ఇంద్రపాలనగరం లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధిలోని ఇంద్రపాల నగరం గ్రామంలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా మండల నరసింహస్వామి బాబా ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకృష్ణుని పూజ గోవుల పూజ నిర్వహించడం జరిగింది .ఈ సందర్భంగా శ్రీకృష్ణుని అవతార లీలలు గురించి వివరించడం జరిగింది .శంకర్ గుట్ట ప్రాంతంలో గోశాలను ఏర్పాటు చేసే ఆలోచన వారు వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో తవుటం శంకరయ్య గురు స్వామి రుద్రాల గోపాల్ స్వామి రచ్చ దానయ్య జోగు నరసింహ పగడాల వేణుగోపాల్ మాజీ వార్డ్ నెంబర్ మండల అనిత జానయ్య బిజెపి మండల అధ్యక్షులు పల్లపు దుర్గయ్య బిజెపి ఉపాధ్యక్షులు బోనగిరి వెంకటేశం పలుగుల మల్లేశం చెవ్వ శ్రీనివాస్ నాగరాజు మహిళా భక్తులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 1న సంగారెడ్డిలో బాంసేఫ్ 11వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి : రాష్ట్ర అధ్యక్షుడు బట్టి చెన్నయ్య

సెప్టెంబరు 1న సంగారెడ్డి అంబేద్కర్ భవన్ లో బాంసెఫ్ తెలంగాణ రాష్ట్ర 11 వ మహసభలు నిర్వహిస్తున్నామని బాంసెఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బట్టి చెన్నయ్య తెలిపారు. సోమవారంనాడు భువనగిరి అంబేద్కర్ విగ్రహం వద్ద మహసభ ల పొస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ ఈ మహసభల ను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ప్రారంభిస్తారని తెలిపారు. ముఖ్య అధిది గా బాంసెఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి మాన్యబర్ డి.అర్.ఓహోల్ హజరవతరని తెలిపారు. ఒబిసి కులగణన చెయకపొవడం రాజ్యాంగ విరుద్దమన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామన్న బిజెపిని ఎన్నికలలో ప్రజలు కట్టడి చెసి తగిన బుద్ది చెప్పారన్నారు. ఓబిసిల కులాధిరిత జనగణన చేయకపోవడం రాజ్యాంగం కల్పించిన హక్కులను అధికారాలను ఉల్లంఘించడమేనన్నారు.. ఈ మహాసభలో ఈవిఎం లను నిషెధించి బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరపాలని,బిసి జనగణణన,ప్రవేటికరణ తదితర అంశాల పై చర్చించి భవిష్యత్తు కార్యచరణ ను రూపొందిస్తామని చెన్నయ్య తెలిపారు.ఈ మహసభలను బహుజన మూల వాసులు విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. డిబిఎఫ్ జాతీయ కార్యద్శి పి.శంకర్ మాట్లడుతూ ఇటివల రాష్ట్రం లో ఎస్సీ ఎస్టీ ల పై లాకప్ హింస పెరిగిపొతున్నాయన్నారు.లాకప్ హింస కు పాల్పపడుతున్న పొలీసుల పై ఎస్సీ,ఎస్టి అట్రాసిటి కేసులు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పియంసి రాష్ట్ర కన్వీనర్ ఎస్.శివలింగం తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ: జలేందర్ సార్ కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్న బంధు మిత్రులు

నల్గొండ జిల్లా కేంద్రంలోని కె.బి తండా గ్రామానికి చెందిన జలంధర్ సార్ కుమార్తె వివాహం  ,స్థానిక జూలకంటి ఇంద్రా రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా గ్రామస్తులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు . స్థానిక మాస్టర్ స్కూల్స్ కరస్పాండెంట్ ఫయాజ్ సార్, మహమ్మద్ రఫీ, రాజమౌళి ,మహ్మద్ రఫీ, రాజేష్, విజయ్ కుమార్, శివకుమార్, బాలాజీ, బాలకిషన్, బంధుమిత్రులు తదితరులు, పాల్గొని, నూతన వధూవలను ఆశీర్వదించారు.





పిల్లల పై తల్లిదండ్రుల నిఘా ఉండాలి, ఇంద్రపాలనగరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పేరెంట్స్ &టీచర్స్ మీటింగ్

