78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, మాజీ ఎమ్యెల్యే కాపు రామచంద్రారెడ్డి..
78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, మాజీ ఎమ్యెల్యే కాపు రామచంద్రారెడ్డి ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు గారు హార్ ఘర్ తిరంగా రాయలసీమ జోనల్ ఇంచార్జ్ కాపు రామచంద్రారెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం స్వాతంత్రం రావడానికి అనేకమంది స్వాతంత్ర సమరయోధులు త్యాగదనుల యొక్క త్యాగాలతో ఈరోజు మన అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నామని అలాంటి త్యాగదనులందరినీ కూడా నేటి సమాజానికి వారి పోరాటాలు తెలియజేసే బాధ్యత మనకుందని, కొన్ని లక్షల మంది స్వాతంత్రం కోసం ప్రాణాలర్పిస్తే వచ్చిన స్వాతంత్రం భారతంలో మనం ఎంత స్వేచ్ఛగా ఈరోజు బతుకుతున్నామని అతి చిన్న వయసులోనే ప్రాణాలకు ఇచ్చిన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్,ఝాన్సీ లక్ష్మీబాయి, వీర సావర్కర్, సుభాష్ చంద్రబోస్ ఇలా అనేకమంది తమ జీవితాలను త్యాగం చేశారని స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాల్లో గత పది సంవత్సరాలుగా మన దేశం ఎంతో గర్వపడే విధంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నిరంతరం పనిచేస్తూ దేశాన్ని ప్రపంచ పటంలో ఉన్నత స్థాయిలో పెట్టాడని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారతదేశం విశ్వ గురువుగా నిలుస్తుందని మనందరం కూడా మన ప్రధానమంత్రి గారు చెప్పినట్లు విదేశీ వస్తువులు కొనుగోలు చేయకుండా స్వదేశీ వస్తువుల్ని కొనుగోలు చేసినట్లయితే ఆర్థికంగా కూడా మన దేశం మొదటి స్థానంలో ఉంటుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రత్మమయ్య, లలిత్ కుమార్, అల్లాడి రామచంద్రయ్య, ఆదిలక్ష్మమ్మ, పైల నరసింహయ్య బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి, శ్రీధర్, నాగరాజు, ఆజేష్ యాదవ్, సూర్య ప్రకాష్ ,రంజిత్ ఇలియాజ్ ,అనంత కుమారి,మల్లీశ్వరి, రవికుమార్ ,చలపతి, వెంకటేష్, శివ, మండల అధ్యక్షులు అయ్యన్న, బోయ లక్ష్మణ్ ,వెంకటనారాయణ గౌడ్, గౌతమ్, సుధాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు
Aug 16 2024, 07:15