VijayaKumar

Aug 20 2024, 21:07

మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో అన్నదానం: తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేసిన నారపాక నరేందర్

హైదరాబాద్ నాదరుగుల్ లోని మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో మంగళవారం రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు నారపాక నరేందర్ వర్షిత ల కుమారుడు హ్రియాన్స్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నారపాక నరేందర్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో తన కుమారుడి పుట్టినరోజు వేడుకలు జరిపి , వారికి ఒక్కపూట భోజనంతో పాటు 5000 రూపాయలు భోజనానికి తనవంతు సహకారం అందిస్తున్న అని అన్నారు .పుట్టినరోజు వేడుకలను గొప్పగా జరుపుకోవడం వల్ల ధనం వృధా కావడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఆ డబ్బుతో చాలామంది నిరుపేదలు, అనాధలకు ఒక్కపూట ఆకలి తీర్చినా సార్థకం ఉంటుందన్నారు.మా కుమారుడి పుట్టినరోజు వేడుకలు అనాధాశ్రమంలో జరపడం మాకు చాలా సంతోషంగా ఉందన్నారు.అనంతరం హ్రియాన్స్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

VijayaKumar

Aug 20 2024, 20:01

విషపూరిత జ్వరాలని నిర్మూలిద్దాం; ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

విషపూరిత జ్వరాల్ని నిర్మూలిద్దాం-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దోమలను నివారిద్దాం ఆరోగ్యాన్ని పెంచుకుందామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు* మంగళవారం రోజు ఓ ప్రకటనలో తెలిపారు. .ఇంటి పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వ ఉంచడం తోనే దోమలు పుట్టుక జరుగుతుందని,ఇవి మనుషులకు కుట్టడాం వల్లే రోగాలు పుడుతాయన్నారు.కావున నీటి నిల్వ లేకుండా చేసి.దోమలను నివారించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అన్నారు.కాచి వడపోసిన నీరు, వేడి వేడి ఆహారం తీసుకోవాలన్నారు.బయటి ఆహారం విషమని ఇంటిలో ఆహారం అమృతమన్నారు.గర్భిణులు, పిల్లలు,వృద్ధులు, తీవ్రమైన వ్యాధులు వున్న వారు అత్యంత జాగ్రత్తగా వుండాలన్నారు.జ్వర లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం కాకుండా దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలన్నారు.ప్రభుత్వ.ఆస్పత్రిలో అన్ని మందులు అందుబాటులో ఉన్నాయన్నారు.అందుకే విషపూరిత జ్వరాల్ని నిర్మూలిద్దామని బీర్ల ఐలయ్య గారు తెలిపారు.

VijayaKumar

Aug 20 2024, 16:32

సెప్టెంబర్ 1న భువనగిరిలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైతన్య యాత్రను జయప్రదం చేయాలి: ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు సంగిశెట్టి క్రిస్టఫర్

తెలంగాణ ఉద్యమకారుల హామీలను నెరవేర్చాలని సెప్టెంబర్ 1న భువనగిరిలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైతన్య యాత్రను జయప్రదం చేయాలని ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ అన్నారు మంగళవారం సమావేశంలో మాట్లాడుతూ చైతన్య యాత్రకు రాష్ట్ర కమిటీ అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ర్యాలీ ఉంటుందని ర్యాలీని జయప్రదం చేయడానికి ప్రతి ఉద్యమకారుడు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సమావేశానికి అధ్యక్షత వహించిన కదిలేని స్వామి నియోజకవర్గ అధ్యక్షులు జోగు అంజయ్య మహిళా కమిటీ అధ్యక్షురాలు గంధ మల్ల. మల్లమ్మ జిల్లా ఉపాధ్యక్షులు మంటి రమేష్. సీనియర్ నాయకులు శీలం స్వామి. జిల్లా నాయకులు మల్లం వెంకటేశం. చౌటుప్పల్ మండల అధ్యక్షులు గట్టు సుధాకర్ రామన్నపేట మండల అధ్యక్షులు నోముల శంకర్ బీబీనగర్ మండల అధ్యక్షులు ధారావత్ చంద్రభాను. బొడ్డుపల్లి లింగయ్య ఇమామ్. చౌటుప్పల్ శ్రీనివాస్. గంగ దారి సత్తయ్య. శిల్పంగి గణేష్. మంటి లింగయ్య. పబ్బు లక్ష్మయ్య. బాబు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 19 2024, 17:53

