VijayaKumar

Aug 18 2024, 15:26

సబ్బండ వర్గాల నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: దయ్యాల నరసింహ గొర్ల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా అధ్యక్షులు

సర్దార్ సర్వాయి పాపన్న 374 వ జయంతిని పురస్కరించుకొని భువనగిరి మండలం హనుమపురం గ్రామంలో పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా దయ్యాల నరసింహ మాట్లాడుతూ 1650 సంవత్సరంలో ధర్మయ్యా సర్వమ్మ దంపతులకు సామాన్య కల్లుగీత కుటుంబంలో జన్మించి గోల్కొండ కోటను స్వాధీనం చేసుకుని ఆనాటి అరాచకాలకు కులవృత్తులకు వేసిన పన్నులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నాయకుడు అని అన్నారు గోల్కొండ కోటను రాజధానిగా చేసుకుని బహుజనుల రాజ్యాన్ని స్థాపించిన బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడినారు షాపూర్ను తన రాజధానిగా చేసుకుని తెలంగాణ ప్రాంతంలోని కొలనుపాక తాటికొండ, ఎలగందుల ,చేర్యాల, హుస్నాబాద్, భువనగిరి, జనగామ తో సహా అనేక ప్రాంతాలను పాలించిన నాయకుడు అని అన్నారు సర్దార్ సర్వాయి పాపన్న అనికొనియాడారు ఆనాడు జరిగిన హింసను భరించలేక దళాని ఏర్పరచుకొని బహుజనుల కోసం పోరాడి నాయకుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో గీత కార్మిక సంఘం సొసైటీ అధ్యక్షులు రంగస్వామి, మాజీ ఉపసర్పంచ్ ఆముదాల రమేష్, మాజీ వార్డు సభ్యులు మోట ఎల్లయ్య, రాగల రాజేశ్వర్ ,మాజీ సొసైటీ అధ్యక్షులు రంగా కొండల్ ,పాలకూరి బిక్షపతి, హనుమగంటి సత్యనారాయణ, రంగ నారాయణ, ఎర్రబోయిన కిష్టయ్య, హనుమగంటి బిక్షపతి, దుర్గం కృష్ణ, ముద్దం కొమరయ్య ,తుమ్మేటి మల్లేష్, హనుమగంటి శ్రీశైలం, జాన భూపాలు ,హనుమగంటి సత్తయ్య ,హనుమగంటి సుక్కయ్య, నరసయ్య.

VijayaKumar

Aug 17 2024, 19:56

చౌటుప్పల్ : దివిస్ పరిశ్రమ కాలుష్యం వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్

దివిస్ పరిశ్రమ కాలుష్యం వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి యాదాద్రి భువనగిరి సిపిఎం జిల్లా కార్యదర్శి జహంగీర్ అన్నారు. దివిస్ పరిశ్రమ నుండి వెలువడే రసాయనాల వల్ల భూగర్భ కాలుష్యం ఏర్పడి ఆరెగూడెం గ్రామంలో ప్రజలు అనారోగ్యానికి గురవుతా ఉన్నారని,వేసిన పంటలు తీవ్రంగా నష్టపోతున్నారని ,బర్రెలు మూగ జీవాలు మృత్యువాత పడుతున్నాయని సిపిఎం బృందం పరిశీలనలో తేలిందని *సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్* అన్నారు దివిస్ పరిశ్రమ వల్ల నష్టపోతున్న రైతాంగం సమస్యలు తెలుసుకొని మాట్లాడుతూ దివిస్ చుట్టుపక్కల గ్రామాలలో 200 నుండి 300 ఫీట్ల లోతుల్లో రసాయనలతో పూర్తిగ భూగర్భ జలాలు కాలుష్యంగా మారి బోరు నుంచి వచ్చే నీళ్లు వ్యవసాయానికి, గేదెలు త్రాగకుండా దుర్గంధమైన వాసనతో నిరుపయోగంగా మారాయని అన్నారు వ్యవసాయం,గేదెలు పై ఆధారపడిన రైతాంగం తీవ్రంగా నష్టపోతా ఉన్నారని అన్నారు ప్రజలకు అనారోగ్య సమస్యలు, గేదెలకు చర్మ వ్యాధుల తో మృత్యువాత పడుతఉన్నాయి అన్నారు పరిశ్రమల కాలుష్యం వల్ల భవిష్యత్తులో నోమ్యాన్ జోన్ గా ప్రకటించే అవకాశం ఉందని అన్నారు కాలుష్యం వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉంటే పిసిబి అధికారులు కంపెనీ యాజమాన్యం ముడుపులో మత్తులో ఉన్నారని అన్నారు ప్రజల మద్దతు ఎన్నికైన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కంపెనీల కాలుష్యం పట్ల స్పందించకపోవడం కారణం ఏంటని అన్నారు కంపెనీల కాలుష్యం పట్ల ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తామని అన్నారు దివిస్ పరిశ్రమ కాలుష్యంపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈనెల 21వ తేదీన నష్టపోయిన రైతులతో కలెక్టర్ గారిని కలుస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, సిపిఎం మండల కార్యదర్శి గంగదేవి సైదులు,DYFI జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేశం,సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు చిరిక సంజీవరెడ్డి, DYFI జిల్లా ఉపాధ్యక్షులు పల్లె మధుకృష్ణ, నాయకులు బోయ యాదయ్య రైతులు అనంతుల రాములు, గుండెబోయిన బాలకృష్ణ, సబిత, శ్రీరాముల బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 17 2024, 18:06

వలిగొండ: TPUS ఆధ్వర్యంలో గురువందన్ ,ఆత్మీయ సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో గురువందన్,ఆత్మీయ సన్మానం తెలంగాణ ప్రాంత ఉపాద్యాయ సంఘం(TPUS) ఆధ్వర్యంలో పెన్షనర్స్ భవన్ వలిగొండ లో శనివారం మధ్యాహ్నం 1pm భోజనానంతర0 TPUS వలిగొండ మండల శాఖ "సర్వ సభ్య సమావేశం" నూతన కార్య వర్గ ఎన్నిక మరియు ట్రాన్స్ఫర్ ప్రమోషన్ ల లో వివిధ ప్రాంతాలకు వెళ్లిన TPUS సభ్యులకు ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది .ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అదనపు కార్యదర్శి తెల్జలపల్లి పెంటయ్య గారు, అత్మీయ అతిథిగా బండారపు లింగుస్వామి గారు, విశిష్ట అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి కొమరెల్లి భాస్కర్ రెడ్డి గారు విచ్చేయడం జరిగింది. మన్నెం నరేందర్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించటం జరిగింది.TPUS నూతన మండల అధ్యక్షుడిగా yvn రెడ్డి గారు, ప్రదాన కార్యదర్శిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోశాధికారి గా మద్దేపూరి వెంకటేశం గారు ఎన్నిక కావడం జరిగింది.

VijayaKumar

Aug 17 2024, 15:35

వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే సందర్శించారు.పేషెంట్ల పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంత్ కే.జెండగే వైద్యాధికారులకు సూచించారు. ప్రతిరోజు వస్తున్న అవుట్ పేషెంట్ల వివరాలు, ల్యాబ్ లో నిర్వహిస్తున్న పరీక్షల వివరాలను పరిశీలించారు. వార్డులు తిరిగి పేషెంట్లతో ఏ సమస్యలపై ఆసుపత్రికి వచ్చింది అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అందుబాటులో అన్ని రకాల మందులను, రాపిడ్ కిట్స్ సిద్ధంగా ఉంచుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. ఆరోగ్య కేంద్రంలో పారిశుద్యపనులు పక్కగా నిర్వహించాలని, దోమల వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్వర్ణలత, డాక్టర్ స్వామి, ఎంపీడీఓ జితేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

VijayaKumar

Aug 16 2024, 22:52

ఘనంగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం కొండకింద బీఆర్ఎస్ పార్టీ మండల మరియు పట్టణ నాయకులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అభిమాన నాయకురాలు శ్రీమతి గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు, నాయకులు నియోజకవర్గ వ్యాప్తంగా అన్నీ గ్రామాలలో మండల కేంద్రాలలో కేక్ లు కట్ చేసి పలు సేవా కార్యక్రమాలతో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలేరు నియోజకవర్గ కేంద్రం ఆలేరు లో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఇమ్మడి నర్సింహారెడ్డి గార్డెన్స్ లో నిర్వహించిన వేడుకలకు హాజరైన గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గారు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఆలేరు నియోజకవర్గం నలుమూలల నుంచి పార్టీ నేతలు, యువకులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.