ఇంద్రపాలనగరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం నాడు పేరెంట్స్ & టీచర్స్ మీటింగ్ స్కూల్ హెడ్మాస్టర్ నిర్మల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ గొల్లపల్లి నరసింహ మరియు రిటైర్డ్ హై స్కూల్ హెడ్మాస్టర్ బిక్షపతి పాల్గొన్నారు. పాఠశాల పూర్వ విద్యార్థి సారయ్య హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పిల్లలు వాళ్ల జీవితంలో ఉన్నత స్థాయిలో ముందుకు వెళ్లాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమని తెలిపారు. గురువులు బాధ్యతయుతంగా పిల్లల్ని చదివంచాల్సిన అవసరం ఉందని, పిల్లల అభివృద్ధి సామాజికంగా విద్యాపరంగా ఉన్నతమైనటువంటి స్థానంలో తీర్చిదిద్ది మన గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలను జిల్లాలోనే ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దాలని, దీనికి గ్రామ యువకులు విద్యావంతులు ఉద్యోగస్తులు అందరం కలిసి మనబడిని బాగు చేసుకునే బాధ్యత మనదే అని ముందుకు రావాలని ప్రభుత్వ బడి అంటే ప్రజల బడి అని మనబడిని మనమే బాగు చేసుకోవాలని తెలియజేశారు. తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల శ్రద్ధ చూపించి బాధ్యతయుతంగా ఉండాలని తెలియజేశారు. ఈ క్రమంలో పిల్లల తల్లిదండ్రులు కూడా స్కూల్లో ప్రస్తుతం ఉన్నటువంటి చిన్న చిన్న లోటుపాట్ల ఏమైనా గమనించి ఉంటే, వారి దృష్టికి వచ్చిన తెలియజేయాలన్నారు. అన్నింటిని త్వరలోనే పూర్తి స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదే విధంగా గ్రామానికి చెందిన కొంత మంది యువకులు తమ వంతు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తామని తెలిపారు.

స్వామి రామానంద తీర్థ సంస్థలో ఉచిత విశిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు : పి ఎస్ ఎస్ ఆర్ లక్ష్మి డైరెక్టర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆద్వర్యంలో స్వామి రామానంద తీర్థ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని సంస్థ డైరెక్టర్ పి ఎస్ ఎస్ ఆర్ లక్ష్మీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా "దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన" పథకం ను గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. బేసిక్ కంప్యూటర్స్ (డాటా ఎంట్రీ ఆపరేటర్) కోర్సును 3 నెలల పాటు ఉచిత శిక్షణ, వసతి మరియు భోజనం ఉచితంగా అందించి, శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామన్నారు. ఇంటర్ పాసైన,18-35 సంవత్సరాల లోపు వయస్సు కల్గిన యువతీ యువకులు సెప్టెంబర్ 09-2024 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు. ఎస్సీ/ ఎస్టీ/ మైనారిటీ అభ్యర్థులకు ప్రాదాన్యత ఉంటుందని ఆమె తెలిపారు. పూర్తి వివరాలకు పోన్ నెంబర్ (1) 9133908000 (2) 9133908111 (3) 9133908222 లను సంప్రదించాలని ఆమె కోరారు.
వలిగొండ లో ఆర్థిక సహాయం అందజేసిన మిత్రులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణానికి చెందిన వేముల లక్ష్మయ్య చిన్న కుమారుడు వేముల నరేష్ ( రైల్వే పోలీస్ కానిస్టేబుల్ ) కొద్ది రోజుల క్రితం మరణించడం జరిగింది. వేముల నరేష్ దశదినకర్మ రోజున చిన్ననాటి మిత్రులు 2004 -2005 ( బ్యాచ్ ) సంవత్సరం కు చెందిన మిత్రులు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం గా 1,08,000 (లక్ష ఎనిమిది వేల రూపాయలు) వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది .వేముల నరేష్ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కునపూరి. శ్రీశైలం , బసోజు .బాలా చారి, రచ్చ .ఆనంద్ , బొడిగె.రాజు, మిర్యాల. అశోక్ ,మాల్గ. కృష్ణ, పాండు, బొడిగె.లింగస్వామి, కిరణ్, ఉపేందర్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
చైతన్య యాత్రను విజయవంతం చేయండి: మారగోని శ్రీనివాస్ గౌడ్ వలిగొండ మండల ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు

యాదాద్రి భువనగిరి జిల్లా:తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సెప్టెంబర్ ఒకటవ తారీఖున భువనగిరిలో రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం బైకు ర్యాలీ ఉంటుందని వలిగొండ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షులు మారగోని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన ప్రతి ఉద్యమకారుడు చైతన్య యాత్రను విజయవంతం చేయాలని కోరారు.
స్వచ్ఛంద సంస్థల సేవలను సద్వినియోగం చేసుకోవాలి : సామాజిక కార్యకర్త కేతావత్ చిరంజీవి

స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, దాతలు అందించే ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సామాజిక కార్యకర్త కేతావత్ చిరంజీవి అన్నారు. శుక్రవారం ఆయన భువనగిరి మండల పరిదిలోని ఆకుతోటబావితండా గ్రామంలో ఇటీవల మరణించిన కేతావత్ మంగ్త నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం "కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ చరణ్" అందించిన అయిదు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని మృతిని భార్య కేతావత్ రాములమ్మ కు అందించారు. ఈ కార్యక్రమంలో కేతావత్ మురళి, కేతావత్ రాజు నాయక్, దరావత్ పాండు , ముడావత్ శ్రీనివాస్, కేతవత్ మహేందర్, కేతావత్ సుధాకర్, కేతావత్ నరేందర్ , కేతావత్ భాషా నాయక్, మురళి, సురేష్, భాస్కర్, శివ, కృష్ణ,రవి, సుధాకర్, నాగి శ్రీనివాస్, వ కేతావత్ పూల్ సింగ్, బీలు, కృష్ణ, రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రిలో బిఆర్ఎస్ పూజలు... నీళ్లు చల్లి శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు...

యాదగిరిగుట్ట కొండపైకి బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి,ఎమ్మెల్యేలు కొండపైకి వచ్చి పాప పరిహార సంకల్పం చేయడంతో వారు చేసిన పూజలను ప్రక్షాళన చేయాలనే ఆలోచనలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్,బీర్ల ఐలయ్య గారు కొండపైన పూర్తిగా మాడవీధుల్లో పరిసర ప్రాంతాల్లో నీళ్లు చల్లి శుద్ధి చేశారు.అనంతరం కొండకింద మెట్లమార్గం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో బీర్ల ఐలయ్య గారు మాట్లాడుతూ ఎలక్షన్స్ లో మాట ఇచ్చిన ప్రకారం 2లక్షల ఋణమాఫి చేసాం,ఇప్పటికి 34లక్షల మంది రైతులకు రుణమాఫీ డబ్బులు రైతుల బ్యాంక్ అకౌంట్లో జమచేయడం జరిగిందన్నారు.డ్రామారావు చేసే పనులు చెప్పే మాటలు అన్ని బూటకపు మాటలని,చేసే పనులు మొత్తం ధమాక్ లేకుండా చేస్తాడని అన్నారు.అలాగే మేము చెప్పిన ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు అయిన 10నెలల్లోనే రైతులకు రుణమాఫీ చేసాం,2రోజుల్లోనే మహిళలకు ఉచితబస్సు సౌకర్యం,అర్హులకు ఉచిత విద్యుత్ ఏర్పాటు చేశామని తెలిపారు.కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 3ఎకరాల భూమి ఏది,దళితుడు సీఎం అయ్యాడా,నువ్వు పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టే లేదని హేళనగా నిరసన చేశావు అందుకే నిన్ను రాష్ట్ర ప్రజలు డ్రామారావు అని అంటున్నారని అన్నారు.ఆరోజు మీ మామ కేసీఆర్ దళితున్ని సీఎం చేస్తా లేదంటే తల నరుక్కుంటా అన్నాడు మరి దళితున్ని సీఎం చేశాడా మీ మామ అప్పుడే ఒక కత్తి ఇచ్చి తల నరుక్కోమంటే అయిపోయేది,ఆ తల భువనగిరి గుట్టకు వేలాడ దీస్తే ఇప్పుడు నువ్వు అడిగే ప్రశ్నకు అర్థం ఉండేది డ్రామారావు.మీరు 10సంవత్సరాలు పరిపాలించారు,ఎన్నిహామీలు నెరవేర్చారు,మీరు చేసిన ప్రతీ అభివృద్ధి కార్యక్రమాలలో 50శాతం మీ అకౌంట్లో మిగతా 50శాతం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.అన్ని నిధులు దోచుకున్నారని ఆరోపించారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య .

సెంట్రల్ లైజ్ కిచెన్ విధానం రద్దు చేయాలి: AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఇమ్రాన్ డిమాండ్

సెంట్రాలైస్ కిచెన్ విధానం రద్దు చేసి హరే రామ హరే కృష్ణ అనే స్వచ్చంద సంస్థకు మధ్యాహ్న భోజన పథకం ఏజన్సీలు ఇవ్వరాదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రోజున మధ్యన బోజన వంట కార్మికుల సమస్యలు పరిష్కారించాలని డిఇఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ వెంకటరమణ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్బంగా ఇమ్రాన్ మాట్లాడుతూ విద్యార్థి తరగతితొ సంబంధం లేకుండా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు రూ.25 రూపాయలకు పెంచాలని, 23 సంవత్సరాలుగా పని చేస్తున్న కార్మికులను వివిధ కారణాలతో తొలగించ కుండా ప్రత్యేక GO విడుదల చెయ్యాలని, వంట గ్యాస్, కోడిగుడ్లు మరియు నిత్యావసర వస్తువులు ప్రభుత్వమే సరఫరా చెయ్యాలని, రాష్ట్ర ప్రభుత్వo ఎన్నికల సందర్బంగా వంట కార్మికులకు నెలకు గౌరవ వేతనాo రూ.10 వెలు ఇస్తామన్నాహామీని వెంటనే అమలు చేయాలని, హరే రామ హరే క్రిష్ణ ఫౌండేషన్ కు మధ్యన బోజన పథకం అప్పచెప్పి ఆలోచన విరమించుకోవాలని రాష్ట వ్యాప్తంగా ఉన్న 54200 మంది వంట కార్మికులకు పని భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, మధ్యాహ్న భోజన పథకం జిల్లా కార్యదర్శి ముంతాజ్ బేగం, నాయకులు జిన్న రాజమ్మ, బుచ్చమ్మ, కృష్ణ, సుగుణ, అండాలు తదితరులు పాల్గొన్నారు.