ఆలేరు: 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ: CPI రాష్ట్ర కార్యదర్శి MLA కూనంనేని సాంబశివరావు
ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో చెక్క వెంకటేష్ అధ్యక్షతన యాదాద్రి భువనగిరి జిల్లా నిర్మల కౌన్సిల్ సమావేశంలో, ముందుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు జెండా ఆవిష్కరించి నా అనంతరం ఈ సమావేశంలో *ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్ల వెంకట్ రెడ్డి గారు* వందేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ ఎన్నో త్యాగాలకు నిలియంగా ఈ ఉమ్మడినల్గొండ జిల్లాలో బడుగు బలహీన వర్గాల కోసం పోరాటాలు చేసిన చరిత్ర ఉందని, పేదవాడికి ఈరోజు కష్టం కలిగిన వారి వెన్నంటే ఉండి పోరాటం చేసేది కమ్యూనిస్టు పార్టీ నే నని పెట్రోల్ ధరలు పెరిగిన, డీజిల్ ధరలు పెరిగిన, నిత్యవసర ధరలు పెరిగిన, పేదవాడు దరిచేరి జెండా ఎర్రజెండా నే అని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఈ ప్రాంతంలో నిరుపేదలకు భూముల పంచిన చరిత్ర ఒక్క భారత కమ్యూనిస్టు పార్టీకే ఉందని ఈ సందర్భంగా వారి పేర్కొన్నారు ఈరోజు దేశంలో రాష్ట్రంలో ఎన్నో పార్టీలు వస్తూ ఉంటాయి పోతుంటాయి కానీ వందేళ్లు అధికారం లేకున్నా నిలబడగలిగిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక కమ్యూనిస్టు పార్టీ అని, దాన్ని మరింత బలోపేతం చేసుకోవడం కోసం ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్మాణపరంగా పార్టీ ఎదుగుదల కోసం మళ్లీ కమ్యూనిస్టు పార్టీని పునర్ వైభవం తీసుకు వచ్చే ప్రయత్నంలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా వారు కౌన్సిల్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు, ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, జిల్లా సహాయ కార్యదర్శులు y దామోదర్ రెడ్డి, బి సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కే శ్రీనివాస్ జిల్లా కార్యవర్గ సభ్యులు బండి జంగమ్మ,కృష్ణ,ఇమ్రాన్, అశోక్,సుదర్శన్, ప్రజా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ఎల్లంకి మహేష్, మహేందర్, శాంతి కుమార్ జిల్లా కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు
Aug 16 2024, 22:52