హనుమపురం లో నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి: అఖిలపక్ష నాయకులు
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని హనుమపురం గ్రామంలో మంచినీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం గ్రామానికి చెందిన అఖిలపక్ష నాయకులు భువనగిరి ఎంపీడీవో శ్రీనివాస్ తో కలిసి చర్చించారు. ముఖ్యంగా గ్రామంలో వర్షాకాలంలో విష సర్పాల బారిన పడే అవకాశం ఉందని వీధి దీపాల ఏర్పాటు చేయాలని , వెంటనే దోమల మందును పిచికారి చేయాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యంగా గ్రామంలో నీటి సమస్యను తీర్చేందుకు అవసరమైన చోట గేటు వాళ్లు నూతనంగా ఏర్పాటు చేసి, నూతన బోరు మోటర్ ను ఫిట్ చేయాలని, పాత బోరుబావిలోకి నూతన పైపులు మంజూరు చేయాలని కోరారు. సెక్రెటరీ సెలవులు ఉండటం, స్పెషల్ ఆఫీసర్ గ్రామానికి రాకపోవడంతో, సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని ఎంపీడీవోను కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు ములాయం సింగ్ యాదవ్ యూత్ బ్రిగేడ్ రాష్ర్ట అధ్యక్షులు మేకల బాలు యాదవ్. సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తుమేటి వెంకటేష్ యాదవ్, బిఆర్ఎస్ మండల నాయకులు నాగపురి కృష్ణ, మాజీ ఉపసర్పంచ్ ఏనుగు లింగారెడ్డి, సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి మోటే ఎల్లయ్య, మాజీ వార్డ్ మెంబర్లు మోర లింగారెడ్డి, రంగస్వామి, నాయకులు హనుమ గంటి రాజు, హ్యన్మగంటి సత్యనారాయణ, ఎస్సీ సెల్ నాయకులు బండారి సుధాకర్ పాల్గొన్నారు.
Aug 16 2024, 19:08