సహృదయ అనాధ వృద్ధాశ్రమంలో రాఖీ పండుగ సంబరాలు జరిపిన యువకులు

యాదాద్రి భువనగిరి జిల్లా: అనాధ వృద్ధశ్రమం లో యువకులు ఘనంగా రాఖీ పండుగ సంబరాలు నిర్వహించారు. భువనగిరి మున్సిపాలిటీ లోని రాయగిరి శివారులో వున్న సహృదయ అనాధ వృద్ధాశ్రమంలో  రాఖి పౌర్ణమి సందర్బంగా రాయగిరి  గ్రామానికి చెందిన యువకులు అనాధ వృద్ధాశ్రమంలో   వృద్ధులకి కుటుంబాలు దూరమైన వారికి మేము వున్నాం అని పండుగ వాతావరణంలో రాఖీలు కట్టించుకున్నారు. స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో  యువజన నాయకులు భాను బొజ్జ ,బొజ్జ శివ, ఏర్పల మహేష్, నిల కార్తీక్, మేకల Mtar ఆనంద్, కొత్త ప్రశాంత్ ,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ ...వున్నా దంట్లో ఎదుటి వ్యక్తులకి సంతోషాన్ని నింపడమే అసలైన జీవితం ఆనందం అని అన్నారు.

VijayaKumar

Aug 18 2024, 19:20

కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచార నిందితులకు కఠిన శిక్షలు అమలుపరచాలి: ఏశాల అశోక్ డిమాండ్

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈరోజు సిపిఐ జాతీయ సమితి పిలుపును అనుసరించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేశాము సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్ మాట్లాడుతూ కోల్కతాలో వైద్యురాలు మౌ మిత పై అత్యాచారం చేసి హింసించి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అకృత్యాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పట్టణ గ్రామీణ ప్రాంతాలలో డాక్టర్స్ కు తగినంత రక్షణ కల్పించాలని అన్నారు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద పోలీస్ భద్రతలు ఉంచాలని అన్నారు ఈ నిరసన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు వస్తువుల అభిలాష్ సిపిఐ పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్ మండల కార్యదర్శి మరిపెళ్లి రాములు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు దాసరి లక్ష్మయ్య మండల కౌన్సిల్ సభ్యులు కోట శంకర్ బొమ్మాయిపల్లి 11వ వార్డు కార్యదర్శి చింతల పెంటయ్య నాయకులు రాసాల బాలస్వామి బద్దం వెంకటరెడ్డి కడారి మల్లేష్ అబ్బులు, చిక్క నరసయ్య రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 18 2024, 15:26

సబ్బండ వర్గాల నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: దయ్యాల నరసింహ గొర్ల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా అధ్యక్షులు

