78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జండా ఆవిష్కరించిన.. ఎంపీపీ దాసరి సునీత..
బుక్కరాయసముద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జండా ఆవిష్కరించి వందనం చేస్తున్న ఎంపీపీ దాసరి సునీత గారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది ఉపాధి హామీ సిబ్బంది మరియు నాయకులు పాల్గొన్నారు
78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, మాజీ ఎమ్యెల్యే కాపు రామచంద్రారెడ్డి..
78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, మాజీ ఎమ్యెల్యే కాపు రామచంద్రారెడ్డి ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు గారు హార్ ఘర్ తిరంగా రాయలసీమ జోనల్ ఇంచార్జ్ కాపు రామచంద్రారెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం స్వాతంత్రం రావడానికి అనేకమంది స్వాతంత్ర సమరయోధులు త్యాగదనుల యొక్క త్యాగాలతో ఈరోజు మన అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నామని అలాంటి త్యాగదనులందరినీ కూడా నేటి సమాజానికి వారి పోరాటాలు తెలియజేసే బాధ్యత మనకుందని, కొన్ని లక్షల మంది స్వాతంత్రం కోసం ప్రాణాలర్పిస్తే వచ్చిన స్వాతంత్రం భారతంలో మనం ఎంత స్వేచ్ఛగా ఈరోజు బతుకుతున్నామని అతి చిన్న వయసులోనే ప్రాణాలకు ఇచ్చిన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్,ఝాన్సీ లక్ష్మీబాయి, వీర సావర్కర్, సుభాష్ చంద్రబోస్ ఇలా అనేకమంది తమ జీవితాలను త్యాగం చేశారని స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాల్లో గత పది సంవత్సరాలుగా మన దేశం ఎంతో గర్వపడే విధంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నిరంతరం పనిచేస్తూ దేశాన్ని ప్రపంచ పటంలో ఉన్నత స్థాయిలో పెట్టాడని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారతదేశం విశ్వ గురువుగా నిలుస్తుందని మనందరం కూడా మన ప్రధానమంత్రి గారు చెప్పినట్లు విదేశీ వస్తువులు కొనుగోలు చేయకుండా స్వదేశీ వస్తువుల్ని కొనుగోలు చేసినట్లయితే ఆర్థికంగా కూడా మన దేశం మొదటి స్థానంలో ఉంటుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రత్మమయ్య, లలిత్ కుమార్, అల్లాడి రామచంద్రయ్య, ఆదిలక్ష్మమ్మ, పైల నరసింహయ్య బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి, శ్రీధర్, నాగరాజు, ఆజేష్ యాదవ్, సూర్య ప్రకాష్ ,రంజిత్ ఇలియాజ్ ,అనంత కుమారి,మల్లీశ్వరి, రవికుమార్ ,చలపతి, వెంకటేష్, శివ, మండల అధ్యక్షులు అయ్యన్న, బోయ లక్ష్మణ్ ,వెంకటనారాయణ గౌడ్, గౌతమ్, సుధాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు
లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన మంత్రి పయ్యావుల కేశవ్
లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు అనంతపురం నగరం లోని అంబేద్కర్ భవనం వెనుక నూతనంగా నిర్మించిన ప్రైవేటు హాస్పిటల్ ప్రారంభానికి వచ్చిన మంత్రి కేశవ్ హాస్పిటల్ ప్రారంభించి, హాస్పిటల్ లిఫ్టు లో పై అంతస్తులో కి వెళ్తున్నప్పుడు లిఫ్టులో జనాభా ఎక్కువగా ఉన్నందున లిఫ్ట్ మద్యలోనే ఆగి పోవడంతో. ఊపిరి ఆడకుండా మంత్రి ఇబ్బందులు పడ్డారు.త్వరగా సగం తలుపులు తీయగా మద్యలో నుండి దూరి బయటికి రావడం జరిగింది.
ఎమ్మెల్యే బండారు శ్రావణి నీ మర్యాదపూర్వకంగా కలిసిన కొత్తగా ఎన్నికైన స్కూల్ చైర్మన్లు..
ఎమ్మెల్యే బండారు శ్రావణి నీ మర్యాదపూర్వకంగా కలిసిన కొత్తగా ఎన్నికైన స్కూల్ చైర్మన్లు..

