భద్రాచలం: చర్ల: ప్రభుత్వ ఆసుపత్రిలో కావలసిన మందులు, ఇంజక్షన్లు ప్రజలకు అందే విధంగా చూడాలని న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్..

ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్ష కేంద్రంను సరైన ఇంజక్షన్లను అందించాలని న్యూ డెమోక్రసీ పార్టీ DM&HO&DH ను డిమాండ్ చేస్తుంది

 చర్ల మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షల రిపోర్ట్ రావడానికి ఐదు రోజులు సమయం పడుతుందని దీనికి కారణంగా బయట రక్తపరీక్ష కేంద్రాల దగ్గరికి వెళ్లి రక్త పరీక్షలు చేపిస్తే వారు 1200 రూపాయలు తీసుకుంటున్నారని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రోగాలకి సరిపడా మందులు లేని కారణంగా బయటకు వెళ్లి కొనుక్కొని వస్తున్నారని ఇకనైనా రోగులకు సరైన వైద్య సౌకర్యాలు మందులు అందించాలని 

 రక్త పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని రోగులకు మంచినీటి సౌకర్యం అందుబాటులోకి తేవాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సతీష్ రోగులను పరామర్శించి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు తదనంతరం రోగులు ప్రభుత్వ ఆసుపత్రిలో పడుతున్న ఇబ్బందులను గ్రహించి వైద్య సదుపాయాల అందించాలని జిల్లా వైద్య అధికారులను ఆయన డిమాండ్ చేశారు ఆదివాసి చర్ల మండలం పై జిల్లా అధికారులకు చిన్నచూపు తగదని ఇప్పటికైనా జిల్లా అధికారులు దృష్టి సారించి చర్ల మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు కల్పించాలని లేనియెడల ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తోట మల్ల రవి నక్క సాగర్ తోకల మోహన్రావు కొంగురు చిన్న చంటి రమేష్ గౌరీ తదితరులు పాల్గొన్నారు

నల్లగొండ: గొల్లగూడ ప్రభుత్వ ఆసుపత్రి లో రోగ నివారణకు వెళ్లే పేషెంట్లకు రోగం కలిగించే విధంగా ఉన్న టాయిలెట్లపై కలెక్టర్కు ఫిర్యాదు

నల్లగొండ: ప్రభుత్వ గొల్లగూడ ఆస్పత్రిలో రోగ నివారణకు వెళ్లే పేషెంట్లకు రోగం పుట్టించే విధంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలోని టాయిలెట్ల పై నల్లగొండ కలెక్టర్ కి ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త సాధిక్ పాష

ఈ మధ్యనే పెట్రోల్ బంకులోని సమస్యలపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి.. నిత్యం ఏదో రకంగా సమాజంలోను, ప్రభుత్వ ఆఫీసులలోనూ ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులను నిత్యం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే సామాజిక కార్యకర్త సాధిక్ పాషా మరొక సంఘటనను నల్గొండ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.

నల్లగొండ గుల్లగూడ ప్రభుత్వ ఆస్పత్రికి వ్యాధి నయం చేసుకోవడానికి వెళ్లే పేషెంట్లకు అక్కడ అపరిశుభ్ర వాతావరణం మరియు దుర్గంధం గా ఉన్న టాయిలెట్లు పేషంట్లకు వ్యాధిని వ్యాపించే కారకాలుగా ఉన్నాయని, కనీసం ట్రీట్మెంట్కు వెళ్లిన పేషంట్లకు టాయిలెట్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి కనీస సూచికలు కూడా లేవని, సంబంధిత అధికారులు వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నల్గొండ కలెక్టర్ కి వినతి పత్రం అందించిన సామాజిక కార్యకర్త సాధిక్ పాష.

SSLV D-3 రాకెట్‌ ప్రయోగం విజయవంతం...

SSLV D-3 రాకెట్‌ ప్రయోగం విజయవంతం..

ఈవోఎస్‌-08 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లిన SSLV D-3.. నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన రాకెట్‌.. భూపరిశీలన కోసం సేవలు అందించనున్న ఈవోఎస్‌-08.. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల సంబరాలు

TS:పాఠ్యాంశంగా మహిళలపై నేరాలు-శిక్షలు!