VijayaKumar

Aug 16 2024, 22:40

గ్రామపంచాయతీ కార్మికుడు నల్లాల శంకరయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైళ్ల గణపతి రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో మండల సెంటర్ గ్రామపంచాయతీలో గత సుమారు 35 సంవత్సరాలుగా వాటర్ మెన్ గా పనిచేస్తూ ఈరోజు అనారోగ్యంతొ మరణించడం జరిగింది అనారోగ్యంతో మరణించిన శంకరయ్య కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఐదు లక్షల ఇన్సూరెన్స్ మంజూరు చేయాలని ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పైళ్ళ గణపతి రెడ్డి జిల్లా అధ్యక్షులు బందెల బిక్షం జిల్లా మాజీ ఎడవల్లి ఎల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గ్రామపంచాయతీ నుండి పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చారు ఇది మేజర్ గ్రామపంచాయతీ కోట్ల రూపాయలు ఆదాయం ఉన్న పంచాయతీ పదివేల రూపాయలు కాకుండా కనీసం 50 వేల రూపాయలు అతని సర్వీస్ దృష్టిలో పెట్టుకొని ఇవ్వవలసిన అవసరం ఉంది ఇప్పటికైనా నూతనంగా వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని ప్రతి కార్మికునికి తప్పకుండా ఇన్సూరెన్స్ కల్పించాలని అదేవిధంగా మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని గ్రామపంచాయతీ లో ఆదాయం ఉన్నటువంటి వద్ద జీతాలు పెంచుకోవడానికి ప్రభుత్వం సహకరించాలని ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు మరియు ఇట్టి విషయంలో ఎమ్మెల్యే గారు కూడా పూర్తిగా సహకరించాలని వారి ఆలయంలో కూడా గ్రామపంచాయతీలో పని చేశారు కావున ఎమ్మెల్యే గారు ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని శంకరయ్య గారికి ఒక కూతురు వివాహం కూడా కాలేదు కావున ఆదుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎడవెల్లి శ్రీరాములు మల్లయ్య రామలింగం సాలయ్య ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 16 2024, 22:18

ఆలేరు: 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ: CPI రాష్ట్ర కార్యదర్శి MLA కూనంనేని సాంబశివరావు

ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో చెక్క వెంకటేష్ అధ్యక్షతన యాదాద్రి భువనగిరి జిల్లా నిర్మల కౌన్సిల్ సమావేశంలో, ముందుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు జెండా ఆవిష్కరించి నా అనంతరం ఈ సమావేశంలో *ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్ల వెంకట్ రెడ్డి గారు* వందేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ ఎన్నో త్యాగాలకు నిలియంగా ఈ ఉమ్మడినల్గొండ జిల్లాలో బడుగు బలహీన వర్గాల కోసం పోరాటాలు చేసిన చరిత్ర ఉందని, పేదవాడికి ఈరోజు కష్టం కలిగిన వారి వెన్నంటే ఉండి పోరాటం చేసేది కమ్యూనిస్టు పార్టీ నే నని పెట్రోల్ ధరలు పెరిగిన, డీజిల్ ధరలు పెరిగిన, నిత్యవసర ధరలు పెరిగిన, పేదవాడు దరిచేరి జెండా ఎర్రజెండా నే అని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఈ ప్రాంతంలో నిరుపేదలకు భూముల పంచిన చరిత్ర ఒక్క భారత కమ్యూనిస్టు పార్టీకే ఉందని ఈ సందర్భంగా వారి పేర్కొన్నారు ఈరోజు దేశంలో రాష్ట్రంలో ఎన్నో పార్టీలు వస్తూ ఉంటాయి పోతుంటాయి కానీ వందేళ్లు అధికారం లేకున్నా నిలబడగలిగిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక కమ్యూనిస్టు పార్టీ అని, దాన్ని మరింత బలోపేతం చేసుకోవడం కోసం ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్మాణపరంగా పార్టీ ఎదుగుదల కోసం మళ్లీ కమ్యూనిస్టు పార్టీని పునర్ వైభవం తీసుకు వచ్చే ప్రయత్నంలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా వారు కౌన్సిల్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు, ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, జిల్లా సహాయ కార్యదర్శులు y దామోదర్ రెడ్డి, బి సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కే శ్రీనివాస్ జిల్లా కార్యవర్గ సభ్యులు బండి జంగమ్మ,కృష్ణ,ఇమ్రాన్, అశోక్,సుదర్శన్, ప్రజా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ఎల్లంకి మహేష్, మహేందర్, శాంతి కుమార్ జిల్లా కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు


VijayaKumar

Aug 16 2024, 19:08

హనుమపురం లో నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి: అఖిలపక్ష నాయకులు

యాదాద్రి భువనగిరి జిల్లా  భువనగిరి మండలంలోని హనుమపురం గ్రామంలో మంచినీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం గ్రామానికి చెందిన అఖిలపక్ష నాయకులు భువనగిరి ఎంపీడీవో శ్రీనివాస్ తో కలిసి చర్చించారు. ముఖ్యంగా గ్రామంలో వర్షాకాలంలో విష సర్పాల బారిన పడే అవకాశం ఉందని వీధి దీపాల ఏర్పాటు చేయాలని , వెంటనే దోమల మందును పిచికారి చేయాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యంగా గ్రామంలో నీటి సమస్యను తీర్చేందుకు అవసరమైన చోట గేటు వాళ్లు నూతనంగా ఏర్పాటు చేసి, నూతన బోరు మోటర్ ను ఫిట్ చేయాలని, పాత బోరుబావిలోకి నూతన పైపులు మంజూరు చేయాలని కోరారు. సెక్రెటరీ సెలవులు ఉండటం, స్పెషల్ ఆఫీసర్ గ్రామానికి రాకపోవడంతో, సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని ఎంపీడీవోను కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు ములాయం సింగ్ యాదవ్ యూత్ బ్రిగేడ్ రాష్ర్ట అధ్యక్షులు మేకల బాలు యాదవ్. సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తుమేటి వెంకటేష్ యాదవ్, బిఆర్ఎస్ మండల నాయకులు నాగపురి కృష్ణ, మాజీ ఉపసర్పంచ్ ఏనుగు లింగారెడ్డి, సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి మోటే ఎల్లయ్య, మాజీ వార్డ్ మెంబర్లు మోర లింగారెడ్డి, రంగస్వామి, నాయకులు హనుమ గంటి రాజు, హ్యన్మగంటి సత్యనారాయణ, ఎస్సీ సెల్ నాయకులు బండారి సుధాకర్ పాల్గొన్నారు.

VijayaKumar

Aug 15 2024, 22:11

క్యూ న్యూస్ ఆఫీసులో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

హైదరాబాదులోని క్యూ న్యూస్ ఆఫీసులో 78వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జెండా విస్కరణ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పిఏ రవీందర్, యాంకర్ శ్యామ్ ,సుదర్శన్ 7200 యూత్ వింగ్ నాయకుడు తోటకూరి లింగస్వామి, కార్తీక్ ,కుమార్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 15 2024, 21:20

ఇంద్రపాలనగరం లో ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధిలోని ఇంద్రపాలనగరం గ్రామంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్సీ కాలనీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జెండా ఆవిష్కరణ చేశారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుల త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బందెల క్రిస్టఫర్, మాజీ వార్డ్ మెంబర్ కొలుకులపల్లి యాదయ్య, మహేష్ రవి, భూతం బాలస్వామి, సంభోగు స్వామి,కొలుకులపల్లి నరేష్, కొలుకులపల్లి ప్రశాంత్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.