మండల కేంద్రమైన నార్పల ఎస్సి కాలనీ మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల చైర్మన్ పూజారి చైతన్య, గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రాథమిక చైర్మన్ షేక్ వలి,జ్యోతిరావు పూలే బాలికల పాఠశాల చైర్మన్ రవి పులసలనూతుల చైర్మన్ రామంజి శిoగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి గారి ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మా ఎన్నికలకు సహకరించిన టిడిపి ఎమ్మెల్యే బండారు శ్రావణి గారికి,రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు గారికి,జిల్లా నాయకులు టీడీపీ వెంకట నరసానాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.టీడీపీ కార్యాలయంలో పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణి మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధి కి,విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పి ఎల్ లక్మి నారాయణ, చంద్రబాబు,నడిమింటి రాము,గొల్లపల్లి దనుంజయ యాదవ్, ప్రసాద్,మహేష్,హరీష్,గణేష్,వడ్డే మహేష్ తదితరులు పాల్గొన్నారు.
రైతుపై రెండు ఎలుగుబంటిలు దాడి..
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఉప్పు వంక వద్ద రైతుపై రెండు ఎలుగుబంటిలు దాడి ఎలుగుబంటి దాడి దాడిలో తీవ్రంగా గాయపడిన రామన్న . బుధవారం తెల్లవారుజామున వ్యవసాయ పనులు పోతున్న రామన్న రెండు ఎలుగుబంటు దాడి దాడిలో రామన్న తలకు తీవ్ర గాయాలు మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలింపు
సర్పంచులు, కార్యదర్శుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ దాసరి సునీత..
సర్పంచులు, కార్యదర్శుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ దాసరి సునీత..

బుక్కరాయసముద్రం మండలం నందు మూడు రోజుల శిక్షణా కార్యక్రమములో భాగంగా మొదటి రోజు “రిఫ్రెషర్ శిక్షణా కార్యక్రమం” పారిశుద్ధ్యము, ఘన మరియు ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ మరియు గ్రామ పంచాయితీ అభివృద్ధి ప్రణాళిక అంశాల పై మండల స్థాయి శిక్షణా కార్యక్రమము ఉదయం 10.00 గంటల నుంచి నిర్వహించడం జరిగినది. శిక్షణా కార్యక్రమం పంచాయతీ కార్యదర్శులు మరియు సర్పంచులకు నిర్వహించడం జరిగినది. మరియు “డ్రగ్స్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్” సంబంధించి ప్రతిజ్ఞ చేయడమైనది. ఈ కార్యక్రమంలో శ్రీమతి దాసరి సునీత గారు, మండల పరిషత్ అధ్యక్షులు మరియు శ్రీమతి కె. తేజోష్ణ గారు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, శ్రీమతి కె.దామోదరమ్మ, విస్తరణా అధికారి (పి.ఆర్. & ఆర్.డి), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, గ్రామీణ నీటి సరఫరా విభాగము, బుక్కరాయసముద్రం వారు హాజరు కావడం జరిగినది.
పేదింటి ఆడపడుచు వివాహ కార్యమానికి ₹5000/- రూ.లు ఆర్థికసాయం చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి..
పేదింటి ఆడపడుచు వివాహ కార్యక్రమంకు ₹5000/- రూపాయలు ఆర్థికసాయం చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు* ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్దారంపురం గ్రామంలోని బండారు గంగమ్మ కుమార్తె వివాహకార్యక్రమంకు ₹5000/- రూపాయలు ఆర్థికసాయం చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు.ఈ కార్యక్రమలో సిద్దారంపురం ZPH హైస్కూల్ చైర్మన్ లింగమయ్య, ఏలిమెంటరీ స్కూల్ కమిటీ చైర్మన్ అంజి, నాగేంద్ర, రవి, కాటమయ్య,శేఖరయ్య, చెన్నమయ్య, నరసింహులు, కొండన్న తదితరులు పాల్గొన్నారు.
Breaking.. టీవీ5 కెమెరామెన్ శేఖర్ మృతిపై ఎమ్మెల్యే దగ్గుపాటి దిగ్భ్రాంతి..
Breaking.. టీవీ5 కెమెరామెన్ శేఖర్ మృతిపై ఎమ్మెల్యే దగ్గుపాటి దిగ్భ్రాంతి..