పాఠ్యాంశంగా మహిళలపై నేరాలు-శిక్షలు!

మహిళల భద్రతపై ఉన్నతాధికారులతో సమీక్షలో మంత్రి సీతక్క

హైదరాబాద్‌: మహిళలను గౌరవించటం, నేరాలు చేస్తే పడే శిక్షలపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలని, అందుకోసం పాఠ్యాంశాల్లో ఈ అంశాలను చేర్చాలని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. దీనికోసం స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో మహిళల భద్రతపై ఆమె సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ఐదు రోజుల స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టబోతున్నట్టు తెలిపారు.

మహిళా మంత్రులు, ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని వివరించారు.

సమాజంలో మహిళల భద్రత కోసం స్వయంసహాయక సంఘాల సహాయాన్ని తీసుకుంటామని, ఆ సంఘ సభ్యులతో గ్రామ స్థాయి నుంచి సోషల్‌ యాక్షన్‌ కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. బాధిత మహిళలు బహిరంగంగా మాట్లాడేలా ధైర్యం కల్పిస్తామని తెలిపారు. వేధింపులకు పాల్పడాలంటేనే భయపడేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.

దేశవ్యాప్తంగాఘనంగా 78వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు..

దేశవ్యాప్తంగాఘనంగా 78వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు

నేడు సీతారామ ప్రాజెక్టును ప్రారంభించనున్న రేవంత్

HYDలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

మెట్రో స్టేషన్లలో పెయిడ్‌ పార్కింగ్‌పై L&T ప్రకటన

రేపటి నుంచి ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన

రైల్వే స్టేషన్లలో క్యూఆర్‌ కోడ్‌తో టికెట్ల విక్రయం

PNB, SBIతో లావాదేవీలు నిషేధించిన కర్నాటక ప్రభుత్వం

కాంగో సహా పలు దేశాల్లో మంకీపాక్స్‌ వ్యాప్తి

వినేష్ ఫొగట్‌కు నిరాశ, కాస్‌లో అప్పీల్‌ తిరస్కరణ

సైబరాబాద్‌ : రాయదుర్గంలో భారీగా డ్రగ్స్ పట్టివేత...

సైబరాబాద్‌ : రాయదుర్గంలో భారీగా డ్రగ్స్ పట్టివేత. 650 గ్రాముల హెరాయిన్ పట్టుకున్న పోలీసులు. ఎస్వోటీ, రాయదుర్గం పోలీస్ జాయింట్ ఆపరేషన్. రాజస్థాన్ గ్యాంగ్‌లో ముగ్గురు ఫెడ్లర్స్ .. నలుగురు కంజూమర్స్ అరెస్ట్. మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు.

భద్రాచలం: చర్ల:చర్ల మండలంలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి మెడికల్ సిబ్బందిని పెంచాలి.పి వై ఎల్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేత

చర్ల మండలంలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి మెడికల్ సిబ్బందిని పెంచాలి:పి వై ఎల్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కి వినతి పత్రం

చర్ల మండలంలో ప్రజలు గత కొంతకాలంగా కురిసిన భారీ వర్షాల మూలంగా పంచాయతీ సెక్రటరీలు సరిగా లేక స్వచ్ఛతనం లేక బ్లీచింగ్ పౌడర్ చల్లకపొగా పూర్తిగా ఏజెన్సీ చర్ల మండలమైన గ్రామాలలో ప్రజలు విష జ్వరాలతో తీవ్రమైన నొప్పులతో ప్రజలు మంచాన పడి ఉన్నారని కదలలేని పరిస్థితిలో ఉన్నారని ఆస్పత్రికి వచ్చే పరిస్థితి కూడా లేదని వారికి తక్షణమే వైద్య సౌకర్యం కల్పించాలని గ్రామాలలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని పివైఎల్ ప్రగతిశీల యువజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ముసలి సతీష్ అన్నారు  మండలంలో ఉన్న ప్రధాన ఆసుపత్రిలో డాక్టర్లను స్టాఫ్ నర్స్ను సిబ్బందిని మంచినీటి సౌకర్యాన్ని స్కానింగ్ మెడికల్ షాపుల్ని ఏర్పాటు చేయాలని ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్,తరుపున చర్ల తహసిల్దార్ శ్రీనివాస్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది.

