స్వచ్ఛంద సంస్థల సేవలను సద్వినియోగం చేసుకోవాలి : సామాజిక కార్యకర్త కేతావత్ చిరంజీవి

స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, దాతలు అందించే ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సామాజిక కార్యకర్త కేతావత్ చిరంజీవి అన్నారు. శుక్రవారం ఆయన భువనగిరి మండల పరిదిలోని ఆకుతోటబావితండా గ్రామంలో ఇటీవల మరణించిన కేతావత్ మంగ్త నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం "కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ చరణ్" అందించిన అయిదు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని మృతిని భార్య కేతావత్ రాములమ్మ కు అందించారు. ఈ కార్యక్రమంలో కేతావత్ మురళి, కేతావత్ రాజు నాయక్, దరావత్ పాండు , ముడావత్ శ్రీనివాస్, కేతవత్ మహేందర్, కేతావత్ సుధాకర్, కేతావత్ నరేందర్ , కేతావత్ భాషా నాయక్, మురళి, సురేష్, భాస్కర్, శివ, కృష్ణ,రవి, సుధాకర్, నాగి శ్రీనివాస్, వ కేతావత్ పూల్ సింగ్, బీలు, కృష్ణ, రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రిలో బిఆర్ఎస్ పూజలు... నీళ్లు చల్లి శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు...

యాదగిరిగుట్ట కొండపైకి బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి,ఎమ్మెల్యేలు కొండపైకి వచ్చి పాప పరిహార సంకల్పం చేయడంతో వారు చేసిన పూజలను ప్రక్షాళన చేయాలనే ఆలోచనలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్,బీర్ల ఐలయ్య గారు కొండపైన పూర్తిగా మాడవీధుల్లో పరిసర ప్రాంతాల్లో నీళ్లు చల్లి శుద్ధి చేశారు.అనంతరం కొండకింద మెట్లమార్గం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో బీర్ల ఐలయ్య గారు మాట్లాడుతూ ఎలక్షన్స్ లో మాట ఇచ్చిన ప్రకారం 2లక్షల ఋణమాఫి చేసాం,ఇప్పటికి 34లక్షల మంది రైతులకు రుణమాఫీ డబ్బులు రైతుల బ్యాంక్ అకౌంట్లో జమచేయడం జరిగిందన్నారు.డ్రామారావు చేసే పనులు చెప్పే మాటలు అన్ని బూటకపు మాటలని,చేసే పనులు మొత్తం ధమాక్ లేకుండా చేస్తాడని అన్నారు.అలాగే మేము చెప్పిన ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు అయిన 10నెలల్లోనే రైతులకు రుణమాఫీ చేసాం,2రోజుల్లోనే మహిళలకు ఉచితబస్సు సౌకర్యం,అర్హులకు ఉచిత విద్యుత్ ఏర్పాటు చేశామని తెలిపారు.కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 3ఎకరాల భూమి ఏది,దళితుడు సీఎం అయ్యాడా,నువ్వు పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టే లేదని హేళనగా నిరసన చేశావు అందుకే నిన్ను రాష్ట్ర ప్రజలు డ్రామారావు అని అంటున్నారని అన్నారు.ఆరోజు మీ మామ కేసీఆర్ దళితున్ని సీఎం చేస్తా లేదంటే తల నరుక్కుంటా అన్నాడు మరి దళితున్ని సీఎం చేశాడా మీ మామ అప్పుడే ఒక కత్తి ఇచ్చి తల నరుక్కోమంటే అయిపోయేది,ఆ తల భువనగిరి గుట్టకు వేలాడ దీస్తే ఇప్పుడు నువ్వు అడిగే ప్రశ్నకు అర్థం ఉండేది డ్రామారావు.మీరు 10సంవత్సరాలు పరిపాలించారు,ఎన్నిహామీలు నెరవేర్చారు,మీరు చేసిన ప్రతీ అభివృద్ధి కార్యక్రమాలలో 50శాతం మీ అకౌంట్లో మిగతా 50శాతం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.అన్ని నిధులు దోచుకున్నారని ఆరోపించారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య .