టీవీ ఫైవ్ కెమెరామెన్ శేఖర్ మృతి పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుండెపోటుకు గురయ్యారన్న సమాచారం తెలుసుకున్న వెంటనే ఆసుపత్రిలో వైద్యుల్ని అప్రమత్తం చేశారు. త్వరితగతిన చికిత్సలు అందించాలని సూచించారు. అయితే వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ప్రతినిత్యం మీడియా కవరేజ్ లో కనిపించే శేఖర్ మృతి చెందారు అంటే నమ్మలేకపోతున్నానని ఎమ్మెల్యే దగ్గుపాటి తెలిపారు. శేఖర్ మృతి పై సంతాపం వ్యక్తం చేశారు.
పంట రకాలను జాతికి అంకితం చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..
పంట రకాలను జాతికి అంకితం చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..

ఆదివారం నాడు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు బయో ఫోర్టిఫైడ్ మరియు క్లయిమేట్ రిసైలైన్ట్ రకాలను దాదాపుగా 109 పంట రకాలను భారత వ్యవసాయ పరిశోధన మండలి హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో జాతికి అంకితం చేశారు. మోడీ గారి సందేశాన్ని కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లి లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా రైతులకు ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ మల్లీశ్వరి సాదినేని గారు రైతులకు చూపించారు. 109 రకాల వివరాలను అదేవిధంగా వాటి పంట స్థితిగతులను రైతులకు తెలియజేశారు. అదేవిధంగా ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం నుండి రెండు రకాలను జాతీయస్థాయిలో మోడీ గారు రిలీజ్ చేశారు. పప్పు శనగలో NBEG 1267, పెసర లో LGG -610 రకాలను విడుదల చేశారు. ఈ రకం మన అనంతపురం జిల్లాకు చాలా అనుగుణంగా ఉంటుందని తెలియజేశారు. మొత్తం 109 రకాల ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, పూల రకాలను భారత జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డిపల్లి గ్రామ రైతులు, వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు మరియు శాస్త్రవేత్తలు డాక్టర్ మల్లీశ్వరి డాక్టర్ కిషోర్ మరియు డాక్టర్ మాధవి సిబ్బంది ముత్యాలరావు, ప్రభు మిత్ర, సాయికుమార్ పాల్గొన్నారు.
అనంతపురం పట్టణంలోని ప్రైవేట్ యశోద ఆసుపత్రిని తనిఖీ చేసిన.. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈబీ దేవి..
ఆస్పత్రిలో వెలువడే వ్యర్థ పదార్థాలను శాస్త్రీయ పద్ధతిలో డిస్పోస్ తెలియలి, డాక్టర్ ఈ బి దేవి డి యం అండ్ హెచ్ ఓ ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈబీ దేవి అనంతపురం పట్టణంలోని ప్రైవేట్ యశోద ఆసుపత్రిని తనిఖీ చేయడం జరిగింది ఆసుపత్రిలో వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలను సక్రమమైన పద్ధతిలో డిస్పోజ్ చేయడం లేదని ఫిర్యాదులు అందడంతో డి ఎం అండ్ హెచ్ వో గారు తనిఖీ చేయడం జరిగింది ఈ సందర్భంగా డి ఎం అండ్ హెచ్ ఓ మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం ఆసుపత్రిలో వెలువడేటువంటి వ్యక్తపదార్థాలను బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ వారితో అనుసంధానమై శాస్త్రీయ పద్ధతిలో వ్యక్తపదార్థాలను డిస్పోజ్ చేయాలని ఆదేశించారు .ముఖ్యంగా వ్యర్థ పదార్థాలను రకాలుగా విభజించుకొని పసుపు రంగు,ఎరుపు రంగు ,నీలం రంగు మరియు పంచర్ ప్రూఫ్ కవర్లలో వేయాలని వేసేముందు ఏ రంగు చెత్తకుండీలో ఏ చెత్త వేయాలో విభజించుకుని అందులో వేసి బయో మెడికల్ డిస్పోజల్ ప్రాంతానికి ఒప్పంద ప్రకారం పంపివేయాలని ఆదేశించారు బయో మెడికల్ వేస్ట్ ప్రమాదకరమైనవని పారవేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని తెలియజేశారు ఆసుపత్రుల యాజమాన్యం ఆసుపత్రులలో వెలువడే వ్యర్థ పదార్థాలను శాస్త్రీయ పద్దతిలో డిస్పోస్ చేయక పొతే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసారు