అమిత్ షా కీలక ప్రకటన: లడఖ్‌ లో కొత్తగా  ఐదు జిల్లాలు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు తెలిపారు. వాటిని జన్స్కార్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్తాంగ్ జిల్లాలుగా తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రభుత్వ ఫలాలు ప్రతి ఒక్కరి ఇంటివద్దకు చేకూరేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అమిత్ షా ట్వీట్ చేశారు. అభివృద్ధి చెందిన, సుసంపన్నమైన లడఖ్‌ను నిర్మించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత ఈ నిర్ణయానికి కారణమని షా తన ట్వీట్ లో పేర్కొన్నారు. లడఖ్ ప్రజలకు సమృద్ధిగా అవకాశాలను కల్పించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

కాగా లడఖ్‌లో ప్రస్తుతం రెండు జిల్లాలు మాత్రమే ఉన్నాయి అవి లేహ్, కార్గిల్. తాజాగా మరో ఐదు జిల్లాల ఏర్పాటుతో మొత్తం ఏడు కానున్నాయి. త్వరలో జమ్మూ కశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమిత్ షా ప్రకటన చర్చనీయాంశంగా మారింది.
SRPT: గురుకుల పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు
విద్యార్థులు చిన్ననాటి నుండి భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలని సూర్యాపేట జిల్లా, జాజిరెడ్డి గూడెం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్ అరుణ అన్నారు. సోమవారం కృష్ణాష్టమి పర్వదినం పురస్కరించుకొని పాఠశాల ఆవరణంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అరుణ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు సంస్కృతి, సాంప్రదాయాలను కూడా నేర్చుకొని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని  అన్నారు.

నాడు సమస్య.. నేడు పరిష్కారం
మునుగోడు నియోజకవర్గం, మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో కనగల్ నుండి మాల్ రహదారి గుంతలమయమై   ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. అటు వైపు గా వెళ్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గుంతలమయమైన రోడ్డు ను చూసి వెంటనే గుంతలు పూడ్చాలని  ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆదేశాలతో, యుద్ధప్రాతిపదికన ఇవాళ లెంకలపల్లి గ్రామంలో గుంతల మాయమైన రోడ్డు ను అధికారులు పూడ్చి ప్రయాణికులకు వినియోగంలోకి తెచ్చారు. నియోజకవర్గంలో ఏ ఇబ్బంది ఉన్నా ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి అని ఎమ్మెల్యే చెబుతూనే.. ఆ సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారు.
దీంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యశాల సమావేశం
సూర్యాపేట జిల్లా:
కోదాడ పట్టణంలోని కాశీ విశ్వనాధ మినీ ఫంక్షన్ హాల్ లో, ఈరోజు బిజెపి సూర్యాపేట అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి అధ్యక్షతన 'భారతీయ జనతా పార్టీ 'సభ్యత్వ-2024 ' నమోదు కార్యశాల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు మరియు పార్లమెంట్ ప్రభారీ చాడ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. సెప్టెంబర్ మొదటివారం నుండి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు మొదలవుతాయని, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ సమన్వయంతో పనిచేసి సూర్యాపేట జిల్లాలో అధిక సంఖ్యలో సభ్యత్వాలు చేయాలన్నారు.

100 సభ్యత్వాలు చేసిన వారికే క్రియాశీల సభ్యత్వం వస్తుందని క్రియాశీలక సభ్యత్వం వచ్చిన వారికే మండల, జిల్లా స్థాయిలో పదవులు వస్తాయని కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి పోలింగ్ బూత్ లో సభ్యత్వాలు చేయాలని అన్నారు.

ఈ సమావేశములో జిల్లా సభ్యత్వ కోఆర్డినేటర్స్, జిల్లాలోని బిజెపి రాష్ట్ర నాయకులు, అసెంబ్లీ కన్వీనర్స్ బిజెపి జిల్లా పదాధికారులు, జిల్లాలోని మండల అధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఉత్తమ డిప్యూటీ ఆర్ఎం అవార్డు అందుకున్న నల్లగొండ డిప్యూటీ ఆర్ఎం
నల్లగొండ డిప్యూటీ ఆర్ఎం శివశంకర్ రాష్ట్ర ఉత్తమ డిప్యూటీ ఆర్ఎం  అవార్డు అందుకున్నారు.ఇవాళ హైదరాబాదులోని ఆర్టీసీ కళాభవన్ లో జరిగిన ఉత్తమ ఉద్యోగుల ప్రగతి చక్రం పురస్కార ప్రధానోత్సవంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎండి సజ్జనార్ అవార్డును అందజేశారు. నల్లగొండ రీజియన్ లో గ్యారేజ్ మెయింటేనెన్స్ విభాగాన్ని పటిష్ట పరిచి, అహర్నిశలు గ్యారేజీ ఇన్చార్జిలకు గైడ్ చేస్తూ గ్యారేజీ ప్యారా మీటర్లను పెంపొందించినందుకు వారు అవార్డు అందుకున్నారు.
అవార్డు సాధించిన మీడియా ఫోటోగ్రాఫర్లను అభినందించిన కలెక్టర్ మరియు డిపిఆర్ఓ