సర్దార్ సర్వాయి పాపన్న 374 వ జయంతిని పురస్కరించుకొని భువనగిరి మండలం హనుమపురం గ్రామంలో పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా దయ్యాల నరసింహ మాట్లాడుతూ 1650 సంవత్సరంలో ధర్మయ్యా సర్వమ్మ దంపతులకు సామాన్య కల్లుగీత కుటుంబంలో జన్మించి గోల్కొండ కోటను స్వాధీనం చేసుకుని ఆనాటి అరాచకాలకు కులవృత్తులకు వేసిన పన్నులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నాయకుడు అని అన్నారు గోల్కొండ కోటను రాజధానిగా చేసుకుని బహుజనుల రాజ్యాన్ని స్థాపించిన బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడినారు షాపూర్ను తన రాజధానిగా చేసుకుని తెలంగాణ ప్రాంతంలోని కొలనుపాక తాటికొండ, ఎలగందుల ,చేర్యాల, హుస్నాబాద్, భువనగిరి, జనగామ తో సహా అనేక ప్రాంతాలను పాలించిన నాయకుడు అని అన్నారు సర్దార్ సర్వాయి పాపన్న అనికొనియాడారు ఆనాడు జరిగిన హింసను భరించలేక దళాని ఏర్పరచుకొని బహుజనుల కోసం పోరాడి నాయకుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో గీత కార్మిక సంఘం సొసైటీ అధ్యక్షులు రంగస్వామి, మాజీ ఉపసర్పంచ్ ఆముదాల రమేష్, మాజీ వార్డు సభ్యులు మోట ఎల్లయ్య, రాగల రాజేశ్వర్ ,మాజీ సొసైటీ అధ్యక్షులు రంగా కొండల్ ,పాలకూరి బిక్షపతి, హనుమగంటి సత్యనారాయణ, రంగ నారాయణ, ఎర్రబోయిన కిష్టయ్య, హనుమగంటి బిక్షపతి, దుర్గం కృష్ణ, ముద్దం కొమరయ్య ,తుమ్మేటి మల్లేష్, హనుమగంటి శ్రీశైలం, జాన భూపాలు ,హనుమగంటి సత్తయ్య ,హనుమగంటి సుక్కయ్య, నరసయ్య.

VijayaKumar

Aug 17 2024, 19:56

చౌటుప్పల్ : దివిస్ పరిశ్రమ కాలుష్యం వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్

దివిస్ పరిశ్రమ కాలుష్యం వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి యాదాద్రి భువనగిరి సిపిఎం జిల్లా కార్యదర్శి జహంగీర్ అన్నారు. దివిస్ పరిశ్రమ నుండి వెలువడే రసాయనాల వల్ల భూగర్భ కాలుష్యం ఏర్పడి ఆరెగూడెం గ్రామంలో ప్రజలు అనారోగ్యానికి గురవుతా ఉన్నారని,వేసిన పంటలు తీవ్రంగా నష్టపోతున్నారని ,బర్రెలు మూగ జీవాలు మృత్యువాత పడుతున్నాయని సిపిఎం బృందం పరిశీలనలో తేలిందని *సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్* అన్నారు దివిస్ పరిశ్రమ వల్ల నష్టపోతున్న రైతాంగం సమస్యలు తెలుసుకొని మాట్లాడుతూ దివిస్ చుట్టుపక్కల గ్రామాలలో 200 నుండి 300 ఫీట్ల లోతుల్లో రసాయనలతో పూర్తిగ భూగర్భ జలాలు కాలుష్యంగా మారి బోరు నుంచి వచ్చే నీళ్లు వ్యవసాయానికి, గేదెలు త్రాగకుండా దుర్గంధమైన వాసనతో నిరుపయోగంగా మారాయని అన్నారు వ్యవసాయం,గేదెలు పై ఆధారపడిన రైతాంగం తీవ్రంగా నష్టపోతా ఉన్నారని అన్నారు ప్రజలకు అనారోగ్య సమస్యలు, గేదెలకు చర్మ వ్యాధుల తో మృత్యువాత పడుతఉన్నాయి అన్నారు పరిశ్రమల కాలుష్యం వల్ల భవిష్యత్తులో నోమ్యాన్ జోన్ గా ప్రకటించే అవకాశం ఉందని అన్నారు కాలుష్యం వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉంటే పిసిబి అధికారులు కంపెనీ యాజమాన్యం ముడుపులో మత్తులో ఉన్నారని అన్నారు ప్రజల మద్దతు ఎన్నికైన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కంపెనీల కాలుష్యం పట్ల స్పందించకపోవడం కారణం ఏంటని అన్నారు కంపెనీల కాలుష్యం పట్ల ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తామని అన్నారు దివిస్ పరిశ్రమ కాలుష్యంపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈనెల 21వ తేదీన నష్టపోయిన రైతులతో కలెక్టర్ గారిని కలుస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, సిపిఎం మండల కార్యదర్శి గంగదేవి సైదులు,DYFI జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేశం,సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు చిరిక సంజీవరెడ్డి, DYFI జిల్లా ఉపాధ్యక్షులు పల్లె మధుకృష్ణ, నాయకులు బోయ యాదయ్య రైతులు అనంతుల రాములు, గుండెబోయిన బాలకృష్ణ, సబిత, శ్రీరాముల బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 17 2024, 18:06