ఐటిడిఏ కూడా జోక్యం చేసుకొని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా సాంస్కృతికంగా వెనకబడినటువంటి చర్ల మండలం పై దృష్టి సారించాలని రెక్కాడితే డొక్కాడని ప్రజలు ఎక్కువ మంది ఉన్నారని ఆ ప్రజలకు వైద్యం గురించి తెలియదని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి అన్యం పుణ్యం తెలవని ప్రజలు వారిని చైతన్యపరిచి వైద్య సౌకర్యాలని సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో పి వై ఎల్ మండల నాయకుడు కారం సురేష్ పిడిఎస్యు మండల నాయకుడు ఇరుప రాజేష్ శ్యాంసుందర్ కృష్ణ  తదితరులు పాల్గొన్నారు.

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. స్టేషన్లలో QR కోడ్‌తో ఇక పేమెంట్స్‌..

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. స్టేషన్లలో QR కోడ్‌తో ఇక పేమెంట్స్‌

సికింద్రాబాద్‌: రైల్వే టికెట్‌ కౌంటర్ల వద్ద టికెట్ల (Train ticket) కొనుగోలు ఇకపై సులభతరం కానుంది. క్యూఆర్‌ కోడ్‌ (QR code) ద్వారా డిజిటల్‌ చెల్లింపులు చేసే సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే (South central railway) వెల్లడించింది. దీంతో ప్రయాణికులకు టికెట్ కొనుగోలులో చిల్లర కష్టాలు తీరనున్నాయి. తొలుత ప్రధాన రైల్వే స్టేషన్లలోనే ఈ సదుపాయం ఉండగా.. ఇప్పుడు అన్ని స్టేషన్లకూ విస్తరించినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది.

రైల్వే స్టేషన్లలోని జనరల్‌ బుకింగ్‌, రిజర్వేషన్‌ కౌంటర్లలో క్యూఆర్‌ కోడ్‌ను ఉపయోగించి ఇకపై డిజిటల్‌ చెల్లింపులు చేయొచ్చని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఇందుకోసం అన్ని స్టేషన్లలోని టికెట్ విండో వద్ద ప్రత్యేక డివైజ్‌ను ఉంచుతున్నట్లు తెలిపింది. ప్రయాణికుడికి సంబంధించిన అన్ని వివరాలూ కంప్యూటర్‌లో ఎంటర్‌ చేశాక.. ఆ డివైజ్‌లో క్యూఆర్‌ కోడ్‌ ప్రత్యక్షమవుతుంది. దాన్ని యూపీఐ యాప్స్‌ వినియోగించి చెల్లింపులు చేయొచ్చు. పేమెంట్ పూర్తవ్వగానే టికెట్‌ను అందిస్తారు.

సికింద్రాబాద్‌ వంటి ప్రధాన రైల్వే స్టేషన్లకే పరిమితమైన క్యాష్‌లెస్‌ సదుపాయాన్ని జోన్‌ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లకు విస్తరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇప్పటికే అన్ని స్టేషన్లకు డివైజులను పంపించామని, దశలవారీగా మరికొన్ని రోజుల్లో అన్ని స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపింది. ఈ విషయంలో కీలకంగా వ్యవహరించిన కమర్షియల్‌, టెక్నికల్‌ సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ కొనియాడారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు.

ఉప్పు, చక్కెరలో ప్లాస్టిక్‌ భూతం..

Plastic: ఉప్పు, చక్కెరలో ప్లాస్టిక్‌ భూతం

దేశంలోని అన్ని కంపెనీల ఉత్పత్తుల్లోనూ మైక్రో ప్లాస్టిక్స్‌

సైజు 0.1 మి.మీ. నుంచి 5 మి.మీ.

