ఢిల్లీ: ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత..
ఢిల్లీ: ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత..
లిక్కర్ కుంభకోణంలో జైలుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత మరొకసారి అస్వస్థత కు గురయ్యారు. ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో కవితకు చికిత్స.. గైనిక్ సమస్య, వైరల్ ఫీవర్తో బాధపడుతున్న కవిత..
Ts:టాప్ కళాశాలల్లోనూ సీఎస్‌ఈ సీట్లు ఖాళీ జేఎన్‌టీయూహెచ్, ఓయూలోనూ అదే పరిస్థితి ఐదు ప్రభుత్వ కళాశాలల్లో సగమే భర్తీ..
Btech Seats: టాప్ కళాశాలల్లోనూ సీఎస్‌ఈ సీట్లు ఖాళీ
జేఎన్‌టీయూహెచ్, ఓయూలోనూ అదే పరిస్థితి
ఐదు ప్రభుత్వ కళాశాలల్లో సగమే భర్తీ
హైదరాబాద్: రాష్ట్రంలోని జేఎన్‌టీయూహెచ్, ఓయూ క్యాంపస్ కళాశాలలతోపాటు ప్రముఖ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లోనూ బీటెక్ సీట్లు మిగిలిపోయాయి. వాటిలో అత్యంత డిమాండ్ ఉన్న సీఎస్‌ఈ సీట్లూ ఉండటం గమనార్హం. జేఎన్‌టీయూహెచ్ పరిధిలోని వర్సిటీ కళాశాలల్లోని మొత్తం సీట్లలో సగానికిపైగా నిండలేదు. అంతర్గత స్లైడింగ్ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. ఈసారి విద్యాశాఖే ఆ ప్రక్రియ చేపట్టడంతో కళాశాలలు, బ్రాంచీల వారీగా ఖాళీల వివరాలను ప్రకటించింది.
మొత్తం 11,836 సీట్లు భర్తీకాకుండా మిగిలిపోయాయి. వాటిల్లో సీఎస్‌ఈ, ఐటీ, డేటా సైన్స్, ఏఐ అండ్ ఎంఎల్ సీట్లు ఉండటం విశేషం. దశాబ్దంన్నర క్రితం నెలకొల్పిన జేఎన్‌టీయూ జగిత్యాలలో సైతం 330కి 204 సీట్లు (62%) నిండకపోవడంపై విద్యాశాఖ వర్గాలే ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నాయి.
కొత్తగా ప్రారంభించిన పాలేరు, సిరిసిల్ల, మహబూబాబాద్, వనపర్తితోపాటు రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలోనే సగానికిపైగా సీట్లు నిండలేదు.
Ts:యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పెంపు
యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పెంపు
,హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశు వైద్య, ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో వివిధ అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు తేదీని ఈనెల 29 వరకు పొడిగించారు.
బైపీసీ స్ట్రీమ్ కోర్సుల్లో దరఖాస్తు చేసుకునే తేదీని పెంచినట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ పి.రఘురామిరెడ్డి బుధవారం తెలిపారు.
జులై 12 నుంచి ఆగస్టు 17 వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించామని, తొలి విడతలో దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయ వెబ్‌సైట్
www.pjtsau.edu.in
ను సందర్శించాలని కోరారు.
Ts:నిర్వహణ పనులతో పలు రైళ్లు రద్దు ...
నిర్వహణ పనులతో పలు రైళ్లు రద్దు ...
హైదరాబాద్: సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే డివిజన్ల పరిధిలో నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.