వలిగొండ: TPUS ఆధ్వర్యంలో గురువందన్ ,ఆత్మీయ సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో గురువందన్,ఆత్మీయ సన్మానం తెలంగాణ ప్రాంత ఉపాద్యాయ సంఘం(TPUS) ఆధ్వర్యంలో పెన్షనర్స్ భవన్ వలిగొండ లో శనివారం మధ్యాహ్నం 1pm భోజనానంతర0 TPUS వలిగొండ మండల శాఖ "సర్వ సభ్య సమావేశం" నూతన కార్య వర్గ ఎన్నిక మరియు ట్రాన్స్ఫర్ ప్రమోషన్ ల లో వివిధ ప్రాంతాలకు వెళ్లిన TPUS సభ్యులకు ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది .ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అదనపు కార్యదర్శి తెల్జలపల్లి పెంటయ్య గారు, అత్మీయ అతిథిగా బండారపు లింగుస్వామి గారు, విశిష్ట అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి కొమరెల్లి భాస్కర్ రెడ్డి గారు విచ్చేయడం జరిగింది. మన్నెం నరేందర్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించటం జరిగింది.TPUS నూతన మండల అధ్యక్షుడిగా yvn రెడ్డి గారు, ప్రదాన కార్యదర్శిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోశాధికారి గా మద్దేపూరి వెంకటేశం గారు ఎన్నిక కావడం జరిగింది.

VijayaKumar

Aug 17 2024, 15:35

వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే సందర్శించారు.పేషెంట్ల పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంత్ కే.జెండగే వైద్యాధికారులకు సూచించారు. ప్రతిరోజు వస్తున్న అవుట్ పేషెంట్ల వివరాలు, ల్యాబ్ లో నిర్వహిస్తున్న పరీక్షల వివరాలను పరిశీలించారు. వార్డులు తిరిగి పేషెంట్లతో ఏ సమస్యలపై ఆసుపత్రికి వచ్చింది అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అందుబాటులో అన్ని రకాల మందులను, రాపిడ్ కిట్స్ సిద్ధంగా ఉంచుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. ఆరోగ్య కేంద్రంలో పారిశుద్యపనులు పక్కగా నిర్వహించాలని, దోమల వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్వర్ణలత, డాక్టర్ స్వామి, ఎంపీడీఓ జితేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

VijayaKumar

Aug 16 2024, 22:52

ఘనంగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం కొండకింద బీఆర్ఎస్ పార్టీ మండల మరియు పట్టణ నాయకులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అభిమాన నాయకురాలు శ్రీమతి గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు, నాయకులు నియోజకవర్గ వ్యాప్తంగా అన్నీ గ్రామాలలో మండల కేంద్రాలలో కేక్ లు కట్ చేసి పలు సేవా కార్యక్రమాలతో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలేరు నియోజకవర్గ కేంద్రం ఆలేరు లో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఇమ్మడి నర్సింహారెడ్డి గార్డెన్స్ లో నిర్వహించిన వేడుకలకు హాజరైన గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గారు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఆలేరు నియోజకవర్గం నలుమూలల నుంచి పార్టీ నేతలు, యువకులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.