సెంట్రల్ లైజ్ కిచెన్ విధానం రద్దు చేయాలి: AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఇమ్రాన్ డిమాండ్

సెంట్రాలైస్ కిచెన్ విధానం రద్దు చేసి హరే రామ హరే కృష్ణ అనే స్వచ్చంద సంస్థకు మధ్యాహ్న భోజన పథకం ఏజన్సీలు ఇవ్వరాదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రోజున మధ్యన బోజన వంట కార్మికుల సమస్యలు పరిష్కారించాలని డిఇఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ వెంకటరమణ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్బంగా ఇమ్రాన్ మాట్లాడుతూ విద్యార్థి తరగతితొ సంబంధం లేకుండా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు రూ.25 రూపాయలకు పెంచాలని, 23 సంవత్సరాలుగా పని చేస్తున్న కార్మికులను వివిధ కారణాలతో తొలగించ కుండా ప్రత్యేక GO విడుదల చెయ్యాలని, వంట గ్యాస్, కోడిగుడ్లు మరియు నిత్యావసర వస్తువులు ప్రభుత్వమే సరఫరా చెయ్యాలని, రాష్ట్ర ప్రభుత్వo ఎన్నికల సందర్బంగా వంట కార్మికులకు నెలకు గౌరవ వేతనాo రూ.10 వెలు ఇస్తామన్నాహామీని వెంటనే అమలు చేయాలని, హరే రామ హరే క్రిష్ణ ఫౌండేషన్ కు మధ్యన బోజన పథకం అప్పచెప్పి ఆలోచన విరమించుకోవాలని రాష్ట వ్యాప్తంగా ఉన్న 54200 మంది వంట కార్మికులకు పని భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, మధ్యాహ్న భోజన పథకం జిల్లా కార్యదర్శి ముంతాజ్ బేగం, నాయకులు జిన్న రాజమ్మ, బుచ్చమ్మ, కృష్ణ, సుగుణ, అండాలు తదితరులు పాల్గొన్నారు.
దళిత మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నాం; మాల మహానాడు

తిరుమలగిరి పట్టణంలో చేపట్టిన రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని నిరసనలో పాల్గొన్న తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌పై దాడి చేసిన కాంగ్రెస్ నేతలను సహించేది లేదని, వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వలిగొండ మండల మాల మహానాడు నాయకులు కూచిమల్ల సుధాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో రుణమాఫీ చేయాలని చేపట్టిన రైతు నిరసన దీక్షపై దాడి చేసిన కాంగ్రెస్ నేతలు రాళ్లతో, కోడి గుడ్లతో దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారని గురువారం విలేకరుల సమావేశంలో ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరునికి ఉందని గుర్తు చేశారు. మాజీ దళిత ఎమ్మెల్యే కాబట్టే ఇలాంటి దాడులకు పాల్పడ్డారని, మాజీ దళిత ఎమ్మెల్యే అంటే చులకనబావం ఎందుకని ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. ఇదేనా ప్రజా పాలన? అని ఎద్దేవా చేశారు. ఇకనైనా దళితులపై దాడులు మానుకోవాలని హెచ్చరించారు.
రెక్కలు తెగిన బాల్యానికి బాధ్యులు ఎవరు...బంగారు భవితనందించేది ఎవరు...

