సబ్బండ వర్గాల నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: దయ్యాల నరసింహ గొర్ల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా అధ్యక్షులు
సర్దార్ సర్వాయి పాపన్న 374 వ జయంతిని పురస్కరించుకొని భువనగిరి మండలం హనుమపురం గ్రామంలో పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా దయ్యాల నరసింహ మాట్లాడుతూ 1650 సంవత్సరంలో ధర్మయ్యా సర్వమ్మ దంపతులకు సామాన్య కల్లుగీత కుటుంబంలో జన్మించి గోల్కొండ కోటను స్వాధీనం చేసుకుని ఆనాటి అరాచకాలకు కులవృత్తులకు వేసిన పన్నులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నాయకుడు అని అన్నారు గోల్కొండ కోటను రాజధానిగా చేసుకుని బహుజనుల రాజ్యాన్ని స్థాపించిన బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడినారు షాపూర్ను తన రాజధానిగా చేసుకుని తెలంగాణ ప్రాంతంలోని కొలనుపాక తాటికొండ, ఎలగందుల ,చేర్యాల, హుస్నాబాద్, భువనగిరి, జనగామ తో సహా అనేక ప్రాంతాలను పాలించిన నాయకుడు అని అన్నారు సర్దార్ సర్వాయి పాపన్న అనికొనియాడారు ఆనాడు జరిగిన హింసను భరించలేక దళాని ఏర్పరచుకొని బహుజనుల కోసం పోరాడి నాయకుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో గీత కార్మిక సంఘం సొసైటీ అధ్యక్షులు రంగస్వామి, మాజీ ఉపసర్పంచ్ ఆముదాల రమేష్, మాజీ వార్డు సభ్యులు మోట ఎల్లయ్య, రాగల రాజేశ్వర్ ,మాజీ సొసైటీ అధ్యక్షులు రంగా కొండల్ ,పాలకూరి బిక్షపతి, హనుమగంటి సత్యనారాయణ, రంగ నారాయణ, ఎర్రబోయిన కిష్టయ్య, హనుమగంటి బిక్షపతి, దుర్గం కృష్ణ, ముద్దం కొమరయ్య ,తుమ్మేటి మల్లేష్, హనుమగంటి శ్రీశైలం, జాన భూపాలు ,హనుమగంటి సత్తయ్య ,హనుమగంటి సుక్కయ్య, నరసయ్య.
Aug 21 2024, 18:38