నల్గొండ: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా 2024 ఉత్తమ ఛాయాచిత్ర పోటీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోటీలో అవార్డులు గెలుపొందిన నల్గొండ జిల్లా ఆంధ్రజ్యోతి స్టాప్ ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల విజయ్ ని, ఉమ్మడి నల్గొండ జిల్లా హాన్స్ ఇండియా ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల శ్రీనివాస్ ను శనివారం, నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మరియు డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు అభినందించారు.

బొట్టుగూడ హైస్కూల్ విద్యార్థుల క్షేత్రస్థాయి పర్యటన
విద్యార్థిని విద్యార్థులలో సృజనాత్మకత, విషయపరిజ్ఞానం, ప్రసిద్ధిగాంచిన ప్రదేశాల పట్ల అవగాహనను పెంపొందించే పనిలో భాగంగా, శనివారం నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయినీల మరియు విద్యార్థిని విద్యార్థుల బృందం పానగల్లు పర్యాటక కేంద్రాన్ని  సందర్శించారు.

ఈ మేరకు ఉపాధ్యాయినీలు  మాట్లాడుతూ.. జిల్లా కేంద్రానికి సమీపంలో గల పానగల్ లో ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఛాయా సోమేశ్వరాలయం, ఉదయ సముద్రం రిజర్వాయర్, పురాతన కట్టడాలను విద్యార్థులకు చూపించి  వాటి విశిష్టతను విద్యార్థులకు తెలియజేసినట్లు తెలిపారు.

పాఠశాల టీచర్లు  జయ, ప్రసన్న, కుశలకుమారి, చంద్రకళ బృందం మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
చికిత్స పొందుతున్న జిట్టా బాలకృష్ణా రెడ్డిని పరామర్శించిన కేటీఆర్
TG: అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డిని శనివారం  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.

ఆయనకు అందిస్తున్న వైద్యం వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.

అదే విధంగా జిట్టా బాలకృష్ణా రెడ్డి కుటుంబ సభ్యుల తోనూ కేటీఆర్ మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, జిట్టా కోలుకుంటున్నారని డాక్టర్లు చెప్పినట్లు వారికి సూచించారు.
NLG: మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు
నల్గొండ:  జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మారుపాక గ్రామ మాజీ సర్పంచ్ కీర్తిశేషులు మేరెడ్డి సురేందర్ రెడ్డి జయంతి ని బంధుమిత్రులు అభిమానులు మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ భవన్  లో సీనియర్ నాయకులు లయన్ గట్టుపల్లి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో  జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ మేరెడ్డి వెంకట్ రెడ్డి మాజీ ఎంపీటీసీ చిత్రం జీవన్ రావు, చిత్రం శ్రీను, సింగం రామలింగయ్య, కారింగు నవీన్, సురేష్, వెంకట్ రెడ్డి, లింగయ్య, రాంబాబు, అశోక్, లైన్స్ క్లబ్ మెంబర్స్ సరళ, మామిడిపల్లి దీపిక, తదితరులు పాల్గొన్నారు.
NLG: అవార్డులు పొందిన ఫోటోగ్రాఫర్లను అభినందించిన కలెక్టర్
నల్లగొండ: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా 2024 ఉత్తమ ఛాయా చిత్ర పోటీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోటీలో మూడు అవార్డులు గెలుపొందిన నల్గొండ జిల్లా ఆంధ్రజ్యోతి స్టాప్ ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల విజయ్, నల్గొండ జిల్లా హాన్స్ ఇండియా ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల శ్రీనివాస్  లను శనివారం నాడు నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మరియు డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు  అభినందించారు.