పాపం, పుణ్యం,ప్రపంచ మార్గం కష్టం, సౌఖ్యం,శ్లేషార్థాలూ ఏమీ ఎరుగని పువ్వుల్లారా... అయిదారేడుల పాపల్లారా.... మెరుపు మెరిస్తే వాన కురిస్తే,ఆకసమున హరివిల్లు విరిస్తే, అవి మీకే అని ఆనందించే కూనల్లారా.... మీదే మీదే సమస్త విశ్వం మీరే లోకపు భాగ్యవిధాతలు... ఉడతల్లారా! బుడతల్లారా! ఇది నా గీతం వింటారా.... అంటూ కల్మషం లేని బాల్యానికి అక్షరాల ఆకారం ఇచ్చాడు మహాకవి శ్రీశ్రీ కానీ నేడు ఆ బాల్యానికి భరోసా ఇచ్చే వారు కరువౌతున్నారని ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. సరిగ్గా నేటికీ 965 రోజుల క్రితం కుటుంబ పెద్దదిక్కుగా ఉన్న తండ్రిని కోల్పోయి బతుకు తెరువు కోసం జిల్లా కేంద్రానికి వచ్చారు ఈ కుటుంబం. వీరి బాధను అర్థం చేసుకొని సామాజిక కార్యకర్త ఒకరు 1098 కు పోన్ చేసి వీరికి రక్షణ తో పాటు పిల్లలకు చదువు, తల్లికి ఉపాధి కల్పించాలని అధికారులను కోరారు. అధికారులు మాత్రం వీరిని తీసుకెళ్ళి వివరాలు రాసుకుని వదిలి వేసారు. తినడానికి తిండి లేక, ఉపాధి అవకాశాలు లేక భిక్షాటన చేయడం మొదలుపెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ వీరు మద్యానికి, డిపో కల్లుకు బానిసలయ్యారు.అంతేకాదు అప్పుడప్పుడు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు సమాచారం. పిల్లల సంక్షేమం కోసం, ముఖ్యంగా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకోసం ఎన్నో సంక్షేమ పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నా, ఆపథకాలు వీరికి అందకపోవడం లో ఆంతర్యం ఏమిటి? దేశంలోని 6-14 సంవత్సరాల వయస్సు పిల్లల కొరకు తెచ్చిన "నిర్భంద విద్యా హక్కు చట్టం- 2009" కి వీరు అర్హూలు కారా ? అని సామాజిక కార్యకర్తలు అడుగుతున్నారు. పసి పిల్లల సంరక్షణ కోసం అంగన్వాడీ కేంద్రాలు, బాలసదనం, మరియు చైల్డ్ కేర్ సెంటర్లు ఎన్ని ఉన్నా, వీరిని పట్టించుకునే వారు కరువయ్యారు. అనాధలైన, తప్పిపోయిన 6 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలను గుర్తించి వారిని తల్లిదండ్రులకు అప్పగించాలని, లేదా బాలసదనం లో ఉంచి చదివించాలని సుప్రీం కోర్టు 2016 లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా ఏటా జనవరి ఒకటో తేదీ నుంచి 31 వ తేదీ వరకు "ఆపరేషన్ స్మైల్" పేరుతో జులై ఒకటో తేదీ నుంచి 31 వ తేదీ వరకు "ఆపరేషన్ ముస్కాన్" పేరుతో ప్రత్యేక దాడులు నిర్వహించి పిల్లలను గుర్తించి బాలల సంరక్షణ కమిటీ కి అప్పగిస్తున్నారు. కానీ జిల్లా కేంద్రం నగరం నడిబొడ్డున ఉన్న భువనగిరి బస్ స్టేషన్ లో భిక్షాటన చేస్తూ , దుర్బర జీవితం గడుపుతున్న,వీరిని మాత్రం గుర్తించకపోవడం విడ్డూరంగా ఉందని సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. బాల్యం ఎంతో విలువైనది. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకొనే భాద్యతలు తల్లిదండ్రుల పైనా, మరియు ప్రభుత్వల పైనా ఉంది. ఇప్పటికైనా భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించి, తగిన వసతి కల్పించి, పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించాలని, తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా ఆమె కు మెరుగైన చికిత్స చేయించాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. *పిల్లలను రక్షించండి, లేకుంటే సంఘం విద్రోహ శక్తులుగా మారే ప్రమాదం ఉంది* *కొడారి వెంకటేష్*. సామాజిక కార్యకర్త. గత రెండు సంవత్సరాలుగా భువనగిరి బస్ స్టేషన్ లో భిక్షాటన చేస్తూ గడుపుతున్న కుటుంబం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ , దామెర ప్రాంతానికి చెందిన వారు. తల్లి హసీనా (30). పిల్లలు, రషీద్ (11) హైమ్మద్ (9) లు ఇప్పటికే మద్యానికి బానిసలయ్యారని, వీరిని ఇలాగే వదిలి పెడితే భవిష్యత్తులో సంఘ విద్రోహ శక్తులుగా మారే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీరికి మంచి జీవితాన్ని ఇవ్వడానికి కృషి చేయాలని కోరారు.

నాగారం లో కట్ట లక్ష్మమ్మకి నివాళులర్పించిన మాలమహానాడు నేతలు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నాగారం గ్రామంలో కట్ట అశోక్ మాతృమూర్తి కట్ట లక్ష్మమ్మ అనారోగ్యం తో మృతి చెందారు. బుధవారం నాగారంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా మాల మహానాడు అధ్యక్షులు పెరుమాళ్ళ యాదగిరి, వలిగొండ మండలం మాల మహానాడు అధ్యక్షులు నీలం నరేందర్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వల్లమల్ల రఘుపతి, సంగిశెట్టి నరసయ్య, బుంగ రాములు, సంభోగు బాలస్వామి, వల్లమాల రత్నయ్య, సలబద్రి మహేందర్, గడ్డం ప్రకాష్, సంగిశెట్టి చంద్రయ్య ,సంగిశెట్టి విజయ్ కుమార్, సంభోగు విజయ్ కుమార్, బంధువులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

దివిస్ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకొని బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం డి జహంగీర్ డిమాండ్