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

‘టాక్సిక్స్‌ లింక్‌’ అధ్యయనంలో వెల్లడి

దిల్లీ: దేశంలో విక్రయిస్తున్న ఉప్పు, చక్కెరలో ప్రమాదకర మైక్రో ప్లాస్టిక్స్‌ (ప్లాస్టిక్‌ రేణువులు) ఉన్నట్లు తేలింది. ఇందుకు ఏ బ్రాండూ మినహాయింపు కాదని వెల్లడైంది. బ్రాండ్లే కాదు.. అన్‌ బ్రాండెడ్‌ ఉప్పు, చక్కెరలోనూ మైక్రో ప్లాస్టిక్స్‌ ఉన్నాయి. ‘పెద్ద బ్రాండ్‌.. చిన్న బ్రాండ్‌ అనే కాదు. అన్‌ బ్రాండెడ్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ప్యాకేజ్డ్, అన్‌ ప్యాకేజ్డ్‌లోనూ మైక్రో ప్లాస్టిక్స్‌ ఉనికి ఉంది’ అని ‘టాక్సిక్స్‌ లింక్‌’ అనే పర్యావరణ పరిశోధన సంస్థ ‘మైక్రో ప్లాస్టిక్స్‌ ఇన్‌ సాల్ట్‌ అండ్‌ షుగర్‌’ అనే పేరుతో జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. 10 రకాల ఉప్పులను, 5 రకాల చక్కెరలను తీసుకుని ఈ సంస్థ అధ్యయనం చేసింది. ఆ వివరాలను మంగళవారం వెల్లడించింది. సంస్థ అధ్యయనం చేసిన వాటిలో టేబుల్, రాక్, సముద్ర, స్థానిక ముడి ఉప్పులున్నాయి. 

ఉప్పు, చక్కెరల్లో వివిధ రూపాల్లో మైక్రో ప్లాస్టిక్స్‌ ఉన్నాయి. అవి ఫైబర్, పెల్లెట్స్, ఫిల్మ్స్, ఫ్రాగ్మెంట్స్‌ రూపంలో కనిపించాయి.

ఈ మైక్రో ప్లాస్టిక్స్‌ సైజు 0.1 మిల్లీమీటర్ల నుంచి 5 మిల్లీమీటర్ల వరకూ ఉన్నాయి.

అయోడైజ్డ్‌ ఉప్పులో అత్యధిక స్థాయిలో మైక్రో ప్లాస్టిక్స్‌ ఉన్నాయి. అవి బహుళ రంగుల పల్చటి ఫైబర్, ఫిల్మ్స్‌ రూపంలో కనిపించాయి.

భారతీయుల్లో వినియోగం అధికం

భారతీయులు సగటున రోజుకు 10.98 గ్రాముల ఉప్పును తీసుకుంటారని గతంలో నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది. 10 చెంచాల చక్కెరను తీసుకుంటారని తేలింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే చాలా ఎక్కువ. మైక్రో ప్లాస్టిక్స్‌ ఆరోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర నష్టం కలగజేస్తున్నాయి. ఇవి మానవ శరీరంలోకి ఆహారం, నీరు, గాలిద్వారా ప్రవేశిస్తాయి. ఊపిరితిత్తులు, గుండెతోపాటు తల్లి పాలు, గర్భస్థ శిశువుల్లోనూ మైక్రో ప్లాస్టిక్స్‌ ఉన్నట్లు ఇటీవల జరిపిన పరిశోధనలో తేలింది. 

నిర్దిష్ట చర్యల కోసమే: టాక్సిక్స్‌ లింక్‌

మైక్రో ప్లాస్టిక్స్‌పై శాస్త్రీయ డేటాబేస్‌కు మరింత సమాచారం జోడించడానికే తాము అధ్యయనం చేశామని టాక్సిక్స్‌ లింక్‌ ఫౌండర్‌-డైరెక్టర్‌ రవి అగర్వాల్‌ తెలిపారు. దీనిద్వారా అంతర్జాతీయంగా మైక్రో ప్లాస్టిక్స్‌పై పోరాటంలో నిర్దిష్ట చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుందని చెప్పారు. ‘ఉప్పు, చక్కెరల్లో అధిక మైక్రో ప్లాస్టిక్స్‌ ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఇది ఆరోగ్యంపై చూపే ప్రభావాలను అత్యవసరంగా, సమగ్రంగా పరిశోధించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది’ అని టాక్సిక్స్‌ లింక్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ సతీశ్‌ సిన్హా పేర్కొన్నారు.

కేజీ ఉప్పులో 89.15 వరకూ.. 

ఒక కేజీ ఉప్పులో 6.91 నుంచి 89.15 వరకు మైక్రో ప్లాస్టిక్స్‌ ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. 

• ఇళ్లలో విరివిగా ఉపయోగించే అయోడైజ్డ్‌ ఉప్పులోనే ఇవి ఎక్కువ సంఖ్యలో (89.15) ఉండటం గమనార్హం. 

ఆర్గానిక్‌ రాక్‌ సాల్ట్‌లో అతి తక్కువగా 6.7 మైక్రో ప్లాస్టిక్స్‌ ఉన్నాయి. 

చక్కెరలో 68.25 వరకూ..

కేజీ పంచదారలో 11.85 నుంచి 68.25 మైక్రో ప్లాస్టిక్స్‌ ఉన్నట్లు తేలింది. 

ఆర్గానికేతర చక్కెరలోనే ఇవి అధికంగా ఉన్నట్లు వెల్లడైంది.

TS: రోగులకు ఉచితంగా హార్ట్‌ వాల్వులు పంపిణీ...త్వరలో హార్ట్‌ వాల్వ్‌ బ్యాంకును ప్రారంభించనున్న వైద్య మంత్రి

సహజసిద్ధమైన గుండె కవాటాలను అందించడమే లక్ష్యం

పేద రోగులకు ఉచితంగా హార్ట్‌ వాల్వులు పంపిణీ

త్వరలో హార్ట్‌ వాల్వ్‌ బ్యాంకును ప్రారంభించనున్న వైద్య మంత్రి

లక్డీకాపూల్‌: గుండెకు మరింత భరో సా కల్పించే దిశగా నిజామ్స్‌ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్‌) అడుగులు వేస్తోంది. గుండె సమస్యలతో బాధపడుతున్న పేద రోగుల్లో అవసరమైన వారికి ఉచితంగా గుండె కవాటా(హార్ట్‌ వాల్వ్‌)లను అందించేందుకు నిమ్స్‌ సమాయత్తమైంది. ప్రస్తుతం ఆస్పత్రిలో గుండె సిరలు దెబ్బతిన్న వారికి కృత్రిమంగా తయారు చేసిన వాటిని అమరుస్తున్నారు. 

JOY_Kareena_Subtitles

ఖర్చుతో కూడుకున్న ఈ వాల్వ్‌ల మార్పిడి ఆపరేషన్‌ నిరుపేదలకు పెనుభారంగా తయారైంది. దీంతో పేదలకు ఉచితంగా అందించేందుకు ఆస్పత్రిలో ప్రత్యేకంగా హార్ట్‌ వాల్వ్‌ బ్యాంకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో స్థల పరిశీలన జరుగుతోంది. త్వరలోనే హార్ట్‌ వాల్వ్‌ బ్యాంక్‌ను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో ప్రారంభించాలని భావిస్తున్నారు.  

బ్రెయిన్‌ డెడ్‌ అయిన వాళ్ల నుంచి సేకరణ..

బ్రెయిన్‌ డెడ్‌కు గురైన వాళ్ల నుంచి అవ యవాలను నిమ్స్‌ సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మృతుని కుటుంబసభ్యుల అంగీకారంతో కిడ్నీ లు, కాలేయం, కళ్లు, గుండె తదితర కీలక అవయవాలను సేకరిస్తోంది. అదే విధంగా బ్రెయిన్‌ డెత్‌కు గురైన వాళ్ల నుంచి గుండె కవాటాలను కూడా సేకరించి.. వాటిని భద్రపర్చేందుకు ప్రత్యేక విభాగాన్ని(హార్ట్‌ బ్యాంక్‌) ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. 

ఈ బ్యాంకులో భద్రపరిచిన కవాటాలను పూర్తిగా ఉచితంగా అందించడంతో నిమ్స్‌కు వచ్చే రోగులు చాలా తక్కువ ఖర్చుతోనే శస్త్ర చికిత్సలు చేయించుకోవచ్చని నిమ్స్‌ అసిస్టెంట్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాకేశ్‌ తెలిపారు.