దళితులు సాగు చేసుకుంటున్న భూమికి పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలి: దయ్యాల నరసింహ డిమాండ్
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధిలోని హనుమాపురం గ్రామంలో దళితులు సాగు చేసుకుంటున్న భూమికి వెంటనే పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని సింగిల్ విండో డైరెక్టర్ దయ్యాల నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రోజున హనుమాపురం దళితుల పట్టాదారు పాసుబుక్కుల సాధన కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి మండల ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి డిప్యూటీ ఎమ్మార్వోకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా దయ్యాల నరసింహ మాట్లాడుతూ హనుమాపురం గ్రామంలో సర్వేనెంబర్ 87 లో ప్రభుత్వ భూమి 15.06 ఎకరాలు సుమారు 65 సంవత్సరాల నుండి దళితులు సాగు చేసుకోని చెలుక పంటలు పండిస్తూ ఉలువలు, కందులు, నువ్వులు ఇతర పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నారు. కావున ప్రభుత్వము దళిత పేద కుటుంబాలని దృష్టిలో పెట్టుకొని పట్టదార్ పాస్ బుక్కులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని నరసింహ కోరారు. ఈ కార్యక్రమంలో పట్టాదారుల సాధన కమిటీ అధ్యక్షులు బిచ్చాల మహేందర్, ప్రధాన కార్యదర్శి ముడుగుల రాజు, నాయకులు బండారి రామచందర్, చందుపట్ల మల్లేష్, బండారి జనార్ధన్, బిచ్చాల కొండలు, బండారి బాల నరసింహ, బిచ్చాల మైసయ్య, బండారి క్రాంతి, బుడుగుల రామచందర్, బండారి జీవన్, బుడుగుల బాల నరసింహ, సింగారం జాంగిర్, బండారి ప్రభాకర్, ముడుగుల ఉప్పలయ్య, ముడుగుల పరమేష్, మడుగుల కొండల్, మైసయ్య, దానయ్య, లింగయ్య, నరసింహ, బిచ్చల రాము ముడుగుల వెంకటయ్య బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
Aug 15 2024, 21:20