దివిస్ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకొని బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్ చేశారు. బుధవారం రోజున చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన బాధిత రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ కె. హనుమంతు జెండగే కు వినతిపత్రం సమర్పించి దివిస్ కంపెనీ వల్ల రైతులకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు. వ్యర్థ రసాయనాలతో వస్తున్న బోర్ నీళ్లను వాటర్ బాటిల్స్ తో కలెక్టర్ కు చూపించారు. క్షేత్రస్థాయిలో పరిశీలనకు రావాలని కలెక్టర్ ను కోరగా కలెక్టర్ స్పందించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ ప్రతి ఏటా లక్షల రూపాయలు విలువ చేసే పంటల ను, పశుసంపదను నష్టపోతున్నారని అన్నారు. దివిస్ కంపెనీ ఆవరణలోనే బోర్ వెల్స్ ద్వారా సుమారు150 బోర్లను వందలాది ఫీట్ల లోతు వేయించి వాటిల్లో కంపెనీ నుండి వెలువడే వ్యర్థ రసాయనాలను పంపడంతో కంపెనీ చుట్టూతా ఉన్న భూముల్లోని భూగర్భ జలాలు మొత్తం కలుషితమై పంట నష్టం, ప్రాణ నష్టానికి కారణం అవుతున్నారని అన్నారు. వేసిన పంటలు వ్యర్ధ రసాయనాల వల్ల మాడి మసైపోతున్నాయని అన్నారు. పశువులు ఈ నీళ్లను తాగడం వల్ల చనిపోతున్నాయని అన్నారు. పశువులకు నీళ్లు తాపడానికి రైతులు ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేసి తాపుతున్నారన్నారు. ఈ కంపెనీ వెదజల్లే విషవాయువులను, వ్యర్థ రసాయనాలను ఆపడానికి సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటలు, పశు పోషణ కరువై రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. బాధిత రైతులకు ఒక ఎకరానికి 50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతుల పక్షాన సిపిఎం ఉధృతమైన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి, బాధిత రైతులు సామ జనార్దన్ రెడ్డి, గుండెబోయిన బాలకృష్ణ, అనంతుల రాములు, శ్రీరాముల బక్కయ్య, జిల్లల రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రామకృష్ణా రావు

యాదాద్రి భువనగిరి జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రామక్రిష్ణ రావు జిల్లాలోని వలిగొండ మండల పరిధిలోని వేముల కొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు ఉప కేంద్రాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల లోని అన్ని రికార్డులను పరిశీలించారు. ఔట్ పేషంట్స్ సర్వీస్ లను పరీక్షించారు. జ్వర కేసుల నమోదును పరిశీలించారు. అనంతరం వేముల కొండ ఆరోగ్య ఉప కేంద్రం లో పిల్లలకు టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...అర్హులైన పిల్లలందరికీ టీకాలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ప్రసిధ్, సూపర్వైజర్ లు ప్రవీణ్, అనురాధ, మరియమ్మ ANM వినోద, సుస్మిత, కృష్ణ వేణి, సౌజన్య, రామలీల, కవిత, సూర్యకాంతం, పావని, నీరజ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో అన్నదానం: తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేసిన నారపాక నరేందర్

హైదరాబాద్ నాదరుగుల్ లోని మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో మంగళవారం రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు నారపాక నరేందర్ వర్షిత ల కుమారుడు హ్రియాన్స్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నారపాక నరేందర్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో తన కుమారుడి పుట్టినరోజు వేడుకలు జరిపి , వారికి ఒక్కపూట భోజనంతో పాటు 5000 రూపాయలు భోజనానికి తనవంతు సహకారం అందిస్తున్న అని అన్నారు .పుట్టినరోజు వేడుకలను గొప్పగా జరుపుకోవడం వల్ల ధనం వృధా కావడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఆ డబ్బుతో చాలామంది నిరుపేదలు, అనాధలకు ఒక్కపూట ఆకలి తీర్చినా సార్థకం ఉంటుందన్నారు.మా కుమారుడి పుట్టినరోజు వేడుకలు అనాధాశ్రమంలో జరపడం మాకు చాలా సంతోషంగా ఉందన్నారు.అనంతరం హ్రియాన్స్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
విషపూరిత జ్వరాలని నిర్మూలిద్దాం; ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

విషపూరిత జ్వరాల్ని నిర్మూలిద్దాం-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దోమలను నివారిద్దాం ఆరోగ్యాన్ని పెంచుకుందామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు* మంగళవారం రోజు ఓ ప్రకటనలో తెలిపారు. .ఇంటి పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వ ఉంచడం తోనే దోమలు పుట్టుక జరుగుతుందని,ఇవి మనుషులకు కుట్టడాం వల్లే రోగాలు పుడుతాయన్నారు.కావున నీటి నిల్వ లేకుండా చేసి.దోమలను నివారించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అన్నారు.కాచి వడపోసిన నీరు, వేడి వేడి ఆహారం తీసుకోవాలన్నారు.బయటి ఆహారం విషమని ఇంటిలో ఆహారం అమృతమన్నారు.గర్భిణులు, పిల్లలు,వృద్ధులు, తీవ్రమైన వ్యాధులు వున్న వారు అత్యంత జాగ్రత్తగా వుండాలన్నారు.జ్వర లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం కాకుండా దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలన్నారు.ప్రభుత్వ.ఆస్పత్రిలో అన్ని మందులు అందుబాటులో ఉన్నాయన్నారు.అందుకే విషపూరిత జ్వరాల్ని నిర్మూలిద్దామని బీర్ల ఐలయ్య గారు తెలిపారు.