫౌండేషన్ అండగా ఉంటుందని ఫౌండేషన్ అద్యక్షులు అనుముల నవీన్ కుమార్ అన్నారు. గుర్రంపోడు మండలం కొప్పోల్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన గట్టుపెల్లి యాదగిరి రెడ్డి కుటుంబానికి కుటుంబ ఖర్ఛుల నిమిత్తం రూ. 5000/- మరియు పక్షవాతంతో అనారోగ్యం పాలైన పాలోజు అంజయ్య చారి కుటుంబానికి రూ. 5000/- వైద్య ఖర్ఛుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ గౌరవ సలహాదారు కొమ్ము రామదాసు, కార్యదర్శి నేనావత్ శంకర్ నాయక్, ట్రెజరర్ అయితరాజు నాగరాజు, త్రిపురారం మండలం అద్యక్షులు ధనావత్ గోవింద్ నాయక్, ప్రధాన కార్యదర్శి ధనావత్ లచ్చు నాయక్, గ్రామ యువత తేలుకుంట్ల రవి, వెంకటాచారి, రామకృష్ణ, నరేష్, శంకర్ గౌడ్, రామకృష్ణ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
అమిత్ షా కీలక ప్రకటన: లడఖ్‌ లో కొత్తగా  ఐదు జిల్లాలు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు తెలిపారు. వాటిని జన్స్కార్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్తాంగ్ జిల్లాలుగా తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రభుత్వ ఫలాలు ప్రతి ఒక్కరి ఇంటివద్దకు చేకూరేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అమిత్ షా ట్వీట్ చేశారు. అభివృద్ధి చెందిన, సుసంపన్నమైన లడఖ్‌ను నిర్మించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత ఈ నిర్ణయానికి కారణమని షా తన ట్వీట్ లో పేర్కొన్నారు. లడఖ్ ప్రజలకు సమృద్ధిగా అవకాశాలను కల్పించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

కాగా లడఖ్‌లో ప్రస్తుతం రెండు జిల్లాలు మాత్రమే ఉన్నాయి అవి లేహ్, కార్గిల్. తాజాగా మరో ఐదు జిల్లాల ఏర్పాటుతో మొత్తం ఏడు కానున్నాయి. త్వరలో జమ్మూ కశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమిత్ షా ప్రకటన చర్చనీయాంశంగా మారింది.
SRPT: గురుకుల పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు
విద్యార్థులు చిన్ననాటి నుండి భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలని సూర్యాపేట జిల్లా, జాజిరెడ్డి గూడెం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్ అరుణ అన్నారు. సోమవారం కృష్ణాష్టమి పర్వదినం పురస్కరించుకొని పాఠశాల ఆవరణంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అరుణ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు సంస్కృతి, సాంప్రదాయాలను కూడా నేర్చుకొని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని  అన్నారు.