అనంతపురం పట్టణంలోని ప్రైవేట్ యశోద ఆసుపత్రిని తనిఖీ చేసిన.. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈబీ దేవి..
ఆస్పత్రిలో వెలువడే వ్యర్థ పదార్థాలను శాస్త్రీయ పద్ధతిలో డిస్పోస్ తెలియలి, డాక్టర్ ఈ బి దేవి డి యం అండ్ హెచ్ ఓ ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈబీ దేవి అనంతపురం పట్టణంలోని ప్రైవేట్ యశోద ఆసుపత్రిని తనిఖీ చేయడం జరిగింది ఆసుపత్రిలో వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలను సక్రమమైన పద్ధతిలో డిస్పోజ్ చేయడం లేదని ఫిర్యాదులు అందడంతో డి ఎం అండ్ హెచ్ వో గారు తనిఖీ చేయడం జరిగింది ఈ సందర్భంగా డి ఎం అండ్ హెచ్ ఓ మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం ఆసుపత్రిలో వెలువడేటువంటి వ్యక్తపదార్థాలను బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ వారితో అనుసంధానమై శాస్త్రీయ పద్ధతిలో వ్యక్తపదార్థాలను డిస్పోజ్ చేయాలని ఆదేశించారు .ముఖ్యంగా వ్యర్థ పదార్థాలను రకాలుగా విభజించుకొని పసుపు రంగు,ఎరుపు రంగు ,నీలం రంగు మరియు పంచర్ ప్రూఫ్ కవర్లలో వేయాలని వేసేముందు ఏ రంగు చెత్తకుండీలో ఏ చెత్త వేయాలో విభజించుకుని అందులో వేసి బయో మెడికల్ డిస్పోజల్ ప్రాంతానికి ఒప్పంద ప్రకారం పంపివేయాలని ఆదేశించారు బయో మెడికల్ వేస్ట్ ప్రమాదకరమైనవని పారవేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని తెలియజేశారు ఆసుపత్రుల యాజమాన్యం ఆసుపత్రులలో వెలువడే వ్యర్థ పదార్థాలను శాస్త్రీయ పద్దతిలో డిస్పోస్ చేయక పొతే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసారు
Aug 16 2024, 06:50