సికింద్రాబాద్-వరంగల్, వరంగల్-హైదరాబాద్ మెమూ, కాజీపేట-బల్లార్ష రైళ్లు సెప్టెంబరు 1 నుంచి అక్టోబరు 30 వరకు నెలరోజుల పాటు రద్దయ్యాయి. బల్లార్ష-కాజీపేట రైలు సెప్టెంబరు 2 నుంచి అక్టోబరు 1 వరకు.. సిర్పూర్‌టౌన్-కరీంనగర్, కరీంనగర్-బోధన్ మెమూ రైళ్లు సెప్టెంబరు 1-30 వరకు, బోధన్-కరీంనగర్ మెము సెప్టెంబరు 2 నుంచి అక్టోబరు 1 వరకు.. కాచిగూడ-నడికుడి, నడికుడి-కాచిగూడ రైళ్లు సెప్టెంబరు 1-30 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని ద.మ.రైల్వే సీపీఆర్వో ఏ.శ్రీధర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
హెచ్‌ఎస్ నాందేడ్-రాయచూరు రైలు సెప్టెంబరు 1 నుంచి 30 వరకు తాండూరు-రాయచూరు మధ్య పాక్షికంగా రద్దయ్యింది. అదేవిధంగా భద్రాచలం రోడ్-బల్లార్ష, సిర్పూర్‌టౌన్-భద్రాచలం రైళ్లకు సెప్టెంబరు 1-30 వరకు కాజీపేట స్టేషన్‌లో స్టాపేజిని తొలగించారు.
భద్రాచలం: చర్ల:ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని కోరుతూ ఎమ్మెల్యే తెల్లo వెంకటరావుకు వినతి పత్రం అందజేసిన న్యూడెమోక్రసీ బృందం
ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని కోరుతూ ఎమ్మెల్యే తెల్లo వెంకటరావుకు వినతి పత్రం అందజేసిన న్యూడెమోక్రసీ బృందం
రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని, ఆర్ గ్యారంటీల అమలకు పూనుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావుకు వినతిపత్రం అందజేయడం జరిగింది.
అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్* మాట్లాడుతూ పది సంవత్సరాలు టిఆర్ఎస్ దొరల పాలన చేసిందని ఏ ఒక్కరిని పట్టించుకోలేదని మార్పు రావాలని నేర్పంతో ఈ రాష్ట్రంలోని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను చూసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఈనాడు వాడు దాటినాక ఓడ మల్లయ్య లాగ వ్యవహరిస్తున్నాడని ఆయన అన్నారు. మీ జిల్లాలో 57,000 మంది రైతులకు రుణమాఫీ జరిగిందని అందులో రెండు లక్షల వారు 11,000 మంది మాత్రమే ఉన్నారని ఇంకా వేలాది మంది రైతులు ఉన్నారని వారికి రేషన్ కార్డు ఆధార్ కార్డు పహాని నకాలని అనేక కథలు చెబుతున్నారని వారన్నారు. ఈ పది సంవత్సరాల కాలంలో రేషన్ కార్డు ఇచ్చింది లేదు ఈ ప్రభుత్వం వచ్చినంక కూడా ఇచ్చింది లేదని ఇప్పుడు రేషన్ కార్డుతో ఆంక్షలు పెట్టడం అంటే దీని ఉద్దేశం ఏంటని ఆయన అన్నారు. తక్షణమే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలని అమలు చేయాలని ప్రతి ఒక్కరికి ఎలాంటి ఆంక్షలు లేకుండా బ్యాంకు మేనేజర్ లతో మాట్లాడి తక్షణమే రుణమాఫీ చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ఏఐటీఎఫ్ ఆల్ ఇండియా ట్రైబల్ ఫారం మండల నాయకులు గొంది ముయ్యన్న పిడిఎస్యు మండల నాయకులు ఇర్ఫా రాజేష్ సురేష్ స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ: శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు,మహిళలకు చీరల పంపిణీ..
నల్లగొండ: శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు,మహిళలకు చీరల పంపిణీ..
శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో నల్గొండ లోని సుందరయ్య కాలనీ లో పులిజాల కీర్తన పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పోచంపల్లి రమణారావు గారు తెలంగాణ బ్రాహ్మణ సమితి జిల్లా అధ్యక్షులు శ్రీ భక్తాంజనేయ సేవా సంస్థ అధ్యక్షులు సిరి ప్రగడ శ్రీనివాస శర్మ గారు తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు రుద్రాక్షి నరసింహ గారు శ్రీ భక్తాంజనేయ సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు డాక్టర్ భరత్ గారు కార్యవర్గ సభ్యురాలు పులిజాల నాగశ్రీ గారు మహిళలు వృద్ధులు పాల్గొని పులిజాల కీర్తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
నల్లగొండ: చర్లపల్లి మార్కండేయ గుడి గణేష్ ఉత్సవ కమిటీ నూతన అధ్యక్షునిగా పున్నరాజు..
నేడు నల్లగొండ చర్లపల్లి మార్కండేయ గుడి గణేష్ ఉత్సవ కమిటీ సమావేశం జరపడం జరిగింది.
ఈ మీటింగ్ లో ఉత్సవ కమిటీ సభ్యులు ఉత్సవాల గురించి చర్చించి, ఈ కమిటీ నూతన అధ్యక్షునిగా పున్నరాజును సభ్యులందరూ నియమించుకోవడం జరిగింది. ఈ కమిటీకి ఉపాధ్యక్షునిగా గంజి లక్ష్మీనారాయణ ని అలాగే ప్రధాన కార్యదర్శిగా చిట్టిపోలు పూర్ణి చందర్, ముఖ్య కార్యదర్శిగా చిట్టిపోలు చంద్రశేఖర్ సహాయ కార్యదర్శిగా భువనగిరి ముఖేష్ నీ మరియు కార్యవర్గ సభ్యునిగా మిరియాల కిరణ్ కుమార్ ని చేర్చుకోవడం జరిగింది. దీనిని కమిటీ సభ్యులందరూ ఆమోదిస్తూ తమ సంతకాలు చేయడం జరిగింది.
టీచర్ల నియామకాల్లో ‘వర్గీకరణ’ లేనట్టే!
Teacher Posts: టీచర్ల నియామకాల్లో ‘వర్గీకరణ’ లేనట్టే!
న్యాయ, సాంకేతిక సమస్యలు తప్పవు
నియామక ప్రక్రియే జాప్యమయ్యే ముప్పు!
ప్రస్తుతానికి ఎస్సీ వర్గీకరణ లేకుండానే భర్తీ
డీఎస్సీ ఫలితాల వెల్లడికి అధికారుల కసరత్తు
హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసే అవకాశం కనిపించడం లేదు. వర్గీకరణ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే న్యాయపరమైన ఇబ్బందులేగాక, సాంకేతిక సమస్యలూ ఉత్పన్నమై మొత్తం నియామక ప్రక్రియే నిలిచిపోయే ప్రమాదం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దీంతో ప్రస్తుతానికి వర్గీకరణను పక్కన పెట్టి నియామకాలను చేపట్టాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. గత నెల 18 నుంచి ఈ నెల 5 వరకు పరీక్షలను నిర్వహించారు.
ఈ పరీక్షల ప్రాథమిక కీని కూడా విడుదల చేశారు. సెప్టెంబరు మొదటి వారంలో ఫలితాలను వెల్లడించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా, ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. అవసరమైతే ఇప్పటికే నోటిఫికేషన్లను ఇచ్చిన పోస్టుల భర్తీలోనూ వర్గీకరణను అమలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై అధికారులు కొంత అధ్యయనం చేశారు. టీచర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌లో రిజర్వేషన్ల అమలుపై స్పష్టత ఇచ్చారు. దానికి విరుద్ధంగా ఇప్పుడు రిజర్వేషన్లను అమలు చేస్తే.. సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని, ముఖ్యంగా న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని భావిస్తున్నారు.
అదే జరిగితే ఈ పోస్టుల భర్తీ తీవ్ర ఆలసమయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగానే రిజర్వేషన్లను అమలు చేయాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. మరోవైపు ఇప్పటికే ప్రకటనలు ఇచ్చిన పోస్టుల విషయంలో ఎస్సీ వర్గీకరణ అమలు సాధ్యం కాదని న్యాయశాఖ అధికారులు కూడా స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. దీంతో డీఎస్సీ పోస్టుల భర్తీలో ఎస్సీ వర్గీకరణ అమలును పక్కన పెట్టాలని నిర్ణయించారు. ఉపాధ్యాయ పోస్టులను 95 శాతం స్థానికులతో, 5 శాతం అందరి (నాన్‌లోకల్)తో భర్తీ చేయనున్నారు. ఈ నాన్‌లోకల్ కోటాలో ఎక్కువగా తెలంగాణతో పాటు ఏపీకి చెందిన అభ్యర్థులు అర్హత పొందే అవకాశం ఉంది. అయితే, జిల్లాలు, సజ్జెక్టుల వారీగా ఉన్న పోస్టుల సంఖ్యను పరిశీలిస్తే ఈ నాన్‌లోకల్ కోటాలో ఎక్కువ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇక డీఎస్సీ పరీక్షలను రాష్ట్ర యూనిట్‌గా నిర్వహించారు. పోస్టుల భర్తీని మాత్రం జిల్లా యూనిట్‌గా చేపట్టనున్నారు. దీంతో మెరిట్ జాబితాలనూ జిల్లాల వారీగా రూపొందించనున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉండే ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో టీచర్ పోస్టుల భర్తీని చేపట్టనున్నారు.
రాష్ట్రంలో భర్తీ చేస్తున్న ఉపాధ్యాయ పోస్టుల వివరాలు పోస్టు సంఖ్య
ఎస్‌ఏ 2,629
ఎస్‌జీటీ 6,508
భాషా పండితులు 727
పీఈటీలు 182
ఎస్‌ఏ 220 (స్పెషల్ కేటగిరీ)
ఎస్‌జీటీలు 796 (స్పెషల్ కేటగిరీ)
మొత్తం 11,062.
భద్రాచలం: చర్ల: ప్రభుత్వ ఆసుపత్రిలో కావలసిన మందులు, ఇంజక్షన్లు ప్రజలకు అందే విధంగా చూడాలని న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్..
ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్ష కేంద్రంను సరైన ఇంజక్షన్లను అందించాలని న్యూ డెమోక్రసీ పార్టీ DM&HO&DH ను డిమాండ్ చేస్తుంది
చర్ల మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షల రిపోర్ట్ రావడానికి ఐదు రోజులు సమయం పడుతుందని దీనికి కారణంగా బయట రక్తపరీక్ష కేంద్రాల దగ్గరికి వెళ్లి రక్త పరీక్షలు చేపిస్తే వారు 1200 రూపాయలు తీసుకుంటున్నారని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రోగాలకి సరిపడా మందులు లేని కారణంగా బయటకు వెళ్లి కొనుక్కొని వస్తున్నారని ఇకనైనా రోగులకు సరైన వైద్య సౌకర్యాలు మందులు అందించాలని
రక్త పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని రోగులకు మంచినీటి సౌకర్యం అందుబాటులోకి తేవాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సతీష్ రోగులను పరామర్శించి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు తదనంతరం రోగులు ప్రభుత్వ ఆసుపత్రిలో పడుతున్న ఇబ్బందులను గ్రహించి వైద్య సదుపాయాల అందించాలని జిల్లా వైద్య అధికారులను ఆయన డిమాండ్ చేశారు ఆదివాసి చర్ల మండలం పై జిల్లా అధికారులకు చిన్నచూపు తగదని ఇప్పటికైనా జిల్లా అధికారులు దృష్టి సారించి చర్ల మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు కల్పించాలని లేనియెడల ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తోట మల్ల రవి నక్క సాగర్ తోకల మోహన్రావు కొంగురు చిన్న చంటి రమేష్ గౌరీ తదితరులు పాల్గొన్నారు
Aug 22 2024, 12:47